జైల్లో నా జీవితం

నేను జైల్‌కి వస్తానని కలలో కూడా అనుకోలేదు. ఒక కార్పొరేట్‌ ఆఫీసులో హెచ్‌.ఆర్‌. మేనేజర్‌గా పని చేస్తున్న నేను జైలు కొచ్చానంటే, చదివే మీకు చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు. నాతో పాటు జైలులో ఇంకా చాలా మంది ఉన్నారు. నేరాలు చేసి వచ్చిన వాళ్ళు, నేరాలు ఆరోపించబడి వచ్చినవాళ్ళు ఉన్నారు. అసలు నేనెందుకు జైలు కొచ్చాను?

ఒక రోజు నేను ఆఫీస్‌ నుండి క్యాబ్‌లో ఇంటికొస్తున్నాను. తెలియని ఒక నంబర్‌తో ఫోనొచ్చింది. అలాంటి కాల్స్‌ సాధారణంగా నేను తీసుకోను. మళ్ళీ, మళ్లీ రావడంతో ట్రూ కాలర్‌లో చూసాను. నాకు తెలియని పేరు కనిపించింది. పట్టించుకోకుండా వదిలేసాను. వాట్సాప్‌లో మెసేజ్‌ పెట్టాడు. ఫోన్‌ మాట్లాడకపోతే విపరీత పరిణామాలుంటాయి అని బెదిరించడం మొదలు పెట్టాడు పదే పదే కాల్స్‌ రావడంతో ఫోన్‌ తీసుకుని ‘నువ్వు రాంగ్‌ నెంబర్‌కి కాల్‌ చేస్తున్నావ్‌. మళ్ళీ కాల్‌ చేసావంటే మర్యాదుండదు’ అని తిట్టి ఫోన్‌ పెట్టేసి ఆ నెంబర్‌ బ్లాక్‌ చేసేసాను. అయినా సరే వేరే వేరే నెంబర్లతో కాల్స్‌ చేసి హింసించడం, వాట్సాప్‌లో, మెసేజెస్‌లో వేధించడం కొనసాగించాడు. ఎవరు నువ్వు ఎందుకిలా వేధిస్తున్నావ్‌ అంటే ‘నన్నొక సారి కలువ్‌. ఫోన్‌ చేయడం మానేస్తా’ అన్నాడు.

నాకూ విసుగొస్తోంది. వాడెవడో చూసి, తర్వాతేం చేయాలో ఆలోచించవచ్చులే అనుకుని, అమ్మానాన్నలకి చెప్పకుండా ఇద్దరు ఫ్రెండ్స్‌కి చెప్పి వాళ్ళతో కలిసి వాడు రమ్మన్న చోటుకి వెళ్ళాను. తన బైక్‌ నెంబరు చెప్పడం వల్ల చాలా కోపంగా అతని బైక్‌ దగ్గర కెళ్ళి నిలబడ్డాను. అది మెయిన్‌ రోడ్డు. నన్ను బైక్‌ మీద ఎక్కమని వొత్తిడి చేయడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో నా ఫ్రెండ్స్‌ వచ్చి అతన్ని కొట్టారు. పబ్లిక్‌ మా చుట్టూ మూగసాగారు. ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. అప్పుడు నా ఫ్రెండ్స్‌ అతనిని పక్కనే ఉన్న షాప్‌లోకి లాక్కెళ్ళారు. అతనిని మేము బలవంతంగా తీసుకెళుతున్నామని భావించి ఎవరో పోలీస్‌ కంప్లయింట్‌ ఇచ్చారు.

మేము షాప్‌లోకి తీసుకెళ్ళానే అతని ఫోన్‌ తీసుకుని కాంటాక్ట్‌ లిస్ట్‌ చూసాను. నా క్లోజ్‌ ఫ్రెండ్‌ ఫోటో అతని ఫోన్‌లో చూసి ఆశ్చర్యపోయి తనకి ఫోన్‌ చేసి విషయం చెప్పాను. అతని ఫోన్‌ నెంబర్‌ చూసి అది తమకి తెలిసిన ఒక కార్పెంటర్‌ కొడుకు నెంబరని చెప్పింది. అతనికి నా నెంబర్‌ ఎలా వచ్చింది అని నేను అడిగాను. ‘నువ్వొక సారి మా ఇంటికొచ్చినప్పుడు, నీ ఫోన్‌తో కార్పెంటర్‌కి కాల్‌ చేసాను. గుర్తుందా! వీడు వాళ్ళ నాన్న ఫోన్‌లో నుంచి నా నెంబరు తీసుకుని ఉంటాడు. సారీ! నీకు ఇంత ప్రాబ్లమ్‌ అయినందుకు’ అంది తను. వాడినడిగితే అవునని ఒప్పుకున్నాడు. అతన్ని దగ్గర ఉన్న పోలీస్‌ స్టేషన్‌లో అప్పచెప్పాలని మేము బయలు దేరుతున్నంతలో పోలీసులొచ్చి నన్ను, నా ఫ్రెండ్స్‌ని అరెస్ట్‌ చేసారు. పోలీస్‌ స్టేషన్‌కి తీసుకెళ్ళి బాగా కొట్టారు. అక్కడున్న టీ.వీలో వస్తున్న స్క్రోల్‌ చూసి అదిరిపోయాం. ఒకమ్మాయి, ఆమె ఫ్రెండ్స్‌ కలిసి ఒకరిని కొట్టి, కిడ్నాప్‌ చేసి తీసుకెళ్ళి పోతుంటే పోలీసులు చాకచక్యంగా కిడ్నాపర్లను ఛేేజ్‌ చేసి అరెస్ట్‌ చేసారని ఆ స్క్రోల్‌లో వస్తోంది. నేను షాక్‌ అయ్యాను.

ఆ తర్వాత మమ్మల్ని కోర్టుకు తీసుకెళ్ళారు. ఎఫ్‌.ఐ.ఆర్‌.లో మా మీద కిడ్నాపింగ్‌, చంపడానికి ప్రయత్నం కేసులు పెట్టారు. కోర్టు మమ్మల్ని జైలుకు పంపింది. నన్ను వేధించిన వాడిని ఫ్రీగా వదిలేసారు. మిమ్మల్ని జైలుకు పంపారు. నేను చేసిన నేరం ఏమిటి? నన్ను వేధిస్తున్న వాడికి బుద్ధి చెప్పాలనుకోవడమా? తల్లిదండ్రులకి చెప్పకుండా, వారి సలహా అడగకుండా నా అంతట నేను నా సమస్యను పరిష్కరించుకోవాలనుకోవడమా? నాకు సహాయంగా వచ్చిన నా ఫ్రెండ్స్‌ కూడా జైలు పాలవ్వడం నాకు చాలా బాధగా ఉంది. ఈ జైలు, ఇక్కడి మనుష్యులు,వాళ్ళ సమస్యలు దగ్గరగా చూడగలుగుతున్నాను. స్వేచ్ఛను కోల్పోవడం అంటే ఏమిటో అర్థమౌతోంది. ఒక మిస్డ్‌ కాల్‌ వల్ల జరిగిన అనర్థం నా జీవితాన్ని ఒక కుదుపు కుదిపేసింది. బాధ్యతా రాహిత్యంగా ఒక వ్యక్తి చేసిన ఫోన్‌ కాల్స్‌ వల్ల నా కుటుంబం తీవ్ర ఇబ్బందులకు, మానసిక వేదనకు గురైంది. నేను పనిచేస్తున్న ఎమ్‌.ఎన్‌.సి నాకు తోడుగా నిలవడం వల్ల నా ఉద్యోగం ఏమీ అవ్వలేదు.

నేను రిలీజ్‌ అయ్యాక ఫోన్‌తో, ఇంటర్‌నెట్‌, సోషల్‌ మీడియాతో ఎలా మెలగాలో అందరికీ చెబుతాను. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదని చెబుతాను. అందుబాటులో ఉన్న సహాయ సంస్థల సహకారాన్ని గురించి కూడా వివరిస్తాను. నిజానికి జైలు అనుభవం నన్ను రాటుదేల్చింది. నేను పొరపాటు చేసాను కానీ నేరం చెయ్యలేదు కాబట్టి నేను ధైర్యంగానే ఉంటాను. ప్రిజన్‌లో మీరు (భూమిక) చాలా మంచి పని చేస్తున్నారు. మాకు ధైర్యం ఇస్తున్నారు. నా కథ రాయించారు. ఇది చదివి ఫోన్‌తో ఎలా జాగ్రత్తగా ఉండాలో అందరూ అర్థం చేసుకుంటే చాలా సంతోషం.

Share
This entry was posted in ప్రిజన్ పేజి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.