అనగనగా ఆకాశంలో ఒక తెల్లని పావురం ఉండేది. ఆ పాపురం తన దిన చర్య ఆహారం కోసం తిరుగుతూ ఉండేది. పావురం ప్రయాణిస్తు వుండగా ఒక ఎర్రని గులాబీల తోట కనిపించింది. ఆ పావురం రోజు ఆ తోటపై నుండి విహరిస్తుండేది. కొన్ని రోజుల తరువాత ఆ తోటలో తెల్లటి గులాబీ కనిపించింది. ఆ గులాబీ ఎంతో ఆకర్షణియంగా కనిపిస్తుంది. ఆ పావురం తెల్లని గులాబితో స్నేహం చేయాలనుకుంది. పావురం ఎర్రన్ని గులాబి తోటలో పూసిన తెల్లన్ని గులాబితో స్నేహం కోసం వెళ్ళింది. నాతో స్నేహం చేయవా అని అడిగింది. పావురం గులాబితో స్నేహం కోసం తన ఆవేదనతో ప్రేమతో అడిగింది. దానిని తెల్ల గులాబి నేను కూడా అందరిలానే ఎర్రగా వుండాలనుకున్న కాని తెల్లగా ఆకర్షిస్తున్నాను. నాకు ఎర్రగా వుండాలని వుంది అని తెల్లని గులాబి బాధతో పావురానికి చెప్పింది. నేను తెల్లగా వున్నాను. కదా ఎర్రగా మారినప్పుడు నీతో స్నేహం చేస్తాను. అని తెల్ల గులాబి పావురంతో చెప్పింది. పావురం వెంటనే స్నేహం కోసం తెల్లటి గులాబి ముళ్ళకు గుచ్చుకుపోయింది. పావురం రక్తంతో తెల్లని గులాబిని ఎర్రగా మార్చింది. తెల్లటి గులాబి ఆనందంతో వికసించింది. ఇప్పుడు నీతో స్నేహం చేస్తాను అని పావురానికి సెలవుచింది. కాని పావురానికి ఆ తెల్లన్ని గులాబితో స్నేహం చేయకుండానే చనిపోయింది. ఆ తెల్లని గులాబి బాధాతో వాడిపోయింది.