హేమలతక్క లేని లోటు ఒక రైటర్ లేని లోటు కాదు… ఆమె రైటర్లలో యూనిక్ రైటర్… కామన్‌సెన్స్‌తో ప్రపంచ లోటుపాట్లను విశ్లేషించగలిగే అన్ కామన్ ఉమన్ ఆమె!
”విజయ్… ఈ పిల్లలకు దేవునిమీద పెద్ద నమ్మకం లేదు గాని నేను వస్తాను పదా మీ చర్చ్‌కు… ఒకసారి వెళదాం” అంటుంది. అందరితో గుమిగూడి ఉన్నప్పుడు పక్కకు పిలిచి మాట్లాడుతూ అన్ని ”స్టాంప్”లపైన జోకులు వేస్తుంది… కడుపు పగిలేలా నవ్విస్తుంది… చాలా స్ట్రెయిట్‌గా, మొహమాటం లేకుండా మొఖం మీద కొట్టినట్లు ఉండే మాటలో… ఆమె రఱఎజూశ్రీఱషఱ్‌వ మాత్రమే బయటపడుతుంది.
ఏ కవరింగ్ ఇవ్వదు. ఎవరిమీదా కచ్చలేని వ్యక్తి. పిల్లలంటే అమితమైన మమకారం. ఆర్టిఫిషియాలిటీ అస్సలు కనిపించదు ఆమెలో. దేనికీ ఉద్ధరింపు అనే ఫీలింగ్ లేని వ్యక్తి ఆమె. రోహిత్ గురించి ముగింపు వాక్యం రాసివ్వు అక్కా అంటే అంతా బైబిల్ లాంగ్వేజ్‌లో రాసిచ్చి ”తమ్ముడూ… నాకు తోచినట్లు రాసాను అంతే” అంది. అలా ఒరిజినాలిటీని ఏ మాత్రం కప్పుకోలేని అమాయకత్వం తనది.
ఎటువంటి సెన్సేషనల్ స్టేట్‌మెంట్‌లు ఇవ్వదు. తనేదో అంబేద్కర్, మార్స్‌ను వడబోచిన ఫీలింగ్ ఇవ్వదు. ఎందుకంటే ప్రశ్న ఎదుర్కొన్న కామన్‌సెన్స్‌కు నిలబడుతుందా లేదా అనే అద్భుతమైన ఫన్నీ లాజిక్‌లు మాత్రమే తెలుసు తనకు.
నా పాట విన్నా, నా డాన్స్ చూసినా మా అక్క ఎంత మురిసిపోతుందో నాకు తెలుసు. రాజమండ్రిలో మీటింగ్‌కొస్తే ”మా తమ్ముడు ఫ్లయిట్‌లో వస్తున్నాడు” అని గర్వంగా చెప్పుకునే పిచ్చి ఆప్యాయత అక్కది. అలా చెప్పుకుని వచ్చి నా చెవిలో ”ఇలా అందరితో అన్నా తెలుసా” అని నవ్వుకుంటూ గర్వపడుతుంది. అక్క రైటర్‌గా ఎంత గొప్పదో చూసిన జనాలకు తెలియనిది.
అక్క ఒక సాధారణ వ్యక్తి రూపానికి ఎంత గొప్ప ఆరాధ్యాన్ని అద్దిందో నాకు తెలుసు. నా పర్సనల్ విషయాలు ఇవి. అయితే మా అక్క నా గురించి చెప్పుకుని ఎలా గర్వపడేదో… నేను ఈ మాత్రం పంచుకుని గర్వపడాలి కదా అనే రాస్తున్నా!!