లింగం, లైంగికత- సాహిత్యం, సంభాషణ – పూర్ణిమ తమ్మిరెడ్డి

(భూమిక సంస్థ వారు రెండు రోజుల పాటు లింగం-లైంగికత : సాహిత్యం, సంభాషణ అనే వర్క్‌షాప్‌ని నిర్వహించారు, జులై 10-11న. పాతికమందికి పైగా LGBTQLA+ కమ్యూనిటీ వారు, పది, పదిహేను మంది ఇతరులు (for once) ఇందులో పాల్గొన్నారు. పి.సత్యవతి, వసుధేంద్ర, వి.ప్రతిమ లాంటి దిగ్గజాలు తమ అనుభవాలను పంచుకున్నారు. లైంగికత మీద, సాహిత్యం గురించి దాదాపుగా సమానంగా చర్చ జరిగింది. అందులో నాకు పాల్గొనే అవకాశాన్ని ఇచ్చిన అపర్ణ తోటకి అనేకానేక ధన్యవాదాలు. ఆ కార్యశాలలో పాల్గొన్నప్పుడు ఆ తర్వాతా నాకు కలిగిన ఆలోచనలను ఇక్కడ దాచుకుంటున్నాను.)

నేను.LGBTQLA+ నేపథ్యంగా కథ ఎప్పుడూ ప్రయత్నించలేదు. ప్రయత్నించాలని అనుకున్న సందర్భాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా బెంగుళూరులోని ఈ కమ్యూనిటీ వారు నిర్వహించే కార్యక్రమాలు, వారిని ఆధారంగా చేసుకొని వచ్చిన నాటక ప్రదర్శనలు, వారిని అర్థం చేసుకోవడానికి నాకు దోహదపడ్డాయి. కాకపోతే ఈ సబ్జెక్టుని తీసుకొని కథ రాయాలంటే చాలా ”మానసిక పెట్టుబడి” (మెంటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌) అవసరం. ప్రస్తుతం నా సొంత మానసిక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు ఇలాంటి కథాంశం ఎన్నుకుని దానికి న్యాయం చేయగలనని నాకు అనిపించలేదు. ”ఆరెక్స్‌ మారేజ్‌”లో ఆ అమ్మాయి చుట్టూ జరుగుతున్న ప్రైడ్‌ పెరేడ్స్‌ గుర్తు చేసుకుంటూ తన సెక్సువాలిటీని వెతుక్కుందని రాశానని ఈ వర్క్‌షాప్‌ తర్వాతే స్ఫురించింది. (అది రాసేటప్పుడు పనిగట్టుకొని దాని ప్రస్తావనను తీసుకురాలేదు.She’s desperately looking around for some inspiration and finds it in these movements. అదేదో గొప్ప విషయం అని కాదు, నాకు బల్బు ఇప్పుడే వెలిగింది అని అంటున్నా.)

భాష-సంస్కృతి-చరిత్ర

భాష గురించి బాగానే చర్చ జరిగింది. మనకు పదసంపద లేదని, నబవవతీ భావవ్యక్తీకరణకు అది సరిపోదని అందరూ అనుకున్నారు. అయితే తెలుగులో వచ్చిన చిక్కేంటంటే పదాలు అసలు ఎప్పుడూ లేవా, ఉన్నవి పోగొట్టుకున్నామా? అన్నది తెల్సుకోవడం చాలా కష్టం. ఉన్నా లేకపోయినా, కొత్తవి కనిపెట్టుకోవాలి. కొత్త పదాలు పుట్టాలి. ఒకరు homo, cis etc లాంటి ఇంగ్లీషు పదాల etomological గా చూస్తే కెమిస్ట్రీ నుండి వచ్చాయన్నారు. అలా తెలుగులో కూడా ఏవైనా సృష్టించాలి.

అయితే ఈ చర్చ వల్ల నాకు కలిగిన ఒక ఆలోచన, ఈ కమ్యూనిటీని mainsteam లో తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా వీళ్ళ ప్రస్తుత కథలు, గాథలు మాత్రమే కాకుండా వీళ్ళ చరిత్రనూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. చరిత్రంతా మగమహారాజుల గొడవే oకాబట్టిmyగా చేయవచ్చు:

1. పురాణ కావ్యాలు, గ్రంథాలు, రచనలలో వీరి ప్రస్తావన ఎలా ఉంది, ఏమని రాశారు? (ఇది తప్పకుండా నిరాశపరుస్తుంది. stigma వివక్ష అప్పుడూ ఉండుంటాయి. ఆడవాళ్ళ గురించి ఏవేవో పేలారు. ”ఇలా రాయాలి/చూడాలి” అనే తోవకి చెందకపోయినా, ”ఇలా రాయకూడదు/చూడకూడదు” అని చెప్పడానికి ఇవి పనికి రావచ్చు.)

2. Oral history & folk history లో ఎలా ప్రస్తావించారు? ఏమని రాశా ఊహ. బ్రిటిష్‌ వారు రానంత వరకూ అయినా వీరికి కొంత ఆదరణ, గౌరవం ఉన్నాయని నాకు అనిపిస్తుంది. వసుధేంద్రగారి కొత్త నవల ”తేజో తుంగభద్ర”లో విజయనగరానికి చెందిన హిజ్రా కథ ఒకటుంటుంది. అప్పట్లో కూడా, వారికి (అతడు/ఆమె ఏమనాలో తెలీక) బలవంతపు పెళ్ళై, భార్య విషయం తెలుసుకున్నాక వేరొకనితో వెళ్ళిపోతుంది. వారు రాణిగారి అంతఃపురంలో పనిచేసి, కొంచెం వయసయ్యాక ఒక దేవదాసికి తోడుగా ఒక ఊరిలో ఉంటాడు. ఎప్పటికో భార్యను మళ్ళీ కలిసిన సందర్బాన్ని వసుధేంద్ర హృద్యంగా రాసుకొచ్చారు.)

స్త్రీలు పాడుకునే పాటలు, స్త్రీల రామాయణం లాంటి వాటిపైన రిసెర్చులు జరిగాయి. అలానే ఈ కమ్యూనిటీకి సంబంధించిన చరిత్ర, ముఖ్యంగా తెలుగు దేశాల్లో జరిగింది సేకరిస్తే ఉపయోగకరం. అయితే చాలా వ్యయప్రయాసలతో కూడుకున్న పని.

రచన-సాధన-శోధన

”మీకు తెలిసిందే మీరు రాయండి” అన్నది ఇంగ్లీషు రైటింగులో కూడా ఊదరగొట్టేదే. తెలుగులో అది ఇంకాస్త ఎక్కువ వినిపిస్తుంది. తెలుగు రచనలను, రచయితలను వేర్వేరుగా చూసే ఆస్కారం తక్కువ. రచయిత గుర్తింపు, వ్యక్తిత్వానికి కొనసాగింపుగా (extension) రచనలని చూస్తారు. దీనితో నాకు కొన్ని పేచీలున్నాయి, కొందరి స్నేహితులతో వాదనలూ జరిగాయి. వాటి వివరాల్లోకి ఇప్పుడు వెళ్ళలేను కానీ, క్లుప్తంగా:

ఎవరైనా, ఎవరి కథనైనా చెప్పగలరని నా నమ్మకం. దానికి ఐడెంటిటీతో సంబంధం లేదు. రాయడానికి కావల్సినది పరిశోధన, సహానుభూతి. ఇవి లేకుండా రాయడం తప్పు. దాన్ని నేనూ ఒప్పుకోను. కానీ దళితుల కథలు దళతులే రాయాలి, గే కథలు గేలు మాత్రమే రాయాలంటే మాత్రం నేనొప్పుకోను.

ఎవరి కథలు వాళ్ళే బాగా చెప్పగల్గుతారు అన్న అభిప్రాయం కూడా ఒకటి బలంగా వినిపించింది. మన కథ మనం చెప్పుకోవడం అన్నది చాలా కష్టమైన పని, నా అనుభవం ప్రకారం. ”నువ్వెందుకని ఫిక్షన్‌ రాస్తావు?” అంటే నా సమాధానం, ”నా కథ నేను చెప్పుకునే నేర్పు, ధైర్యం నాకు లేవు. అందుకే ఫిక్షన్‌ వెనక దాక్కోవడం” అని అంటాను. (కథ చెప్పడానికి సబ్జెక్టు నుండి కొంచెం దూరం (distance) గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎలా అంటే, ఒక ఆపిల్‌ను చూసి ఆపిల్‌ బొమ్మ గీయాలంటే/ఫోటో తీయాలంటే అది మరీ దూరంగా ఉండకూడదు, మరీ మొహం మీద ఉండకూడదు. దానిపై పడుతున్న వెలుగునీడలు అనుకూలంగా ఉండాలి. అప్పుడే బొమ్మ బాగా వస్తుంది. కథ రాయడం కూడా అంతే! మనం మన జీవితాల్లో ఎంతగా చిక్కుకుపోయి, ఉక్కిరిబిక్కిరైపోతామంటే క్లారిటీ రావడం కష్టం. అందరికీ వాళ్ళ కథలు చెప్పుకోవడం అంత తేలిక కాదు. ముందు మన జీవితాల్లో జరుగుతున్నది మనకే అర్థమై చావదు. దాన్ని ఇంకొకరికి ఎలా చెప్పడం? కనీసం, నాకీ సమస్యలన్నీ ఉన్నాయి.)

సరే, ఆ అభిప్రాయ భేదాలు పక్కకు పెడితే, ఎవరి కథలు ఎవరు రాసినా, రాయాలనుకున్నా దానికి Iబోలెడు సాధన కావాలి.Iam writer made out of internet” కాబట్టి ఈ కమ్యూనిటీ వారిలో కొత్తగా రచనలు చేయాలనుకుంటున్న వారికి కొన్ని నసూచనలు.

రాయడమంటే ఒక form of self expression, భావవ్యక్తీకరణ. పుస్తకాలు-అచ్చులు- సన్మానాలు-శాలువాలు అన్నీ ఎప్పటికో వస్తాయి. అసలు రాకపోనూ వచ్చు. కానీ చెప్పాలనుకున్నది కాగితం మీద అర్థవంతంగా పెట్టగలిగినప్పటి సంతోషాన్ని ఇంకేదీ ఇవ్వలేదు. రచనా వ్యాసంగాన్ని అలా చూడడం వల్ల మన మీద బరువు బాధ్యతలు కూడా తగ్గుతాయి. (నన్ను నేను రైటర్‌ అనుకోవడానికి పదేళ్ళకు పైగా పట్టింది, ఆ బాధ్యతను ఒప్పుకోవడానికి) Travel light, when you can. Don’t be a writer. Be writing అన్నది నాకు మార్గదర్శి.

Self expression కి self love కి చాలా దగ్గర సంబంధం ఉంది. సమాజం మనకి మన గురించి చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది. ”మార్కులు తెచ్చుకోకపోతే నాశనమైపోతావ్‌!”, ”ఇంకో ఆడదాన్ని ప్రేమిస్తున్నావా? నీదీ ఒక జన్మేనా?” లాంటివెన్నో అంటూ పోతుంది. మనం వింటూ ఉండడం వల్ల, అవి ఎంత అసమంజసమైనా, వారిలో ఒకరం కాలేకపోతున్నందుకు బాధనీ, కోపాన్నీ మనమీదే చూపించుకుంటాం. సమాజం మనల్ని అనే వాటికన్నా మనమే ఇంకెంతో దారుణమైనవి అనుకుంటూ ఉంటాం. అలాంటి అవస్థలో రాయలేమా అంటే, రాయొచ్చు – రాస్తాం కూడా! వాటిని అందరూ పొగడొచ్చు కూడా! కానీ వాటిలో ఏదో వెలితి ఉంటుంది. మనం మనల్ని పూర్తిగా స్వీకరించినప్పటి నిండుదనం రాదు.

కథలో రాయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఫోటోగ్రఫీ ఆసక్తి ఉన్నవారు మొదటిసారే అవార్డు గెల్చుకునే ఫోటోలు ఎలా తీయలేరో, అలా తీసే స్థాయికి వెళ్ళడానికి ఎన్ని వేల ఫోటోలు తీసుంటారో, అలానే రాసేవాళ్ళు కూడా ఎంతో సాధన చేస్తే తప్ప గొప్ప కథలు రాయలేరు. (విపరీతమైన టాలెంట్‌ ఉన్నవాళ్ళుంటారు. వాళ్ళు ఒకసారి రాశాక మళ్ళీ అచ్చు తప్పులు చూసుకునే అవసరం ఉండదు. కానీ అలాంటివాళ్ళు 1% కూడా ఉండరు. మనం మానవమాత్రులం – అందుకే కష్టే ఫలి!)

ఇంటర్నెట్‌ మనకున్న గొప్ప వరం. రాయడానికి అంతకు మించి గొప్ప అవకాశం ఉండదు. బ్లాగుల నుండి డిజిటల్‌ పబ్లిషింగ్‌ వరకూ అన్నీ చిటికెలలో పని. గొప్ప రచయితలు మనకి ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌ అయిపోతారు. మనం రాసిన కథ మన ఊహకి కూడా అందనంత దూరం వెళ్తుంది.

బ్లాగుల్లో రాసుకోవడం ఉత్తమం. కవితలు, లేదా ఐదొందల పదాల వరకూ వస్తుందంటే వచనం ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసుకోవచ్చు. అలా తరచుగా ఏదో ఒక విషయం (ఇవేవో గొప్ప విషయాలు కానవసరం లేదు. రోజువారీ అనుభవాలైనా సరిపోతుంది.) గురించి పెడుతూ ఉంటే, మన చుట్టూ ఒక సాహిత్యం సమూహం ఏర్పడుతుంది.

ఈ సమావేశంలోనే పి.సత్యవతి గారు ఒక మాట అన్నారు: ”సమాజమంటే గాలిలో ఉన్న గడుసు దెయ్యం” అని. ఇంటర్నెట్‌లో ఈ గడుసు దెయ్యం మరీ పేట్రేగిపోతుంది. నిజజీవితంలో అయితే ముగ్గులోనికి దింపడమో, బాటిల్‌లో బంధించడమో, వదిలేదాకా కొట్టడమో చేస్తారు. ఆన్‌లైన్‌లో మాత్రం ఏమన్నా ఎవరికీ దొరకం అనే అవగాహన లేని ధీమా కొందరిది. వీరికి పెద్ద భయపడనవసరం లేదు. ఒక ”బ్లాక్‌”తో పోతారు వీళ్ళంతా!

వారానికో, రోజుకో ఇంత సమయమనుకుని ఇందులో రాయడం తప్ప వేరే పనేం పెట్టుకోకపోవడం ఉత్తమం. అనేకమంది నిపుణులు, చేయితిరిగిన రచయితలు నిద్ర లేచీ లేవంగానే రాయడం ఉత్తమం అంటారు. (నేను లేచీ లేవగానే పడుకుంటాను కాబట్టి నాకు కుదరదు.)

ఇలా ఒక ప్రత్యేకమైన టైము పెట్టకోవడం మాత్రం చాలా ముఖ్యం. లేకపోతే రోజువారీ జీవితంలో మనం కొట్టుకుపోతూనే ఉంటాం, రాయడం వెనుకబడిపోతూనే ఉంటుంది. అయితే వర్జీనియా వూల్ప్‌ రాసిన అద్బుతమైన వ్యాసం,A room of one’s own లో ఆడవారికి ఈ తీరిక దొరకడం గురించి వివరంగా రాస్తుంది. అలాంటిదొకటి నబవవతీ కమ్యూనిటీకి సంబంధించినది వస్తే రచనా వ్యాసంగం కొనసాగించడానికి వాళ్ళకి అడ్డుపడే అవరోధాలు తెలిసొస్తాయి.

చివరిగా, రాయాలంటే చదవాలి. ఎంత ఎక్కువ చదివితే అంత బాగా రాయగలం. చదవడమంటే సాహిత్యాన్ని మాత్రమే కాదు. మనుషులని, మనసులని, కట్టుబాట్లని, సమాజాన్ని – అందరినీ, అన్నింటినీ. అప్పుడే బాగా రాయగలం.

మానసిక ఆరోగ్యం – సాహిత్యం

మన దగ్గర మానసిక ఆరోగ్యం గురించి అవగాహన చాలా తక్కువ! అనేక కారణాల వల్ల మనందరం మానసికంగా అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నాం. ప్రాథమిక చికిత్స, రోజువారీ ఆరోగ్యపు అలవాట్లు మనకి చిన్నప్పటి నుంచి చెబుతారు. కానీ మానసిక ఆరోగ్యం, ఎమోషనల్‌ హెల్త్‌ గురించి ఎవరూ చెప్పరు ఎప్పుడూ! నిరాకరణ, వేరుగా చూడడం, మనల్ని కాదనుకోవడం, సూటిపోటి మాటలు అనడం… ఇవన్నీ మనసుకి తగిలే గాయలే కదా? చిన్న గాయమై కాస్త రక్తమొస్తే ”అమ్మో! అమ్మో” అంటాం కానీ, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, వ్యవస్థపరంగా రోజూ ఇన్నేసి మానసికమైన గాయాలు తగులుతుంటే, హింసలకి గురవుతుంటే మనం ”బాగా” ఎలా ఉండగలం? ఇది అందరికీ వర్తిస్తుంది, కానీ ఈ కమ్యూనిటీ వాళ్ళకి ఎక్కువగా కావాలీ సపోర్టు. (ఈ అంశానికి సంబంధించిన రచనలు, కొన్ని సూచనలు ఇంకోసారి పంచుకుంటాను. ఇవన్నీ ఇంగ్లీషులో ఉంటాయి. మనం తెలుగులో ఈ కంటెంటుని తెచ్చుకోవాలి.)

సాహిత్యం ఈ మానసికమైన దెబ్బలకి మందూ ఇవ్వగలదు, దాన్నింకా విషమమూ చేయవచ్చు. అందుకని చాలా జాగ్రత్తగా

ఉండాలి. సాహిత్యమంటే చదవడమూ, రాయడమూ రెండూ అని నా ఉద్దేశ్యం. (2015లో నాకు డిప్రెషన్‌ ఉందని తేలినప్పుడు, ఒక రెండు సంవత్సరాలు పుస్తకాలు చదవడం పూర్తిగా మానేశాను. ఆ వివరాలన్నీ మళ్ళీ ఎప్పుడో రాస్తాను గానీ, అప్పుడు డాక్టర్లతో, థెరపిస్టులతో చర్చించాక తేలింది ఏంటంటే నేను చదువుతున్న సాహిత్యం నాకు కావాల్సిన ఊతం అందించటం అటుంచి ఇంకా పాతాళంలోకి తోసేస్తుందని. అరదుకే పక్కకు పెట్టాల్సి వచ్చింది.)

రాయడం వల్లా, చదవడం వల్లా పాత గాయాలు రేగే అవకాశాలూ అధికంగా ఉంటాయి. అందుకే పైన రవశ్రీట-శ్రీశీఙవ ప్రస్తావన తీసుకొచ్చింది. ఏ పనైనా మనకు ఆ సమయంలో మంచి చేస్తుంటేనే చేయాలి. మనల్ని మనం బలవంతం పెట్టుకోకూడదు. గతాన్ని తవ్వే క్రమంలో ఎంతో కొంత బాధ ఉంటుంది గానీ, దాన్ని మన శరీరం, మనసూ ఆ సమయంలో తట్టుకునే పరిస్థితుల్లో ఉన్నాయా అన్నది మనం నిజాయితీగా నిర్ధారించుకోవాలి.)

కాగితం మీద మనకి అనిపిస్తున్నది పెట్టగానే పెద్ద భారం దిగిపోయినట్లు అనిపించడం కూడా బోలెడు సార్లు జరుగురది. మన కోసమే మనకన్నా ముందు పుట్టేసి, జీవితాన్ని కాచి వడపోసి మనకి అందిస్తున్నారు అనిపిస్తుంది చాలాసార్లు పుస్తకాలు చదువుతుంటే. మనకి అప్పటివరకూ అంతు చిక్కనివి కూడా కొన్ని అర్థమవ్వడం మొదలవుతాయి. కానీ చదువుతున్నప్పుడు, రాస్తున్నప్పుడు అవి మనపైన చూపుతున్న ప్రభావాన్ని మనం ఒక కంట కనిపెడుతూ ఉండడం మంచిది.

కొన్ని సూచనలూ, సలహాలూ

ఇలాంటివి తలకెత్తుకుని, అందరినీ పోగేసి, ప్రణాళిక వేసి నిర్వహించడమనేది చేతులెత్తి దణ్ణం పెట్టాల్సిన విషయం. ముఖ్యంగా తెలుగులో అణాపైసా తీసుకోకుండా ఇవన్నీ చేస్తుంటారు. ఇంగ్లీషులో అయితే డబ్బులు కట్టామన్న అధికారంతో ఫీడ్‌బాక్‌ ఇచ్చేయొచ్చు. ఇక్కడ మొహమాటం అడ్డొస్తుంది. అయినా కూడా కొన్ని సూచనలూ, సలహాలు. ఎటూ ఇంత శ్రమ తీసుకుని చేసేటప్పుడు ఇంకొన్ని సరిజూసుకుంటే శ్రమకి రెట్టింపు ఫలితం లభిస్తుంది.

రైటింగ్‌కి సంబంధించిన వర్క్‌షాప్‌ అంటే ఖచ్చితంగా పాల్గొనేవాళ్ళు, అప్పటికప్పుడో, లేక మరో విడత సెషన్‌కి కల్సుకునేటప్పటికి రాసేలా (అది వంద పదాలే అవ్వొచ్చు లేదా రెండు మూడు వాక్యాలే అవ్వచ్చు) ఎక్సర్‌సైజ్‌లు ఉండాలి. లేకపోతే దాన్ని వర్క్‌షాప్‌ అని అనలేం. థియరీ మాత్రమే ఉంటుంది. (తెలుగులో ఎప్పుడూ ఇలానే జరుగుతాయా అన్నది నాకు తెలీదు. కానీ నేను ఎక్కువ విన్నది, హాజరైన రెండూ ఇలానే ఉన్నాయి). అక్కడికీ ప్రశ్నలు అడుగుతూ సత్యప్రసాద్‌ ఆసక్తికరమైన ఉదాహరణలు ఇచ్చారు. అలాంటివి ఎక్కువగా ఉండాలి.

LGBTQIA+ కమ్యూనిటీ గురించి కొన్ని వివరాలు మొదట్లోనో, లేక ఫ్రీ రీడింగ్‌గానో ఇచ్చుంటే బాగుండేది. నేను కొంచెం చదువుకొని వెళ్ళాను కానీ అందరూ మాట్లాడుతుంటే అన్ని నిర్వచనాలూ కలగాపులగం అయిపోయాయి బుర్రలో.

నాకు ఒక నవతరంగంలా, ఒక పుస్తకం .నెట్‌లా ఒక LGBTQIA+ ప్రత్యేకమైన వెబ్‌ మాగజైన్‌ అవసరం కూడా బాగా కనిపిస్తుంది. ఈ కమ్యూనిటీకి చెందిన అన్ని విషయాలూ (కథలు, కవితలే కాకుండా) మిగతా కంటెంట్‌, సమావేశ వివరాలు, మానసిక ఆరోగ్యం గురించి, ఇతరత్రా పంచుకునే వీలుగా. దానికి అందరూ తలా ఓ చేయి వేసేలాగా.This will be useful in educating the larger community too. ఐడియా మరీ కొట్టిపారేయనక్కర్లేదు అని అనిపిస్తే, దీని గురించి ఇంకా brainstorm చేద్దాం.

Share
This entry was posted in Uncategorized, వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.