తప్పెక్కడుంది?? -పి. ప్రశాంతి

హైస్కూల్‌ ఆవరణ పిల్లల్తో కళకళ లాడుతోంది. చుట్టుపక్కల ఏడెనిమిది ఊళ్ళకి అదే హైస్కూల్‌. ఆరోజు స్కూల్‌ వార్షికోత్సవం. ఆట పాటల్లో, చదువులో, సైన్స్‌ పోటీల్లో, అటెండెన్స్‌లో… ఇంకా అనేక విభాగాల్లో ముందున్న విద్యార్థులకి బహుమతు లిస్తున్నారు.

”ఈ ఏడాది స్కూల్లో అందరికన్నా ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థి.. ఎనిమిదో తరగతి కవిత” హెడ్మాష్టర్‌ ప్రకటించగానే అప్పటికే రెండుసార్లు స్టేజిమీద కెళ్ళొచ్చిన కవిత మరోసారి బహుమతి అందుకోడానికి స్టేజిమీదకి పరిగెత్తింది. ఆత్మవిశ్వాసం నిండిన నడకతో… సంతోషంతో వెలుగుతున్న ముఖంతో… స్నేహితుల కేరింతల మధ్య గర్వంగా బహుమతి అందుకొని వేదికమీదున్న పెద్దలందరికి నమస్కారం చేసింది. ”రెండేళ్ళుగా అత్యధిక మార్కులు తెచ్చుకుంటున్న కవిత మరో రెండేళ్ళూ ఇలాగే కొనసాగుతూ పదో తరగతిలో జిల్లాకే ఫస్ట్‌ రావాలని కోరు కుంటున్నా” అంటున్న హెడ్మాష్టార్‌కి నమస్కరించి బహుమతితో పాటు స్టేజిదిగి తండ్రి దగ్గరకి పరిగెత్తింది. సంతోషంతో చెల్లిని వాటేసుకుంది.

ఇంకో సంవత్సరం గడిచి పోయింది. స్కూల్‌ వార్షికోత్సవం వచ్చింది. ఎన్నెన్నో బహుమతులు.. కవిత పేరు ఒక్క దాంట్లోనూ లేదు. మూణ్ణెల్ల పరీక్షల్నుంచే మార్కులు తగ్గడాన్ని గమనించిన టీచర్లు కవితని పిలిచి కారణమడిగారు. ఈ సారి బాగా చదువుతానంటూ యాంత్రికంగా జవాబు. ఆటపాటల్లో ఆసక్తి తగ్గింది. సైన్స్‌ ప్రయోగాలంటే ముందుండే కవిత ఆవైపే వెళ్ళట్లేదు. ఆర్నెల్ల పరీక్షల్లోనూ, వార్షిక పరీక్షల్లోనూ మార్కులు తగ్గుతూ వచ్చాయి. టీచర్లు, హెడ్మాష్టర్‌ ఎన్నిసార్లు మాట్లాడినా నిర్లిప్తంగా సమాధానం ఇవ్వడం తప్పించి ముందటి ఉత్సాహం కనబడలేదు. కవితని అన్నిట్లో పాల్గొనాలని ఎంకరేజ్‌ చేసే తండ్రిని, ఇంటిపనుల్లో సాయానికి తప్పించి పెద్ద పనులేటికీ పిలవకుండా బాగా చదువుకోమనే తల్లిని కూడా పిలిచి మాట్లాడారు. వారూ మనుపట్లా చురుగ్గాకాక మొక్కుబడిగా, తల్లి కొంత బెరుగ్గా మాట్లాడటాన్ని గమనించిన హెడ్మాష్టర్‌ కుటుంబంలోనే ఏదో సమస్య

ఉందని అనుకున్నా, కవితతో మాట్లాడటానికి రెండు మూడుసార్లు ప్రయత్నించినా ఏమీ తెలుసుకోలేక పోయారు. స్కూల్‌ వార్షికోత్సవంలో కూడా స్నేహితులకి దూరంగా వెనకెక్కడో కూర్చుని సగంలోనే లేచెళ్ళిపోయింది కవిత. ఆ తర్వాత మళ్ళీ స్కూల్‌కి రాలేదు.

ఎండాకాలం సెలవులు మొదలైన వారానికే కవితకి పెళ్ళన్న విషయం విన్న స్నేహితులు అవాక్కయ్యారు. సైన్స్‌ టీచర్‌ అవ్వాలని కలలుగన్న కవిత ఇక చదవదన్న మాటే వాళ్ళకి మింగుడుపడట్లేదు. పదిహేనేళ్ళ కవితకి పెళ్ళేంటని కోపం కూడా వచ్చింది. ఇంట్లో పెద్దవాళ్ళు లేని సమయం చూసి కవిత దగ్గరికెళ్ళారు. నాలుగునెల్ల తమ్ముణ్ణి ఒళ్ళోవేసుకుని నిద్రబుచ్చుతోంది. పెళ్ళి విషయం అడగ్గా ”నాకు ఇష్టమయ్యే చేసుకుంటున్నాను. రెణ్ణెల్లలో 16 ఏళ్ళు వస్తాయి. నాకంటే 5 ఏళ్ళే పెద్దోడు. పట్నంలో కంపెనీలో డ్రైవర్‌. మూడు గదుల కోర్టర్‌ ఇచ్చారంట. మంచి సంబంధం పెళ్ళవ్వగానే అక్కడికెల్లిపోతా…” అంటూ ముభావంగానే గబగబా చెప్పింది కవిత. స్కూల్లో టీచర్లు చెప్పిన విషయాలు, బాలదండులో అక్కావాళ్ళు చెప్పినవి అన్నీ మర్చిపోయిందా అనుకుంటూ ‘అక్కోళ్ళకి ఫోన్‌చేసి విషయం చెప్పారు. చైల్డ్‌లైన్‌కీ ఫోన్‌ చేసి చెప్పారు.

అక్కోళ్ళు కవిత వాళ్ళ గ్రామానికెళ్తే అంగన్‌వాడి టీచర్‌, ఆశ కార్యకర్త, మహిళా సంఘం లీడర్లు, బాలదండు పిల్లలు, ఊరిపెద్దలు అంతా చేరారు. కవిత తల్లి చంటి పిల్లాడికి పాలిస్తూ నిర్లిప్తంగా గుమ్మంలో కూర్చుంది. తండ్రి కొంతసేపటి తర్వాత ‘నా బిడ్డ, నా ఇష్టం. అయినా నా బిడ్డే పెళ్ళిచేసేస్కుంటానన్నాక మీకేంది? నేనేం బలవంతంగా చెయ్యట్లేదు. మీరెందుకు ఆపాలని చూస్తున్నారు? అంటూ అరిచి గోల చేస్తూ ఒక్కసారిగా గదిలోకి దూరి గ్యాస్‌ నూనె డబ్బాతో బైటికొచ్చి అమాంతం మీద గుమ్మరించుకుని ‘ఎవరన్నా ఈ పెళ్ళి ఆపాలని చూస్తే ఇప్పుడే, ఇక్కడే నిప్పంటించుకుని చస్తా’ అంటూ బెదిరించాడు. అంతకుముందే అక్కడికొచ్చిన గ్రామ పోలీస్‌, గ్రామంలోని యువకులు అతన్ని ఆపి బలవంతంగా పక్కకి లాక్కొచ్చి కూర్చోబెట్టారు. స్టేషన్‌కి వెళ్దాం పదమంటే అంగన్‌వాడి టీచరు, అక్కోళ్ళతో పాటు కవిత, ఆమె తండ్రి జీపెక్కారు.

కవితని ఒంటరిగా గదిలో కూర్చో బెట్టుకుని ‘బాగా చదువుకోవా లనుకున్నావ్‌, ఇప్పుడు సడెన్‌గా నీకు పెళ్ళెందుకు ఇష్టమైంది? ఆ ఇంట్లో ఎందుకు ఉండలేనంటున్నావ్‌? ఏమైందమ్మా…’ అని అడిగినదానికి కవిత జవాబు అంగన్‌వాడి టీచర్‌ని, అక్కోళ్ళని అవాక్కు పరిచాయి.

ఏడాది క్రిందట… విచిత్రమైన శబ్దాలకి నిద్ర మెలకువచ్చిందని, తనమీద కాలేసుకు పడుకున్న చెల్లి అలాగే ఉన్నా, తన చేతికి తల్లి తగల్లేదని, భయంతో కళ్ళు తెరిచి చూస్తే మంచంమీద తల్లి, తండ్రి లైంగిక చర్యలో ఉన్నారని, చూడకూడదని కళ్ళు మూసుకున్నా తర్వాత రోజుల్లో రాత్రిళ్ళు నిద్ర పట్టేదికాదని, అలా చాలాసార్లు చూడాలని పించేదని, ఒక్కొక్కసారి తను తప్పు చేస్తోందనిపించినా ఉన్న ఒక్కగది ఇంట్లో వేరే దారిలేదని, తనకీ ఆసక్తిగా ఉండేదని, చదువు మీద ధ్యాస తగ్గిందని, అబ్బాయిలపట్ల ఆకర్షణగా ఉందని, బాయ్‌ ఫ్రెండ్‌ కావలనిపిస్తోందని, పెళ్ళిచేసేసుకుంటే అన్నిటికీ అదే పరిష్కారమని ఏడుస్తూ చెప్పింది. తన నాలుగునెల్ల తముడ్ని చూసినప్పుడల్లా సిగ్గు. కోపం, కచ్చితో కలగాపులగంగా అనిపిస్తుందని, తన పట్ల తనకే అసహ్యమేస్తోందని, తను పాపం చేసిందని, ఇప్పుడైతే చచ్చిపోవాలనిపిస్తోందని ఏడ్చింది. కొన్నాళ్ళ క్రిందట అమ్మానాన్నలు కలిసున్నప్పుడు తను చూడటాన్ని తండ్రి గమనించాడని, అప్పట్నుంచి తనని అన్నిటికీ తిడుతున్నాడని, పెళ్ళి చేసి పడేస్తే పీడ విరగ డౌతుందంటున్నాడని, ఎప్పుడూలేనిది ఈ మధ్య అప్పుడప్పుడూ కొడ్తున్నాడని, ముందు వారించినా విషయం తెలుసుకున్న తల్లి తనతో ముక్తసరిగా ఉండడం భరించలేక పోతోందని వాపోయింది. కాసేపటికి తేరుకుని తనకి చదువుకోవాలనుందని, ఇంటికెళ్ళనని, దూరంగా ఎక్కడన్నా హాస్టల్లో పెట్టమని బతిమలాడింది చివరికి స్టేట్‌ హోంలో

ఉండాల్సోచింది.

కవిత ఈ పరిస్థితికి కారణ మెవ్వరు? ఆమె తల్లి దండ్రులా? పేదరికమా? సరైన ‘గూడు’ కల్పించలేని ప్రభుత్వమా? పిల్లలకి లైంగిక విద్య అందించడం నేరమని నైతిక విలువలు నేర్పించాలని ఊదరగొడ్తున్న విద్యా వ్యవస్థా? వీటన్నిటి వెనకా ఉన్న రాజకీయమా? ఏది కారణం?? తప్పెవరిది??

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.