భూమిక ఎడిటర్ గారికి,
నాగావళి తీరాన మెలుకువతో నా కోసం అక్కలాగా లాపంలా సాగింది కవనభూమిక. నన్ను నేను తీర్చి దిద్దుకునేలా చేసిన కవితలకు కవిత్వధారతో ఋణం తీర్చుకుంటాను. కాశింబి గారు అమ్మని అమ్మలాగే కవిత్వీకరించారు. అటువంటప్పుడు ఫెమినిజాన్ని తూచడానికి రాళ్ళెక్కడ! సుజాతక్క ఈ మధ్య జరుగుతున్న సంఘటనల బండారాన్ని చాలా జాగ్రత్తగా బయట పెడుతున్న విధానానికి నవ్వు వస్తుంది. బాధ్యత మరిచిన భావితరాల పట్ల భాదగా కూడా ఉంది అందుకేమోఈ ‘నన్ను బ్రతకనివ్వండి’. మరొక కవిత నీలోనే… అంటూ డా|| సిరి జగమంత కుటుంబాన్ని జగమంత మనస్సుతో లాలించి, దీవించి చివరకు నీ ప్రయత్నమే కదా! ప్రపంచజ్ఞానం అనేంత వరకు వచ్చారు, తెచ్చారు. ఆ జ్ఞానాన్ని సమాజంలో నిజాయితీగా ఎన్నో తరాలనుండి పోగు చేస్తున్న మానవాళికి చెందుతున్నదా అన్నదే ప్రశ్న కదా! ఆ ప్రశ్నని కూడా జవాబుగా మలుచుకుంటూ డా|| సిరిగారి ఆచరణతో, ఆలోచనలో మమేకమవుదాం. ”కన్నీళ్ళరుచి”లో కరిగిపోయి పుటం పెట్టేలా నిన్ను నీవు వర్షించుకుని ఆ వర్షం సాక్షిగా వర్షధారగా ప్రపంచం ముందు నీదైన నిజాయితీతో ప్రియురాళి రోధన సాక్షిగా ఆవిష్కరించడం. చాలా గుండెనిబ్బరాన్ని కలిగించింది. అందుకే నా కలాన్ని కాగితంలా ఎగరేస్తున్నా! పారిశ్రామికీకరణ కార్మిక స్థితిగతులు అన్న వ్యాసం చరిత్ర మూలాల్లోకెల్లి మన కార్మికుల్లో లేని స్పృహకు అసలు కారణం వాళ్ళు కార్మికులుగా ఎప్పటికీ ఉండాలనుకోవడం, భూస్వామ్య రైతు సంబంధాల్లోనే వారిని వారు నిరూపించుకోవాలనుకోవడంలోనే ఉంది అని చెప్పడం ఒక కవి విశ్లేషణలో లోటుపాటులను తెలియజెప్పింది. సుభాష్ నగర్ స్థితి గతులను చక్కగా వివరించారు. ఈ మధ్య మేడ్చల్‌లో కూడా రియాక్టర్ పేలడం వలన బీహార్‌కు చెందిన ఇద్దరు కార్మికులు మరణించారు. చుట్టు పక్కల ఉన్న కంపెనీలకు కూడా తీవ్ర నష్టం జరిగింది. అందులోని మిషనరీ ఎగిరి గాలిలో విమానంలా, ఒక స్కూటీమీద పడడం మూలంగా అది పూర్తిగా దెబ్బతింది. అక్కడ వాచ్‌మెన్ అయితే సార్ నా మెడను పక్కకు అనడం వలన నేను బతికి పోయాను లేకుంటే నేను చనిపోయేవాడిని అని చెప్పడం సమస్య తీవ్రతను తెలియజేస్తుంది. ఇంత చేస్తే ఆ కంపెనీ రిజిష్టర్ అవ్వలేదు. అక్కడ టి.ఆర్.ఎస్. లీడర్ ఆధ్వర్యంలో నడుస్తూంది. అందులో తయారయ్యే పొడి కూడా ఏంటో అక్కడి వారు చెప్పలేకపోయారు. ఇలా రియాక్టర్లు పేలడం సర్వ సాధరణం. పేలినప్పుడు ఎంతో కొంత నష్టాన్ని ఇచ్చి వాళ్ళ శవాలను వాళ్ళ సొంత రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఆ రియాక్టర్లను కంట్రోల్ చేసే ఉద్యోగులకు సరియైన ఉద్యోగ అర్హత లేకపోవడం, నాసిరకం రియాక్టర్ల వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. పేలకముందే చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే నేను ఈ వ్యాసం వ్రాసే సమయానికి మరల రియాక్టర్ పేలి 10 మంది కార్మికులు మృతి అని పేపర్లో వచ్చినా ఆశ్చర్య పోవడం నావంతు అవుతుందేమో అందుకే భూమిక దృష్టికి తెస్తున్న.
చివరగా మహిళా ఖైదీల అంతరంగ ఆవేధనల ఆవేశాలు, ఆక్రోశాలు భవిష్యత్ పట్ల వారి పాటలకచేరీ చాలా బాధ్యతతో ఉండి, భవిష్యత్ ఆశాజనకంగా ఉండాలని కోరుకుంటూ…
నిశ్శబ్దమే పెను విస్పోటనం: రాయ్ వ్యాసం చైతన్య అనువాదంతో మరింత ఎరుపెక్కింది. నిజంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నిశ్శబ్దం ఆవరించిన మాట వాస్తవం. ఆ నిశ్శబ్దాన్ని చేదించడానికి చేసిన ప్రయత్నాన్ని కూడా ఈ ముసుగు ప్రభుత్వాలు మాట్లాడేవారిపై కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పుతూ జైళ్ళపాలుగావించారు. ఇప్పటికీ కశ్మీరం అందరని అర్థంకాని పరుసవేదిగా మారిపోయింది. ఇదిట్లా
ఉండగా భూమిక చేసిన ప్రయత్నం చాలా ఆలోచించే విధంగా ఉంది. కశ్మీర్ కాదు తెలుగు ప్రజలంతా ముక్తకంఠ నాథంతో వస్తావిక కాచుకోండి అనేలా ఈ వ్యాసం చదివిన సంస్థలన్ని మరొక్క సారి కశ్మీరుల నిజమైన స్వాతంత్య్రానికే నినదిస్తాయని నిరూపించుకుంటాయని, రాజకీయాల్లో పాములను మింగే ప్రజలవైపు చరిత్రను నణానికి మరోవైపును చూయించిన చైతన్యక్కకు వందనాలు. తెలుగు తల్లి విప్లవాభివందనాలు
కలన