కులాల అంతరాలూ – పరువుల భ్రమలూ – అనిశెట్టి రజిత

మన సమాజంలో పాతుకొనిపోయిన దురాచారాలకు ఒక కారణం మనం భ్రమల్ని విశ్వసించడమే. ఇది కాకుండా తెలివిలో ఉండో తెలియని మూర్ఖత్వంతోనో బ్రాహ్మణీయ భావజాలాన్ని కళ్ళకద్దుకొని నెత్తికెత్తుకొని ఆచరిస్తుండడమే.

అసలు కులమంటే ఏమిటి? అదొక ఆచార వ్యవహారమే కదా. ఒకే రకమైన వృత్తిని చేపట్టిన సమూహం ఒకే రకమైన ఆచార వ్యవహారాలనూ కట్టుబాట్లనూ ఏర్పర్చుకుని జీవించడాన్నే కులాచారం అని భావించడం జరుగుతూ వస్తోంది. చిత్రమైన విషయం ఏమిటంటే ఎన్ని కులాలున్నా ఏ రెండు కులాలూ ఒకే వరుసగా గుర్తించబడకపోవడం, ప్రతి కులమూ ఒక సమాంతర వలయం కావడం.

కులానికి విస్తరించే స్వభావం లేకపోగా అది క్రమంగా కుదించుకుపోతుంటుంది. ఫలితంగా కులం సంకుచిత స్వభావాన్ని సంతరించుకుంటుంది. కరుడుకట్టుకుపోతూ క్రూరంగా మారిపోతుంది. అగ్రకులాలన్నీ ఒక్కటి కావు. వాటిలో శూద్ర, పవిత్ర కులాలుంటాయి. దళిత కులాలు అన్నీ ఒక్కటి కావు. అందులో తేడాలు, తెగలు ఉంటాయి. వెనుకబడిన కులాలు అనేకం కానీ ఏ ఒక్కటీ మరొకదానితో కలవదు, పోలిక కలిగి ఉండదు.

పాచిపట్టిన రొచ్చు గుంటలాంటి కుల అంతరాలూ, విద్వేషాలూ సమసిపోవాలంటే భారతీయ సమాజానికి పునాదుల నుండీ ప్రక్షాళన జరగాల్సిందే. కులరహిత సమాజం ఆరోగ్యకరమైనది. కులాలు వట్టి భ్రమలు, వాటిననుసరించి ఏర్పడే పరువూ, ప్రతిష్టలూ కూడా కాగితపు పడవలే అన్న గ్రహింపును కులవాదుల్లో తేగలగాలి. ఎవరి ఆర్థిక స్థాయి పైచేయిగా

ఉంటుందో వారికి సాంఘిక అంతస్తు, సామాజిక గౌరవము హెచ్చుగా లభిస్తాయి. డబ్బు, ఆస్తులనూ అంతస్తులనూ ఏర్పరుస్తుంది. కులంవల్లా, డబ్బు వల్లా వచ్చేదే శాశ్వతమైన శాసనమని తిరుగులేని ధర్మసూత్రమని భావించే అజ్ఞానమే నేటి సమాజ సంబంధాల పతనానికి కారణంగా ఉంటున్నది.

… … …

జ్ఞానానికి శాస్త్రీయత మూలంగా ఉండాలి. హేతుబద్ధమైన శాస్త్రీయ జ్ఞానం సమాజాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తుంది. మన దౌర్భాగ్యం ఏమిటంటే జ్ఞానాన్ని అపార్ధం చేసుకున్నంతగా అర్థం చేసుకుని అర్థవంతంగా ఆచరించడం మనకు అలవడలేదు. ఆ లోపమే నేడు ఈ వ్యవస్థ కుళ్ళిపోయి రోగగ్రస్తం కావడానికి దోహదపడింది. లోపాలను గుర్తించి, విచారించి సవరించుకోవడం ఉన్నతమైన స్థితి. కానీ దాని అంచులవరకైనా చేరుకోలేదు మనం.

”జన్మను బట్టి కులాన్ని నిర్ణయించే విధానాన్ని ఉపనిషత్తులు అంగీకరించవు. గుణాలను అనుసరించే వర్ణాలుంటాయని భగవద్గీత చెప్తుంది”. ఆదిశంకరులు తాను సత్పురుషులెవరికైనా గానీ ప్రణమిల్లుతానన్నాడు.

మహా ప్రవక్తలు, తత్వవేత్తలు కులాల వివక్షతల్నీ, వైషమ్యాలనూ, తేడాలనూ నిరసించారు. కులాలను మించిన సహజీవన సామరస్యాన్ని ప్రబోధించారు. కుల వ్యవస్థ బిగదీసుకుపోవడం అనేది భారతీయ సమాజానికి పెద్ద లోపమన్నారు. సహపంక్తి భోజనాలూ, చాపకూటి సిద్ధాంతాలూ ఎరుకపర్చి ప్రత్యక్షాచరణలో భాగస్వామ్యులయ్యారు. కానీ మతాన్ని విశ్వసించే వారైనా మతానికి మూలమైన మత గ్రంథాల్లో చెప్పిన అంశాలను కూడా పట్టించుకోనంత అంధకారంలో పడి కొట్టుకుంటున్నారు.

మన స్వాతంత్య్ర ఉద్యమకాలంలో కులాల తీవ్రతను గుర్తించిన గాంధీ అంటరాని కులాలవారిని ‘హరిజనులు’ అంటే దేవుని బిడ్డలుగా సంభోదించాడు. డా||బి.ఆర్‌.అంబేద్కర్‌ కుల వ్యవస్థపై తిరుగులేని యుద్ధం ప్రకటించాడు. కుల నిర్మూలనకు అనేక అంశాలను సిద్ధాంతీకరించి కులాంతర వివాహాల ద్వారా కుల నిర్మూలన జరుగుతుందన్నాడు. అంబేద్కర్‌ కన్నా ముందే మహారాష్ట్రలో పీష్వాల పాలన అంతమైన పదేళ్ళకు జన్మించిన జోతీబాఫూలే కులమత వ్యవస్థలను నిరసిస్తూ సాహసోపేతమైన సంస్కరణోద్యమాలను నిర్మించాడు. అందుకే ఆ సత్యశోధకుడు అంబేద్కర్‌కు గురువయ్యాడు.

ఒక దశాబ్ధంన్నర కాలంలో కులంకన్నా చేసే ఉద్యోగం, వృత్తి, ఉపాధి ముఖ్యం అన్న భావన కూడా వచ్చింది. కుల నిర్మూలనా సంఘాలూ, వేదికలూ ఏర్పడ్డాయి. కానీ పెరుగుతున్న కులాల సంక్షోభాన్ని నిలువరించడం సాధ్యం కావడం లేదు. అణిగిమణిగి

ఉన్నట్టుండే కులం ఒక్కసారిగా కులాంతర ప్రేమ పెళ్ళిళ్ళు జరిగినప్పుడు తమ పరువు పోయిందంటూ భౌతిక దాడులు చేస్తూ, హత్యలకు తెగబడేవరకూ పోతున్నది.

భారత రాజ్యాంగ చట్టాలకీ, విలువలకీ విరుద్ధంగా కులాన్ని బట్టి చట్టాలను అన్వయించడం, సంపదలు పొందే అవకాశాలనూ, అర్హతలనూ నిర్ణయించడం, అంతస్తులూ, హోదాలూ నిర్ధారించడం సంఘ వ్యతిరేకమని అశాంతి కారకులైన కులవాదులు గుర్తించడంలేదు, పట్టించుకోవడమూ లేదు. వారు నిర్భయంగా, దుందుడుకుగా రాజ్యాంగ వ్యతిరేకమైన, చట్ట వ్యతిరేకమైన అసాంఘిక శక్తులుగా వ్యవహరిస్తున్నారు.

… … …

”కులం” నాడూ, నేడూ ఒక విషమ సమస్య. విచిత్రమైన భావజాలపు సంక్షోభం. అనాదిగా కులాన్ని నిరసించారు. సమతాతత్వాన్ని బోధించారు లోకాయతలూ, చార్వాకులూ. బౌద్ధం నాటి కాలకూట విషంలాంటి కుల వ్యవస్థను తన తాత్విక భావజాలం ద్వారా తుత్తునియలు చేసింది. సమాజంలోని తిరస్కృతులను అక్కున చేర్చుకొని కులం వర్గంపై ప్రకంపనలు సృష్టించింది. నాస్తిక హేతువాదులు మన సమాజంలో అల్పసంఖ్యాకంగా ఉన్నా తమ స్వరాలు వినిపిస్తూనే ఉన్నారు.

సంత్‌ రవిదాస్‌, సంత్‌ కబీర్‌దాస్‌లు మానవతా సిద్ధాంతాన్ని సమతావాదానికి అన్వయించి ప్రవచించారు.

రామకృష్ణ పరమహంస, వివేకానందుడు కులం తేడాలను వ్యతిరేకించారు. కులం కట్టుకున్న గోడలను కూలదోయాలన్నారు. దైవాన్ని మెప్పించినవారూ, దైవాన్ని ఆవాహన చేసుకున్న వారందరూ ఒక్కటే అన్నారు… శ్రీమద్‌ రామానుజాచార్యులు, జ్ఞానేశ్వరుడు, సమర్ధ రామదాసు, గురునానక్‌లు ఫూలే, పెరియార్‌, అయ్యంకాళి, నారాయణ గురుస్వామి, చత్రపతి సాహుమహారాజ్‌, అంబేద్కర్‌, రామ్‌ మనోహర్‌ లోహియాలు మన తెలుగు వారైన త్రిపురనేని రామస్వామి చౌదరి, గోరాగారి కుటుంబం, గుత్తావారి కుటుంబ కుల నిర్మూలనను ప్రత్యక్ష ఆచరణలో పెట్టి ప్రచారం చేస్తున్నారు.

స్వాతంత్య్ర పోరాట కాలంలో అస్పృశ్యతా నిర్మూలన, మద్యపాన నిర్మూలన, మహిళాభ్యుదయ ఉద్యమాలూ సమాంతరంగా పుట్టుకొచ్చాయి.

‘అంటరానితనం’ వల్ల భారతజాతి ప్రపంచంలో సభ్యతను, గౌరవాన్నీ కోల్పోయిందని వాపోయారు గుర్రం జాషువా కవి. అంటరానితనం కుళ్ళు భావన అనీ, నేరపూరితమైనదనీ ఎన్నో నీచమైన ఘటనలు నిరూపిస్తున్నా, కులవాదుల్లో రవ్వంత చలనం కలగడంలేదు. లేని ”పరువు”నూ, పాచిపట్టిన ఆచారాలనూ పట్టుకుని వైతరిణీ నదిలో పవిత్ర మునకలేస్తున్నారు.

కుల వ్యవస్థకు చారిత్రక పునాదులున్నాయి. యుగాలుగా ఆచరణలో రాతిలా ఘనీభవించిన అనాగరిక విలువలున్నాయి. బ్రాహ్మణ పెట్టుబడిదారీ, భూస్వామ్యపు ఆధిపత్యం, పితృస్వామ్యపు అమానుషత్వం, పాలక వర్గాల అలసత్వం, ఆధిక్య కులాల పట్టుదలా, స్వార్థం అన్నీ కులానికి ఆజ్యం పోస్తూ కులస్వామ్యాన్ని నిలబెడ్తున్నాయి.

… … …

కులమూ స్త్రీ అనే అంశంపై రామ్‌ మనోహర్‌ లోహియా ”ఆడపిల్లకు పెళ్ళి చేయడం తల్లిదండ్రుల కర్తవ్యం కాదు”, అమ్మాయికి మంచి ఆరోగ్యాన్నీ, విద్యాబుద్ధుల్ని ఇచ్చేంతవరకే వారి బాధ్యత. ఆడపిల్ల స్వేచ్ఛగా తిరిగినా, ఎవరితోనైనా వెళ్ళిపోయినా, ఆమె సంతానవతి అయినా, ఆమె శీలం కళంకితమైనదని భావించకుండా ప్రకృతి సిద్ధమైన స్త్రీ, పురుష సంబంధాలను ఏర్పర్చుకునే ప్రయత్నంలో అదే ఒక అంశమని భావించాలని అంటారు.

సంఘం అనేది క్రూరమైనది. ఆడపిల్లలు, మగపిల్లలతో తిరుగుతుంటే వారిపట్ల ఆడవాళ్ళు కూడా నీచంగా గుసగుసలు పోతూ పుకార్లు లేపుతుంటారు. మగవాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకుని ఆడపిల్లల్ని వేధిస్తుంటారు. మనస్తత్వాల్లో వికృతత్వం, సంకుచితత్వం కొనసాగినంతకాలం ఈ జెండర్‌ అసమానతలు అంతరించిపోవడం జరగదు.

ఆడపిల్లను పెళ్ళిచూపుల పేరుతో ఆపాదమస్తకం పరీక్షించి, అడిగినంత డబ్బు, వస్తు వాహన సంపదల్ని ఇచ్చే సాధనంగా చూసే పద్థతి అవివేకం, అవమానకరమైనది.

స్త్రీలను అనేక జంజాటాలూ, కవచాలూ, చట్రాలూ, పాత్రల నమూనాల నుండి తప్పించి చూడాలి. బాల్యంలో ఒకరు, యుక్త వయసులో ఒకరు, వృద్ధాప్యంలో ఒకరు రక్షిస్తుండాలట, అదీ ఎవరినుండీ… ఈ సమాజంలోని తమలాంటి వారి నుండే కదా. స్త్రీలకు ప్రత్యేకంగా పవిత్రతనూ, మాలిన్యాన్నీ ఆపాదించడం ఒక కుట్ర.

స్త్రీలను ఇప్పటికీ వంటింటి దాస్యంలోనే మగ్గబెడుతూ సంతాన యాంత్రికతకు కట్టిపడేస్తూ, రాజకీయ రంగానికీ, సామాజిక రంగాలకు దూరంగా నిలువరించడం జరుగుతున్నది. స్త్రీ స్వాతంత్య్రతకూ, ఆత్మగౌరవానికీ విలువనివ్వడం సమాజానికి గిట్టదు. అధికారాన్ని పంచుకోవడం లేదా ప్రజాస్వామీకరించడం, ఆధిక్యతను ఒదులుకోవడం లేదా స్నేహీకరించడం పెత్తనాలకు సరిపడదు.

… … …

భారతదేశం ఎక్కడో దారి తప్పిపోయింది. ముందడుగులు వేస్తూ ఏదో మైలురాయి దగ్గరే ఆగిపోయింది. దేశం ఆధునికం, నాగరికం కావాల్సి ఉంది. సంస్కారాన్నీ, సంఘ జీవన సమిష్టి ప్రయాణాన్నీ పునర్నిర్వచించుకోవాల్సి ఉంది.

భారతదేశం ఈనాడు వికృతం అయిపోయింది. స్త్రీ పవిత్రతను గురించి చెప్పే గొప్ప గొప్ప మాటలు ఎన్ని

ఉన్నప్పటికీ స్త్రీకి సంబంధించిన వివాహం లాంటి విషయాల్లో లోకుల ఆలోచనలు బాగా కుళ్ళిపోయాయి. ఆ కుళ్ళు గుంటల్లోనే పడి దొర్లుతూ బతకడానికి అలవాటు పడిపోయారు భారతీయులు.

అరకొరగా అమలయ్యే చట్టాల వల్ల ఏమీ మారదు. ఆడపిల్ల లైంగికత మీద కుటుంబం-సమాజం-రాజ్యం పెట్టే నిఘా, చేసే అదుపు అర్థరహితమైనది. శాసనాల్లో, చట్టాల్లో వాస్తవికత, శాస్త్రీయత, సమగ్రతా లోపం ఉండటం ప్రతి నేరచర్యకూ, సంఘ వ్యతిరేక అసాంఘిక ఘటనకూ రాజకీయ ప్రమేయం, పెద్దల అండా ఉండి కొమ్ముగాస్తుండటం జరుగుతున్నంత కాలం, చట్టం చేశాము, వాడుకొండని చేతులు దులిపేసుకునే బాధ్యతారాహిత్యం ప్రభుత్వానిదైనప్పుడు ఎక్కడి గొంగళి అక్కడే పడి ఉండి చీకిపోతుంది.

భారతీయులు రోగగ్రస్తులై కోలుకోవడం లేదు. వారి పేదతనానినికి హద్దే లేదు. ఆత్మికంగా పతనమైన వారు ప్రాకృతికంగా చైతన్యవంతం కాలేరు. నిర్లిప్తత, ఉదాసీనత బలహీనతగా బాగా బక్కచిక్కి పోయారు. ప్రాణభయంతో తమలోకి తాము ముడుచుకుపోయి పిడచగట్టుకుపోయారు. కానీ నీచత్వంలో, దురాశల్లో చాలా రాటుదేలారు. వంచనల్లో చురుకుగా పనిచేస్తుంటారు. ఘోరంగా దిగజారిపోయిన ఆత్మను అలంకరించుకొని పతనాల దారుల్లో తచ్చాడుతుంటారు. తమ సామర్ధ్యాలను వ్యక్తిగతంగా మార్చుకొని, సమీకృత చేతనను పాతిపెట్టేసి ఒక్క అడుగైనా ముందుకు పడక ఎక్కడివాళ్ళు అక్కడే దిగబడిపోయి బురద పన్నీరనే భ్రమలో ఉన్నారు.

దేశంలో పేదరిక నిర్మూలన, కుల నిర్మూలన, మత ప్రమేయం తగ్గించడం, స్త్రీ పురుష సమానత్వం అనే చట్రాలను విరగదీసే ప్రయత్నాలన్నీ మోసపూరితంగా ప్రవేశపెడ్తున్నంత వరకూ ఏదీ అంతం కాదు, ఏ తేడాలూ సమసిపోవు.

స్త్రీలకూ, పేదరికానికీ, శూద్రులైన ఉత్పత్తి కులాల వారికీ, పేదరికానికీ, స్త్రీలకూ, శూద్రులకూ కులానికీ ఉన్న బంధనాలు తెంచే నిర్విరామ ప్రయత్నాలు, ప్రయోగాలు చేయనంతవరకు ఏదీ మారదు.

సర్వ సత్తాక సార్వభౌమాధికార రాజ్యం నుండే ఒక విప్లవ చర్య ప్రారంభమవుతుంది, కావాలి. దాన్ని విశాల సమాజం దాని

ఉపాంగాలూ, వ్యవస్థను నిర్మించే ‘కుటుంబం’ అమలుపర్చుకోవాలి. దానికి రాజ్యం పూర్తి బాధ్యత వహించాలి.

కుటుంబం, కుల సమాజం అనుక్షణం తమ ప్రతాపాన్ని పిల్లలపై, యువతపై, పెద్దలపై, బలహీనులపై చూపించే సంప్రదాయం రద్దు కాబడాలి.

విలువల్ని తెలుసుకుంటేనే పరువు నిలుస్తుంది. కోల్పోయిన ఆత్మను తిరిగి ప్రతిష్టించుకుంటేనే గౌరవం నిలబడుతుంది. కులాలు మానవ కల్పితాలు, వద్దనుకుంటే కుల సంకెళ్ళు తెగిపోయి స్వేచ్ఛా మానవ సమాజం ఏర్పడుతుంది. నిరుపేదతనం, రోగగ్రస్తం నుండి మానవ ప్రపంచం విముక్తి పొందుతుందన్న తాత్విక విచారణ జరగాలి మనలో.

ఆ విలువలు కలిగించే ప్రేరణ ప్రభుత్వ సిద్ధాంతాలూ, విధానాల నుండి బయటికి స్పష్టం కావాలి. దట్టి కట్టుకున్న కులం గోడల్ని, వర్గాల చీడల్నీ ధ్వంసం చేసి నాశనం చేయనంతవరకు లేని పరువుల వెంట, లేని కులాల భ్రమల్లో పడి ఆత్మను కోల్పోయి ఆత్మ సంవేదనను చంపుకొని మనం మూర్ఖత్వంలో, డబ్బు మాయలో సుడిచుట్టుకుపోతూనే ఉంటాం.

చిక్కులు పడి ఉండలు కడ్తున్న ఈ భారతీయ సంస్కృతి ఔన్నత్యం ఎప్పటికీ విడిపోని చిక్కుముడుల్లో మడతల్లో పడి అనాకారంగా, అసమర్ధంగా, అనర్థకంగా మారిపోతున్నది.

అంతర్గత సంబంధాల్లో, సమాజ బాంధవ్యాల్లో ప్రజాస్వామీకరణ జరగాలి. అంతకంతకూ ఘోరనేరంపై నిలబడే పరువులమీదా, అలుక్కుపోయిన మిథ్యావాదంలో ఇరుక్కుపోయిన ప్రతిష్టల మీదా, చెరిపేస్తే చెరిగిపోయే కుల, మతాల అంతరాలను ఆలింగనం చేసుకున్న ఆజ్ఞానాల మీద, ఈ గాలివాటపు సూడో మానవ సంబంధాల అబద్ధపు సహజీవనం ఇంతే క్రూరంగా, ఇంతే శవప్రాయంగా విషాద వలయాల్లో మెలికలు తిరుగుతూ ఉంటుంది. రక్తపాతం నిత్యకల్లోలం సృష్టిస్తూనే ఉంటుంది.

ఓటు రాజకీయాల ఐదేళ్ళ కుట్రలకు దేశంలోని అస్సహాయ వర్గాలు నిస్సహాయంగా బలయ్యే పరంపరకు ముగింపు చర్యలు ఎండమావులుగానే ఏడిపిస్తుంటాయి. మనం అందుకు తలవంచుకుని బలికావడమేనా?

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.