అసలు నీకర్థమవుతోందా!?!? -పి. ప్రశాంతి

ఎటుచూసినా ఉత్తేజం తొణికి సలాడు తోంది. నగరంలో ఎంతోమంది మహిళలు… ముఖ్యంగా యువతులు మొదటిసారి ఈ ఉత్తేజాన్ని అనుభవి స్తున్నారు. ఈ ఉత్తేజం కరెంట్‌లా దేశంలోని ఎన్నో నగరాలకి, మహా నగరాలకి పాకేస్తోంది. మెల్లగా చిన్న పట్టణాలు… అక్కడ్నుండి గ్రామాలకూ చేరుకుంటోంది.

చిన్న చిన్న గుంపులుగా…. పెద్ద సమూహాలుగా… ఎన్నడూ బైటికిరాని మహిళలు రోడ్లపైకి వచ్చేస్తున్నారు. గట్టిగా మాట్లాడను కూడా చెయ్యని వీరంతా గొంతులు పెగిల్చి నినాదాలిస్తున్నారు. కొత్త వారితో కలవడానికి బెరుకుపడే వీరిప్పుడు కొత్తాపాతా తేడా లేకుండా కలిసి పాడుతు న్నారు… కలిసి నినాదాలిస్తున్నారు… ఒకింత అలసటనిపిస్తే ఎవరికెవరు అనే ప్రశ్నే లేనట్టు చాయ్‌, బిస్కెట్లు, పండ్లు, సమో సాలు… ఏది అందుబాటులో ఉంటే అది తెచ్చేస్తున్నారు… అందరికీ పంచేస్తున్నారు.

కొత్త స్నేహాలు… నయా దోస్తానీలు… కామ్రేడ్లు… పోరాటంలో సాథీóలు… ప్రేమగా మాట్లాడుకోడాలు, ఆర్తిగా హత్తుకోడాలు, కలిసి పాడుకోడాలు, సామూహిక చర్చలు, పకడ్బందీ ప్రణాళికలు, పనికి ఉరకలు, లాంగ్‌ మార్చ్‌లు, కొత్త పోకడలు, ఎలుగెత్తి ప్రశ్నించడాలు, స్వేచ్ఛ – స్వాతంత్రానికి నినదించడాలు…

ఈ నేల మాది, ఈ మట్టి మాది, ఈ దేశం మాది… ఇక్కడ పుట్టి ఈ పరిమిళాన్ని నింపుకున్న మేము… తరతరాలు గా ఈ మా పురిటిగడ్డతో పెనవేసుకున్న వారసత్వాన్ని ఇవ్వాళ నిరూపించుకోవాలా! కావాలంటే కళ్ళు విప్పార్చి చూసుకో మా బొడ్డుతాడుతో ముడిపడున్న ఇక్కడి సంస్కృతి మట్టి వాసనల్ని!! అంతేకాని, నాది… నన్ను కన్నోళ్ళది… వాళ్ళని కన్నోళ్ళది… వాళ్ళ వాళ్ళని కన్నోళ్ళది గుర్తింపు తెమ్మనగానే తేడానికి అస్సలు ఆది చూపించావా? నీ వారసత్వపు జాడలు ఎక్కడివో నీకు తెలుసా?

వేలాదిగా, కోట్లాదిగా ఉన్న ఈ దేశపు నిరక్షర బిడ్డలు… నిలువ నీడలేని జనులు… కడుపుకింత తిండిలేక… తీరైన పాలన లేక… ఉన్న కాసింత సొంత వనరుల్ని అభివృద్ధి పేరుతో నిలువు దోపిడీ చేస్తున్న మూకల బారి నుండి తప్పించుకోడానికి పొట్ట చేతపట్టుకుని గంజికోసం ఊళ్ళూవూళ్ళు దాటుతున్న వలస జీవులకి, బడుగు ప్రజలకి జవాబు చెప్పే బాధ్యత లేని నీకు… నువ్వెక్కడ్నుంచి వచ్చావో నిరూపించుకో అంటే…?? జవాబు దొరకని ప్రశ్నలు వెయ్యటం, అంతుచిక్కని దోపిడి చెయ్యటం, తెల్లకాలరు దొంగలకి వత్తాసు పలకడం, దేశాన్ని తాకట్టు పెట్టే వారికి చేయూత నివ్వటం, ఈ దేశపు సారాన్ని పీల్చేసి పరాయి దేశాలకు పారిపోతున్న వారికి దొడ్డి దారి చూపించడం… ఇదేగా నీ నైజం! ఇది నా దేశపు వైనం కాదే!! మరి నువ్వెవరు? అసలు నీకెక్కడిదీ అధికారం??

ఇన్ని ప్రశ్నలతో, ఇప్పుడే తెచ్చుకున్న ధైర్యంతో, ఇప్పడిప్పుడే పెగుల్చుకున్న గొంతులతో ఉమ్మడిగా… మూకుమ్మడిగా న్యాయపోరాటం చేయడానికి అలలు, అలలుగా ఉవ్వెత్తున్న ఎగసిపడుతున్న మహిళా సముద్రం… పితృస్వామ్య బానిస సంకెళ్ళను పుటుక్కున తెంపేసుకుంటున్న నారీశక్తిని… మొదట విస్మయంగా చూసినా, అంతలోనే అణిచెయ్యాలన్న కుబుద్ధితో… జూలు విప్పుకున్న మతోన్మాదంతో విచక్షణ మరిచి (ఎప్పుడూ లేదులే!) ద్వేషాన్ని రగులుస్తూ ృారత్వాన్ని వర్దీలో నింపి పంపింతే… మేమేం భయపడం… భయ పడేదేం లేదు.

మా ఈ తెగువని భరించలేకే కదూ నీ కుళ్ళు కృారత్వాన్ని మహిళా పోలీసులకూ చేర్చేశావు. మొక్కవోని మా సంకల్పాన్ని నీరుకార్చడానికి, మా ధైర్యాన్ని చిదిమెయ్య డానికి… నీ నిరంకుశత్వానికి నిరసన తెలపడానికి ఒక్కటైన మమ్మల్ని ముక్కలు చేయ్యడానికి… మళ్ళీ మా శరీరాలనే వాడుకున్నావుగా! ప్రజాస్వామికంగా ఇది తప్పని చెప్తున్న మమ్మల్ని ఈడ్చి పోలీసు వ్యానుల్లో పడేయాలని, ఉద్వేగంతో ఉన్న మమ్మల్ని చెదరకొట్టాలని, ఈడ్చేయాలని చేసే ప్రయత్నం ఇంత హీనంగానా? కూసింత వ్యతిరేకతకే తట్టుకోలేక నీ పోలీసులు మా స్థనాల్ని పిండి, యోనిని గిచ్చి, పిరుదుల్ని చరిస్తేకాని నీ కంట్రోల్‌లోకి రామనుకున్నారు కాబోలు! చిట్టచివరికి లైంగికంగా వేధిస్తేనే కాని దారికిరామనుకున్నారు కాబోలు!! మమ్మల్ని ఎత్తి పోలీసు వ్యానుల్లో కుదేయ డానికి ఎంచుకున్న ఈ మార్గం ఎంత నీచ మైందో అర్థమవుతోందా? ఇదంతా మమ్మల్ని మళ్ళీ ఇంటి లోపలి గదుల్లోకి తరిమేయా

లనేగా?? శాంతియుతంగా ఉద్యమిస్తున్న మమ్మల్ని చూసి ఝడుసుకుని ఉద్యమమే లేకుండా అణిచేయాలనుకుంటే తన చితి నుండే లేచొచ్చిన ‘షాహీన్‌’ పక్షులమవుతాం.

మాకు గోడలు, గోపురాలు కట్టాలని చూడకు… మాకు సరిహద్దులేలేవు. మా ఓటుతో నువ్వు పదవిలోకొచ్చి… మెల్లగా అధికారాన్ని నియంతృత్వంగా మార్చుకుని ‘నే చెప్పిందే వేదం. నే చేసిందే మోదం’ అని నువ్వంటే నువ్వు వెర్రి వెంగళప్పవే. ఎందుకో తేల్సా! నీ లెక్కల్లోంచి మా ఓటుని తీసేస్తే… మరి మా ఓటరు కార్డుకి విలువే లేకపోతే… నివ్వెక్కిన ఆ అందలం కూలిపోతుందిగా! నీ కర్థమవుతోందా? మరి ఇక అధికారంలో లేని నువ్వు చట్టమెలా చేస్తావ్‌? నువ్వెవరని మా వారసత్వాన్ని ప్రశ్నించగలవు? ఈ దేశపు అణువుల్లో మేమున్నాం… నీ చూపు మారితే కదా నీ కర్థమయ్యేది. ఈ దేశపు వెలుగుల్లో మేమున్నాం… నీ చీకటి బుద్ధికి తెల్లారితే కదా నీ కర్ధమయ్యేది!! ఈ దేశపు నాగరి కతలో మేమున్నాం… నువ్వు విద్యావంతు డివైతే కదా నీకర్ధమయ్యేది!!! ఈ దేశపు నిర్మాణ పునాదుల్లోనూ మేమున్నాం… నీ అస్థిత్వ పునాదుల్ని తెలుసుకోగలిగితే కదా నీకర్ధమయ్యేది!!!

ఇవన్నీ నీకర్ధమవ్వాల్సిన అవసరం లేదు… ఎందుకంటే, యే దేశ్‌ హమారా… జాన్‌సే ప్యారా…

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.