ఈ రోజుల్లో ఒక మంచి పుస్తకం చదవాలంటే బాగా పాతవో లేదా ఇంగ్లీష్ నుండి అనువదించినవో అయి ఉండాలేమో అన్న ఆలోచనని పటాపంచలు చేస్తూ అప్పుడప్పుడూ అచ్చమైన తెలుగు పుస్తకం ఒకటి మన కళ్ళని పరుగులు పెట్టించడం అనుభవమైనప్పుడల్లా మనసు చాలా ఉద్విగ్నంగా మారిపోతుంది.
ఈ మధ్య అలాంటి పుస్తకం ఒకటి నన్ను తనలోకి లాగేసుకుంది. మనిషిని నువ్విలా ఉండాలి… నువ్విలా నడవాలి… నువ్విలా తినాలి… నువ్విలా నవ్వాలి… నువ్విలా పడుకోవాలి… అంటూ ఇంకా ఏవేవో పాఠాలు చెప్పే నాన్ ఫిక్షన్ పుస్తకాల పిక్షన్ విజ్ఞానాన్ని పక్కకి పెట్టేస్తూ కథలో భాగంగానే మనల్ని మనకి పరిచయం చేసే మెళుకువలను సుతి మెత్తగా మన మనస్సులో జొప్పించవచ్చంటూ అక్షరమయ్యేంత పుస్తకం జలంధర గారి ”పున్నాగ పూలు”
ఈ పుస్తకాన్ని చదివే ముందు మనసుని తెల్ల కాన్వాస్‌గా మార్చుకుని చదవాల్సిన అవసరం లేదు. ఈ పుస్తకమే ఆ పని చేసేస్తుంది. ఎక్కడికక్కడ మనలోని పాత దృక్పథాన్ని అత్యంత సహజంగా చెరిపేస్తూ కొత్త దృక్పథాన్ని అంతే సహజంగా మనకిస్తుంది.
ఇది మనిషిలోని పాజిటివ్ థాట్స్‌ని తట్టి లేపటానికి రాయబడిన పుస్తకం. మన చుట్టూ ఉన్నవాళ్ళ చేత మంచి అనిపించుకోవడం కోసం జీవిత పర్యంతం ప్రపంచం బిగించిన చట్రంలో ఉండిపోవడమన్నది ఉందే… అదిగో ఆ బందీఖానాని తప్పించుకోవడం అన్నది ఎప్పటికీ మనల్ని మనకి మంచిగా అప్పచెప్తుంది.
మన పిల్లలకి మనం అన్నీ నేర్పాలి అని చూస్తాం. సాధ్యమైనంత వరూ నేర్పుతాం ూడా. కానీ ఆ నేర్పే వాటిల్లో ఆలోచన’ అన్నది ఎప్పుడైనా ఉందేమో మనం చూసుకున్నామా అంటే అనుమానమే. అదే తప్పు అంటారు రచయిత్రి. మిగిలిన అన్నిటితో పాటు ఆలోచన అన్నదాన్ని ూడా పిల్లలకి నేర్పాలి అంటారామె.
ఈ పుస్తకంలో కథగా చెప్పాలంటే రెండు ముక్కల్లో చెప్పెయ్యవచ్చు.
”మంచిగా ఉండాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించే అమ్మాయిలు సంఘం కక్ష కడితే ‘విక్టిమైజ్ద్ రోల్’ లో ఇమిడి పోతారు. ఇందులో చాలా మంది సినిక్స్ అయిపోయి, చాలా భయంకరమైన అత్తగార్లుగా, స్నేహాన్ని ఇవ్వలేని తల్లులుగా తయారైపోతారు.
ఒక్కసారి ఈ విక్టిమైజ్డ్ రోల్ కి వెళ్ళాక వాళ్లకి వాళ్ళు మిగిలి ఉండరు. ఇంవెరిగానో రూపాంతరం చెంది జీవితమంతా అంతా అదే పాత్రని పోషిస్తూ అదే తమ సేఫ్టీ జోన్ అన్న భ్రమలో ఉండి పోతారు.
అలా రూపాంతరం చెందుతున్న దశలో ఉన్న రాధ అనబడే భర్త చాటు మహిళ, భర్తకి చేసిన జబ్బు వలన హాస్పిటల్‌లో తనకి సహాయంగా ఉండటానికి వెళ్లి, ఆ హాస్పిటల్ వాతావరణంలో రకరకాల వ్యక్తిత్వాల పరిమళాన్ని అల్లుకుని పూర్తి పరిణితితో సంపూర్ణమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవటమే ఈ పున్నాగపూలు. ఇందులో పున్నాగపూలు అంటే పుస్తకంలో మనకి ఎదురయ్యే రాధ, కృష్ణ, షీలా, రాజారావు, స్వప్న, రఘు, రాణి, రామకృష్ణ, లావణ్య, కాంతం, ప్రభావతి, విరించి, సుందర్, డాక్టర్ పిళ్ళై, పరిమళ లాంటి పాత్రలు తప్ప వేరే ఏమీ కాదని చెప్పవచ్చు.
ఇందులోని కథకు నేపథ్యమంతా డాక్టర్ జి.. హీలింగ్ సెంటర్ అనబడే ఒక హాస్పిటల్. ప్రస్తుతం మన కార్పొరేట్ హాస్పిటల్ కల్చర్ మధ్య ఇలాంటి ఒక హాస్పిటల్ ఎందుకు లేదా అని పుస్తకం అయ్యే లోగా ఎన్ని సార్లు అనిపిస్తుందో చెప్పటం చాలా కష్టం. పైన చెప్పబడిన పాత్రలన్నిటికీ ఆ హాస్పిటల్‌తో ఏదో ఒక సంబంధం అల్లుకోబడే ఉంటుంది. రాధ అనబడే ఒక ప్రధాన పాత్ర మానసిక సంఘర్షణ, హాస్పిటల్‌లో ఎదురయ్యే వ్యక్తుల ద్వారా తన ఆలోచనలు వికసించడంతో, అప్పటివరూ ఎలానో రూపాంతరం చెందుతున్న తన జీవితాన్ని తన అదుపులోకి తెచ్చుకుని తన తదుపరి గమ్యానికి అడుగు వెయ్యడమే ఈ పుస్తకం.
ఇప్పటికిప్పుడు మన ప్రయారిటీస్ అన్నీ ూడా ఇప్పుడేవి విలువైనవి అనిపించుకుంటాయో అన్నవాటిమీదే ఉంటుంది కానీ, తరువాత వాటి విలువేమిటి అన్నది ఎప్పటికీ ఆలోచనల్లోకి తెచ్చుకోము. ఎందుకంటే మనం అలాంటి పనికి వచ్చే ఆలోచనలని ఎప్పుడో పోగొట్టేసుకున్నాం కాబట్టి. అదే తప్పంటారు రచయిత్రి.
వంటికి వచ్చే జబ్బులన్నిటికీ భౌతికమైన కారణాలని వెతికి, వాటికి మాత్రమే మందులివ్వడం వల్ల ఆ జబ్బు మూలాల్లోకి వెళ్లి చూడటం మర్చిపోయిన వైద్య శాస్త్రమే మనకి తెలిసిన ఈ రోజుల్లో స్త్రీ అవ్వనీ, పురుషుడవనీ వారనుభవించే మానసిక వేదనలు , కోపాలు, అసూయలు , వివక్షలు, ఒత్తిడులే శరీరానికి జబ్బుల్ని ఆహ్వానిస్తున్నాయని మనం ఇవన్నీ వదిలేసి అచ్చంగా ఎన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ ని మన చుట్టూ నింపుతూ ఉంటే మనం అంత హృద్యమైన జీవనఝరిగా పరిసరాల్ని ప్రభావితం చెయ్యవచ్చు అని చెప్పుతుంది ఈ రచన నిజమే కదా! ఇదంతా మనలోని అంతర్గతంగా నిక్షిప్తమై ఉన్న అనంత శక్తిని వెలికి తియ్యడమే కదా.
జుఅవతీస్త్రవ అవఱ్‌ష్ట్రవతీ షతీవa్‌వస అశీతీ సవర్‌తీశీవవస అని నమ్మినట్లుగా మనం ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్‌ని నేచర్ లో నింపుతూ ఉంటే నేచర్ అంత పాజిటివ్ వైబ్రేషన్స్‌నే మనకి ఇస్తుంది అని నమ్మటంలో తప్పేమీ లేదుగా అనిపిస్తుంది పుస్తకాన్ని చదువుతున్నంత సేపు.
ఈ పుస్తకంలో అన్ని వ్యక్తిత్వ పుస్తకాల్లో ఉండేలాంటి స్సస్ మంత్రాలు లేవు, స్నేహితుల్ని ఎలా గెలుచుకోవాలో లేవు.
నీలో నిన్ను నింపుకోవడం అన్నదే ఈ పుస్తకం యొక్క కాన్సెప్ట్. ఒక్కసారి అలా నింపుకున్నాక లోకాన్ని మార్చడం కంటే మనం మారడం సులభం అని తెలుసుకుని మనం అచ్చంగా మనలా రూపాంతరం చెందడం కన్నా జీవితంలో సులువైనది ఏముంది.
ఒక్కసారి అలోచించి చూడండి… మీ ఈ చిన్ని ప్రపంచంలో మిమ్మల్ని మీకు ఇచ్చుకోవడం కన్నా మీకు విలువైనది మరేముంటుంది?
అవతల ఉన్నవారిని బట్టి స్త్రీగా, ూతురుగా, భార్యగా, తల్లిగా, చెల్లిగా, స్నేహితురాలిగా నా రోల్ ఎప్పటికప్పుడు మారిపోతూ
ఉండవచ్చు కానీ ఎప్పటికీ మారని నా రోల్ నేను మనిషిని. ఎవరికి వారు ఇలాగే అనుకుని ఒక మనిషిని ఎలా చూసుకోవాలో వారు తెలుసుకుంటే చాలు. లోకమంతా మనుష్యులే ముందుకొస్తారు మిగిలిన రోల్స్ అన్నిటినీ కాలరాసుకుంటూ…
ఈ పుస్తకంలో రాధ ఒక చోట రాసుకున్నట్లు
”మనం ఎదగాలంటే మనలో ఒక ఎ్స్టన్షన్ జరగాలి. కొన్ని గాలి గోడలు ూలిపోవాలి”.
అలా జరగలేదంటే మనం మారకం కాని మనుష్యులుగా తయారైపోతాం.
నిజం…
మన జీవితాల పట్ల ప్రేక్షకత్వాన్ని మానేసి, ఒక్కసారి మనం మోసే అనవసరమైన బరువులని ఒక్కొక్కటిగా దింపుకుంటూ వెళదాం. ఎక్కడో ఒక చోట తేలిక పడతాం. మనం తేలిక పడ్డామా ప్రపంచాన్నే తేలిక పడేలా ప్రయత్నిస్తాం… అంతకన్నా ప్రపంచం మాత్రం కోరుకునేది వేరే ఏముంటుందని?
ఇలా చదివేసి అలా పక్కకు పడేసే పుస్తకాల గురించి మర్చిపోయి ఈ పున్నాగపూలని మాత్రం నా పుస్తకాల మాలలో గుదిగుచ్చి దాచేసుకున్నాను మళ్ళీ మళ్ళీ ఆ పరిమళాన్ని ఆస్వాదించేలా. ఒకసారి చదివారంటే మీరూ ఇదే పని చేస్తారనే నా నమ్మకం.
ఈ పుస్తక రచయిత్రి జలంధర గారు బి.ఎ ఎకనమిక్స్ చదివారు. గత నాలుగున్నర దశాబ్దాలుగా ఆమె ప్రముఖ పత్రికలన్నిటిలో ప్రఖ్యాతమైన కథలెన్నో రాసారు. జలంధర గారు రాసిన ఈ పున్నాగపూలు పుస్తకం, 2015 సంవత్సరానికి రచయిత్రి ఉత్తమ గ్రంథం విభాగంలో పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాన్ని పొందింది.