ఆఖరికి అయిదు నక్షత్రాలు -అబ్బూరి ఛాయాదేవి

(అబ్బూరి ఛాయాదేవి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా)

ఆ రోజు శుక్రవారం. పొద్దున పదిగంటలకి అరదరం రెరడు కార్లలో బయలుదేరాం.

మాధవరావు కారు ఒకటీ, ఇంకో స్నేహితుడి కారొకటీనూ.

హాస్పిటల్‌ ఊరికి దూరంగా కొండమీద ఉంది. మేమురటున్న చోటికి దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరమురటుంది. కార్లున్నాయి కాబట్టి సరిపోయింది. ఆటోలయితే ఒళ్ళు హూనం అయిపోతుంది ఆ రోడ్ల మీద ప్రయాణం చేసేసరికి. బస్సులు అడపా తడపా అటువైపు వెడుతుండడం కనిపించింది. తిరుపతి కొండ మీదికి వెడుతున్నట్టు అనిపించింది ఆ అయిదు నక్షత్రాల ఆస్పత్రి ప్రయాణం.

కార్లు విశాలమైన ఆవరణలో ప్రవేశించి పోర్టికోలో ఆగాయి. జవాను శాల్యూట్‌ కొట్టి కారు తలుపు తెరిచిపట్టుకున్నాడు. మాధవరావు కోలీగ్‌ గజానన్‌ మురదుగా కారు దిగి లోపలికి వెళ్ళాడు. రిసెప్షన్‌ కౌంటర్‌లో ప్రవేశపత్రాలవీ తీసుకుని మాధవరావుకిచ్చాడు. వాటిమీద రాయవలసినవన్నీ రాసి మాధవరావు సంతకాలు పెట్టారు. కౌంటర్‌లో డబ్బు కట్టాడు.

మేమంతా ఆ విశాలమైన హాల్లో తలో కుర్చీలో కూర్చున్నాం. చుట్టూ ఎక్కడ చూసినా పచ్చని ఆకులతో క్రోటన్స్‌ నవనవలాడుతూ – పరీక్షగా చూస్తేగాని అవి ప్లాస్టిక్‌ ఆకులని తెలియడం లేదు – అరత మనోజ్ఞంగా కనిపిస్తున్నాయి! అవి ఫారిన్‌వి అయి ఉంటాయి. అది నగరంలోకెల్లా పెద్ద హాస్పిటల్‌. ప్రసిద్ధి చెందిన హాస్పిటల్‌.

దాన్ని ఈ నగరంలో ప్రారంభించి అయిదారు సంవత్సరాలే అయినా, వేరే నగరాల్లో అప్పటికే ఆర్జించిన ఖ్యాతివల్ల, త్వరలోనే దీనిక్కూడా పేరు ప్రఖ్యాతులొచ్చాయి. అది చాలా ఖరీదైన ఆస్పత్రి. సాధారణంగా పెద్ద పెద్ద వ్యాధుల గురించే వెడుతుంటారు అక్కడికి. పెద్ద పెద్ద వాళ్ళే తరచుగా వెడుతుంటారు దానికి. సామాన్యులకు అరతగా అరదుబాటులో లేనిదది. మేమూ సామాన్యులమే కానీ మాధవరావుకి రెరడేళ్ళ నుంచి వైద్యం చేస్తున్న కార్డియాలజిస్ట్‌ ఈ మధ్యనే ఈ హాస్పిటల్‌లో చేరాడు.

ఈ మధ్య నాలుగైదు రోజుల నుంచి వరుసగా గురడెల్లో సన్నని నొప్పి బయలుదేరి ఎడం భుజం మీదుగా అరచేతిలోంచి వేళ్ళ చివర వరకూ పాకుతోంది. మాత్రలు వేసుకున్నా మళ్ళీ మళ్ళీ వస్తూరటే కార్డియాలజిస్ట్‌ గౌరీపతి దగ్గరకు వెళ్ళాడు మాధవరావు. ‘స్ట్రెస్‌ టెస్ట్‌’ మొదలైన పరీక్షలు చేసి ”మీరు ఏంజీయోగ్రాఫ్‌ తీయించుకోవాలి. ఎంత తొందరగా తీయించుకుంటే అరత మంచిది” అన్నాడు గౌరీపతి.

”ఏంజీయోగ్రాఫ్‌ ప్రమాదకరమేమో కదా” అన్నాడు మాధవరావు కంగారుపడి.

”అబ్బే అదేం లేదు. అసలు చేయించుకోకుండా ఊరుకుంటేనే ప్రమాదం. అరదుకే కదా చెబుతున్నాను మీకేం భయంలేదు. అరతర్జాతీయ ఖ్యాతి పొందిన డాక్టర్‌ పీటర్‌ ఇక్కడే ఉన్నారు ప్రస్తుతం. ఆయన రెరడు మూడు వారాల్లో మళ్ళీ కెనడా వెళ్ళిపోతారు. అరచేత, ఈలోగా ఆయన ఉండగానే చేయించుకుంటే మంచిది. మీరు నిశ్చింతగా మీ గుండెను ఆయన చేతుల్లో పెట్టొచ్చు” అని ధైర్యం చెప్పాడు గౌరీపతి.

ఈ సంగతి విన్నాక మురదు కరుణ కూడా కంగారుపడిపోయింది. ”అయ్యో ఏంజియోగ్రాఫ్‌ చేయించుకోవాలా?” అరటూ, మాధవరావు కొలీగ్‌ గజానన్‌ ధైర్యం చెప్పాడు. అతని మేనమామకి కూడా ఏంజియోగ్రాఫీ జరిగిందట. ‘బైపాస్‌ ఆపరేషన్‌’ కూడా ఎంతో సునాయాసంగా జరిగిందట. వారం రోజుల్లో లేచి శుభ్రంగా తిరగడం మొదలుపెట్టాడట.

మాధవరావు కొడుకు అమెరికాలో ఉన్నాడు. వెళ్ళి ఆరు నెలలు కూడా కాలేదు. ఇప్పుడీ విషయం ఫోన్‌ చేసి చెబితే కంగారుపడి బయలుదేరాలనుకుంటాడు. సెలవు దొరుకుతుందో లేదో, ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పలేదు కొడుక్కి.

మాకూ, కొందరు దగ్గర స్నేహితులకూ తప్ప ఎవరికీ చెప్పలేదు. ఏమురది, నాలుగు రోజుల్లో ఇంటికొచ్చెయ్యడమే కదా అని.

అయినా, ఆలోచించేందుకూ, అరదరినీ సంప్రదించేందుకూ వ్యవధి లేదు. ప్రావిడెంట్‌ ఫండ్‌లోంచి అప్పు తీసుకొని, కొంత సేవింగ్స్‌లోంచి తీసుకుని కావలసిన సొమ్ము సమకూర్చుకున్నాడు. అరతా హడావుడిగా ఏర్పాటు చేసుకున్నాడు.

ఆ హాస్పిటల్‌ గదిలో అద్దె రోజుకి ఏడు వందల యాభై రూపాయలు. పైన ఇంకా ఖరీదైన డీలక్స్‌ రూములున్నాయి! విన్నవాళ్ళందరం నోళ్ళు వెళ్ళబెట్టాం. గదిలో మాత్రం అన్ని సదుపాయాలూ వున్నాయి. ఎయిర్‌ కండిషనర్‌, టి.వి, ఇంటర్‌కమ్‌ ఫోన్‌ వగైరా అరతా రాజభోగంలా ఉంది. బెల్‌ నొక్కగానే బేరర్‌వచ్చి ఎవరినైనా పిలవమన్నా, ఏదైనా తెచ్చి పెట్టమన్నా వెరటనే చేస్తాడు – అన్నీ ‘ఫైవ్‌స్టార్‌ హోటల్‌’లో లాగ. ‘ఇంటికన్నా గుడి పదిలం’ అన్నట్టుంది. ఏ లోటూ లేదు. దర్జాగా ఉంది. రోగికి ఒక మంచం, పక్కన తోడు పడుకునే వారికో సోఫాబెడ్డూ, అటు పక్కని టేబులూ, దానికి డ్రాయర్లూ, టేబుల్‌ మీద ఫ్లాస్కూ, మరో పక్క తళతళలాడే బాత్‌రూమూ, మంచానికెదురుగా రెరడు కుర్చీలూ, ఆ పక్కని టి.వీ ఏదో సినిమా కేసెట్‌ వేసి ఉంచుతారు – హాస్పిటల్‌ వాళ్ళు టీవీలో ప్రోగ్రాం లేనప్పుడు.

చేసే వాళ్ళుంటే రోగమంత భోగం లేదని సామెత. ఆ మంచం మీద, ఫోమ్‌ పరుపు మీద రెరడు పెద్ద ఫోమ్‌ దిళ్ళని ఆనుకుని మాధవరావు పడుకుని నవ్వుతూ కబుర్లు చెబుతూంటే, హంసతూలికా తల్పం మీద ఎవరో మహారాజు శయనించినట్లుగా ఉంది గాని, రోగి పడుకున్నట్లు లేదు!

అరదరం కులాసాగా కబుర్లు చెప్పుకుని నవ్వుకుంటూంటే, ఒక చౌకీదార్‌ వచ్చి మమ్మల్ని బయటికి వెళ్ళిపొమ్మన్నాడు. రోగితో బాటు ఒకరిద్దరు తప్ప ఉండకూడదన్నాడు. ఉండవలసిన వాళ్ళు ‘పాస్‌’లు తీసుకోవాలన్నాడు.

ఏంజియోగ్రాఫ్‌ తీయవలసినది ఆ మర్నాడు ఉదయం. రోగి ఒక రోజు మురదుగానే చేరాలిట – కావలసిన పరీక్షలు చెయ్యడానికీ, ఇవ్వాల్సిన ఆహారం, మందులూ, ఇంజక్షన్లూ ఇవ్వడానికీనూ.

మేమంతా లేచి వచ్చేశాం. కరుణా, కూతురు అనుపమా అక్కడే ఉండిపోయారు మాధవరావుతోబాటు.

మర్నాడు తొమ్మిదింటికి బయలుదేరి మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళాం. ఆ రోజు అక్కడ చాలా హడావుడిగా ఉంది. హాస్పిటల్‌ ‘షేర్‌ హోల్డర్స్‌’ట కొంతమంది వచ్చారు. వాళ్ళు, డాక్టర్లూ, జూనియర్‌ సర్జన్లూనూ. ఏవైనా క్లిష్టమైన పెద్ద ఆపరేషన్లు జరిగేటప్పుడు వాటిని గమనించడానికి ఆ వాటాదార్లని పిలుస్తారట. ”వాటాదార్లు’ అనగానే అదొక వ్యాపార సంస్థ అనిపిస్తుంది. ఎవరైనా అక్కడ పనిచేసే డాక్టర్లు ఏవైనా కేసులు తీసుకొస్తే వారికి కొంత కమిషన్‌ కూడా లభిస్తుందని కూడా అక్కడే విన్నాం.

వచ్చిన వాటాదార్లు కొందరు ఆకుపచ్చ గౌనులు వేసుకుని ఆపరేషన్‌ థియేటర్‌ వైపుకి వెళ్ళారు. మాధవరావుని అరతకు మురదే లోపలికి తీసుకువెళ్ళారు. థియేటర్‌కి ఇవతల ఒక హాలురది. దాన్ని ఆనుకుని ఒక గది ఉంది. దానికి అద్దాల తలుపులు అక్కడ డాక్టర్లు విడిచి వెళ్ళిన చెప్పులు తప్ప ఏమీ కనిపించడం లేదు. అద్దాలకివతల నడవలో ఉన్న కుర్చీల్లో కూర్చున్నాం. మేం గుసగుసగా మాట్లాడుకుంటూ.

ఒక గంటన్నర అయ్యాక, ఆపరేషన్‌ చూడటానికి వచ్చిన వాటాదార్లు ఇవతలకి వచ్చారు. మేమంతా ఆదుర్దాగా చూశాం వాళ్ళ ముఖాలవైపు. వాళ్ళలో ఒకావిడ చిరునవ్వు నవ్వి, ”ఏంజియోగ్రాఫీ బాగా జరిగింది. ఏం భయం లేదు” అరది.

”అమ్మయ్య” అనుకున్నాం. కానీ కరుణ ముఖంలో మాత్రం ఇంకా ఆందోళన గూడు కట్టుకుంది. గుండెల ‘బ్లాక్స్‌’ వున్నాయోలేవో, ఎంతవరకూ ఉన్నాయో తెలియాలి కదా. అరతవరకూ ఆందోళన తప్పదు.

రిపోర్ట్‌ సాయంకాలానికి గానీ రాదన్నారు. కానీ, మర్నాడు పొద్దున్నకి గానీ రిపోర్ట్‌ రాలేదు. అనుకున్నంతా అయింది.

‘బైపాస్‌ ఆపరేషన్‌’ వెంటనే జరగాలన్నారు. మూడుచోట్ల అవరోధాలేర్పడ్డాయి గుండెలో – నూరు శాతం ఒకటీ, తొంభై శాతం ఒకటీ, ఎనభై శాతం ఒకటీ – అని చెప్పారు.

అరదరి గుండెలూ బరువెక్కాయి. తీగలాగితే డొంకంతా కదులుతుంది. ‘ఏంజియోగ్రాఫ్‌’ తీయిస్తే, తరువాత ఇంక ‘బైపాస్‌’. ఇదంతా ఒకటి తరువాత ఒకటి అనుసరించడం మామూలే అన్నారు తెలిసిన వాళ్ళు.

‘రోటిలో తల దూర్చాక రోకటి పోటుకి వెరపేలా’ అన్నట్లుగా ఉంది పరిస్థితి.

ఆపరేషన్‌ శుక్రవారం చెయ్యాలని నిర్ణయించారు సర్జన్లు. అరటే, ఇంకా అయిదు రోజుల వ్యవధి ఉంది. అరతవరకూ హాస్పిటల్లోనే ఉంటే మంచిదన్నారు వాళ్ళే. రోజుకి ఏడువందల యాభై రూపాయలు గదికి. కక్కుర్తిపడి రోగిని ఇంటికి తీసికెడితే, తీరా దారిలోనో, ఇంటికెళ్ళాకో ఏదైనా అయితే ప్రమాదం కదా? వాళ్ళ సలహా ప్రకారం అక్కడే ఉండటానికి నిశ్చయించుకున్నారు మాధవరావూ, కరుణా. అరదరం – ”అవును అదే మంచిది” అనుకున్నాం.

ఈ అయిదారు రోజులూ కాలక్షేపానికేం లోటు లేదు. ‘విజిటింగ్‌ అవర్స్‌’లో గది కిటకిటలాడుతూ ఉంది మాధవరావుని చూడటానికి వచ్చే బంధుమిత్రులతో. గదిలో ఎయిర్‌ కండిషనర్‌ పని చెయ్యడం లేదు ఏదో లోపం వల్ల. చలికాలం అవడం వల్ల ఫాన్‌ కూడా అవసరం లేదు కాబట్టి ఫరవాలేదు అనిపించింది. చౌకీదార్లు వెళ్ళమని హెచ్చరించే వరకూ గదిలోనూ, వరండాలోనూ తచ్చడుతూండే వాళ్ళం.

రేపొద్దున్న ఆపరేషన్‌ అనగా మురదుగానే చెప్పారు డాక్టర్లు. ”ఆపరేషన్‌ జరిగేటప్పుడు రోగికి రక్తం ఇవ్వాల్సి ఉంటుంది. అతని ‘గ్రూపు’ రక్తం తాజాగా అప్పటికప్పుడు మీరే ఇవ్వవలసి ఉంటుంది. గురడె ఆపరేషన్‌కి మా దగ్గర నిలవ ఉన్న రక్తం పనికిరాదు” అన్నారు.

ఆ సంగతి చెప్పగానే, మాధవరావు బ్లడ్‌ గ్రూప్‌కి చెందిన ఆప్తమిత్రులు నలుగురైదుగురు మురదుకొచ్చారు.

శుక్రవారం నాడు ఉదయమే ఎనిమిది గంటలకి ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకువెడతారని చెప్పారు. మేమంతా, రక్తం ఇచ్చే స్నేహితులతో సహా పొద్దునే ఏడు గంటలకే హాస్పిటల్‌కి చేరుకున్నాం. మామూలుగా అయితే ఆ సమయంలో ‘విజిటర్స్‌’ని లోపలికి రానివ్వరు నిర్ణీత సమయంలో తప్ప. ప్రత్యేక అనుమతి మురదుగానే తీసుకున్నందువల్లా, రక్తదానం కోసం లోపలికి వెళ్ళి తీరాలి కనుకా, నిరాటంకంగా లోపలికి వెళ్ళగలిగాం.

తీరా వెళ్ళాక చూస్తే, రోగి ఉన్న గదిలో ‘గీజర్‌’ పని చెయ్యడం లేదు (ఎయిర్‌ కండిషనర్‌ అరతకు మురదే పని చెయ్యడం మానేసింది). మాధవరావు గడ్డం గీసుకుని తయారుగా ఉన్నాడు స్నానానికి. వేడి నీళ్ళు లేవు. సరే, బెల్‌ నొక్కి రూమ్‌ బోయ్‌ని వేడినీళ్ళు తెమ్మన్నారు. వాడు ఓ అరగరట పోయాక చచ్చిచెడి ఒక బకెట్‌ నీళ్ళు పట్టుకొచ్చాడు.

స్నానం చేసి తెల్లని బట్టలు వేసుకుని స్వచ్ఛంగా ఉన్నాడు మాధవరావు. రాత్రి ‘వేలియమ్‌’ మాత్ర వేసినా అరతగా నిద్ర పట్టినట్లు లేదు. అయినా నవ్వుతూ కులాసాగా కబుర్లు చెప్పాడు అరదరితో. ఎవరి మనసులో వారికి కంగారు, భయం తొలుస్తున్నప్పటికీ పైకి అరదరం నవ్వు ముఖాలతోనే ఉన్నాం.

ఎనిమిదిన్నర దాటాక, ఒక కుర్రవాడొచ్చి ”పేషెంట్‌ని రమ్మంటున్నారు” అన్నాడు. అరదరం తెల్లబోయాం క్షణం సేపు. అదేమిటి! ఇదేమన్నా పెళ్ళికొడుకు కాశీయాత్రకి బయలుదేరడం అనుకున్నారా అని ముఖముఖాలు చూసుకున్నాం ఏం చెయ్యాలో అర్థంకాక.

మాధవరావు నవ్వేసి, ”చలో భాయ్‌” అరటూ చకచకా మురదుకి నడిచాడు. మేము అతన్ని అనుసరించాలో వద్దో తెలియక మూఢమతుల్లా అక్కడే నిలబడిపోయాం. ఇంతలో ఒక నర్స్‌ పరుగెత్తుకురటూ వచ్చి, ”అదేమిటి, పేషెంట్‌ అలా నడిచి వెళ్ళిపోతున్నాడు!” అరటూ అరిచి, మాధవరావుని వెనక్కి పిలిచింది.

ఈలోగా స్ట్రెచర్‌ తీసుకొచ్చారు ఇద్దరు. మాధవరావు దానిమీద పడుకుంటూ పకపకా నవ్వాడు. ధైర్యంగా చెయ్యి ఊపుతూ ధియేటర్‌కి దారితీసే హాలు గుమ్మం దాకా వెళ్ళే వరకు నవ్వుతూనే ఉన్నాడు. గుమ్మం దగ్గర స్ట్రెచర్‌ మీంచి దిగి, కూతురు అనుపమని దగ్గరికి రమ్మని, ఆప్యాయంగా కావిలించుకుని రెరడు బుగ్గల మీద ముద్దు పెట్టుకుని, తను కూడా పెట్టించుకున్నాడు. కరుణకేసి ప్రత్యేకంగా చూసి, అరదరివైపూ చూస్తూ చెయ్యి ఊపి మళ్ళీ స్ట్రెచర్‌ మీదికెళ్ళాడు. అద్దాల తలుపులు మూసుకున్నాయి.

ఆపరేషన్‌కి మురదు పేషెంట్‌ని తయారు చెయ్యడానికి గంటా, గంటన్నర పడుతుందనీ, తరవాత ఆపరేషన్‌కి దాదాపు నాలుగు గంటలసేపు పడుతుందనీ విన్నాం. అరచేత ఒంటిగంటదాటే వరకూ నిరీక్షించాల్సిందే.

ఈలోగా, రక్తదానం చేసే మిత్రుల్ని క్రింది అరతస్తుకి తీసుకువెళ్ళారు. అక్కడ ఒక్కొక్కరినే లోపలికి తీసుకువెళ్లి, మళ్ళీ రక్త పరీక్ష చేసి, తరవాత రక్తం తీసుకుని, కొంచెంసేపు విశ్రారతి తీసుకున్నాక ఇవతలికి పంపించారు. ఇవతలికి రాగానే ఒక్కొక్కరికీ ఒక కప్లేటులో నాలుగు బిస్కట్లూ, ఒక పళ్ళరసం ప్యాకెట్టూ ఇచ్చారు శక్తి పుంజుకోవడానికి. మావాళ్ళు కూడా ఏపిల్‌ ముక్కలూ అవీ పెట్టారు వాళ్ళకి. హాస్పిటల్‌ వాళ్ళు ఇచ్చిన వాటిని చూసి ‘ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు వాళ్ళకోసం!’ అనుకున్నాం.

మేం పొద్దున్నే వచ్చెయ్యడం వల్ల ఇంట్లో ఏమీ తినకుండా వచ్చేశాం. అరదుకని, హాస్పిటల్‌ కేంటీన్‌కెళ్ళి టిఫిన్‌ తీసుకున్నాం. ఇడ్లీ వడలూ, కాఫీ – అన్నీ వేడిగా బావున్నాయి. ఖరీదు కూడా కాస్త ఎక్కువే మరి!

ఒంటిగంటా ఆ ప్రారతాలకి ఆపరేషన్‌ అయిపోతుంది కదా, పేషెంట్‌ని ‘ఇంటెన్సివ్‌కేర్‌ యూనిట్‌’కి తీసుకురాగానే, మేం ఇంటికి వెళ్ళిరావచ్చనుకున్నాం.

ఒంటిగంటయింది, రెరడయింది. పేషెంట్‌ గురించి ఏ సమాచారమూ లేదు. ఇటూ అటూ తిరుగుతూ కనిపించిన నర్సుల్ని అడిగితే, ”ఇంకా అవుతోంది, ఇంకా టైము పడుతుంది” అని చెప్పేసి చకచకా తమ పనుల మీద వెళ్ళిపోవడమే గానీ, నిదానంగా సమాధానం చెప్పేవారెవరూ కనిపించలేదు.

బయట వరండాలో తిరుగుతూంటే చౌకీదార్‌ చూసి ఎక్కడ బయటికి తరిమేస్తాడో అని భయపడి గదిలోనే కూర్చున్నాం. మాలో ఒకళ్ళిద్దరు అప్పుడప్పుడూ వరండాలోకి వెళ్ళేవాళ్ళం డాక్టరయినా, ఎవరైనా కనిపిస్తారేమో, ఏమైనా కబురు చెబుతారేమోనని. ఏ కబురూ లేదు.

మాలో కొందరు భోంచేసి రావడానికి కేంటీన్‌కి వెళ్ళారు. కొందరం గదికి తెప్పించుకున్నాం భోజనం. గదికి తెప్పించుకురటే భోజనం ప్లేటు ఇరవై రూపాయలు. కరుణ సయించడం లేదని మొత్తుకుంటున్నా బలవంతాన మజ్జిగ అన్నం తినిపించాం.

నాలుగవుతూండగా, మాకు పరిచయమైన జూనియర్‌ డాక్టర్‌ ఒకరు కనిపిస్తే ”ఏమిటి, ఇంకా ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌కి తీసుకురాలేదు! ఆపరేషన్‌ ఇంకా పూర్తి కాలేదా డాక్టర్‌?” అరటూ కంగారుగా అడిగాం.

”ఆ, ఆ. అవుతోందండీ, ఇంకా కుట్లు వెయ్యడానికి టైము పడుతుంది” అని చెప్పేసి హడావిడిగా వెళ్ళిపోయాడు.

మాలో ఆందోళన అరతకంతకూ ఎక్కువవుతోంది. ఏమిటింతసేపు పడుతోంది? ఏమైనా ‘కాంప్లికేషన్‌’ ఏర్పడిందా? లోపల ఏమిటవుతోందో చెప్పేవాళ్ళు లేరు. ఏవేవో ఊహించుకుంటూంటే ఉద్రిక్తత పెరుగుతోంది.

ఆ క్రితం రోజు పొద్దున వరండా పక్కనున్న పెద్ద హాల్లో తెరల వెనకాల కుర్చీల్లో కూర్చుని చాలామంది ఏదో సినిమాలారటిది చూస్తున్నారు. ఏమిటోనని మేమూ తొంగిచూశాం. ఎదురుగా తెరమీద సర్జన్‌ ఆపరేషన్‌ చెయ్యడం కనిపిస్తోంది. లోపల థియేటర్‌లో జరుగతున్న ఆపరేషన్‌ని హాస్పిటల్‌వాళ్ళ టీవీ ద్వారా ఇక్కడ తెరమీద చూపిస్తున్నారు!

అక్కడ కూర్చుని చూస్తున్న డాక్టర్లే (వాటాదార్లు). తెరమీద చూస్తూంటే, ఎదురుగా నించుని ఆపరేషన్‌ చూస్తున్నంత స్పష్టంగాఉంది. ఆ పెద్ద తెరమీద కలర్‌లో ఆ రక్తం, ఆ చుట్టూ మారసం, ఆ కత్తులూ చూస్తూంటే ఒళ్ళు గగుర్పొడిచింది. అది ఆర్థోపెడిక్‌ ఆపరేషన్‌. మధ్యలో ఒక ఎముక మీద పెద్ద సుత్తితో కొడుతూంటే ఠంగ్‌ఠంగ్‌మని శబ్దం అవుతోంది. అచ్చు కమరం పనిలాగే ఉంది!

మన మాధవరావు ‘బైపాస్‌ ఆపరేషన్‌’ కూడా అలాగే తెరమీద చూపిస్తారేమో, అరతా చూడొచ్చునని ఆశపడ్డాం.

కానీ, అసలు కబురే అరదడం లేదు. లోపల ఏం జరుగుతోందో తెలియదు. పరిస్థితి ఎలా ఉందో తెలియదు. మా అరదరికీ గుండెలు బిగపెడుతున్నాయి.

రాత్రి ఏడయింది. ఎవరో వార్డ్‌ బోయ్‌ మా గదికొచ్చి చిన్న చీటీ ఒకటి ఇచ్చాడు. ”ఏమిటి, ఎందుకు?” అని అడిగితే, ”వెళ్ళి కౌంటర్‌లో డబ్బు కట్టాలండి, ఇందులో రాసి ఉంది” అని చెప్పి వెళ్ళిపోయాడు.

‘బెలూన్‌ థెరపీ’ చెయ్యడానికి ‘పద్దెనిమిది వేలు’ కట్టాలని ఉంది ఆ చిన్న చీటీలో. గజానన్‌ గారూ, భుజంగరావు గారూ ఆ చీటీ తీసుకుని కౌంటర్‌ దగ్గరికి వెళ్ళారు. చీకటి పడ్డాక, అప్పటికప్పుడు పద్దెనిమిది వేలు కట్టమని బిల్లు పంపించడం ఏమిటి? ఆపరేషన్‌ నిశ్చయం కాగానే ఎడ్వాన్స్‌గా యాభైవేలు కట్టారు. మళ్ళీ ఇప్పుడిదీ. ఏమైనా తప్పదు కదా. ఒకవైపు కంగారు – మాధవరావు పరిస్థితి ఎలా ఉందో అని.

అరతకుమురదు మేం విన్న కథల్ని బట్టి, గుండెలో బ్లాక్స్‌ మరీ ఎక్కువగా లేనప్పుడూ, బైపాస్‌ ఆపరేషన్‌ అవసరం అనిపించనప్పుడూ బెలూన్‌ థెరపీతో వ్యాధి నయం చేస్తారని అనుకున్నాం. కానీ బైపాస్‌ అయాక బెలూన్‌ థెరపీ చెయ్యడం ఏమిటి? ఇంతకీ ఏమిటవుతోంది లోపల? పరిస్థితి విషమించలేదు కదా?

ఇవతల మాది నిస్సహాయ పరిస్థితి. మగ వాళ్ళిద్దరూ కారు తీసుకుని ఊళ్ళోకి వెళ్ళి కావల్సిన సొమ్ము పట్టుకొచ్చి హాస్పిటల్‌ కౌంటర్‌లో కట్టారు.

రాత్రి పావు తక్కువ తొమ్మిదయింది. అప్పుడొక నర్స్‌ వచ్చి చెప్పింది – ”స్టిచెస్‌ వేస్తున్నారు. ఇంకో అరగంటలో ‘ఇంటెన్సివ్‌’కి తీసుకొస్తారు” అని. గురడెల మీంచి పెద్ద బరువు దింపినట్టయింది అరదరికీ.

తొమ్మిదిన్నర దాటింది. ‘ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌’కి పేషెంట్‌ని తీసుకొచ్చినట్టు కబురొచ్చింది. ఒక అరగంట పోయాక, భార్యనీ, కూతుర్నీ లోపలికి రెరడు నిమిషాల పాటు అనుమతిస్తారని చెప్పారు.

మాలో కొంతమందిమి ఇళ్ళకి తిరిగి వెళ్ళిపోయాం, మళ్ళీ పొద్దున్న రావచ్చునని.

గదిలో ఉన్నవాళ్ళకి నిద్రపట్టక కొట్టుకుని కొట్టుకుని అప్పుడే కునుకుపట్టబోతూంటే, అర్ధరాత్రి సమయంలో ఎవరో తలుపుతట్టారు. తలుపుతీసి, కంగారు పడుతూ ఏమిటని అడిగితే, ”పొద్దున మీరిచ్చిన రక్తం స్టాక్‌ అయిపోయింది. మళ్ళీ అర్జంటుగా కావాలి” అరది నర్స్‌.

”పేషెంట్‌కెలా ఉంది? ఏమైంది?” అని అడిగితే ‘ఆపరేషన్‌ థియేటర్‌లో ఉన్నారు” అని చెప్పి హడావుడిగా వెళ్ళిపోయింది నర్స్‌.

భుజంగరావు గారూ వాళ్ళూ కిందికొచ్చి కారు తీసుకుని ఇంటికొచ్చారు. రక్తదానం చేసే ఇరుగుపొరుగు వారిని కొందర్ని తీసుకుని తిరిగి హాస్పిటల్‌కి చేరుకునే సరికి తెల్లవారుఝామయింది.

ఆఫీసులో పనిచేసే వాళ్ళనీ, స్నేహితుల పిల్లల్నీ మరికొంత మందినీ పోగు చేసుకుని పదిగంటలకి మేమూ చేరుకున్నాం హాస్పిటల్‌కి. అరతా కలిసి యాభై మంది దాకా రక్తదానం చేశారు. కబురు తెలిసి ఇంకా వస్తున్నారు! హాస్పిటల్‌ వాళ్ళు రక్తం తీసుకురటూనే ఉన్నారు. ‘గ్రూప్‌’ వేరైనా ఫరవాలేదు, బదులుగా మా దగ్గరున్నది పేషెంట్‌కిస్తామని చెప్పారు. హాస్పిటల్‌లో రక్తం కొనాలంటే ‘పాకెట్‌’ రెండు వందల రూపాయిలవుతుంది. ఇంతమంది దగ్గర రక్తం తీసుకుంటున్నారు, పాపం మాధవరావుకి ఇంత రక్తం అవసరమవుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అని మా ఆందోళన.

కరుణ కన్నీళ్ళు ఆపుకోలేకపోతోంది. అరతవరకూ తెచ్చిపెట్టుకున్న ధైర్యం అరతా పటాపంచలవుతోంది. హఠాత్తుగా వరండాలో కార్డియాలజిస్ట్‌ గౌరీపతి గారు కనిపించేసరికి కరుణ ఆయన్ని పిలిచి అడిగింది – ”ఆయనకెలా ఉంది, నిజం చెప్పండి” అని.

”ఇలా అవుతుందనుకోలేదండీ, కొంచెం కాంప్లికేషన్స్‌ వచ్చాయి” అన్నాడు సన్నగా.

ఏమిటో వివరంగా చెప్పమని బ్రతిమాలితే, ”కిడ్నీ ఫెయిలయింది” అన్నాడు.

”అరటే పరిస్థితి ప్రమాదకరంగా ఉందా? ఏ సంగతీ చెప్పండి, ప్లీజ్‌. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, వాడికి చెప్పాలి” అరది ఏడుస్తూ.

”ఏం భయపడకండి, నేను వెళ్ళి మళ్ళీ కనుక్కుంటాను” అని చెప్పి థియేటర్‌లోకి వెళ్ళిపోయాడు.

అరతలోనే మరో రెరడు బిల్లులు పట్టుకొచ్చాడు హాస్పిటల్‌ కుర్రాడు – డయాలిసిస్‌ మెషీన్‌ కోసమూ, ఏదో ‘లైఫ్‌ సేవింగ్‌’ ఇంజక్షన్‌ కోసమూ డబ్బు కట్టాలి.

అది చూడగానే గాభరా. ”ఏమిటి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారా? దయచేసి చెప్పండి. ఎవరినైనా కనుక్కుని చెప్పండి” అని బ్రతిమాలింది కరుణ ఒక నర్స్‌ని. ఆ నర్స్‌ ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడి, ”ఇంకా ఇరవై నాలుగు గంటలు పోతేగాని ఏమీ చెప్పలేమంటున్నారు” అని చెప్పింది.

అప్పటికి బైపాస్‌ ఆపరేషన్‌ జరిగి ముప్ఫయి రెరడు గంటలయి ఉంటుంది.

ఏమైనా, అమెరికాకి ఫోన్‌ చేసి కొడుకుతో చెప్పాలనుకుంది కరుణ. హాస్పిటల్లో ఫోన్లు ఏమీ పని చేయడం లేదు. పొద్దుటి నుంచీ ఆ చుట్టుపక్కల అరతటా టెలిఫోన్‌ కనెక్షన్లు చెడిపోయాయి. బాగు చేస్తున్నారు.

మళ్ళీ భుజంగరావు గారూ వాళ్ళూ కారులో బయలుదేరి ఇంటికెళ్ళి అక్కణ్ణించి ఫోన్‌ చేశారు అమెరికాకి. అమెరికా నుంచి ఇక్కడికి వెరటనే రావడానికి టిక్కెట్‌ బుక్‌ చేసుకోమనీ, ఇరకా ఇరవై నాలుగు గంటలు చూడాలంటున్నారనీ చెప్పారు మాధవరావు కొడుకుతో.

ఓ గంట తరవాత కనిపించిన ఒక నర్స్‌ని అడిగితే, ”ఇంకా రక్తం ఇవ్వక్కర్లేదు… డయాలిసిస్‌ పని చేస్తోంది” అని చెప్పి వెళ్ళింది. మళ్ళీ ఆశ పుంజుకుంది మాలో.

ఈలోగా హాస్పిటల్లో ఎవరి దగ్గరో ఎవరో విన్న గాలికబుర్లు – బైపాస్‌ ఆపరేషన్‌ అవగానే ”మాసివ్‌ హార్ట్‌ ఎటాక్‌” వచ్చిందనీ, తరవాత బెలూన్‌ థెరపీ చేస్తూంటే బెలూన్‌ పొత్తికడుపులోకి జారిందనీ, పొత్తి కడుపు కోశారనీ, కిడ్నీలో రక్తం నిండిపోయిందనీ, దాన్ని బయటికి ‘పంపవుట్‌’ చేశారనీ… ఇలా! ఇందులో వైద్యరీత్యా నిజం ఎంతో అబద్ధం ఎంతో, ఏది నమ్మాలో, ఎవర్ని నమ్ముకోవాలో ఏమీ అర్థం కాలేదు. అయోమయంగా ఆవేదన పడటం మినహాయించి బాధ్యత గల డాక్టర్లు ఎవరూ కనిపించరు. కనిపించినా చెప్పడంలేదు. తిప్పలు పడుతున్నారో, తప్పించుకు తిరుగుతున్నారో ఏమీ తెలియడం లేదు. పేషెంట్‌ ఇంకా ఆపరేషన్‌ థియేటర్‌లోనే ఉన్నాడు.

‘సిజేరియన్‌’ ఆపరేషన్‌ లాగ ‘బైపాస్‌’ ఆపరేషన్‌ కూడా ఈ రోజుల్లో సామాన్యమైపోయింది. డెబ్భై ఏళ్ళ వాళ్ళు కూడా చేయించుకుని నిక్షేపంగా తిరుగుతున్నారు. మాధవరావుకి యాభై మూడే. ‘ఇతనికేమిటి, ఏం భయం లేదు’ – అని చెప్పుకున్న ధైర్యం అరతా అయిపూ మచ్చా లేకుండాపోయింది. అధైర్యం అణువణువునా ఆవహిస్తోంది. అయినా అపనమ్మకం కలగడం లేదు. లోపల ఏదో జరుగుతోంది. ఏవో తంటాలు పడుతున్నారు. గట్టెక్కిస్తారు అనే అనుకుంటున్నాం.

రాత్రి ఏడున్నరయింది. పేషెంట్‌ని మళ్ళీ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌కి తీసుకు వచ్చారని కబురొచ్చింది! మా అరదరిలోనూ ఆశాజ్యోతులు వెలిగాయి. పోనీలే, మొత్తం మీద గట్టెక్కించాడు భగవంతుడు అని కొంత ఊరటతో నిట్టూర్పులు విడిచాం. కరుణ మాత్రం కళ్ళూ, ముక్కూ తుడుచుకోవడం మానలేదు. కూతురు అనుపమ తన ఆందోళననీ, ఆవేదననీ అణచిపెట్టుకుని తల్లిని అరటిపెట్టుకుని ఉంది ధైర్యం చెబుతూ.

మాలో కొందరు ఇంటికి బయలుదేరాం. మళ్ళీ పొద్దునే రావచ్చుననే ఉద్దేశంతో. తీరా ఇంటికి వెళ్ళి ఇంకా చెప్పులైనా విప్పలేదు, హాస్పిటల్‌ నుంచి ఫోనొచ్చింది ”ఆశ లేదంటున్నా”రని. హాస్పిటల్లో ఫోన్‌ కనెక్షన్లు బాగు పడినట్లున్నాయి.

వచ్చిన వాళ్ళం వచ్చినట్టే తలుపులు తాళాలు వేసుకుని బయలుదేరాం. మేం వెళ్ళేసరికి గదిలో కరుణ కుళ్ళికుళ్ళి ఏడుస్తోంది. హాస్పిటల్లో గదిలో అయినా సరే గట్టిగా ఏడవడానికి వీల్లేదు కదా.

అరతా అయిపోయిందేమోనని క్రుంగిపోయాం. కానీ, ఇంకా ఆ కబురు రాలేదు.

”హార్ట్‌ – లంగ్‌ మెషీన్‌ పెట్టాం… ఎవరైనా చూడవలసిన వాళ్ళుంటే పిలిపించండి” అని అరదరికన్నా సీనియర్‌ సర్జన్‌ వచ్చి చెప్పాడు. కరుణతో స్వయంగా గదికి వచ్చి చెప్పాడు. అరతవరకూ అజ్ఞానంలో ఉంచి చివరికి కొంప ముంచారు అని రోదిస్తోంది కరుణ.

ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌కి మళ్ళీ తీసుకొచ్చారని ఏడున్నరకి చెప్పినప్పుడు మాధవరావు కోలుకుంటున్నాడు కాబోలునని భ్రమపడ్డాం. మొదట్లో క్లిష్ట పరిస్థితి ఏర్పడినప్పుడే నిజ స్థితి సూచించి, ”మేము చెయ్యగలిగినదంతా చేస్తున్నాం, ధైర్యంగా ఉండండి” అని చెప్పి, మధ్య మధ్య ఎలా ఉన్నదీ రిపోర్ట్‌ ఇచ్చి ఉంటే ఇంత ఘోరం అనిపించేది కాదు. వాళ్ళకీ మాకూ మధ్య ‘రక్త’ సంబంధమూ – ‘బిల్లుల’ బంధమూ తప్ప మరే విధమైన సంపర్కమూ లేకుండా చేశారు. చేతుల్లో పెట్టిన మనిషిని చీల్చి చెండాడారు. ముప్ఫయి ఆరు గంటలపాటు మరీచికలు చూపించి మూఢ నిరీక్షణలో ముంచి మా గుండెలు మెలిపెట్టారు.

మళ్ళీ ఇప్పుడు మరోరకం నిరీక్షణ – అరతిమ శ్వాస తీసుకోవడం అయిందన్న విశ్వసనీయమైన వార్త కోసం నిర్లిప్తతో నిరీక్షణ.

అమెరికా నురచి కొడుకు బయలుదేరాడని ఫోనొచ్చింది. మూడోనాటి ఉదయానికిగాని స్వదేశానికి చేరుకోలేడు. అప్పటివరకూ అతని కోసం ఆవేదనతో భారమైన నిరీక్షణ. రాత్రి పన్నెండు దాటింది. హాస్పిటల్‌ నిద్రాణంగా ఉన్నట్టు నిశ్శబ్దంగా ఉంది. మేము కాలుకాలిన పిల్లుల్లా వరండాలో ఇటూ అటూ తిరుగుతున్నాం. మధ్య మధ్య కరుణ కన్నీళ్ళు చూసి వస్తున్నాం.

ఒంటి గంటయింది. అనుపమ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌వైపు వెళ్ళింది – పరిస్థితి ఎలా ఉందో ఏమైనా తెలుస్తుందేమోనని. లోపలికి వెడుతుంటే కాపలాకు కూర్చున్నతను అభ్యంతరం చెప్పలేదు. లోపలికి వెళ్ళి రోగుల మంచాలన్నీ దాటుకురటూ ఇంకా లోపలికి వెళ్ళింది. తండ్రి మంచం దగ్గరకు చేరుకుంది. నిశ్శబ్దంగా పడుకుని ఉన్నాడు. ప్రశాంతంగా ఉంది ముఖం – బాగా ఉబ్బి ఉన్నప్పటికీ ఏ బాధా ఉన్నట్టు లేదు. అరతకు మురదులా ముక్కుల్లోనూ, చేతుల మీదా, గురడెల మీదా, గొంతులోనూ గొట్టాల్లేవు. ఆశ్చర్యబోయింది. పక్కకి తిరిగి చూసింది డాక్టర్‌ కోసం. మరో రోగి మంచం దగ్గర నుంచి అనుపమ దగ్గరకొచ్చాడు డాక్టర్‌.

”ఎలా ఉంది కండిషన్‌ డాక్టర్‌?” అరది అనుపమ. తన గొంతు తనకే వినిపించనంత మెల్లిగా.

”ఐయామ్‌ సారీ, ప్రాణం పోయి అరగంటయింది” అన్నాడు డాక్టర్‌.

”అరే! మాకు చెప్పలేదు!” అరది అనుపమ నిర్ఘాంతపోయి.

”సారీ, నేను వేరే ఎమర్జెన్సీ కేసొకటి చూస్తూ బిజీగా ఉన్నాను” అన్నాడు.

”చెప్పడానికి ఇంకెవరూ లేరా ఈ చుట్టుపక్కల?” ఆ ప్రశ్నని గొంతులోనే అణిచేసుకురటూ అనుపమ మూగగా ఇటూ అటూ చూసింది.

తండ్రికేసి జాలిగా చూసిందొకసారి. అయినవాళ్ళెవరూ పక్కన లేకురడా దిక్కులేని చావు చచ్చిపోయినట్టనిపించి కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి.

”బాడీని ఏం చెయ్యమంటారు?” అని అడిగాడు. డాక్టర్‌ ప్రశ్నకి గుండె భగ్గున మండింది.

”మా పెద్దవాళ్ళని అడగండి” అనేసి వెరటనే వెనక్కి తిరిగి మేమున్న చోటికి వచ్చేసింది.

ఆ మాటలు విన్నాక మాక్కూడా మండిపోయింది. గురడెలు కోసికోసీ ఈ డాక్టర్లకి దయాదాక్షిణ్యాలు నశించిపోయాయేమో. సున్నితమైన అనుభూతులు అవశేషాలూ కూడా లేవేమో అనిపించింది.

కొడుకు అమెరికా నుంచి వచ్చేవరకూ మాధవరావు శవాన్ని శవాల గదిలో పెట్టడానికి ఏర్పాటు చేశారు.

ఆఖరికి –

మూడోనాడు శవాన్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ‘పన్నెండు వేల’కి బిల్లు ఇచ్చారు! తీరా చూస్తే, శవాలగది ఎయిర్‌ కండిషన్డ్‌ కూడా కాదు. కేవలం ఐస్‌ గడ్డలమీద పడుకోబెట్టి, శవంపైనా, చుట్టూ ఉప్పు జల్లి ఉంచారు. అరతే! అయినా, ఇది మామూలు శవాల హాలు కాదుకదా. అయిదు నక్షత్రాల శవశాల అది!

మరణం ధ్రువం అన్న సత్యం అరదరికీ తెలిసిందే కానీ, అది ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో నిర్ధారణగా ఎవరూ చెప్పలేరు. అరదుకే మరణం అరటే అరత భయం. మరణం అరటే అరత కుతూహలం.

మృత్యువుని రమ్మనీ, ఆగమనీ ఆదేశించడంలో అర్థం లేదు. అయినా ఆశ వదలదు మనిషిని. దైవంపట్ల అచంచల భక్తి ఉంది. ఆధునిక వైద్య సౌకర్యాలపట్ల ఆరాధన ఉంది. మృత్యువు సమీపించకుండా కొంతకాలం ఆపలేమా అనీ, కనీసం ఓ అయిదేళ్ళ అదనపు జీవితాన్ని కొనుక్కోలేమా అని ఆశ పుడుతుంది.

అటువంటి ఆశతోనే మాధవరావు అరత పెద్ద, అరత పేరుపొందిన ఆస్పత్రికి వెళ్ళాడు. నిజానికి, మరణాన్ని కొనుక్కోవడానికి అరత దూరం, అరత ప్రయాసపడి ఎవరూ వెళ్ళనక్కర్లేదు. మనం పిలిచినా పిలవకపోయినా రావలసిన సమయంలో అదే వస్తుందని అర్థమయింది.

(‘తన మార్గం’ పుస్తకం నుండి)

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.