కొన్ని సమయాల్లో… -ఉమా నూతక్కి

మనసు అస్థిమితంగా

ఉన్నప్పుడు…

హృదయంలో బడబాగ్నులు రగులుతున్నప్పుడు…

గుండెలోని వేదనంతా గొంతుకి అడ్డం పడుతున్నప్పుడు…

కన్నీరంతా కారిపోతూ కళ్ళు పొడిబారిపోతున్నప్పుడు…

వినపడే ఒక్క సానుకూలమైన పలకరింపు… ప్రాణ స్నేహితులదైనా.. పరిచయస్తులదైనా… మనల్ని ఏమార్చుకునేలా చేస్తుంది. అదిగో అప్పుడు మనం విప్పిచెప్పిన ఏ విషయం అయినా సరే తన తీరు మార్చేసుకోవచ్చు. నిన్నొక దోషిగా చూపించేలా కన్పించవచ్చు.

ఎందుకంటారా… మనకి సున్నితమైన విషయాలు పక్కవారికి కూడా అలానే కన్పిస్తాయనుకోవడం మన భ్రమ. మనం చెప్పుకున్న విషయాల్లో తమ కనుకూలమైనవేవో వారికి కనిపించవచ్చు లేదా సమాజ ఉద్ధరణకి కంకణం కట్టుకున్నట్టుగా అవ్వవచ్చు. తనకి అది ఎలా ఉపయోగపడినా సరే… మనవైపు ఎంత న్యాయమున్నా సరే మనల్ని మాత్రం అందరికీ సమాధానం ఇచ్చు కోవాల్సిన పరిస్థితిలోకి నెట్టేస్తుంది.

అసలు విషయం మరుగున పడిపోయి… కొత్త కొత్త చర్చలు జరుగుతాయి, సరికొత్త వాదాలు బయటికి వస్తాయి. ఇదంతా ఏ ఒకటి రెండు రోజులకో పరిమితం కాదు. గొలుసు కట్టు కథలా కొనసాగుతూనే ఉంటుంది. మన సమాధానాన్ని కోరుతూనే ఉంటుంది. ఎన్నాళ్ళు…? ఎన్నేళ్ళు ఇవ్వగలం

సమా ధానం?

అంతే కదా మరి… ఎవరో గాయాన్ని చేస్తారు. ఇంకెవరో మందు పూయాలని ప్రయత్నిస్తారు. కొందరు తగ్గిందా లేదా అని ఒకసారి టచ్‌ చేసి చూస్తారు. మరొకరు అది అసలు గాయమా కాదా అని కెలికి కెలికి చూస్తారు. తమ వాదనతో ఎవరి ఏ కారణం చొప్పించినా ప్రతి సారి మనకు మాత్రం నొప్పి అంతకంతకూ పెరగటమే తప్ప తగ్గడం

ఉండదు. గాయమేమో మరింత పచ్చిగా తయారవుతుంది. అసలు గాయమన్నది మనం కల్పించిన మాయయేమో అని భావించేవారూ ఉంటారు.

అప్పుడనిపిస్తుంది…

మనసులోని బాధని మరొకరితో పంచుకుంటే మనసుకి సాంత్వన చేకూరుతుంది అని చదివిన ఈ మాటలు ఈ కాలానికి పనికి రావని, ఇప్పుడలా పంచుకుంటే… అది ఏ రూపాన్ని ధరించి మనల్ని తన ఉచ్చులోకి లాక్కుంటుందో అన్న అనుమానంతో మనలోకి మనం మరింతగా కుంగిపోతామని.. మన బాధా, మన గోడు మనకి తప్ప వేరెవ్వరికైనా సరే అది ఆటవిడుపు లాంటి కాలక్షేపమేనని.

ఎందుకంటే మన భావోద్వే గాలను పంచుకునే వాతావరణం లేదిప్పుడు. ఒకవేళ అలా పంచుకున్నా అదేదో మన స్వార్థం కోసమే చేసామనీ అనుకుంటారు. ఇక్కడ ఎవ్వరికీ ఎవ్వరి సొదా పట్టదు. పట్టినట్లు అనిపించిందంటే అక్కడ వాళ్ళల్లో మరేదో స్వార్ధం మొలకెత్తిందన్న మాటే…

మహిళలుగా మనం వృత్తి పరమైన, కుటుంబ పరమైన, సామాజిక బాధ్యతలను ఒకే సమయంలో నిర్వర్తించాల్సి ఉంటుంది. అదే సమయంలో మన మనసు మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించే మానసిక వత్తిళ్ళను దూరంగా ఉంచాల్సిన బాధ్యత మనకే తప్ప వేరెవరికీ లేదు.

అందుకే చెప్తున్నా సోదరీ… ఒక్కసారి మన పెదవి దాటిన ఏ విషయమూ మనది కానట్టే గుర్తుంచు కోవాలి. అంతేకాదు అది తీసుకుని వచ్చే మంచికైనా చెడుకైనా బాధ్యత మనదే అవుతుందన్న విషయమూ మన మనసుకి ముల్లులా గుచ్చుకునేలా మనకి మనమే తర్ఫీదు ఇచ్చుకోవాలి.

మన చుట్టూ ఉన్న సమాజంలో మన వ్యక్తిత్వానికి అనుగుణంగా మనమే స్వతంత్రంగా పోరాటానికి ప్రయత్నించాలే తప్ప మన పోరాటాన్ని ఎవరి భుజాల మీదో మోపితే వాళ్ళు ఎప్పుడు కాడి దించేస్తారో అనేది ఎవరూ చెప్పలేరు. అలా జరిగితే వచ్చే పరిణామాల మీద మనం నోరు విప్పితే ఆత్మ స్తుతి, పరనిందలు మిగులు తాయి తప్ప ఫలితం మృగ్యమవుతుంది.

సమాజానికి చేరాలి అని అనుకున్న మన ప్రతి మాటా మన గొంతు ద్వారానే సమాజానికి చేరాలి తప్ప, మరో గొంతుతో మాత్రం కాదు. అప్పుడే పోరాటం మనదవుతుంది. ఫలితమేదైనా సరే మనసుకి పోరాటం చేసామన్న సాంత్వన కలుగుతుంది. మన పోరాటంలో మనంముందు ఉన్నప్పుడే మన మానసిక ఒత్తిళ్ళు దూరమవుతాయి.

Share
This entry was posted in మంకెన పువ్వు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.