అమెరికన్‌ సమాజానికి అద్దం: జోకర్‌ -డా|| విరించి విరివింట

ప్రతి సమాజంలో కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరికీ ఏ ఇబ్బందీ కలిగించరు, కానీ అందరూ వారిపట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళకు వారి సొంత అస్తిత్వం గురించిన అవగాహన కూడా ఉండదు. ఈ ప్రపంచంలో తాము బతుకుతున్నామనే స్పృహ ఉండదు. వాళ్ళు సమాజం నుంచి ఏదీ కోరుకోరు, ఎందుకంటే వాళ్ళు సమాజానికి ఇచ్చేది కూడా ఏదీ ఉండదు. తమ కష్టాలను చెప్పుకుందామంటే వింటున్నట్టు అనిపించే వాళ్ళు తప్ప నిజంగా వినేవాళ్ళు ఎవరూ ఉండరు. కానీ వాళ్ళకు కొంత వెచ్చదనం కావాలి. కొంత ప్రేమ కావాలి. కొంత గుర్తింపు కావాలి. ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు ఎందరో ఉంటారు. వాళ్ళల్లో ఒక్కడే ఆర్థర్‌ ఫ్లెక్‌. అతడు చిన్నతనంలో అబ్యూజ్‌కు గురయినవాడు. అతడి తల్లి అందరు తల్లులలాగే అతడికి ఒక విషయం చెబుతుంది. అతడి జీవితానికి ఓ పర్పస్‌ ఉందని, ప్రపంచానికి నవ్వునూ, ఆనందాన్నీ పంచి ఇవ్వడమే జీవిత పరమార్ధమని చెబుతుంది. ఎప్పుడూ నవ్వుతూ సంతోషకరమైన ముఖాన్ని కలిగి ఉండమని చెబుతుంది. అందుకే అతడు జోకర్‌ అవుదామని అనుకుంటాడు. కానీ అతడి చుట్టూ పరుచుకుని ఉన్న బోథం నగర జీవితం అతడ్ని అణచివేస్తుంది. అతడికి తన జీవితం ఎంత మాత్రం భరించలేనిదని తోస్తుంది. ఉనికి లేని జీవితాన్ని జీవించడంలోని ట్రాజెడీ అతడికి ”ఫక్కింగ్‌ జోక్‌” లాగా కనిపిస్తుంది.

అతడికి ఒక మానసిక జబ్బు ఉంటుంది. Pseudo Bulbar Affect. సంతోషం వచ్చినా ఏడుపు వచ్చినా ఆ ఎమోషన్‌ని ప్రాసెస్‌ చేసి సరైన రీతిలో వఞజూతీవరర చేసే శక్తిని అతడి బ్రెయిన్‌ కోల్పోతుంది. దానివలన ఎమోషన్‌కు తగ్గట్టు కాకుండా inappropriate response to emotion  వలన తనను తాను కంట్రోల్‌ చేసుకోలేనంతగా నవ్వడం మొదలవుతుంది. అతడికి ఈ జబ్బుని ప్రసాదించింది మరెవరో కాదు, అతడిని నవ్వనీయని ఈ సమాజమే. Abused child నుంచి marginalised lone adult గా ఎదిగిన క్రమం అతడిని ఈ సమాజానికి దూరంగా తనదైన ప్రత్యేక లోకంలోకి నెట్టివేస్తుంది. సమాజంలోనే ఉంటూ సమాజంలో లేనట్టే బతికేవారు, తమ ఉనికి ఆనవాలు లేనివారు, ఈ సమాజంలో తమ ఉనికిని నిలుపుకోవాలని తపించేవారూ అచ్చం ఆర్థర్‌లాగే ఉంటారు అనిపిస్తుంది. సంతోషమే లేని జీవితం, సమాజపు వికృత వాస్తవికతను అర్థం చేసుకోలేనితనం, తనను ఒక mediocre joker గా మారుస్తుంది. అందుకే రోజూ ఏదో ఒకచోట అపహాస్యానికి గురిచేస్తూ అతడిని ఒక మానసిక రోగిగా మార్చేస్తుంది ఈ సమాజం. జీవితంలో నవ్వే లేనివాడు అందరినీ నవ్వించగలిగే జోకర్‌గా మారాలనుకోవడమే నిజమైన ట్రాజెడీ. అతడి నవ్వు ఈ సమాజాన్ని ఆ రోతనీ చూసి నవ్వినట్లు ఉంటుంది. అతడి మానసిక జబ్బు ఈ సమాజం కలిగించిన ఒత్తిడిలాగా ఉంటుంది. కానీ, అతడికి స్పష్టంగా తెలిసిన విషయమేమిటంటే… ఈ సమాజం ఏ మానసిక రోగినీ, మానసిక రోగిలా ప్రవర్తించకూడదని సమాజం ఒప్పుకున్న పద్ధతిలో డీసెంట్‌గా ప్రవర్తించాలని కోరుకుంటుంది అని. అందుకే అది నిర్దేశిస్తుంది, శాసిస్తుంది. ఏది మంచో ఏది చెడో, ఎలా ప్రవర్తించాలో, ఎలా కూడదో, చివరికి ఏది జోకో, ఏది కాదో కూడా సమాజమే నిర్దేశిస్తుంది. అందుకే అది మానసిక రోగులను కౌన్సిలింగ్‌ తీసుకోమంటుంది, మందులు వేసుకోమంటుంది. అయితే, రోజురోజుకీ పెరుగుతున్న ఖర్చులు, తరుగుతున్న జీవన ప్రమాణాలు, నిరుద్యోగం, ఆకలి బాధ అంతా కలిసి, మందులు కొనుక్కుని ఆరోగ్యంగా ఉండగలిగే హక్కును, జీవన మాధుర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. అదే సమయంలో ఆర్థర్‌ ఉద్యోగం పోతుంది. అమెరికాలో మారిన ప్రభుత్వాలు మెడికైడ్‌పై ఆంక్షలు విధించాక ఆ రూల్స్‌ ప్రకారం నిరుద్యోగులకు ఇన్స్యూరెన్స్‌ అకస్మాత్తుగా ఆగిపోతుంది. అమెరికాలో జాబ్‌ కోల్పోవడం అంటే కేవలం జీవనభృతి కోల్పోవడం మాత్రమే కాదు, తన మానసిక జబ్బును మరింత తీవ్రతరం చేసుకోవడం కూడా. ఇటువంటి సమాజంలో అతడికి ఉన్న ఏకైక ఊరట అతడి ఊహల్లో మాత్రమే నివసించే అతడి ప్రియురాలు. ఒక వ్యక్తి ఒక హాల్యూసినేషన్‌లో తప్ప మరెక్కడా సంతోషంగా లేనితనం నిజంగా భయంకరమైనది. అయితే, ఒక సందర్భంలో ఒక స్త్రీని లోకల్‌ ట్రెయిన్‌లో ముగ్గురు కుర్రాళ్ళు బుల్లీ చేయడం చూస్తాడు ఆర్థర్‌. ఆ బాధను తట్టుకోలేక బిగ్గరగా నవ్వుతాడు. ఆ కుర్రాళ్ళు ఆర్థర్‌ నవ్వుకు కారణం కనుక్కోలేక అతడిని హింసిస్తారు. అప్పుడు సడన్‌గా ఆర్థర్‌ తన దగ్గరున్న పిస్టల్‌తో ఆ ముగ్గురినీ కాల్చి చంపేస్తాడు. అతడు మరింత లోతుగా కష్టాల్లోకి కూరుకుపోవడం మొదలవుతుంది. కానీ ఆ తుపాకీ ఓ ధైర్యాన్ని ఇస్తుంది. అతడు ఇక ఏ మాత్రం బాధపడేది లేదని తెలుసుకుంటాడు. ఇంతకాలం ఎంత నవ్వించినా తనను గుర్తించని సమాజం హత్యలు చేయడం వలన గుర్తించిందని తెలుసుకుంటాడు. కానీ అప్పుడే అతని పర్సనల్‌ లైఫ్‌లో తాను ఎవరికీ ఏమీ కానని, తనకు ఉనికే లేదని తెలుసుకుంటాడు. ”తనవాళ్ళు” అని తాను భ్రమిస్తున్న ముసలి తల్లిని, మెదడులో నివసించే ప్రియురాలిని చంపేస్తాడు.

ఇక అతనికి మిగిలి ఉన్నది ఒక్కటే… తాను జోకర్‌ని అనిపించుకోవడం. తాను ఇష్టంగా చూసే ఒక కామెడీ షోలో తాను ”జోకర్‌” అని ఆ షో ప్రజెంటర్‌ ముర్రే చేత బుల్లీ చేయబడ్డాడు కాబట్టి అదే కామెడీ షోలో తన ఉనికిని తెలియజేయడం. ఏ సమాజంలో కామెడీ ఆబ్జెక్టిఫై అయి ఒక గ్రూప్‌ ఆఫ్‌ పీపుల్‌ని తక్కువ చేసి మాట్లాడుతుందో, బుల్లీ చేస్తుందో, సమాజంలో జరిగే ఏ హింసనైనా వీళ్ళనే బాధ్యులను చేస్తుందో, ఏలికలు ఎవరిగానైతే పుట్టకూడదని చెబుతుంటారో, ఎవరి గురించైతే నిర్భయంగా, ఆలోచనారహితంగా కార్నర్‌ చేస్తూ మాట్లాడగలరో వాళ్ళందరూ ఒక్క ఆర్థర్‌ గొంతుకతో మాట్లాడటం మొదలుపెడతారు. మానసికంగా జబ్బుపడిన ఆర్థర్‌ లాంటి వాళ్ళను ఒక చెత్తలా భావించి డస్ట్‌బిన్‌లో వేయాలనుకునే సమాజం, వాళ్ళని రోజురోజుకీ క్షీణింపచేస్తూ, అణగదొక్కుతూ మరింత మానసిక ఒత్తిడికి లోనుచేస్తూ వాళ్ళ నుంచి డిసెంట్‌ బిహేవియర్‌ని మర్యాదపూర్వకమైన కామెడీని కోరుకునే సమాజం అంటే ఆర్థర్‌కి కోపం, కసి. ఏ క్షణంలోనైతే ఆర్థర్‌, సమాజం తన వంటి మనుషులను పట్టించుకోకుండా ధనవంతులు కోరుకునే ఈ ముసుగును గౌరవప్రద కామెడీని అందించే ముర్రేని అదే షోలో కాల్చి చంపేస్తాడో… ఆర్థర్‌ వంటి అశేష ప్రజానీకానికి ఒక ధైర్యం వస్తుంది. గోథం నగరం అతలాకుతలం అవుతుంది. నగర మేయర్‌ సతీసమేతంగా కాల్చబడతాడు. అతడి ఆరేళ్ళ కొడుకు ఆ శవాల నడుమ ఒంటరిగా నిలబడి ఉంటాడు. ఆ షష్ట్రaశీర మధ్యన ఆర్థర్‌ ఒక ”జోకర్‌” లాగా కనిపించే నెససరి ఈవిల్‌ లాగా లేచి నిలబడతాడు.

నా దృష్టిలో జోకర్‌ సినిమా ఒక పొలిటికల్‌ సినిమా. కోర్ట్‌ జెస్టర్‌ వంటి కామెడీ పాత్రల ద్వారానే రాజ్యంలో అధికారులకు చెప్పగలిగింది చెప్పే విధానం షేక్‌స్పియర్‌ కాలం నుండీ ఉంది. అయితే ఇది కామెడీగా కనిపించే ట్రాజెడీ సినిమా. అమెరికాలో అధికారంలో ఉండే అధ్యక్షుడి చర్యల వలన సమాజం రోజురోజుకీ ఏమైపోతుందో, ఎలా పతనం చెందుతుందో మార్జినలైజ్డ్‌ పీపుల్‌ ఎలా టార్గెట్‌ చేయబడుతూ, బుల్లీ చేయబడుతున్నారో… వాళ్ళు ఎలా మానసిక రోగులుగా మారుతున్నారో ఇదంతా ఒక అంతర్లీన అంశంగా చూపబడింది. నిర్లక్ష్యం చేయబడిన వారిని ఇంకా నిర్లక్ష్యం చేస్తే అది ఎట్లా రైజ్‌ ఆఫ్‌ ఈవిల్‌ రైజ్‌ ఆఫ్‌ ఈవిల్‌గా మారుతుందో ఒక హెచ్చరికగా చూపబడింది. చాలా మంది ఆక్షేపిస్తున్నట్లు ఇందులో హింసను గ్లోరిఫై చేయడం ఏమీలేదు. చివరిలో ఆర్థర్‌ ఒక ఐకాన్‌గా లేచి నిలబడడం ఒక సింబాలిక్‌ హెచ్చరిక. ఒక సమాజానికి పట్టిన జాత్యాహంకార క్యాపిటలిస్ట్‌ జాడ్యాన్ని మొత్తాన్నీ ఒక కథలో ఇమిడ్చి ఒక దృశ్య కావ్యంగా తీర్చి దిద్దారు. ఆర్థర్‌ ఫ్లెక్‌గా వాక్విన్‌ ఫీనిక్స్‌ నటన గానీ, సినిమాటోగ్రఫీ గానీ, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ గానీ ఈ సినిమాను ఉత్తమమైన సినిమాల స్థాయిలో నిలబెట్టాయి. ఫీనిక్స్‌ నటన మనల్ని వెంటాడుతుంది. టాడ్‌ ఫిలిప్స్‌ దర్శకత్వ ప్రతిభ ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. నవరసాలను ముఖంలో పలికించి ప్రేక్షకుల మనసులను దోచుకున్న వాక్విన్‌ ఫీనిక్స్‌కి ఆస్కార్‌ అవార్డు వస్తే ఆ అవార్డుకు కూడా గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. రావాలని కోరుకుంటూ…

Share
This entry was posted in సినిమా సమీక్ష. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.