తెలుగు సాహిత్యానికి మరో పేరు ఛాయ
ని రచనలతో చేసావు మా హృదయాలు మాయ
స్త్రీలకు మరి ధైర్యం మీరు మాయ
మీ పేరు మా గుండెల్లో చిరస్థాయిగా
మీ జీవితం అంకితం స్త్రీలకు
చనిపోయిన మట్టికి ఇవ్వలేదు
మీరే మాకు స్పూర్తి !
– పి. దర్శన్ హIII కూఱశ్రీవ,
Aravind High School. Kunchanapally
కవి కోకిల అయిన మీరు
ఆడవారికి ధైర్యం చెప్పారు
చిన్నప్పుడే గొప్పవారు అయ్యారు,
మీరు లేకపోయినా ఆడవారిలో ధైర్యం నింపారు,
మీ శవాన్ని మట్టికి బదులు మనిషికి అంకితం చేసారు.
చెడ్డవారిని తీసివేసి మంచిని పెంచారు,
భూమి మీద లేకపోయినా, నింగిలో దిగిపోయారు.
మీకు ఇవే మా అభివందనాలు !
– జి.హర్షిత హIII కూఱశ్రీవ,
Aravind High School, Kunchanpally
నాకు తోడు నీడు అమ్మ
నాకు కష్టం సుఖం అమ్మ
నాకు స్నేహం అమ్మ
నాకు ఇష్టం అమ్మ
నాకు దైవము అమ్మ
నాకు ఇష్టం అమ్మ
నాకు ప్రాణం అమ్మ
అమ్మ ప్రాణం నేను, నాకు ప్రాణం అమ్మ
అమ్మ లేనిదే నేను లేను
G. Anantha Venkat Lakshmi
నిప్పులాంటి నీ స్నేహం,
నాకు దేవుడు ఇచ్చిన వరం
నే స్నేహం అంతులేనిది…
అతీతమైనది.. స్వార్థం లేనిదీ…
అలాంటి నీ స్నేహం నాతో ఎప్పటికి
ఇలానే ఉండాలని ఆశిస్తున్నాను మిత్రమా !
M. Veerendra XMG
అమృతమైన ప్రేమ అమ్మ
అంతులేని అనురాగం అమ్మ
అలుపెరుగని ఓర్పు అమ్మ
అద్భుతమైన స్నేహం అమ్మ
అపురూపమైన కావ్యం అమ్మ
అరుదయిన రూపం అమ్మ..
నాకెప్పుడూ నువ్వే కావాలమ్మ
SK. Illiyana, 7th JAS
ఒక ఊరిలో ఒక పెద్ద మామిడి తోట ఉంది. దానిలో చీమలు పుట్టలు పెట్టాయి. ఆ పుట్టలో చీమలు కలసిమెలసి జీవిస్తున్నాయి. అలా ఉండగా ఒక రోజు ఎక్కడినుండో ఒక పాము ఆ తోటలో ప్రవేశించింది. తోటంతా కలియ తిరుగుతూ వుంది. వర్షం రావడంతో, చీమల పుట్టలో ప్రవేశించింది దాంతో చీమలు భయపడ్డాయి. కొన్ని రోజుల పాము చీమల పుట్టలోనే ఉండి పోయింది. ధైర్యం తెచ్చుకున్న చీమలు ఒక రోజు పామును కలిసికట్టుగా చుట్టుముట్టి కుట్టి చంపివేశాయి.
– మణికంఠ, 5వ తరగతి