జెండర్‌ ఏమిటో తెలుసుకుందాం -కమలా భాసిన

(గత సంచిక తరువాయి…)

‘ఇంటా’, ‘బయటా’ అన్న విభజన స్త్రీ, పురుషుల మధ్య అసమానతలను తీవ్రతరం చేసిందా?

ఔను. రెండింటినీ వేరు చెయ్యటం వల్ల వాటి మధ్య అంతరాలు ఏర్పడతాయి. ఇంటికి లేదా వ్యక్తిగతానికి సంబంధించింది ఆర్థిక, రాజకీయ, చారిత్రక ప్రాముఖ్యాన్ని కోల్పోయి క్రమేపీ ప్రాధాన్యం కోల్పోసాగింది. మార్కెట్‌లోకి ప్రవేశించినది ‘పని’గా పరిగణింపబడదు. అందులో పనిచెయ్యని వాళ్ళకి ఎటువంటి ఆర్థిక విలువా ఉండదు. ఆర్థికంగా ప్రాముఖ్యం లేని ఇంటిలో స్త్రీలు ఉండిపోయారు. కాబట్టి వారు ప్రాధాన్యతని కోల్పోయారు. స్త్రీ, పురుషుల మధ్య అంతరాలు పెరగసాగాయి. పితృస్వామ్యం బలం పుంజుకుంది. స్త్రీ కేంద్రంగా ఉన్న ఇళ్ళూ, బయట ప్రపంచమూ పురుష కేంద్రంగా మారిపోయి పురుష నియంత్రణ, పాలనలోకి వెళ్ళాయి.

గైన్‌ = గ్రీకు భాషలో స్త్రీ

ఆండ్రోస్‌ = గ్రీకు భాషలో పురుషుడు

గైనకాలజీ = స్త్రీల శరీర ధర్మం, జబ్బులకు సంబంధించిన శాస్త్రం

గైనోసెంట్రిక్‌ = స్త్రీ – కేంద్రిత

ఆండ్రోసెంట్రిక్‌ = పురుష- కేంద్రిత

గైనార్కీ = స్త్రీల ద్వారా ప్రభుత్వం

గైనాక్రసీ = స్త్రీల పాలన

ఆండ్రోక్రసీ = పురుష పాలన

గైనెలేటరీ = స్త్రీల ఆరాధన

గైనోసైడ్‌ = స్త్రీల హత్య

గైనోఫోబియా = స్త్రీలంటే ఏహ్యత లేదా భయం

ఆండ్రోగైనీ = ఒక వ్యక్తిలో స్త్రీ, పురుషుల లక్షణాలు ఉండడం

ఇంటా, బయట రంగాలను నియంత్రించే మౌలిక విలువల్లో కూడా స్పష్టమైన విభజన ఉంది; ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే అవి పరస్పర విరుద్ధమైనవి. ఇంటిలో ప్రేమ, రక్షణ, స్వార్ధరాహిత్యం, అర్థం చేసుకోవటాలను మెచ్చుకుంటే బయటి రంగంలో పోటీతత్వం, కాంక్ష, దుడుకుతనం, వ్యక్తివాదం అవసరమే కాకుండా ప్రశంసలు కూడా అందుకుంటాయి. మార్కెట్‌ ప్రాంతపు క్రూరత్వానికి దూరంగా పురుషుల కోసం స్త్రీలు ఇంటివద్ద స్వర్గంగా అందించాలి. ఆర్థిక విధానంలో, శాస్త్ర, సాంకేతిక రంగాలలో మత-ఆధార నైతికతకీ, విలువలకీ చోటు లేదు. బార్బరా ఎహ్‌రెన్‌రీచ్‌, డైడర్‌ ఇంగ్లీష్‌లు ఈ పరిణామాలను చక్కగా వివరించారు. ”ఈ నూతన ప్రపంచ విధానం నిష్పక్షపాత విభజన రేఖ ద్వారా రెండుగా విభజింపబడలేదు. ఈ రెండు రంగాలు తమ మౌలిక విలువల్లో పరస్పర విరుద్ధమైనవి. వీటి మధ్య రేఖ నైతికత వత్తిడితో జ్వలిస్తోంది. తన అత్యంత మౌలిక చర్యలలో మార్కెట్‌ శతాబ్దాలుగా వస్తున్న మతనైతికతను ఉల్లంఘించింది- ఈ మత నైతికత (కనీసం సిద్ధాంత రీత్యా అయినా) ఇతరులకు మేలు చేయడానికి, స్వార్థరాహిత్యానికి

ఉన్నత పీఠం వేసి అత్యాశను, కాంక్షను నిరసించింది. పాత విధానంలో వాణిజ్యానికి గౌరవప్రద స్థానముండేది కాదు. వడ్డీకి అప్పులివ్వడం నిరసనకు గురయ్యేది కానీ కొత్త విధానాన్ని బాగా వంట బట్టించుకున్న మార్కెట్‌ అన్ని నైతిక సూత్రాలను నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తుంది. ఇతరులను పేదరికంలోకి నెట్టడం ద్వారానే కొంతమంది లాభాలు సంపాదించగలరు, ఇందులో మానవ ప్రేమ, దాతృత్వం, విశ్వాసపాత్రతలకు చోటులేదు…”.

ఇప్పటిదాకా మీరు చెప్పినదాన్ని బట్టి ఇంటా, బయటా రంగాల మద్య విభజన ఎంత తీవ్రంగా ఉంటే స్త్రీల స్థాయి అంత తక్కువగా ఉంటుంది. ఇది నిజమేనా?

అనేక ఫెమినిస్టు చరిత్రకారిణుల ప్రకారం (ఎంగెల్స్‌ ప్రకారం కూడా) ఇది నిజమే. ఇంటిలో

ఉత్పత్తి జరిగే సమాజాలలో ఇంటా, బయటా రంగాల మద్య అంతగా తేడా లేనప్పుడు స్త్రీలు దాదాపు సమాన హోదాను అనుభవించారు. ఇంటా, బయటా ఉన్న ఈ విభజన మౌలికంగా రెండు విభిన్న ఉత్పత్తి విధానాల మీద, ఆర్థిక వ్యవస్థల ఆధారంగా జరిగింది. వీటిలో స్త్రీల పాత్ర భిన్నంగా ఉంటుంది. అంటే వాస్తవంలో పని, ఆస్తితో స్త్రీకి గల సంబంధం ఆమె హోదాను నిర్ణయిస్తుంది. చరిత్రలో స్త్రీలు ద్వితీయ స్థానాన్ని పొందటానికి మూలాలని ఆర్థిక విధానాలలో కనుగొనవచ్చని సోషలిస్టు ఫెమినిస్టులు భావిస్తారు. దాదాపుగా అన్ని సమాజాలలోనూ స్త్రీలు ఒక బృందంగా ప్రత్యేక ఉత్పత్తి, ఆస్తి సంబంధాలు కలిగి

ఉన్నారు. పనితో ఈ ప్రత్యేక సంబంధ ఫలితంగా ఏర్పడిన ద్వితీయ పౌరసత్వ స్థాయి వ్యక్తిగత, మానసిక స్థితులపై ప్రభావం చూపించింది.

జోన్‌ కెల్లీ ప్రకారం ”గృహానికి, బయట రంగాలు భిన్న సంస్కృతులలో భిన్నంగా నిర్వచింపబడవచ్చు. అయితే కుటుంబం, బయటి పనులు దాదాపుగా కలిసిపోయి ఉండడం ఒకవైపు, ఇంటికి, బయటికి సంబంధించిన పనులలో విభజన స్పష్టంగా ఉండటం ఇంకోవైపు గల కొలబద్దపై ఉంచినప్పుడు పరిస్థితి స్పష్టంగా బయటపడుతుంది. కుటుంబ పనులు, బయట లేదా సామాజిక పనులు కలిసి ఉన్నప్పుడు స్త్రీల హోదా పురుషులకు సమానంగా, ఒక్కొక్కసారి వారికంటే ఉన్నతంగా ఉంటుంది. ఈ చిత్రం ఎంగెల్స్‌ అభిప్రాయాలతో ఏకీభవిస్తుంది. ఇటువంటి పరిస్థితులలో మనుగడకూ, ఉత్పత్తికీ అవసరమైన సాధనాలు సామూహిక ఆధీనంలో ఉంటాయి. సామూహిక కుటుంబం గృహ, సామాజిక జీవనాలకు కేంద్రంగా

ఉంటుంది. మార్పిడి కోసం ఉత్పత్తి అంతగా జరగని సమాజాలలోనూ, వ్యక్తిగత ఆస్తి, వర్గ విబేధాలు అంతగా అభివృద్ధి చెందని సమాజాలలోనూ స్త్రీ, పురుషుల మధ్య అసమానతలు అంతగా ఉండవు. కొలబద్దలో ఈ చివర నుంచి ఆ చివరికి వెళ్ళే క్రమంలో అదనపు ఉత్పత్తి పెరిగి, వ్యక్తిగత ఆస్తి అభివృద్ధి చెందుతుంది. సామూహిక గృహం వ్యక్తిగత ఆర్థిక యూనిట్‌ అవుతుంది, కుటుంబ అధినేత పురుషుడవుతాడు. ఈ క్రమంలో స్త్రీలు ఆస్తిమీద, ఉత్పత్తుల మీద, తమ మీద నియంత్రణ కోల్పోతారు. స్త్రీల పనికి కేంద్రమైన కుటుంబం పురుష ప్రపంచమైన విస్తృత సామాజిక విధానానికి పరాధీనమవుతుంది. నాగరిక సమాజాలన్నీ ఇదే రకమైన తీరును ప్రదర్శించాయి”.

ఇంటా, బయటా అన్న ఈ విభజన కుటుంబంలో జరిగే దానిని దాచిపెట్టడానికీ, ఇంటిలోని అసమానతలు, వైరుధ్యాలను ప్రశ్నించటాన్ని కష్టతరం చేయడానికీ ఉపయోగపడుతుందా?

తప్పనిసరిగా. అనేకమంది రాజనీతిపరులు (వారి అనుచరులు) ‘వ్యక్తిగత’ విషయాలలో రాజ్యం జోక్యం చేసుకోకూడదని వాదించారు కూడా. ఇల్లు, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు ప్రభుత్వ నియంత్రణకు లోను కాకూడదని వాదించారు. ఇంటి నాలుగు గోడల మధ్య జరిగేది వ్యక్తిగత విషయంగా భావించబడి బయటివారి జోక్యం ప్రోత్సహించరు. దారుణ అసమానతలు, స్త్రీలపై తీవ్రవాదాలు ఈ విధంగా కొనసాగింపబడుతున్నాయి. భార్యని కొట్టడం, వైవాహిక అత్యాచారం, ఆడపిల్లల తండ్రులూ లేదా ఇతర పురుషులు బలాత్కరించడం, ఆడపిల్లలను అన్నింటిలో తక్కువగా చూడడం ఇటీవలి కాలందాకా బయటి ప్రపంచానికి తెలియనివ్వలేదు. వీటిమీద చర్చ జరగలేదు. వీటిని సవాల్‌ చేసినవాళ్ళూ లేరు. ఇంటా, బయటా రంగాల మధ్య విభజన ఇంటి బయట ఉద్యోగం చేపట్టే స్త్రీలకు సమస్యలను సృష్టిస్తుంది. బయటి పని స్వతంత్రత, తిరగటం, సుదీర్ఘ పనిగంటలు కోరగా ఇల్లు దీనికి వ్యతతిరేకమైనవి కోరుతుంది- పరాధీనత, సేవ, సహకారం. ఈ పరస్పర వైరుధ్యాల గురించీ, వీటి ఫలితంగా ఏర్పడే శారీరక, మానసిక వత్తిడుల గురించి ఎంతోమంది ఉద్యోగినులు చెప్పారు. మంచి భార్య, సమర్ధమైన బాస్‌ పాత్రలను కలపటం చాలా కష్టమైన విషయం. ఇటువంటి వత్తిడులు ఏమీ పురుషునిపై ఉండవు- మంచిభర్త, సమర్ధుడైన బాస్‌ అయి

ఉండాలని పురుషుడిని అడగరు.

పురుష ఆధిపత్యాన్ని, స్త్రీ,పురుష అసమానతలని పెంచుతుందని నమ్ముతున్న కారణంగా ఇంటా, బయటా అన్న ఈ ఖచ్చితమైన విభజనని ఫెమినిస్టులు విమర్శించారు, సవాలు చేశారు. ఈ వైరుధ్యాలను సవాలు చేయడానికే ‘వ్యక్తిగతమూ రాజకీయమే’ అనే నినాదాన్ని ఫెమినిస్టు ఉద్యమం తయారుచేసి, ప్రచారం చేసింది. స్త్రీలు పరాధీనతకు, అణచివేతకకు గురవుతున్న కుటుంబ రంగాన్ని అది సమాజ దృష్టికి తీసుకువచ్చింది.

గృహ హింసపై ఇక నిశ్శబ్దం కొనసాగదు!

స్త్రీల తక్కువ స్థితిని తెలియచేసే అణచివేత, దోపిడీ, పరాధీనత వంటి పదాలలో తేడా ఉందా?

ఈ పదాలను తరచూ ఒకదానికి బదులు మరొకటి వాడుతున్నప్పటికీ వీటి మధ్య తేడా ఉంది. అయితే ముందుగా జెండర్‌ అణచివేత, జెండర్‌ పరాధీనత అన్న పదాలు జెండర్‌ ఆధారంగా అణచివేత, పరాధీనత ఉన్నాయన్న విషయాన్ని మాత్రమే తెలియచేస్తాయని చెప్పదలచుకున్నాను. పరాధీనతకు, అణచివేతకు ఏ జెండర్‌ గురవుతుందో ఇది చెప్పదు. ఖచ్చితమైన అర్థంలో జెండర్‌ అణచివేత అంటే స్రీల అణచివేత అని అర్థం కాదు. అయితే సాధారణంగా స్త్రీలే పరాధీనతకు గురవుతుంటారు. కాబట్టి జెండర్‌ అణచివేత, జెండర్‌ పరాధీనత అన్నవి స్త్రీలపై అణచివేతనే సూచిస్తాయన్న భావన ఉంది.

దోపిడీ అన్న పదం ప్రస్తుతం మార్క్సిస్టు అర్థంలో ఉపయోగ పడుతోంది. దీని అర్ధం ఆర్థిక దోపిడి లేక అదనపు విలువలను గుంజుకోవటం. స్త్రీల దోపిడీ అంటే వేతనం లేకుండా, లేదా తక్కువ వేతనానికి స్త్రీలతో ఆర్థిక పనులు చేయించడం. ఈ దోపిడీ పూరిత సంబంధం వల్ల దోపిడీదారులు ఆర్థిక, భౌతిక ప్రయోజనాలు పొందుతారు. అణచివేత అన్న పదాన్ని పురుషుల ఆధిపత్యం లేదా స్త్రీల పరాధీన పరిస్థితిని తెలియచేయడానికి సాధారణంగా వాడతారు. చారిత్రకంగా, ఒక వ్యవస్థాగత విధానం ఫలితంగా ఏర్పడిన హక్కులవల్ల ఒక వర్గబృందం ప్రయోజనాలను పణంగా పెట్టి ఇంకొక బృందం లాభపడడాన్ని సాధారణంగా ఈ పదం సూచిస్తుంది. ఈ పదం బలవంతపు అణచివేతను సూచిస్తుంది. దాని ఫలితంగా వ్యక్తులు లేదా బృందాల పరిస్థితిని ఇది తెలియజేస్తుంది. ఉదాహరణకు ”వర్గ అణచివేత, ”కుల అణచివేత”, ”జాతి అణచివేత”.

పరాధీనత అంటే ఒకరితో పోలిస్తే తక్కువ స్థానంలో ఉండటం, లేదా ఇంకొకరి పెత్తనం, నియంత్రణలకు లోబడి ఉండటం. ‘స్త్రీల’ పరాధీనత అన్న పదం స్త్రీల స్థానం తక్కువగా, వనరులు అందుబాటులో లేకపోవటం, నిర్ణయాలు తీసుకునే స్థానంలో లేకపోవడం వంటి వాటినీ, అనేక సమాజాలలో స్త్రీలు పితృస్వామ్య ఆధిపత్యానికి గురికావటాన్ని సూచిస్తుంది.

”అణచివేత” అన్న పదం సరయిన భావాన్ని తెలియచెయ్యటం లేదని కొంతమంది ఫెమినిస్టుల అభిప్రాయం. గెర్డా లెర్నర్‌ ప్రకారం ”పితృస్వామ్య ఆధిపత్యాన్ని” ఈ పదం పూర్తిగా వివరించదు. ఇందులో అణచివేతల అంశాలు ఉన్నప్పటికీ, పరస్పరం నెరవేర్చవలసిన బాధ్యతలు కూడా ఉంటాయి…. ఇవి సైతం అణచివేతకు గురిచేస్తాయని అన్ని వేళలా గుర్తించరు.

”…అణచివేత” అన్న పదం అన్యాయాన్ని సూచిస్తుంది; ఒక బృందం అన్యాయానికి గురయ్యిందన్న చేతనను ఇది సూచిస్తుంది కాబట్టి ఇది విషయగతమైనది. ఈ పదం అధికారానికి పోరాటాన్ని సూచిస్తుంది; ఇందులో ఓటమి ఫలితంగా ఒక బృందం ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇతర బృందాలకంటే ఎక్కువగా స్త్రీలు జెండర్‌ విధానాన్ని అంగీకరించడం ద్వారా తమ పరాధీనతకు తామే సహకరించుకున్నారు. తమను పరాధీనతకు గురిచేసే విలువలను వాళ్ళు ఎంతగా అంతర్గతం చేసుకున్నారంటే వారు తమకై తాము స్వచ్ఛందంగా తమ పిల్లలకు వాటిని అందచేస్తారు. కొంతమంది స్త్రీలు తమ జీవితంలోని ఒక భాగంలో తండ్రులు, భర్తల చేతిలో ‘అణచివేత’కు గురవుతూనే స్వయంగా ఇతర స్త్రీలు, పురుషుల మీద ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు. ఒక బృందంగా మహిళల పరిస్థితిని వివరించడానికి ‘అణచివేత’ అన్న పదాన్ని ఉపయోగించినప్పుడు ఇటువంటి సంక్లిష్టతలన్నీ మరుగున పడిపోతాయి”.

”స్త్రీల పరాధీనత’ అన్న పదం ఉపయోగించడం బాగుంటుందని లెర్నర్‌ అభిప్రాయపడతారు. ”పరాధీనత అన్న పదం ఆధిపత్యం కలిగిన వ్యక్తి దురుద్దేశం కలిగి ఉన్నారన్న భావన కలిగించదు. రక్షణ కోసం, కొన్ని హక్కుల కోసం స్వచ్ఛందంగా పరాధీన స్థాయిని అంగీకరించే సందర్భాలూ ఉండవచ్చని ఈ పదం తెలియజేస్తుంది. స్త్రీల చారిత్రక అనుభవం ఈ పరిస్థితినే సూచిస్తుంది. ఈ రకమైన సంబంధానికీ ‘ఆదరణతో కూడుకున్న ఆధిపత్యం’తో పాటు ఇతర సంబంధాలు కూడా ఉండవచ్చు. అంతేకాకుండా ‘అణచివేత’ అన్నప్పుడు పరాధీనతకు కారణాలు అణచివేసే వ్యక్తిపై తోసెయ్యగా పరాధీనత అన్నప్పుడు దానికి కారణాలు ఏమిటి అనేది పేర్కొనదు. వేల సంవత్సరాలలో స్త్రీ, పురుషుల మధ్య ఏర్పడిన సంక్లిష్ట జెండర్‌ సంబంధాలను అధికారానికై పురుషుల అత్యాశ అన్న ఒక్క కారణంపైనే నెట్టివేయలేం. కాబట్టి వివిధ కాలాలలో, వివిధ సమయాల్లో స్త్రీ,పురుషులు నిర్మించుకున్న అనేక వేర్వేరు జెండర్‌ సంబంధాలను వివరించటానికి సాపేక్షికంగా ఎటువంటి విలువలూ ఆపాదించని పదాలను ఉపయోగించటం మంచిది”.

స్త్రీల పరిస్థితిని వివరించటానికి ఒక్కొక్కసారి deprivitation అన్న పదాన్ని ఉపయోగిస్తారు. కానీ అది అధికార సంబంధాలను విస్తృతపరుస్తుంది కాబట్టి ఇది సరైన పదం కాదు. హక్కులు, ప్రాధాన్యతలు లేకపోవటాన్ని deprivitation అంటారు. అందకుండా చేసే వారిపై కాకుండా అందకుండా పోయే దానికి ఇది ప్రాధాన్యతనిస్తుంది. ఒక వ్యక్తి, వ్యక్తుల బృందాలు, సంస్థలు, ప్రకృతి పరిస్థితులు, వైపరీత్యాలు, అనారోగ్యం వంటి అనేక కారణాల వల్ల అందకుండా పోవచ్చు.

స్త్రీల పరిస్థితి చరిత్రలో కాలాన్ని బట్టి, సమాజాన్ని బట్టి మారుతుంటుంది. కాబట్టి దానికి అనువైన వేర్వేరు పదాలు ఉపయోగించవచ్చు.

(ఇంకా ఉంది)

Share
This entry was posted in సమాచారం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.