ఛలోనా…. కరోనా !
సరిహద్దులు దాటి వచ్చావ్ కరోనా ,
బయలుదేరావా ఇకనైనా
అందరూ నీ దాటికి హైరానా,
మాకు లేదా విముక్తి ఇప్పుడైనా.
నీవల్ల అందరం భయపడి నా,
నీ దారి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే నా,
నీకు అందరం చేతులెత్తి మొక్కినా ,
నీకు లేదే కనికర మైన!
వెళ్ళవా నీ దేశానికి ఇకనైనా,
అందరికి కలిగించ వా విముక్తి నైనా.
నిన్ను చంపే వాక్సిన్ పుట్ట లేదనా,
నీవల్ల భారతదేశానికి ఇంతటి జరిమానా,
ఇకనైనా నీ దారి చేసుకోవా కరోనా,
నీవల్ల కష్ట పడ్డ వారిని సుఖ పెడదాం సరేనా…..
– శ్రీయ రావ్‌ు, 10 వ తరగతి