Tuesday’s with Morrie – ఉమా నూతక్కి

“Death ends a life, not a relationship. All the love you created is still there. All the memories are still there. You live on in the hearts of everyone you have touched and nurtured while you were here.”

Morrie …

“మనుషుల్ని పోలిన మనుషులుంటారు… జీవితాల్ని పోలిన జీవితాలు కూడా…నా పుస్తకాల అరలోకి తొంగిచూసి, మిచ్‌ అల్బోమ్‌ రాసిన ుబవరసaవర షఱ్‌ష్ట్ర వీశీతీతీఱవ పుస్తకం కనిపించినప్పుడల్లా ఒక అనుభవజ్ఞుడెవరో నా జీవితాన్ని సేద తీర్చడానికి అక్కడ కూర్చుని నన్ను చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది.

Tuesdays with Morrie అంతకు ముందు చదివాను. మళ్ళీ ఇప్పుడు చదివాను. ఇకపై చదువుతూనే ఉంటాను. ఎందుకంటే, ఇదేమీ కాసేపు మనల్ని మైమరపించే కథల పుస్తకం కాదు. మోరీ అనబడే ఒక ప్రొఫెసర్‌ శిష్యుని ద్వారా మనకి అందించిన అనుభవసారమది.

”ప్రతిరోజూ ఒక నవోదయం. నిద్ర లేచి మేల్కొనడం జీవ చైతన్యానికి సంకేతం. అందుకే జీవితంలో మరో రోజు లోకాన్ని తరచి చూసేందుకు అవకాశం లభించినందుకు కాలానికి కృతజ్ఞతలు తెలపాలి” అంటారు మోరీ.

అప్పటిదాకా ఆరోగ్యంగా హుషారుగా ఉండే ప్రొఫెసర్‌ మోరీ… అంతుపట్టని అనారోగ్యం తనని చుట్ట చుట్టి కబళించడానికి సన్నద్ధం అయినప్పుడు కృంగిపోలేదు. తన చివరి కాలాన్ని ఎంత గొప్పగా బతకగలడో అలా బతికి చూపించాడు. తన మనసులోని భావాలని 13 మంగళవారాలు తన శిష్యుడితో గడిపి వాటిని అక్షరీకరించి భవిష్యత్తు తరాలకి అందుబాటులోకి తెచ్చాడు. ఈ పాఠాలకి పుస్తకాలు… నోట్స్‌ ఏమీ అవసరం లేదు.

అచ్చంగా మనసుని సిద్ధం చేసుకుని వినడమే… ఈ పాఠాలకి చివర ఏ పరీక్షనూ పెట్టలేదు.

ఆయన చెప్పిన అముద్రిత అనుభవాలన్నీ యథాతథంగా మనసు మీద అచ్చుగుద్దినట్లుగా ఒడిసి పట్టుకున్న ఆ శిష్యుడు తనేం నేర్చుకున్నాడో దాన్ని అక్షరంగా మలచి ఆ పాఠాలని మనకూ పంచాలని చేసిన మానవీయ యత్నమే ఈ పుస్తకం.

ఈ పదమూడు వారాలలో వాళ్ళిద్దరి మధ్య సంభాషణల్లో చోటుచేసుకోని అంశం లేదు. మరణం గురించి, కుటుంబం గురించి, ఉద్వేగాల గురించి, ప్రేమ, పెళ్ళి, మన సంస్కృతి, మన పనీ, క్షమా… దేనినీ వదిలి పెట్టలేదు.

చివరికి తన చివరి ఘడియలు సమీపిస్తున్నాయని అర్థమైన సమయంలో ఒక తేదీని ఎంచుకుని తన స్నేహితులని పిలిచారు మోరీ… ఒక చల్లని సాయంత్రం తన స్నేహితులతో ”సజీవ అంత్యక్రియలు” జరిపించుకున్నారు.

ఇందులో మొదటి అధ్యాయంలో చదివి పక్కన పెట్టి ఉన్న వార్తా పత్రికలు కనిపిస్తాయి శిష్యుడైన మిచ్‌కి.

”ఇంకా ఈ వార్తలూ అవీ మీకు అవసరమా” అని అడుగుతాడతను. మోరీ ఏమంటాడో తెలుసా! ”త్వరలోనే నేను చనిపోతున్నాను కాబట్టి, ప్రపంచంలో ఏమి జరుగుతుందో పట్టించుకోకుండా ఉండాలా” అని. ఏదైనా సరే… పట్టించుకునే వాడికే సమస్య లోతులు అర్థమవుతాయి. పరిష్కార మార్గాల అన్వేషణా మొదలవుతుంది.

మనమున్నా లేకున్నా ప్రపంచం ఎప్పుడూ ముందుకు వెళుతూనే ఉండాలనే ఆశావాద దృక్పథం కదా ఇది. ఇది చదవగానే చురుక్కుమని గుచ్చుకున్నట్లయి ప్రపంచం పట్ల మన బాధ్యతని గుర్తు చేస్తున్నట్లు అనిపిస్తుంది, చెప్పకుండానే చెప్పిన పాఠమిది.

మనిషి అన్నిటికన్నా భయపడే మరణం గురించి మోరీ చెప్పింది వింటే చాలు. మరోసారి దానికి భయపడటం అన్నది మన ఆలోచనల్లోకి రావడం తగ్గిపోతుంది. తను చావుకు దగ్గరయ్యానని తెలిసినా ఏ రోజూ కూడా మోరీ నిరాశలోకో నిస్తేజత లోకో జారిపోకుండా ఇంకా ఇంకా ముందుకు సాగిపోతూనే ఉంటాడు. అంతేకాదు ఒక చోట మిచ్‌తో ఇలా అంటాడు…

”ఎలా చనిపోవాలో నువ్వు నేర్చుకుంటే… ఎలా బతకాలో నేర్చుకుంటావ్‌”.

మనిషికి మరణం అన్నది ఎంత దగ్గరగా ఉంటుందో… అంత దగ్గరగా ధైర్యాన్ని కూర్చుండబెట్టే మాటలు కదా ఇవి అనిపిస్తుంది. ఇందులోని మోరీ సంభాషణలు జ్ఞప్తికి వచ్చినప్పుడల్లా. ఒక్కసారి చావు భయం అన్నది మన నుండి దూరమయ్యాక మనం బ్రతికే ప్రతి క్షణంలో జీవం దానికదే నిండుతూ ఉంటుంది.

మోరీ ఒకచోట చెప్పినట్లు డబ్బూ… పదవీ… కీర్తీ… అవేవీ ఎప్పుడూ కూడా మనల్ని మనగా అభిమానించే వారిని రీప్లేస్‌ చెయ్యలేవు. బహుశా ఏదో ఒక సమయంలో వాటికి ఆకర్షితులైన వారు కూడా చివరికి ఆత్మీయుల దగ్గరే ప్రశాంతతని పొందుతారు. మనల్ని యధాతథంగా ఆమోదించి అభిమానించేవారికన్నా ఎక్కువగా ఇంకెవరు అండగా నిలుస్తారు?

”ఇది చాలా ఆలస్యం అన్నమాట జీవితానికి అన్వయించదు” అనేదే మోరీ ఫిలాసఫీ. అవును.. ఏది ఆలస్యమో చెప్పుకోవడానికి మనం ఎవరిమని? జీవితంలో ఏ పార్శ్వంలో మనల్ని తాకే అనుభవం అయినా సరే, దాని సమయం అది అనుకుంటే చాలదా. ఆలస్యం అయిపోయింది అనుకుంటే, ఇక అక్కడే ప్రయాణం ఆగిపోతుంది. లేదనుకుంటే అది ముందుకు సాగుతూనే ఉంటుంది.

పుస్తకం చదువుతున్నంతసేపూ మన కళ్ళు తడి అవుతూ ఉంటాయి. తడితో పాటు కొండంత ధైర్యం కూడా…

ఒక చోట మోరీ అన్నట్లు… ”దుఃఖం వచ్చినప్పుడు తనివితీరా ఏడుస్తాను. కానీ నా జీవితంలో ఇంకా మిగిలి ఉన్న విషయాల మీద దృష్టి పెడతాను. అంతకు మించి ఏదీ ఆగిపోదు. ప్రతి ఉదయం కాసిని కన్నీళ్ళు అంతే”.

మనం చదివే మిగిలిన అన్ని పుస్తకాల్లోలా మోరీ ఫిక్షనల్‌ క్యారెక్టర్‌ కాదు. అందుకే తను మనలో ఒకడిలా మనకు చాలా దగ్గరగా అనిపిస్తాడు. బహుశా మన చుట్టుపక్కలా ఎందరో మోరీలు ఉండే ఉంటారు. ప్రయత్నపూర్వకంగా చూస్తే వాళ్ళని కనుక్కోవడానికి పెద్ద సమయం పట్టదు.

… … …

మిచ్‌ అల్బోమ్‌ అమెరికాకి చెందిన రచయిత. క్రీడా పాత్రికేయునిగా ఆరంభించి ప్రభావవంతమైన రచనలు చేసే నవలాకారునిగా కొనసాగుతున్నారు. The five people you meet in Heaven. Have a Little Faith, For one More Day వీరి ఇతర రచనలు.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.