పంజరాలని బద్దలు కొడదాం -రాణి రోహిణి రమణ

 

పింజ్రాతోడ్‌ – విద్యార్థినులని సంకెళ్ళలో పెట్టి ఉంచటానికి హాస్టళ్ళు అవలంబిస్తున్న తిరోగమన నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఢిల్లీలో వివిధ కళాశాలల్లోని మహిళా విద్యార్థినులు చేస్తున్న ఉద్యమం. వీరు యువతులని పితృస్వామిక సమాజం రక్షణ పేరుతో చేసే కట్టడికి వ్యతిరేకంగా 2015 నుంచి పనిచేస్తున్నారు. భద్రత, రక్షణల పేరుతో చైతన్యాన్ని, స్వేచ్ఛని, విద్యార్థినుల హక్కులను అణచివేయటానికి ఏర్పడిన సిసిటివి ఆధారిత భద్రతా నిర్మాణాన్ని సవాలు చేస్తున్నారు. యువతులపైన కర్ఫ్యూ పేరుతో నిషేధాలు విధించటాన్ని నిరసిస్తూ, వారికి ఆర్థికంగా అందుబాటులో ఉండని నివాసాలను, అతిధి గృహాలను నియంత్రించటం, విశ్వవిద్యాలయ వాతావరణంలో యువతులపై జరిగే లైంగిక వేధింపులను నిర్మూలించి, ఫిర్యాదుల పరిష్కారానికి అవసరమైన అంతర్గత ఫిర్యాదుల వ్యవస్థను ఏర్పాటు చేయటం వంటి అంశాలపై పనిచేస్తున్నారనే విషయం మీకర్థమవుతుంది. ఈ ఉద్యమానికి వ్యవస్థాపకులు గానీ, నాయకులు గానీ లేరు. అది గతంలో నడిచిన మహిళా ఉద్యమానికీ, రాబోయే ఉద్యమానికీ అనుసంధానంగా పనిచేసే కార్యకర్తల సమూహం. దీనికి ఢిల్లీలో నిర్వహించబడే ఎన్నో విద్యార్థి ఉద్యమాలలో భాగస్వామ్యం ఉంది. మన దేశంలో వివిధ ప్రాంతాలలో మొదలైన ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది.

మహిళా హాస్టళ్ళు ఈ పద్ధతిలో పనిచేయటం మొదలుపెట్టి చాలాకాలమైంది. ఈ విధంగా

ఉద్యమించే ఆలోచన మీకెలా కలిగింది? ఏ అంశాలకు మీరు ప్రతిస్పందిస్తున్నారు? ఇది ఎవరి చొరవ? మీరు మొట్టమొదట లేవనెత్తిన అంశాలేంటి? ఈ ఉద్యమం ఎక్కడ మొదలైంది?

హాస్టళ్ళలో అమలవుతున్న నియమ నిబంధనలకు గానీ, విశ్వ విద్యాలయాలలో పాతుకుపోయిన పితృస్వామిక ఆచరణకు గానీ, వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమాలలో ఇది మొట్టమొదటి ఉద్యమం కాదు. గతంలో ఇటువంటి ప్రతిఘటనలు చాలా జరిగాయి. ఇందులో ఇటీవలి కాలంలో 2009లో రామ్‌జాస్‌ కాలేజీలో, 2013లో సెయింట్‌ స్టీఫెన్స్‌ కళాశాలలో, నగరంలో ‘కిస్‌ ఆఫ్‌ లవ్‌’ (ప్రేమపూర్వకమైన ముద్దు), 2015 ఫిబ్రవరి 14న శుద్ధ దేశీ రొమాన్స్‌, కమ్‌ అండ్‌ సీ ద బ్లడ్‌ ఆన్‌ మై స్కర్ట్‌ (నా లంగా పైన ఉన్న రక్తపు మరకలు చూడు) వంటి ప్రతిఘటన / రాజకీయ కార్యకలాపాల ద్వారా కలుసుకుని సమూహంగా ఏర్పడిన యువతులున్నారు.

2015 జులైలో, జామియా మిలియా పాలకవర్గం పంపించిన నోటీసు పెద్ద కలకలం రేపింది. విద్యార్థినులకు ‘రాత్రి బయటకు వెళ్ళే వెసులుబాటు’ను నిరాకరించే నోటీసు అది. విద్యార్థినుల తల్లిదండ్రుల దగ్గర నుంచి ఉత్తరాల ద్వారా గానీ, ఫ్యాక్స్‌ ద్వారా గానీ, ‘తండ్రి’ అని చెప్పబడే వ్యక్తి పేరిట నమోదు చేసిన ఫోన్‌ నెంబరు నుంచి పంపించే ఎస్‌ఎమ్‌ఎస్‌ ద్వారా గానీ, ముందుగా అనుమతి తీసుకుని, హాస్టల్‌ నుంచి బయటకు వెళ్ళి, రాత్రి తిరిగి రానవసరం లేకపోవడాన్ని ”నైట్‌ అవుట్‌’ అంటారు. దీనికి వరుసగా ప్రతిస్పందనలు మొదలయ్యాయి. జామియా హాస్టలు నుండి ఒక అమ్మాయి రాసిన ఒక శక్తివంతమైన

ఉత్తరాన్ని చూసి ఢిల్లీ మహిళా కమిషన్‌ తనంతట తానుగా పంపించిన నోటీసుతో మొదలైంది. ఈ అంశాన్ని ముందుకు తీసుకుపోవటానికి మీడియా దృష్టి పెడుతున్న ఈ సమయం, మైనారిటీ సంస్థ అయిన జామియాపై ప్రత్యేకంగా గురి పెట్టడం తగదని భావించి, ఫేస్‌బుక్‌ పేజీని ప్రారంభించాము. జంతర్‌ మంతర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం కోసం సంతకాల ద్వారా వినతి పత్రం తయారుచేసి ఢిల్లీలోని వివిధ విశ్వవిద్యాలయాల హాస్టళ్ళలో ఉండే విద్యార్థినుల కథలను అజ్ఞాతంగా ప్రచురించడం మొదలుపెట్టాము. మొదటి ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా చేసిన డిమాండ్లు నిషేధాలను, గడువులను ఎత్తివేయడం, స్థానిక సంరక్షకుల అవసరాన్ని తీసివేయటం. నగరంలో స్థానిక సంరక్షకునిగా ఉండాలంటే, వివాహితులై 30 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్న పురుష బంధువులు కావాలి. అలాంటి వాళ్ళు ఇక్కడి విద్యార్థినులలో చాలా మందికి ఉండడం కష్టం. ఇలా ఎవరైనా ఉన్నప్పటికీ, మహిళా హాస్టళ్ళలో ప్రతి వారం రాత్రిళ్ళు ఆలస్యంగా రావడం, బయటికి వెళ్ళడం వంటి అంశాలపైన తరచూ అధికారులు పెట్టే చికాకులను భరించడానికి సిద్ధపడరు. హాస్టళ్ళలో వసతి పెంచాలని, యోగ్యతను బట్టి కాకుండా అవసరాన్ని బట్టి వసతి ఇవ్వాలనీ, నిరంతరం జరిగే అవమానాలకు ముగింపు పలకాలనీ, నైతిక ప్రవర్తన పైన కాపలా వ్యవస్థను తొలగించాలనీ, లైంగిక వేధింపుల ఫిర్యాదుల పరిహార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండు చేశాము.

విశ్వవిద్యాలయం చుట్టు పక్కల ప్రాంతంలో చాలా ఎక్కువ అద్దెలతో పెరుగుతున్న ప్రైవేటు అతిధి వసతులను నియంత్రించవలసిందిగా డిమాండు చేశాము. ఈ డిమాండ్లు, మా ఫేస్‌బుక్‌ పేజి, మేము జరిపిన మొట్టమొదటి రాత్రి కవాతు, అలాగే ప్రజాభిప్రాయ సేకరణ ఇవన్నీ వివిధ కళాశాల క్యాంపస్‌ల మధ్య సంబంధాలకు అవకాశం కల్పించాయి. మొదట్లో ఒక వాట్సాప్‌ గ్రూప్‌ ముఖ్యమైన అందరినీ సమన్వయం చేయటానికి ఏర్పాటైంది. తరువాత రెండు సంవత్సరాల కాలంలో ఈ సంబంధాలు విస్తరించాయి. తరచు జరిగే సమావేశాలతో కళాశాలలు స్వంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ, వారి నిర్దిష్టమైన డిమాండ్లు చేయటం మొదలు పెట్టడం ద్వారా కొంత క్రమబద్ధమయ్యాయి.

హాస్టళ్ళ నిబంధనలు వంటివి సమాజంలో జెండర్‌ వివక్షతకు ప్రతీకగా చూస్తున్నారా? హాస్టళ్ళ తాళాలు బద్దలు కొట్టడాన్ని కళాశాల క్యాంపస్‌లలో ఉండే జెండర్‌ వివక్షతను సవాలు చేయటంగా భావిస్తున్నారా?

విశ్వవిద్యాలయాలలో నిషేధాలు జెండర్‌ వివక్షతకు ప్రారంభం కానీ, అంతం కానీ కాదు. యువతులు ఎదుర్కొనే సమస్యలను చర్చించాలంటే చాలా ప్రశ్నలకు సమాధానం వెతకాల్సి ఉంటుంది. పింజ్రాతోడ్‌ ఒక ఉద్యమంగా కొన్ని నిర్దిష్టమైన డిమాండ్లతో, కేవలం నిషేధాలను తొలగించటం కోసం మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ సామూహిక రాజకీయాల స్థాపనకు అవసరమైన వ్యక్తీకరణకు అవకాశమిస్తూ, విద్యార్థినులు తమ రాజకీయాలను వ్యక్తీకరిస్తూ, వాటిని నిలబెట్టే నిర్మాణాలను రూపొందించుకోవటానికి అవసరమైన వ్యక్తీకరణకు, అవకాశాల కోసం పని చేస్తుంది. ఈ ఉద్యమం విశ్వవిద్యాలయాల వ్యవస్థను సవాలు చేసే విద్యార్థుల ఉద్యమాలను, అవి ‘యూజీసీని ఆక్రమించు’ ఉద్యమం గానీ, రోహిత్‌ వేములకు న్యాయం జరగాలనే ఉద్యమం గానీ లేదా విశ్వవిద్యాలయం పైన నిరంతర దాడులను వ్యతిరేకించడంలో కానీ పాల్గొనటం, వాటితో సంబంధాలు పెట్టుకోవటం, విశ్లేషణపూర్వకమైన విమర్శ చేయటం వంటి వాటికి అవకాశం ఇచ్చింది. వీటికంటే ముఖ్యంగా ఈ ఉద్యమం మహిళా ఉద్యమాలతో సంబంధాలు పెట్టుకుంటూనే అందులోని నిచ్చెన మెట్ల క్రమాన్ని ప్రశ్నిస్తూ ”మహిళ” అనే వర్గానికి ఉండే రకరకాల అర్ధాలకు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉండే అవకాశాన్ని ఇచ్చింది. ఈ అనుభవం మాకు వినయాన్ని నేర్పింది, స్ఫూర్తినిచ్చింది. దీని నుంచి మేము నేర్చుకుంటూనే ఉన్నాము.

మహిళల లైంగికత, స్వేచ్ఛకు సంబంధించి పితృస్వామిక బ్రాహ్మణవాద ఆందోళనలోనే ఈ నిషేధాలు వేళ్ళూనుకుని ఉన్నాయని మా భావన. దీని ఆధారంగా జెండర్‌ వివక్షత ఏర్పడింది. విశ్వవిద్యాలయాలు మహిళలకు పరిపక్వత లేదనే ఉద్దేశ్యంతో, వారికి నిర్ణయాలు తీసుకోగలిగిన సమర్ధతను ప్రశ్నించి చూసే ఈ వ్యవస్థలను కొనసాగించే ప్రయత్నం చేస్తాయి. లైంగిక వేధింపుల పరిహార యంత్రారగం ఏర్పాటు చేయని విశ్వవిద్యాలయాలు, భద్రత, రక్షణ పేరిట మోసపూరితంగా చేసే పనులను మేము సవాలు చేస్తూనే ఉన్నాము. ఇవి రాజ్యాంగ విరుద్ధమైనవి. ఎందుకంటే, ఇవి మహిళల కదలికలను, చైతన్యాన్ని అణచివేయడమే కాకుండా, ఇక్కడి విద్యార్థినుల పవిత్రతను కాపాడడంలో వాళ్ళ తండ్రికి, భర్తకు మధ్య వారధిలాగా వ్యవహరిస్తాయి.

విశ్వవిద్యాలయాలలో ఈ విధానాలు విరివిగా ఉన్నాయి. నిషేధాలకు వ్యతిరేకంగా ఆర్థికంగా అందుబాటులో ఉండే వసతి కోసం, పరిహార యంత్రాంగం ఏర్పాటు కోసం మేము చేస్తున్న పోరాటం, మహిళల స్వేచ్ఛ కోసం, సాముహికీకరణ కోసం, వారి జీవితాలపై వారికి నియంత్రణ కోసం పితృస్వామిక వ్యవస్థతో బేరమాడే శక్తి కోసం, బ్రాహ్మణవాదం, పితృస్వామిక వాదం, ‘పబ్లిక్‌’, ‘ప్రైవేటు’ల మధ్య వైరుధ్యాన్ని ఇలా వర్ణిస్తుంది. ‘మంచి బ్రాహ్మణ స్త్రీ, ‘ప్రైవేటు’లోకి పరిమితమై ఉంటుందనీ, వీథులలో, పని ప్రదేశాలలో అంటే ‘పబ్లిక్‌’ అనబడే ప్రదేశాలలో కనిపించే స్త్రీలు లైంగికంగా అందుబాటులో ఉండేవారని, అవి చెడిపోయిన, అనైతిక ప్రదేశాలు కావటం వలన అక్కడ వెలివేయబడిన దళిత, ఆదివాసీ స్త్రీలుంటారనీ’ చిత్రీకరిస్తుంది.

మహిళలుగా మనకు ఈ పాత్రల్ని ఆధిపత్య వ్యవస్థలు నిర్ధారించాయి. ఇవి ఏ రకంగా చూసినా వాటి ప్రయోజనాలకి అనుగుణంగా రూపొందించబడినవే. ఇటీవలి కాలంలో మహిళా కార్మికులను రాత్రివేళలో పనిచేయటానికి ‘అనుమతించే’ విధంగా కార్మిక చట్టాలను సవరించటం ఒక మంచి ఉదాహరణ. దీని వలన ప్రయోజనమెవరికి? చీకటి పడిన తరువాత ఎట్టి పరిస్థితులలోనైనా కొందరు స్త్రీలని బంధించి ఉంచాలని తాపత్రయపడే ఈ వ్యవస్థ మరికొందరు బయటికి వెళ్ళాలని ఎందుకు కోరుకుంటుంది? ఈ చట్టానికీ, మా మీద

ఉన్న నిషేధానికి వెనుక ఉన్న కారణం ఒక్కటే. వ్యవస్థ అనుకూలతను బట్టి, మహిళలు వీథులపైన అయినా, ఇళ్ళల్లో, హాస్టళ్ళలో అయినా బంధించబడి ఉంటారు. మన శరీరాలతో, జీవితాలతో వాళ్ళకుండే అవసరాన్ని బట్టి వీథులను ఊడ్చే శ్రామికులగానో, ఫ్యాక్టరీలలో చెమటోడ్చే కార్మికులుగానో లేక వర్గ-కుల అధికారాల రక్షణకు వారి ‘గౌరవ మర్యాదలను’ భద్రపరచటానికో అన్నది నిర్ధారించబడుతుంది. బయటికి రావటానికి మేము చేసే పోరాటం, పితృస్వామిక వ్యవస్థకు ఎంత వ్యతిరేకమో, అంతర్గతమో కుల వ్యవస్థకు, పెట్టుబడిదారీ వ్యవస్థకు కూడా అంతే వ్యతిరేకం. నిషేధాల ద్వారా మహిళల శరీరాలపైన చేసే నియంత్రణకు, స్త్రీలను ఇళ్ళల్లో, హాస్టళ్ళల్లో అతిధి వసతులలో బంధించే బ్రాహ్మణ వాద పితృస్వామిక వ్యవస్థ మూలం. ఈ పోరాటం ఖచ్చితంగా ప్రైవేట్‌ / పబ్లిక్‌ భావజాలాన్ని నిర్మూలించటానికే.

హాస్టళ్ళలో నియమ నిబంధనలను మార్చినంత మాత్రాన సరిపోతుందా? ఇప్పటి పరిస్థితులలో మహిళల రాకపోకల్ని, వారి భద్రత అనే అంశాలను ఏ రకంగా సమన్వయం చేస్తారు?

పైన చెప్పినట్లు, నిషేధాలను తొలగించాలనే మా డిమాండు పోటీగా చేసినది కాదు. ఈ డిమాండు వయోజనులైన మహిళలకు, వారికి నచ్చిన చోటికి వెళ్ళడానికి హక్కుందనీ, వారికి నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యం ఉన్నదనే అవగాహనపైన ఆధారపడి ఉంది. సిసి టీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, మహిళలను పంజరాలలో బంధించినంత మాత్రాన లైంగిక వేధింపులు, హింస అనే సమస్యలు పరిష్కారం కావు. నిజం చెప్పాలంటే పెద్ద సంఖ్యలో మహిళలు వీథులలోకి వచ్చి, పబ్లిక్‌ రవాణా సౌకర్యాలను వినియోగించుకుంటే ఈ వీథులు ఇప్పటికంటే ఎక్కువ భద్రంగా ఉంటాయనే భావన మా వ్యక్తీకరణకు కేంద్రం. ఎందుకంటే మహిళలు పబ్లిక్‌ ప్రదేశాలను ఆత్మవిశ్వాసంతో వినియోగించుకోగలగటం కూడా ముఖ్యమైన అంశమే. చాలాసార్లు, హాస్టలుకు సమయానికి చేరుకోగలగటం కోసం, వీళ్ళు తమకు నమ్మకం లేని దారులలో ప్రయాణించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఇంత విస్తృతమైన పద్ధతులలో హింస జరిగేది, మహిళలు కొన్ని వేళలలో బయట తిరగటం వల్ల మాత్రమే కాదు. ఉదాహరణకు, గ్రంథాలయాలలో విద్యార్థులకు, విద్యార్థినులకు వేర్వేరు వేళలు కేటాయించబడవు. అయినా, కొన్ని నిషేధాల వలన విద్యార్థినులకు కొన్ని సమయాలలో గ్రంథాలయాలు అందుబాటులో ఉండవు. అలా ఎవరైనా వెళ్ళినట్లయితే ఆమెను వింతగా చూడడం, అసౌకర్యం కలిగేటట్లు ప్రవర్తించటం, అందరూ కలిసి ఆమెను తరిమికొట్టడం జరుగుతుంది. ఇలాంటి ‘నిషేధింపబడిన’ ప్రదేశాలలో మహిళలుండడం అనే విషయాన్ని సాధారణం చేయటం, వీటిని అందుబాటులోకి తీసుకురావటం, ప్రజాస్వామికం చేయటం అవసరం.

మన దేశంలో వివిధ ప్రాంతాలలో ఉన్న హాస్టళ్ళతో సంబంధాలు పెట్టుకోవటం సాధ్యపడిందా?

దేశంలో నలుమూలల ఉండే విశ్వవిద్యాలయాల్లో ఇటువంటి పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. మనూ (వీూచీఖఖ)లో, విద్యార్థులు హాస్టళ్ళలోని హాజరు పట్టికలను, నిబంధనల పుస్తకాలను తగలపెట్టటం లాంటిది ఒక శక్తివంతమైన సంఘటన. అదే విధంగా భోపాల్‌ నేషనల్‌ లా స్కూల్‌లో జరుగుతున్న ప్రతిఘటన లేదా, బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో విస్తృతంగా జరుగుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా జరిగిన శక్తివంతమైన ప్రతిఘటన, అన్నీ కూడా. ఈ ఉద్యమాలతో సంబంధం పెట్టుకున్నాము, వాటి నుంచి స్ఫూర్తినీ పొందాము చాలాసార్లు. అందరినీ అందుకోవటానికి అందరూ సౌకర్యంగా భావించే ఫేస్‌ బుక్‌ పేజీ చాలా ఉపయోగపడింది. మా కార్యకలాపాలు కొనసాగించటానికి, ముందుకు తీసుకొని పోవటానికీ హాస్టళ్ళతో, కళాశాలలతో ఇంకా దగ్గరి సంబంధాలు ఏర్పరచుకోవటానికీ ఉపయోగపడింది. బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో కొందరితో పరిచయం చేసుకోవటం ద్వారా ఆ ఉద్యమం గురించి ఇంకొంచెం లోతుగా తెలుసుకోగలిగాం. అయితే కొన్ని కళాశాలల్లో స్వతంత్రంగా స్థాపించబడిన పింజ్రాతోడ్‌ విభాగాలు పనిచేస్తున్నాయనే విషయం మాకు మీడియా ద్వారా తెలిసింది. వివిధ కళాశాలల క్యాంపస్‌లలో ఇటువంటి అంశాల ప్రభావం గురించి, అక్కడ జరిగే సంప్రదింపుల గురించి విస్తృతమైన అవగాహనను ఈ ఉద్యమం మాకు కలిగించింది.

ఈ ఉద్యమంపైన మీడియా ఎంతవరకు దృష్టి నిలిపింది?

పింజ్రాతోడ్‌, ఢిల్లీలో డిసెంబరు 12 తరువాత జరిగిన ఉద్యమంలో భాగంగా పనిచేయటం వలన, మొదటి దశలో మీడియా దృష్టి కుతూహలంతో దీనిపైన పడింది. చాలాసార్లు పింజ్రాతోడ్‌ పాల్గొనే కార్యక్రమాల్లో అవి ఎంత చిన్నవైనా, అవి యూజీసీని ఆక్రమించు కార్యక్రమం గానీ, రోహిత్‌ వేములకు న్యాయం జరగాలనే కార్యక్రమం గానీ, మీడియా అవసరానికి మించిన ఆసక్తి కనబరిచింది.

మీడియా నివేదికలు మాకు అనుకూలంగా ఉండడమే కాకుండా, కళాశాల అధికార యంత్రాంగంపైన, వాళ్ళు జారీచేసిన షోకాజ్‌ నోటీసుల విషయంలోను, వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వెంటాడే విషయంలోను, ఒత్తిడి తీసుకురావటానికి ఉపయోగపడడమే కాకుండా, మీడియా కథనాలను ఏ విధంగా తయారుచేస్తుంది అనే విషయం పట్ల మాకు ఆసక్తి పెంచింది. చాలాసార్లు, మీడియా మేము చెప్పిన విషయాలను మార్చి, సవరించి బ్రాహ్మణవాద పితృస్వామ్య వ్యవస్థకు అనుకూలంగా, పితృస్వామ్య బదులుగా లింగ వివక్షత అని చెప్తూ, వ్యవస్థకు వాళ్ళ కథనాలని కొటేషన్లలో చూపించటం మొదలుపెట్టింది. మేము ఇటువంటి ఉద్యమాలలో పాల్గొనటం మా తల్లిదండ్రులకు తెలుసా? ఈ విషయంలో వారి అనుమతి ఉందా? అని అడగటం, మమ్మల్ని ”దేశంలోని ఆడపడుచులు స్వాతంత్య్రం కోరుకుంటున్నారు” అని సంభోదించటం జరిగాయి. మేము దీనికి అభ్యంతరం చెప్పాము. చాలాసార్లు మాకు తెలియకుండా ”నేను చేయగలను (ఐ కెన్‌)” అనే ఉద్యమంలో భాగంగా పరిగణించబడ్డాము. విడిగా సభ్యులను కళాశాలలో షార్ట్స్‌ వేసుకుని, ఫోటోలు తీసుకుని పంపించమని కోరటం, మా ఉద్యమం వ్యక్తి యొక్క విప్లవ పోరాటం కాదని, విద్యార్థినులు సామూహిక ప్రయత్నమనే మా వాదనను తక్కువగా చేసి చూపించడమే. చాలాసార్లు తమ రిపోర్టుల సంచలనాత్మక విలువను పెంచటం కోసం మమ్మల్ని ప్రత్యేకంగా ఎంపిక చేసిన పోస్టర్లతో ఫోటోలు ఇవ్వమని అడిగే హక్కు తమకుందని మీడియా భావించింది. జెండర్‌ను ఒక విధంగా చూపించదలచిన మీడియాతో మేము నిరంతరం సంప్రదింపులు కొనసాగించాము. అంటే, ఉద్యమాన్ని ఒక స్థాయిలో నిలబెట్టడంలో మీడియా ఉపయోగపడిన విషయాన్ని మేము నిరాకరించలేక పోయినప్పటికీ, ఐఐటీ ఢిల్లీలో దుస్తుల నిబంధనలు వంటి అంశాల్లో ఎంతో ఆసక్తి చూపించి విస్తృతంగా ప్రచారం చేసిన మీడియా, అదే ఫేస్‌బుక్‌ పేజీలో ఒక దళిత విద్యార్థిని, తన భాగస్వామి బాయ్‌ఫ్రెండ్‌ తనను బెదిరిస్తున్నాడని చేసిన ఫిర్యాదులను పూర్తిగా నిర్లక్ష్యం చేయటం గుర్తించదగినది.

ఈ ఉద్యమంలో పాల్గొంటున్న వారికి ఎటువంటి అనుభవాలు కలిగాయి? మీ కుటుంబాలు, ఇరుగు పొరుగు వారు, స్నేహితులలో పురుషులు, సహచరులు, ఉపాధ్యాయులు దీనికి ఏ విధంగా స్పందించారు?

కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరుల స్పందన విషయంలో ఎవరి అనుభవం వారిదే… ప్రోత్సహించటం, దోహదం చేయటం నుంచీ, సమ్మతించకపోవటం, హేళన చేయటం వరకు. చాలాసార్లు సభ్యులు అత్యుత్సాహాన్ని చూపించేవారిగాను, అతి చురుకుగా స్పందించే వారిగాను చిత్రీకరించబడ్డారు. ఎన్నోసార్లు రాత్రి కవాతుకు సంబంధించి కుటుంబాలతో అబద్దాలు చెప్పాల్సి వచ్చేది. ఉద్యమకారులుగా మీడియాతో ఎవరు మాట్లాడతారు, ఎవరు మాట్లాడరు అనే విషయంపై, ఎవరి ఫోటో మీడియాకు అందచేస్తాము, ఫేస్‌బుక్‌ పేజీలో పెట్టాము వంటి అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సి వచ్చేది. ఇటువంటి అంశాలెన్నో ఉద్యమంలో మా నిర్ణయాలను ప్రభావితం చేశాయి.

ఉద్యమంలో కీలక పాత్ర వహించిన కొందరు పబ్లిక్‌గా కనిపించే ప్రతిఘటన కార్యక్రమాలలో గానీ, సమావేశాలలో కానీ పాల్గొనలేరు. పింజ్రాతోడ్‌, తెల్లవారుజామున 5 గంటలకు గోడ పత్రాలను అతికించటం, అర్థరాత్రి హాస్టల్‌ గదుల తలుపుల కింద నుంచి కరపత్రాలు వదిలి పెట్టడం వంటి చాటుగా చేసే గెరిల్లా యుద్ధ పంధాను అవలంబించింది. ఒక్కోసారి వేరే పేరుతో కూడా పని చేసింది. కొందరు కార్యకర్తలకు ఉద్యమంలో తమతో కలిసి పనిచేసేవారు సహచరులు కూడా అయ్యారు. ఇవి కూడా కఠిన సమయాలలో అర్థం చేసుకుని అంగీకారం ఫలితంగా ఏర్పడిన సంబంధాలే. అయితే, సహచరులు అలా లేనప్పుడు, కార్యకలాపాల తీవ్రత, నిర్వహణ బాధ్యతల వలన కలిగే ఒత్తిడి వలన సన్నిహిత సంబంధాలపైన వ్యతిరేక ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా సహచరులైన వారు ఈ స్థాయి రాజకీయ క్రియాశీలతను అర్థంచేసుకోలేక పోవటం వలన, అదే కారణంగా అర్థవంతమైన సంబంధాలు ఏర్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఉద్యమం ద్వారా ఏర్పడిన స్నేహితులతో, కార్యకర్తలు సన్నిహిత భాగస్థుల ద్వారా తాననుభవించిన హింసాత్మక ఘటనలను కూడా పంచుకున్న సందర్భాలున్నాయి. ఎబివిపి సభ్యులే కాక తోటి కార్యకర్తలు వేధించిన ఆయా సందర్భాల్లో యూనివర్శిటీ పాలనా యంత్రాంగంతో పోరాడటానికి వారికి మేమిచ్చిన తోడ్పాటుతో పాటు, దాని గురించి బయటివారికి అర్థమయ్యేలా చేయటానికి, కుటుంబ సభ్యులతో వారి పోరాటానికి కూడా మా మద్దతునిచ్చాం.

రాణి రోహిణి రమణ్‌ అన్వేషిలో పనిచేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ 2018లో ఈ మెయిల్‌ ద్వారా జరిగింది. 2019లో ఈ వేదికను నిశితంగా విమర్శించి పింజ్రాతోడ్‌ నుంచి తాము వైదొలుగుతున్నట్లు దళిత, బహుజన, మైనార్టీ విద్యార్థులు ప్రకటించారు. ఈ ప్రకటన రౌండ్‌ టేబుల్‌ ఇండియా బ్లాగ్‌లో వచ్చింది.

(సమకాలీన రాజకీయాలపై బ్రాడ్‌షీట్‌, అన్వేషి ప్రచురణ నుండి…)

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.