వేలూరి కృష్ణమూర్తిటెహరాన్‌లోని (ఇరాన్) ఒక మధ్యమ వర్గపు కుటుంబంలో జన్మించిన మజీద్ మజిది ఇరానియన్ భాషలో ప్రతిష్టాత్మకమైన చిత్రాలకు దర్శకత్వం వహించి గొప్ప దర్శకుడన్న పేరు గడించాడు. 58 ఏళ్ల మజీద్ మజిది తన బాల్యం నుండే నటనలో ఆసక్తిని పెంపొందించుకొన్నారు. తన 14 ఏళ్ల వయసులోనే అమెచూర్ (ూఎa్‌వబతీ) నాటక తండం చేరి అనంతర కాలంలో నాటక పాఠశాలలో అభినయంలో తర్ఫీదు పొందాడు. 1979లో ఇరాన్‌లో జరిగిన రాజకీయ క్రారతి తరువాత అతను సినిమాలను గురించి ఆసక్తి పెంపొందించుకొని ‘చిల్డ్రన్ ఆఫ్ హెవెన్’ అన్న తన మొదటి చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆ మొదటి చిత్రానికి అకాడెమీ ప్రశరస కూడ లభించినది. అతను దర్శకత్వం వహించిన ‘సాంగ్ ఆఫ్ స్పారోస్’ చిత్రాన్ని 2008లో విశాఖపట్టణంలో జరిగిన భారత అరతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రారంభిక చిత్రంగా చూపారు. 2015లో అతను దర్శకత్వం వహించిన మహమ్మద్ పైగంబర్ జీవితాన్ని గురించి దర్శకత్వం వహించిన ‘మహ్మద్, ద మెసంజర్ ఆఫ్ గాడ్’ అన్న చిత్రం ముస్లిం ప్రపంచపు గమనాన్ని చాలా ఎక్కువగా ఆకర్షించినది. అతను దర్శకత్వం వహించిన ఇతర చిత్రాలు : బరాస్, కలర్ ఆఫ్ పారడైజ్. ‘బియాండ్ ది క్లౌడ్’ ఇరాన్ దేశపు మజీద్ మజిది దర్శకత్వం వహించిన మొదటి భారతీయ చిత్రం. ఈ చిత్రం 2017లో ఇంగ్లీషు, హింది మరియు తమిళ భాషలలో నిర్మించబడినది. ఈ చిత్రం ఈమధ్యనే గోవాలో జరిగిన 48వ అరతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రారంభిక చిత్రంగా ప్రదర్శింపబడి సినిమా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నది.
చిత్రం సారాంశం: ముంబైలో మత్తు పదార్థాలను (డ్రగ్స్) విక్రయించే వలలో చిక్కుకొన్న యువకుడు అమీర్ మరియు అతడి అక్క తారా జీవితాలలోని దురంతాలను సూక్ష్మంగా చూపే చిత్రం ‘బియాండ్ ది క్లౌడ్’. ఈ ఇరువురి జీవన పోరాటం ద్వారా దర్శకుడు మజిది ముంబైలోని దట్టరగా ఉరడే సారధ్ర జనజీవనం, వేశ్యావాటికలు, దారిప్రక్కన ఉరడే కాలిబాటల మీద, కొచ్చి ప్రదేశాలలో, సేతువుల క్రింద జీవితాలను గడుపుతున్న పేదల కష్టాలను చూపుతూనే, ముంబైలోని దురంతపు ముఖాలను స్పష్టంగా ప్రేక్షకుల మురదు ఉరచుతాడు.
డబ్బు సంపాదించడానికి ఎలాంటి పనినైనా చేయడానికి మురదుకు వచ్చే అమాయక యువకులను ఉపయోగించుకొని వారిచేత చట్టవిరుద్ధమైన పనులు చేయించే మధ్యవర్తులు, వారి గూరడా జనం, జిడ్డుకట్టిన పోలీసు వ్యవస్థ మరియు చట్టాలకు సంబంధించిన వ్యవస్థ మొదలైన వాటిపై మజిది వెలుగు చూపుతూ ప్రేక్షకులలో గాఢమైన విషాదాన్ని, ప్రస్తుత వ్యవస్థపై జుగుప్సనూ కలిగిస్తాడు.
ముంబై మాత్రమేగాక దేశంలోని ఇతర నగరాలలో ప్రతినిత్యం జరిగే అక్రమమైన కార్యాలను కథగా ఉంచుకొని ఎన్నో చిత్రాలు వేర్వేరు భారతీయ భాషలలో ఇంతకు మునుపే వచ్చాయి. కమర్షియల్ చిత్రాల కోసమనే చెప్పి చేసినటువంటి కథా వస్తువును మానవీయ అలాగే భావుకత నేపథ్యంలో పర్యాయపు (aశ్ర్‌ీవతీఅa్‌వ) సినిమా రూపకంగా చూపించారు. ఇప్పటి మన వ్యవస్థకు బలిపశువులుగా పాడైపోయే బీదవారు, అలాగే అసహాయులైన అమ్మాయిల జీవితాలకు భూతద్దం పట్టినదీ చిత్రం.
ఈ చలన చిత్రంలోని నాయకుడు అమీర్‌కు ఇరవై ఏళ్ల వయసు. ఒక స్నేహితుడితో చేరి మత్తు పదార్థాలను (డ్రగ్స్) ముంబైలోని ఎన్నో దుకాణాలకు సరఫరా చేసే పని అతడిది. స్నేహితుడి మోటార్ బైక్ వెనుకసీటుపై కూర్చొని పోలీసుల కళ్ళుగప్పి తిరుగుతూ నీటిలోని చేపలాగా తనకు ఒప్పజెప్పిన పనులను చేస్తూ తిరుగుతూ ఉరటాడు. అతడి అక్క తారా ఒక వివాహ విచ్ఛేదితురాలు. దోభీఘాట్‌లోని ఒక లారడ్రీలో బట్టలను ఇస్త్రీచేసి డబ్బు గడిస్తూ క్రొత్త జీవితాన్ని నిర్మించుకొనే ప్రయత్నంలో ఉరటుంది.
ఒకమారు అమీర్ పోలీసుల కళ్ళల్లో పడుతాడు. వారి నురడి తప్పించుకొని పారిపోతూ దోభీఘాట్‌లోకి దూరుతాడు. చేతిలో ఉన్న మత్తు పదార్థాల పాకెట్‌ను అక్క చేతిలో పెట్టి పారిపోతాడు. తారా దానిని తాను ఇస్త్రీ చేసే బట్టల మధ్యలో దాచిపెట్టి పోలీసుల కన్ను తప్పిస్తుంది. బట్టల మధ్య తారా దాచి వురచిన పాకెట్ ఆ అరగడి యజమాని, మధ్య వయసులో ఉన్న మద్రాసి అక్షి చేతికి చేరుతుంది. దానిని తారాకు వెనుదిరిగిచ్చే నెపంతో ఆమెపై తనకున్న కోరికను తెలుపుతాడు. ఆమెను బలాత్కరించడానికి మురదుకు వస్తాడు. అతడి నురడి తప్పించుకొనే ప్రయత్నంలో తారా చేతికి చిక్కిన ఒక రాయిని అక్షి తలపైకి విసురుతుంది. అక్షి ఆస్పత్రిలో చేరుతాడు. తారా హత్యా ప్రయత్నం చేసిందన్న ఆరోపణలో జైలుకు చేరుతుంది.
తన అక్క జైలు శిక్ష నుండి దూరమవ్వాలంటే అక్షి కోలుకుని అతడే తన తప్పును అరగీకరించే మాటలను పోలీసులకు చెప్పాలి. ఇలా అతడిని అరగీకరింపజేసే ప్రయత్నంలో అక్షి ఆరోగ్య రక్షణ బాధ్యతను అమీర్ తనపై వేసుకొరటాడు. తన కుమారుడు ఆస్పత్రిలో చేరాడన్న విషయం తెలుసుకొన్న అక్షి ముసలి తల్లి ముంబై చేరుకొంటుంది. అక్షి ఇద్దరు కూతుళ్లనూ తనవెంట తీసుకుని వస్తుంది. తన కుమారుడికేమైందన్న విషయం ఆమెకు తెలియదు. అవ్వకు, మనవరాళ్లకూ హిందీ భాష రాదు. పెద్దదానికి కొద్దిగా ఇంగ్లీషు తెలుసు. అవ్వ మరియు ఆ ఆడపిల్లల పేదతనానికి, అమాయకత్వానికి కరిగిపోయిన అమీర్ వారికి తన ఇంటిలో ఆశ్రయమిస్తాడు. వారిని తన కుటుంబంవారిలాగా చూసుకుంటాడు. తన అక్కను జైలు నుండి విడిపించడానికి ఆస్పత్రిలో ఉన్న అక్షి అవసరాలను చూసుకుంటున్న అమీర్ అతడి ముఖం చూసిన తక్షణం కోపం, నిరాశలతో ఉడికిపోతాడు. గందరగోళానికి లోనౌతాడు. ఒక స్థితిలో అక్షి పెద్ద కుమార్తెను వేశ్యావాటికకు అమ్మివేయడానికి కూడా ప్రయత్నిస్తాడు. కాని, వారి అమాయకత్వానికి కరిగిపోయి చివరి క్షణంలో మనసు మార్చుకుంటాడు. అమీర్ మానవీయత అలాగే భావోద్వేగాల చిక్కులాటలో మానవత్వం గెలుస్తుంది. దర్శకుడు మజీది ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటాడు.
తారా ఉన్న జైలులో తనతో ఉన్న మరొక మహిళా ఖైదీ ఏదో వ్యాధితో మరణిస్తుంది. ఆమె పసిపాప చోటూను తారానే చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జైలుశిక్షను అనుభవించే తల్లుల బిడ్డలు వారితోనే ఉరటారు. ఆ జైలులో ఎలుకలే వారికి తోడు. వెన్నెల రాత్రులనూ చూడలేనటువంటి, చీకటి గదులలో బాల్యాన్ని గడిపే చిన్నారుల పరిస్థితిని మజిది గమనించాడు.
అక్షి క్రమంగా కోలుకొంటాడు. కాని అతడికి మాట్లాడడానికి సాధ్యపడదు. అక్షికి ప్రత్యేకమైన చికిత్స చేపిస్తే మాటలాడవచ్చునన్న నమ్మకాన్ని వైద్యులు కలిగిస్తారు. అమీర్ మనసు గందరగోళపు గూడు అవుతుంది. కోపం, ఉద్రేకాలకు లోనై తన మనసుపై నియంత్రణను కోల్పోతాడు. పిచ్చివాడివలె ప్రవర్తిస్తాడు. తన ఇంటిలో సాకుతున్న కోళ్లు, పావురాలను ఎత్తి బయటికి పారవేస్తాడు. అతడి అరుపుల ద్వారా, అక్షి తల్లికి తన కుమారుడి దుర్వర్తన మరియు ఆస్పత్రికి చేరడానికి గల కారణం తెలిసిపోతుంది. అమీర్ మనఃస్థితిని అర్థం చేసుకొని ఇల్లు విడిచి ఆస్పత్రికి వస్తుంది. అమీర్ కూడ ఆస్పత్రికి వస్తాడు. అక్కడ అక్షి ఉన్న మంచం ఖాళీగా ఉంటుంది. అతడి శవం శవాగారంలో ఉంటుంది. అతడి చావుతో తన అక్క తారా జైలు నుండి విడుదలై బయటికి రావడానికి మార్గం మూసుకుపోతుంది.
అమీర్ అసహాయత, అక్షి తల్లి మరియు అతడి ముద్దు బిడ్డల అసహాయతల గురించి చెప్పడానికి ముంబై హోళీ పండగ వీధి దృశ్యాలను మజిది బాగా ఉపయోగించుకుంటాడు. అక్కడే వాయిద్యాల శబ్దం, రంగులను, రంగు నీళ్లను చల్లుకునేలారటి దృశ్యాలను ఉపయోగించుకొని చావును గురించి మరచి మురదరి బ్రతుకును గురించిన దారివైపు నడవాల్సిన అనివార్యతను సారకేతికంగా దర్శకుడు చూపుతాడు.
శవాగారం వెలుపల ఊరేగింపు చూస్తూ నిలబడ్డ అక్షి చిన్న కూతురు చేయిపట్టి అమీర్ మురదుకు నడిచే దృశ్యంతో చిత్రం ముగుస్తుంది. ఇరాన్ దేశపు చాలామంది చలనచిత్ర దర్శకులకు పిల్లల మనోవికాసం గురించి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ చిత్రంలోనూ మజిది అక్షి పిల్లల భవిష్యత్ కలలను గోడపై చిత్రాల రూపంలో చూపడం ద్వారా చిన్నపిల్లల నిష్కల్మష మనసులను విప్పి చూపుతాడు.
తాంత్రిక పటుత్వం: ముంబై పట్టణం అగాధతను సినిమా తెరపై నిజాయితీగా చూపడానికి సహాయపడినది అనిల్ మెహ్రా ఛాయాగ్రహణం. ఏ.ఆర్.రెహమాన్ నేపథ్యపు సంగీతం చిత్రానికి మెరుగునిచ్చినది. ఇక చిత్రంలోని పాత్రల గురించి చెప్పాలంటే అమీర్ పాత్రలో ఇశాన్ ఖట్టర్ (చిత్ర నటుడు శాహిద్ కపూర్ తమ్ముడు) ఒక ఉత్సాహపు బుగ్గ. మొదటి చిత్రంలోనే చూపరుల హృదయాలను చూరగొంటాడు. తారా పాత్రలో మాళవికా మోహన్, అక్షి పాత్రలో గౌతం ఘోష్, అక్షి తల్లి పాత్రలో కన్నడ నటి జి.వి.శారద గొప్ప అభినయర చూపారు. మొత్తంగా ఒక మంచి చిత్రాన్ని చూసిన అనుభవం ప్రేక్షకులకు కలుగుతుంది.