డా|| రోష్నీ
(డా. సమతారోష్నీ భూమిక సంపాదక సభ్యులు. స్త్రీలు-ఆరోగ్యం, నేటి వైద్యవిధానం, వాటిల్లోని పాలిటిక్స్ మొదలైన అంశాల గురించి వరుసగా రాయాలని సంకల్పించారు. పాఠకులు వారి కోరిక మేరకు స్పందించాలని మనవి.-ఎడిటర్)
ముందుగా టైటిల్ గురించి కొంత వివరణ ఇచ్చుకుంటాను. ఈ మధ్య చదువుకున్నవాళ్ళూ, చదువురాని వాళ్లూ కూడ ప్రతి విషయానికి డాక్టరుని సంప్రదించడమే. అవసరం ఉన్నా లేకపోయినా ఆ డాక్టర్లు రాసే ప్రతి మందునీ కొని తినడమే. ఆఖరుకి ఊపిరి తీసుకోవాలా – వద్దా? తుమ్మాలా వద్దా అనేది కూడ డాక్టరు సలహా లేకుండా చెయ్యడానికి ఇప్పుడు జనం భయపడుతున్నారు. ప్రజల్లో ప్రబలంగా ఉన్న ఈ బలహీనతనే ఉపయోగించుకొని డాక్టర్లు, కార్పొరేట్ హాస్పిటళ్లు, మందుల కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నారు.
పై దౌర్భాగ్యాన్ని ఖండిస్తూ ”సవాలక్ష సందేహాలు” ”మన ఆరోగ్యం మన చేతుల్లో” ”వైద్యుడు లేని చోట” అనే పుస్తకాలు మన మధ్యకొచ్చాయి. ఈ పుస్తకాలు మరో విషయాన్ని కూడ నొక్కి చెప్తాయి. అదేంటి అంటే “prevention is better than cure” అని. ఈ నినాదం ఎంతో గొప్పది. చాలా ఏళ్లుగా ఇది మరుగున పడిపోయింది. (D.P.T. &Polio, AIDS), జనాభా నియంత్రణ ప్రచారానికిచ్చిన ప్రాముఖ్యత ఇతర వ్యాధుల నివారణకి ఇవ్వడంలేదు) prevention అనే దాన్ని ఎవరూ పట్టించుకోడంలేదు. దానితో పాటు మన ప్రభుత్వాలు కూడ. ఈ మధ్య ప్రబలుతున్న అతిసార వ్యాధి (డయేరియా)కి కారణం కూడ అదే. అలా అని వైద్యం, మందులు అసలుకే అవసరం లేదని కాదు. సరయిన సమయంలో, సరయిన పద్ధతిలో, అందుబాటు ధరలో వైద్యం అందాల్సిన సందర్భాలు కూడ ఉంటాయి. ఈ విషయం గురించే చర్చిస్తూ భూమిక ప్రారంభ సంచికల్లో కొన్ని వ్యాసాలు రాసినట్లుగా నాకు గుర్తుంది. (మీరు పూర్తిగ మర్చిపోయుంటారు. చాలా సంవత్సరాలయింది మరి). మళ్ళీ అటువంటి వ్యాసాలు రాయాలని ఇది మొదలుపెట్టాను. జబ్బులు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, ఒక వేళ ఏదైనా జబ్బు చేసినా మీ జేబులు చిల్లులు పడకుండా ఉండేలా ఆలోచింప చేయడానికి ఈ వ్యాసాలు ఏ కొంచెం మీకు సాయపడినా నాకు సంతోషమే.
మన ఆరోగ్యసంరక్షణ వ్యవస్థలో ఉన్న మరో లోపం గురించి కూడ మనం చర్చించుకోవాలి. ఒకవైపు ఆరోగ్య సేవలలో సాంకేతిక పరిజ్ఞానం బాగా అభివృద్ధి చెందింది. కాని ఆ అభివృద్ధి అంతా పట్టణాలకు, ధనికులకు సేవచేయడానికే పరిమితమయింది. మరో వైపు గ్రామీణ, పేద ప్రజానీకానికి కనీస వైద్య సౌకర్యాలు కరువయిపోయినాయి. మీడియాలో వస్తున్న జోరుదారు ప్రకటనలు చూస్తే మన అరచేతుల్లో వైకుంఠం ఉన్నట్లే అనిపిస్తుంది. కాని స్త్రీలు, ముఖ్యంగా గ్రామీణ స్త్రీల ఆరోగ్యం విషయంలో ఏదో తెలీని అయోమయం. ఉదా : మన దేశంలో స్త్రీలలో ఇంచుమించు ఎనభై శాతం మంది (mild to severe) రక్తహీనతతో బాధ పడుతున్నారని గత కొన్ని దశాబ్దాలుగా మొత్తుకుంటూనే ఉన్నాం. చర్చలు జరిగాయి. హిమోగ్లోబిన్ తయారుకాడానికి కావల్సిన ఇనుము, B2 ల గురించి చర్చలు, పరిశోధనలు జరిగాయి. ఏంచెయ్యాలి అనేది కూడ మనకు తెలిసినట్టే ఉంటుంది. కాని ఏదో తెలియని అయోమయం. స్త్రీలలో రక్తహీనత అలాగే ఉండిపోయింది. ఈ గాప్ ని ఎలా సరిదిద్దుకోవాలి.
మరో మనవి : ఈ మధ్య ఆరోగ్యం గురించి అన్నిరకాల మీడియా వాళ్లు బోల్డన్ని పేజీలు, గంటలు కేటాయించి అనేక వివరాలు తమదైన పద్ధతిలో తెలియచేస్తున్నారు. మరి నానుంచి వచ్చే వ్యాసాల అవసరం ఉందా? చెప్పిందే చెప్పడం, రాసిందే రాయడం బోరు కదా! కాబట్టి పాఠకులు మీ అభిప్రాయాలను, సలహాలను, మీలో మిగిలిపోయిన సందేహాలను ఉత్తరాల ద్వారా తెలియచేస్తే కొంత ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. please help me and let me help you అని నా మనవి.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags