భూమిక సంపాదకులకు నమస్తే,
ఏప్రిల్, మే పత్రికలు నిజంగా హైలైట్! ఎందుకన్నానంటే వింజమూరి అనసూయదేవి గారి ఇంటర్వ్యూ. అటు జీవితానుభవాలలో జీవన్ గూర్చి తెల్సుకోవటం. కామేశ్వరి గారి కథల్లోని సమకాలీనత, పుస్తక సమీక్ష చాల చాల బాగుంది. ఆమె జవాబు వ్యాసం గిరిజన బతుకుల్లోని అమాయకత్వం గూర్చి చదువుతుంటే గుండె కరిగి కన్నీరైంది. మానవి నవలా సమీక్ష బాగుంది. తప్పెక్కడుంది? మొత్తం చదివితే టీనేజీ ఆడపిల్లలు పేదింట్లో పుట్టడం వాళ్ల బతుకులు ఎలా ఆగమైపోతున్నాయెనని ఆవేదన చెందుతాం. జీవితానుభవాలు గాఢంగా సాగిపోతూ, బతుకులోని ఛిద్రాన్ని వెంటాడే విధంగా పరుగులు పెట్టిస్తుంది. ప్రతినెలా కవర్‌పేజీ ఆకర్షణీయంగా ఉంది. నేను ”ఆడకూలీ” కవిత రాయడానికి కారణం మే నెల పత్రిక ముఖచిత్రమే! వాళ్లు ఆర్టిస్టులైతేనేం..? ఆడకూలీలైతేనేం..? భూమిక సంపాదక వర్గానికి అభినందనలు.. కళాగోపాల్, నిజామాబాద్
……. ఙ …….
భూమిక ఎడిటర్ గారికి,
”తథాగతుని అడుగుజాడలు – ఒక పరిచయం” రామవరపు గణేశ్వర్‌రావు రాసిన పుస్తక సమీక్ష అద్భుతంగా ఉంది. చాలా మంచి పరిచయం.
ముకుందరావు, హైదరాబాద్