ఒక మనిషి ఆడ అయినా, మగ అయినా…
సమాజపు చట్రంలో జీవిత విధానపు రంగుల రాట్నంలో,
విభిన్నంగా, ఎదురువాటంగా తిరగాల్సి వస్తే,
అది కూడా స్వయం నిర్ణయమే అయితే,
ఆ చాలనపు బాధ్యతా, నియంత్రణా కూడా తనవి మాత్రమే అయితే,
వేగం మాత్రం ఖచ్చితంగా తగ్గకుండా ఉండాలనేది మొట్టమొదటి సూత్రం!
ఎందుకంటే, సమాజం ముందుగా గమనించేది దాన్నే, అది
ఉత్తేజం కాబట్టి.
గమనించవలసిన చిన్న విషయం ఏంటంటే చలనం నిరంతరమే,
కానీ చలనం అంటేనే ఒక్కోసారి అస్థిరం, అలాగే సమాజపు చూపూ అస్థిరమే.
ఒక్కసారి ఆ వేగాన్ని గమనించిందంటే అది సమాధానపడినట్టే!
తన పరీక్షలో ఆ మనిషిని ఉత్తీర్ణం చేసినట్టే!!
సమాజం మనకిష్టం లేదని మనం అనుకున్నా, అది మనని వద్దనుకోదు.
పోటీ పరీక్షకి నిలబడకపోతే, సూటిగా గైర్హాజరు వేసేస్తుంది.