టైం బాగుంది
అప్పారావు: పాపారావు నా టైం బాగుండాలంటే ఏం చెయ్యాలి
పాపారావు: ఆ మాత్రం తెలియకపోతే ఎలా నీ వాచీ శుభ్రం చేసుకోవాలి అంతే.
చివరి కోరిక
జైలర్: నీకు ఈ రోజు ఉరిశిక్ష వేస్తాం. చివరి కోరిక ఏంటో చెప్పు?
ఖైదీ: అయితే నన్ను తలకిందులుగా ఉరి తీయండి సార్.
అభిప్రాయం
భూమిక వాళ్ళు ఇచ్చిన ఇన్‌పుట్ సెషన్ అటండ్ అయ్యాను మేడమ్ వాళ్ళు ఇచ్చిన ప్రతి మాట రియాలిటికి చాలా దగ్గరగా ఉన్నాయి మన మహిళల కోసం సమాన హక్కుల కోసం పోరాడుతున్నారు. సత్యవతి మేడమ్ నిన్న ఒక మాట చెప్పారు. ఆ మాట ‘ఏదైన అలవాటు చేసుకోవాలి అంటే మన చేతుల్లోనే ఉంటుంది. మంచి అయినా చెడు అయినా, దీనిని జైల్‌ల్లా కాకుండ హాస్టల్‌గా ఫీల్ అయితే మనం హ్యాపీగా ఉంటాము’ మేడమ్ చెప్పిన మంచి మాట నన్ను ఎంతో పరిచాయి
– శాంతి
ఎలుగున్నప్పుడే
దీపం ఎలుగున్నప్పుడే
నీకటి హద్దుల జాడలు పెట్టాలె
బతుకు హస్యాలు సోదియ్యాలె
నవ్వుకుంట ఉన్నప్పుడే
బాధల తీరాలను చూసితీరాలె
దుఃఖపు లోతులను ఈదిరావాలె
చేతిల నాల్గు రాళ్ళున్నప్పుడే
నలుగురికి దారిసూపాలె
పదిమందిని పోగెసుకోవాలి
గుంపులున్నప్పుడే
ఒంటరితనం ఆనవాళ్ళను తాకిసూడాలె
ఏకాకి మనోవేదనకు మందురాయాలె
తండ్రీ… ఇది సుడిగుండాల జీవితం
యిప్పుడు రాయిలా ఉండే మనసు
ఎప్పుడు గాయపడ్తదో తెల్పదు!
– అను
వరుడికోసం ఫేస్‌బుక్ ప్రకటన (ఫేస్‌బుక్ కబుర్లు)
సోషల్ మీడియాలో మీ ఫోటోలు, అభిరుచులు వ్యక్తం చేసేందుకే కాదు జీవిత భాగస్వామిని కూడా ఎంపిక చేసుకునేందుకు ఉపయోగించుకోవచ్చని దారి చూపింది ఓ యువతి. కేరళలోని మల్లపురానికి చెందిన జి. అనుశ్రీ అనే యువతి తనకు సరైన జీవిత భాగస్వామి కావాలంటూ ఫేస్‌బుక్‌లో ఒక ప్రకటన పోస్టు చేసారు… తన ఫోటో, చిరునామా మొబైల్ నెంబర్ కూడా తెలియచేస్తూ.. ఆమె అంతటితో ఆగకుండా వివాహ సంబంధాల కోసం నిర్వహిస్తున్న వెబ్‌సైట్లు మధ్య వర్తుల దోపిడి నుండి ప్రజలకు రక్షించేందుకు మ్యాట్రిమోనియల్ సర్వీసులు నడపాలని ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు వ్యక్తిగతంగా లేఖ కూడా రాశారు. తనకు తల్లి దండ్రులు లేరని కుల మతాలతో జన్మదిన నక్షత్రాలతో పట్టింపు లేదని పేర్కొంది. ఫ్యాషన్ డిజైనింగ్‌లో బీఎస్సీ పూర్తి చేసిన తనకు ఒక సోదరుడు
ఉన్నారని వివరించారు ఆమె పోస్టు వైరలైంది. ఇప్పటికి 11 వేల మంది లైక్ చేశారు. ఆరువేల మందికి పైగా షేర్ చేశారు. కొందరు వివాహం చేసుకుంటామని ప్రతిపాదించగా మరి కొందరు ఆశీస్సుల అందించారు. చివరకు సోషల్ మీడియా వేదికపై టెండర్ తరహాలో నూతన డేటింగ్ యాప్‌ను ప్రారంభించనున్నట్లు జుకర్‌బర్గ్ ప్రకటించారు. ఇక ముందుకు మ్యారేజ్ బ్యూరోలతో పని లేకుండా పోతుందేమో వేచిచూడాలి
సేకరణ: లావణ్య