ఆత్మీయ నవ్వుల బంగారు తీగ -మెర్సీ మార్గరెట

ఎప్పుడూ గలగలా నవ్వే ఆంటీ…. ఎవరినైనా తన నవ్వుతో ఆలింగనం చేసుకునే ఆంటీ… ఎలా అయినా మన గొంతు వినిపించాలి అని పట్టుపట్టే ఆంటీ ఇకలేరని అనుకుంటే గుండె సముద్రమవుతుంది.

2013లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ ఆంటీనే పెట్టారు. నేను మిమ్మల్ని ఎలా సంభోదించాలి? అక్క అంటాను అంటే గట్టిగా నవ్వారు. వద్దు నా వయసు నీకు తెలియదు కదా… ఆంటీ అని పిలువు అన్నారు. అప్పటికి ఆంటీ ఎండ్లూరి సుధాకర్‌గారి భార్య అని తెలీదు.

నాకు ఆంటీ ఎప్పుడైతే సుధాకర్‌ గారి భార్య అని తెలిసిందో అప్పుడు ఎగ్జయిట్‌మెంట్‌తో అడిగాను ఆంటీ మీరు మిసెస్‌. ఎండ్లూరి సుధాకర్‌ అంట కదా అని. ఆంటీ మళ్ళీ నవ్వి కాదు అన్నారు. నా ఎగ్జయిట్‌మెంట్‌ అంతా ఆవిరైపోయింది. వెంటనే అటువైపు నుంచి మెసెంజర్‌లో పింగ్‌ ‘ఆయనే మిస్టర్‌ హేమలతా పుట్ల’ అని. నాకు ఆ సమాధానం భలే నచ్చింది. ఆంటీని నేను ఎక్కువ ఇష్టపడేట్లు చేసింది ఆ సెల్ఫ్‌ రెస్పెక్ట్‌.

ఫేస్‌బుక్‌లో ఎన్నెన్నో మాట్లాడుకున్నాం. ఫోన్‌లో గంటల తరబడి వేదనని, సంతోషాన్ని, ప్రేమని కలబోసుకున్నాం. అప్పటికి సంవత్సరం ఆంటీ పరిచయమై. ఫోన్‌లో తప్ప ప్రత్యేకంగా కలుసుకున్నది లేదు. ఇంకెప్పుడు ఆంటీ కలిసేది అంటే హైదరాబాద్‌ వచ్చినపుడు అనేవారు. అప్పటికింకా తెలంగాణ రాలేదు. ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ వాళ్ళు కవయిత్రులను, రచయిత్రులను పిలిచి పెద్ద ప్రోగ్రాం ఒకటి కండక్ట్‌ చేశారు. ఆ సభకు ఆంటీ వచ్చారు. నేను ఆంటీని అదే మొదటిసారి చూడటం. ఎవరో కొత్తవారిలా అనిపించలేదు. మా ఇంట్లో మనిషి నాకు బాగా తెలిసిన మనిషి, అమ్మలా మాట్లాడే మనిషి అనిపించారు.

ఫేస్‌బుక్‌లో, ఫోన్‌లో మాట్లాడుకున్నట్లే మాటల ప్రవాహం. ఎన్నెన్ని కబుర్లు చెప్పేవారు. ఆంటీకి సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ ఎక్కువ. ఎంత బాధలో ఉన్నవాళ్ళనైనా, మూడీగా ఉన్నవాళ్ళనైనా ఇట్టే నవ్వించేవాళ్ళు.

ఆ రోజు ఎయిడ్స్‌ కంట్రోల్‌ వాళ్ళ సభలో కూడా అంతా కలియతిరుగుతూ అందరితో మాట్లాడుతూ నవ్వుతూ గలగలా తిరిగారు. అందరికీ పరిచయం చేశారు. మీ అమ్మాయి మానసానా అని నన్ను చూసి ఎవరైనా అడిగినప్పుడు అవును అని గలగల నవ్వేవాళ్ళు. ఫేస్‌బుక్‌లో మాత్రమే సాహిత్య ప్రపంచం తెలిసిన నాకు ఫేస్‌బుక్‌ బయట చాలా సాహిత్య ప్రపంచం ఉందని తెలియజేసింది హేమలత ఆంటీ. అందరు రచయిత్రులను, కవయిత్రులను నాకు పరిచయం చేసింది.

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక గురించీ నాకు తెలియజేసి ”ఎలా అయినా మన దళిత క్రిస్టియన్‌ రెప్రజెంటేషన్‌ ఉండాలి” అని నాకు ఒక ఎరుక కలిగేలా చేసి ప్ర.ర.వే.లో సభ్యత్వం దిశగా నన్ను నడిపించారు.

అప్పుడు అయిదేళ్ళ ప్ర.ర.వే సభ ఒంగోల్‌లో జరిగింది. అక్కడికి నన్నూ పిలిచారు. వెళ్ళాను. ఆ సభలో ఆంటీ నాతోనే ఉన్నారు. నా పక్కనే ఆంటీ పడుకునేవాళ్ళు. అప్పటినుంచి ఎప్పుడు సమావేశాలైనా నేనూ, ఆంటీ కలిసే ఉండేవాళ్ళం, తిరిగేవాళ్ళం. సముద్రం చూడ్డానికి వెళ్ళేటపుడు చీకటి పడింది. ఆ చీకట్లో కూడా సముద్రపు హోరును ఎంజాయ్‌ చేశారు ఆంటీ. నన్ను అక్కడ ఉన్న పడవల దగ్గర నిల్చోబెట్టి ఫోటో తీశారు.

ఆంటీకి ఫోటోలు తీయడమంటే చాలా ఇష్టం. ఎందుకో ఎలక్ట్రానిక్‌ వస్తువులను చాలా తొందరగా అర్థం చేసేసుకుని వాడేయగలరు. ప్ర.ర.వే మొత్తానికి ఆంటీనే టెక్నికల్‌ హబ్‌. ఫేస్‌ బుక్‌లో ఓ పొద్దు తిరుగుడు పువ్వు మాత్రమే ఉండేది ఫోటో లేకుండా. ఫేస్‌ బుక్‌లో చాలా యాక్టివ్‌గా ఉండేవారు. అంతకుముందు ఉన్న గూగుల్‌ గ్రూప్‌ సమూహాల గురించి కూడా ఆంటీకి చాలా తెలుసు.

ఆంటీ అప్పటికే గూగుల్‌ సాహిత్య గ్రూపులలో యాక్టివ్‌గా ఉండి అంతర్జాలంలో ఎన్నెన్ని మార్పులొస్తున్నాయో గమనించగలిగారు. తన పరిశోధనకు కూడా అంతర్జాలంలో తెలుగు అని ఎంచుకోవటంలోనే చాలా దూరదృష్టి కనిపిస్తుంది.

ఆంటీ చాలా ఇంటెలిజెంట్‌. ఈ తరంతో పోటీపడుతూ ఫాస్ట్‌గా నాలెడ్జ్‌ అప్‌డేట్‌ చేసుకోవడంలో దిట్ట. మంచి చదువరి, కాలమిస్టు. నాతో తాను చదివిన కథ గురించి లేదా పుస్తకం గురించి చర్చించేది. నన్ను విహంగ మాగజైన్‌ కవితల విభాగం చూసుకోమని అప్పజెప్పింది.

ప్ర.ర.వే ఢిల్లీలో సభలు జరిగినపుడు నా గురించి నిలబడి మరీ నాకు పత్రిక సమర్పణ ఇచ్చి తనతో పాటు తీసుకెళ్ళింది. ఆంటీతో ఢిల్లీ ప్రయాణం అసలు మర్చిపోలేను. ఆ ఆరు రోజులు నా ఆంటీ, ఆంటీకి నేను. ఎన్నెన్ని కబుర్లు… మాటలు… అప్పటికీ ఆరోగ్యం కొంత నలతగా ఉన్నా దాన్ని overcome చేసేస్తుండేది. ఆగ్రాలో తాజ్‌మహల్‌ చూడడానికి వెళ్ళినపుడు నేను బస్సులో నుండి కిందపడ్డాను. నాకేం జరగలేదు. కానీ ఆంటీ చాలా టెన్షన్‌ పడింది. ఆ రాత్రంతా నన్ను చూసుకుంటూ కూర్చుండిపోయింది.

నాకు మా అమ్మ తరువాత అమ్మలాంటి ఆంటీ ఇక లేరు అంటే అస్సలు దుఃఖం ఆగడంలేదు. నా ప్రతి బాధ, వేదన ఆంటీకి తెలుసు. ఓ తల్లి ఓదార్చినట్లు ఓదార్చేది. చాలా శ్రద్ధగా వినేది, హత్తుకునేది, సలహాలిచ్చేది. నా జీవితం బాగుండాలని మా అమ్మ, నాన్నల తర్వాత ఎవరైనా కోరుకున్నారంటే అది ఆంటీనే.

నెల్లూరులో నాకో అవార్డు సభ ఉండి వెళ్తుంటే… ఆంటీ వాళ్ళ చుట్టాలందరికీ నన్ను ఫోన్‌లోనే పరిచయం చేసింది. నాకు అవార్డు వచ్చిన ప్రతిసారీ తనకు అవార్డు వచ్చినంత సంతోషపడింది.

ఆంటీ అద్భుతమైన కవయిత్రి. తన కవిత్వం చదివి ఏడ్చేశాను. ఎందుకాంటీ మీరు కవిత్వం రాయటం తగ్గించారు? ఎందుకు పుస్తకం తేలేదు అంటే నవ్వేవారు. అంతేకానీ ఒక్క మాటా మాట్లాడలేదు. 1992లోనే ఆంటీ కవిత్వంలో చాలా బలమైన వ్యక్తీకరణ చేశారు. ఇప్పటికీ ఆ కవితలు చదివినా అంతే సాంద్రత ఉంటుంది.

తానే అన్ని కవితలను ఒక దగ్గర టైప్‌ చేసి ”వేకువ రాగం” పేరుతో ఈ-బుక్‌ వేశారు. తన కవిత్వాన్ని పుస్తకంగా చూడాలని ఆంటీకి కోరిక ఉండేది. కొండేపూడి నిర్మలకు ముందు మాట రాయమని ఇచ్చారు. ఇవ్వగానే వేస్తాను అనేవారు.

ఆంటీ చాలా మొండిది. చేయాలని నిశ్చయించుకున్న పని ఎంత కష్టమైనదైనా, ఎవరూ రాకపోయినా ఒక్కతే అయినా ముందుపడి ముగించేది. బయటికి ఎంత సున్నితమో లోలోపల అంత స్ట్రాంగ్‌. ప్రశ్నించే గుణం కలిగిన వ్యక్తి ఆమె. ప్రరవేలో అన్‌ ఆర్గనైజ్డ్‌గా ఏదైనా అనిపిస్తే ఈ.సీ. మీటింగ్‌లో ఖచ్చితంగా అడిగేవారు. అవన్నీ నేను ఆంటీ నుంచి నేర్చుకున్నాను.

నేను పుస్తకం వేస్తున్నా అనగానే నాకంటే ఎక్కువగా ఆంటీనే సంబరపడ్డారు. అంకుల్‌ని బెదిరించి మరీ ముందుమాటను మూడు రోజుల్లో రాయించారు. నాకు ఏదైనా అవార్డు వస్తే ముందుగా ఆంటీనే సంబరపడ్డారు. అకాడెమీ అవార్డు వచ్చినప్పుడు ఫోన్‌ చేసి ఎంత ఆనందపడ్డారో చెప్పలేను.

రాజమండ్రి ఇంటికి పిలిచి నాకు చేసిన మర్యాద అంతా ఇంతా కాదు. నా కోసం వంట వండి కొసరి కొసరి పెట్టిన జ్ఞాపకం అలాగే ఉంది. నన్ను ఆ నది ఒడ్డున నిల్చోబెట్టి తీస్తున్న ఫోటోల జ్ఞాపకమూ ఇంకా తాజాగానే ఉంది. మందుగోలీలు ఇష్టం లేకున్నా మింగేటప్పుడు, అడుగు తీసి అడుగు వేసేటప్పుడు యేసయ్యా, యేసయ్యా అని ఆంటీ గట్టిగా తలచుకోవడమూ గుర్తుకొస్తుంది.

ఆంటీ…

మీ కళ్ళజోడు… మీ చేతి గాజులు… మీ నవ్వు… పొట్టమీద టాబ్‌ పెట్టుకుని మీరు ఆడే కాండీక్రష్‌ ఆట… మీకిష్టమైన దోమల్‌గుడాలో ముసలాయన బండిమీద చేసే ఆలుబజ్జీలు… ఆల్ఫా హోటల్‌ బిర్యానీ… మీరు చెప్పిన ఫూలందేవి కథలు… స్ఫూర్తి నింపే మాటలు ఎలా మర్చిపోగలను. గంటలు గంటలు ఫోన్‌ కాల్స్‌ ఎలా మర్చిపోగలను. మీ గొంతు, మీ నవ్వు, మీ నిండైన రూపం నన్ను జీవితకాలం వెంటాడుతూనే ఉంటాయి. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను.

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.