ఒక్కటైనా చాలు

ఇంద్రగంటి జానకీబాల

ఆత్రేయగారు ఎంత మంచి పాటలు వ్రాశారండీ! ఆయన పాటలున్నాయంటే ఆ సినిమా పెద్ద హిట్టే – మనసు కవిగా, మన సుకవిగా ఆయన తెలుగువారి గుండెల్లో స్థిరంగా వుండిపోయారు.ఆయనెన్ని పాటలు వ్రాసి వుంటారంటారు?
ఇన్ని అని కాదు గానీ – పదులు, వందలు మాత్రం కాదు వేలకు వేలు. వాటిలో ఎన్నో ఆణిముత్యాలు-, ఒక ఆచార్య ఆత్రేయ గారే కాదు. శ్రీశ్రీ మాత్రం, ఆరుద్ర మాత్రం – ఎన్ని గొప్ప పాటలు సినిమాల్లో వ్రాశారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి సినిమా పాటకి కావ్యగౌరవాన్ని తెచ్చిపెట్టారని సినీవిజ్ఞులు అంటారు. అలాగే ఆద్యులు సముద్రాల గారు, మల్లాది రామకృష్ణశాస్త్రి, తోలేటి, బలిజేపల్లి – ఇలా ఎందరో కవులు తెలుగు సినిమా పాటను అందచందాల వయ్యారిభామను చేశారు. సదాశివబ్రహ్మం – జూనియర్‌ సముద్రాల మంచి పాటలు వ్రాసి అందరి మన్ననల్నీ పొందారు. కొసరాజు, పింగళి, దాశరథి, నారాయణరెడ్డి వున్నారు. వేటూరి సుందరరామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇప్పటికీ వ్రాస్తున్నారు.
ఇంత మంది కవులు ఇన్ని వందల, వేల పాటలు వ్రాస్తున్న సమయంలో ఒకటీ, అరా వ్రాసి కూడా తమదైన వ్యక్తిత్వాన్ని చాటుకున్న ప్రతిభావంతులైన కవులున్నారు – పాత సినిమాపాటల్లో వారు మెరుస్తూ కనిపిస్తారు.
వారి గురించి ముచ్చటించుకుంటే ముచ్చటేస్తుంది. బాపూ దర్శకత్వంలో, ముళ్ళపూడి వెంకటరమణ రచనా సారథ్యంలో తెలుగువారిని ఉర్రూతలూగించిన సినిమా ‘ముత్యాలముగ్గు’ ఇందులో గుంటూరు శేషేంద్రశర్మ వ్రాసిన ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది’ అనే అద్భుతమైన పాట ఒకటి వుంది. ఆయన సినిమా కవి కాదు. ఆ పాట తర్వాత మళ్ళీ ఎక్కడా, ఏ సినిమాల్లోనూ పాటలు వ్రాసినట్టు లేదు. కానీ ఈ ముత్యాలముగ్గులోని పాట తెలుగు సినిమాపాటల మాలలో ఆణిముత్యమై ఎప్పుడూ మెరుస్తూ వుంటుందనేది తిరుగులేని నిజం. నిజానికి ఈ పాట సామాన్యంగా వుండే సినిమాపాటకి చాలా విభిన్నంగా వుంటుంది. ఈ పాటలో కవి పలికించిన వేదన, ఆవేదనా, కె.వి. మహదేవన్‌ సంగీతంలో భావస్ఫూర్తిని పొంది, గాయని సుశీల గళంలో మాధుర్యాన్ని నింపుకుని శ్రోతల్ని అలరించింది. ఇది అసలు సిసలైన భావగీతం – ఈ పాటను సినిమాకి అనుగుణంగా మలచుకున్న విధానం కూడా గొప్పగా కుదిరింది.
చాలా కొద్ది పాటలు వ్రాసి, ఒక్కొక్కరికి ఒక్క పాట వ్రాసి కూడా ఎంతో పేరు సంపాదించుకున్నవారున్నారనుకున్నాం కదా!
మీ అందరూ విని ఆనందించి, అభిమానించి, పదేపదే ఆ పాటను గొంతులో పలికించే పాట ”జోరుమీదున్నావు తుమ్మెదా! నీ జోరెవరి కోసమే తుమ్మెదా!” అనే పాట. ఈ పాట రచించిన కవి ‘దాసం గోపాలకృష్ణ’. ‘శివరంజని’ అనే సినిమాలో పి. సుశీల పాడిన ఈ పాట ఎంతో మెలోడియస్‌గా వుంటుంది. ఈ పాటని ట్యూన్‌ చేయడంలో సంగీత దర్శకులు రమేష్‌నాయుడు అందమైన కల్యాణిరాగాన్ని ఎంపిక చేసుకున్నారు. ఎలాంటి హొయలైనా తనలో పలికించగలిగే రాగం కల్యాణి. అదీ ఈ పాటలో వుపయోగించిన సింగిల్‌ వయొలిన్‌ ఆద్యంతమూ అమృతంలా వుంటుంది. ఇంతకీ ఈ పాట రచయిత దాసం గోపాలకృష్ణ మళ్లీ పాటలు వ్రాసినట్లు కనిపించదు. ఆయనదీ ఒక్కపాటైనా చాలు ననిపిస్తుంది.
నార్ల చిరంజీవి అరుదుగా సినిమాల్లో చాలా కొద్దిపాటలు వ్రాశారు. అందులో ‘నీ చెలిమీ-నేడే కోరితినీ-, ఈ క్షణమే ఆశ వీడితినీ’ – అనే పాట ‘ఆరాధన’ (నాగేశ్వరరావు, సావిత్రి నటించిన)లో చాలా గొప్పగా వుంటుంది. ఈ పాటను వ్రాసిన కవి నార్ల చిరంజీవి. సుశీల పాడిన ఈ పాటలో సంగీతం ఎంతో హుందాగా, లలితంగా శ్రోతల్ని వేరే లోకాల్లో విహరింపచేసేట్టుగా వుంటుంది. దీనికి సంగీతం సాలూరి రాజేశ్వరరావు. అలాగే భుజంగరాయశర్మ వ్రాసిన ఇంతేరా ఈ జీవితం – తిరిగే రంగుల రాట్నం అనేది జీవితసత్యాన్ని ప్రబోధించే గొప్ప పాట. ఇది బి.ఎన్‌. రెడ్డిగారి దర్శకత్వంలో వచ్చిన ‘రంగులరాట్నం’ చిత్రానికి టైటిల్‌సాంగు. ఈ పాటకి ఎంతో మంచి పేరు రావడమే కాకుండా, ఎంతగానో ప్రజాదరణ పొందింది. తర్వాత భుజంగ రాయశర్మగారు సినిమాల్లో పాటలు వ్రాసినట్టుగా కనిపించదు. రాజేశ్వరరావు సంగీతంలో రూపుదిద్దుకున్న ఈ ‘ఇంతేరా ఈ జీవితం – తిరిగే రంగులరాట్నము’. ఒక చక్కని భావం గల చిక్కని పాట అని చెప్పుకోవాలి.
పాలగుమ్మి పద్మరాజుగారు కథారచయితగా గొప్ప కీర్తి గణించుకున్నవారు. తెలుగు కథను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన కీర్తి ఆయనకే దక్కింది. ఆయన సినిమాలకి కథలు వ్రాశారు. కానీ చాలా కొద్దిగా పాటలు కూడా వ్రాశారు. ఆయన వ్రాసిన ఒకటి, రెండు, మూడు పాటలూ ఆణిముత్యాలే. ‘నాటకాలరాయుడు’ చిత్రం కోసం ‘నిదురమ్మా-నిదురమ్మ కదిలీ వేగమే రావమ్మ’ అనే పాట వ్రాశారు. దీనిని ఆలపించినవారు, సినిమాలకు అరుదైన గాయని శ్రీరంగం గోపాలరత్నం. ఈమె కర్ణాటక సంగీతంలో శిఖరాగ్రాన నిలిచిన విద్వాంసురాలు. ఆమె సినిమాలలో పాడింది కూడా చాలా తక్కువ. ఈ పాట గోపాలం సంగీతంలో గోపాలరత్నం గళంలో అత్యంత మధురంగా వచ్చింది. ఇది పద్మరాజుగారు వ్రాసిన పాట. అలాగే ‘శ్రీ రాజేశ్వరీ విలాస్‌ కాఫీ క్లబ్‌’ అనే సినిమాలో ‘రాకోయి అనుకోని అతిథి – కాకిచేత కబురైనా పంపక’ – అనే సున్నితమైన పాటను కూడా పాలగుమ్మి పద్మరాజు వ్రాశారు. ఈ పాటను పెండ్యాల నాగేశ్వరరావు సంగీతంలో సుశీల మెలోడియస్‌గా పాడారు. మేఘసందేశం సినిమాలో ప్రియే! చారుశీలే – అనే అష్టపదికి ఆయన తెలుగులో ఎంతో అందమైన పాట వ్రాశారు. రమేష్‌నాయుడు సంగీతంలో జేసుదాసు – సుశీల పాడిన ఈ పాట ఎంతో గొప్ప పాట. అక్కడక్కడ వినిపించినా పద్మరాజు పాటలు ఆణిముత్యాలై మెరుస్తూ వుంటాయి.
ఈ పాట ఎవరు వ్రాశారూ అని ఉత్సాహపడి ఆ కవిని తెలుసుకునే కవులు మనకున్నారు. సినిమాల్లో సాధారణంగా వ్రాసేవారు కాకుండా అప్పుడప్పుడు చక్కని అందమైన, విలువైన పాటలు వ్రాసినవారిని కూడా మనం తల్చుకుంటూ వుండాలి.
మైలవరపు గోపి, విజయరత్నం, జాలాది, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ లాంటివారు అక్కడక్కడ మంచి పాటలు వ్రాశారు. ఆలోచించవలసిన విషయమేమంటే తెలుగు సినిమా పరిశ్రమలో కవయిత్రులు ఎక్కడా సినిమా పాట వ్రాసినట్లు లేదు. సారథీ వారి సినిమాల్లో జ్యోతిర్మయి అనే రచయిత్రి ఒకటి రెండు పాటలు వ్రాసినా వాటికి సరైన ఆదరణ, ప్రచారం లభించినట్టుగా లేదు.
మరొక విచిత్రమేమంటే బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరున్న పి. భానుమతి కూడా సినిమాకి కథ వ్రాశారు, దర్శకత్వం వహించారు, సంగీతం సమకూర్చారు, కానీ ఎప్పుడూ ఆమె పాట (సినిమాకి) వ్రాసినట్లుగా లేరు. ఆమె గొప్ప గాయని – పాట, పాటలోని భాష-, దాన్నెలా సమన్వయపరచాలనే అంశాలు ఆమెకు తెలియనివి కావు. పాటలోని మాటల్ని పలకడం ఆమెదగ్గరే నేర్చుకోవాలి గాయనులు-, కానీ ఆమె ‘లిరిక్‌’ వ్రాయడానికి ఎప్పుడూ ఎందుకు పూనుకోలేదో-.
ఒక్క పాట వ్రాసినా చాలన్నట్టు కొందరు కవులు సినిమాల్లో మెరుపు మెరిసినట్లు మెరిశారు. అలాంటి జాబితాలో ఒక కవియిత్రైనా వుంటే ఎంత బాగుండును అనిపిస్తూ వుంటుంది అప్పుడప్పుడు.
భూమికకు మరో అవార్డు
కీ.శే. బాదం సరోజాదేవి అనేక సంఘసేవా సంస్థల్లో క్రియాశీల పాత్ర నిర్వహించారు. మహిళా దక్షత సమితిలో శిశు సంక్షేమ విభాగానికి ఉపాధ్యక్షురాలుగా పని చేసారు. వారి భర్త బాదం రామస్వామిగారు సరోజాదేవి గారి స్మృత్యర్ధం అనేక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ, ఆవిడ పేరు మీద ‘మహిళారత్న’ అవార్డును కూడా నెలకొల్పారు.
బాదం సరోజాదేవిగారి 78వ జయంతి ఉత్సవం సందర్భంగా త్యాగరాయగాన సభలో యువకళావాహిని, బాదం రామస్వామి మరియు సరోజాదేవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ సంయుక్త ఆధ్వర్యంలో మే నెల 12 న మహిళారత్న అవార్డుల ప్రదానం జరిగింది. భూమిక ఎడిటర్‌తో పాటు మానం పద్మజ, వి.కె.దుర్గ, సురభి ప్రభావతి, శ్రీలత, ఏ.విజయలక్ష్మి, జబీన్‌ గార్లలకు ఈ అవార్డులను ఆర్ధిక మంత్రి శ్రీ.కె. రోశయ్య ప్రదానం చేసారు. డా. సి. నారాయణరెడ్డి, డా. కైకాల సత్యన్నారాయణ, శ్రీ బాదం రామస్వామిగార్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Share
This entry was posted in పాటల మాటలు. Bookmark the permalink.

One Response to ఒక్కటైనా చాలు

  1. kusuma says:

    గీత రచయిత్రులు గా సినిమాలలోస్త్రీలు
    కనిపించలేదు, నాకు కూడా కొన్ని సంవత్సరాలనుండీ మనసులో ఉన్న సందేహమే!
    సినిమాలలో భానుమతి ఐనా ఒక్క పాటను ఐనా రాసి ఉంటే బావుండేది,
    ఆమె అనేక సాహిత్య, సినీ, సంగీతాభినయ రికార్డులు – సాధించిన వనిత కదా!
    ఇప్పటికైనా మించిపోయింది లేదు,
    సావిత్రి దర్శకత్వంలో – స్త్రీలే అన్ని శాఖలనూ నిర్వహించిన సంఘటనలు
    అలాగే – విజయనిర్మల – సినీ దర్శకత్వము వంటి శాఖలలోని
    సాంకేతిక నైపుణ్యము ఇత్యాదులను –
    ఇప్పటి వారు స్ఫూర్తిగా గైకొని, ముందుకు నడక సాగిస్తే మేలు కదా!

    కాదంబరి (కోణమానిని)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.