భారత పౌరులమయిన మేము… స్త్రీల రాజకీయ భాగస్వామ్యం-వాస్తవాలు

సంక్షిప్త పరిచయం:

ప్రపంచంలో గాని, దేశంలో గాని, స్థానికంగా గాని స్త్రీల రాజకీయ భాగస్వామ్యం, నాయకత్వం ఎక్కడా తగినంతగా లేదు. ఓటర్లుగా, ఎన్నికయిన కార్యాలయాల్లో, ప్రఖ్యాత అధికార యంత్రాంగంలో ప్రైవేటు రంగంలో లేదా విద్యావ్యవస్థలో స్త్రీల ప్రాతినిధ్యం సరిపడినంత లేదు. ప్రజాస్వామ్య పరిపాలనలో పాల్గొనేందుకు సమాన హక్కులున్నా, నాయకులుగా మార్పుకి సాధకులుగా వారి సామర్ధ్యాన్ని స్త్రీలు నిరూపించుకున్నాక కూడా పరిస్థితి ఇలాగే ఉంది.

ప్రస్తుతం కోవిడ్‌-19 పరిస్థితుల్లో పార్లమెంటులో స్త్రీల గొంతు ఎక్కడ? అక్కడ ఉన్న కొద్ది బలమైన స్వరాలు అధికార పార్టీ హోరులో మునిగిపోతాయి. ప్రభుత్వం చేపడుతున్న స్త్రీ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలపై మహిళా పార్లమెంటేరియన్లు కూడా మౌనం పాటిస్తున్నారు. ఏ రకమైన ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రకటించిన లాక్‌డౌన్‌ వల్ల ఏర్పడిన సంక్షోభంలో కోట్లాది జీవితాలను, జీవనోపాధులను ప్రమాదంలోకి నెట్టింది. దుర్భరులయిన పౌరుల పట్ల ప్రభుత్వానికి ఎంత మాత్రం సానుభూతి లేదనడానికి ఇది నిదర్శనం.

ఐక్యరాజ్యసమితి మహిళా స్థితిగతుల కమిషన్‌ 64 (జూఔ64) భిన్న తరాల నాయకత్వం, భాగస్వామ్యం పర్యవేక్షణలపై కేంద్రీకరించిన అంశం లాభం చేకూర్చేదిగా ఉంది. 73 సం||రాల స్వాతంత్య్రానంతరం కూడా అతి కొద్దిమంది మహిళా ఎంపీలు, మంత్రులను కలిగి ఉన్న మన దేశానికి ఇదొక మంచి అవకాశం. గతంలో జరిగిన తప్పులు సరిచేయడానికి న్యాయం, శాంతి, ఐక్యత కల్పించడానికి, దేశాన్ని నిజమైన సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దడానికి రాజకీయ రంగంలో మరింతమంది మహిళల అవసరముంది.

వాస్తవాలు-గణాంకాలు: – 1974-75లోని ”సమానత్వ దిశగా” నివేదిక కనీసం 30% మంది మహిళలు అన్ని విధాన నిర్ణయ స్థానాల్లో ఉండాలని సిఫార్సు చేసింది. – రాజ్యాంగ పరంగా సమాన భాగస్వామ్య హక్కు ఉన్నప్పటికీ ప్రస్తుత పార్లమెంట్‌లో మహిళలు 14% ఉండాలి. (544 మందిలో 78 మంది మహిళలు). అయితే వీరి కృషి ఎంత ప్రతిభావంతం అనేది గమనించాల్సిన అంశం. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ప్రధాన రాజకీయాల్లో బాధ్యతాయుతమైన స్థానాల్లో స్త్రీల సంఖ్య 1952 లో మొట్టమొదటి ఎన్నికల కాలం నుండి కూడా అంతే అధమ స్థాయిలో ఉంది. 1996లో 81వ రాజ్యాంగ సవరణగా స్త్రీలకు పార్లమెంటు, అసెంబ్లీలలో 33.3% రిజర్వేషన్‌ కల్పించాలనే బిల్లు 2008లో 108వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ప్రవేశపెట్టబడ్డాయి. ఇప్పటికే అది వెలుగు చూడలేదు. స్థానిక సంస్థల్లో స్త్రీలకు 33.3% రిజర్వేషన్‌ కల్పించిన తర్వాత పది లక్షలకు పైగా మహిళలు ప్రజాప్రతినిధులుగా ఎంపికై క్షేత్రస్థాయి రాజకీయ చిత్రాన్ని మార్చేందుకు నడుంకట్టడం ఒక సానుకూల సశక్తీకరణ గాధ. 2009లో మహిళలకు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్‌ కల్పించి అమలు చేస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా అన్ని పార్టీల్లోని మగ రాజకీయ నాయకులు పార్లమెంటు, అసెంబ్లీల్లో స్త్రీల రిజర్వేషన్‌ బిల్లును నిరంతరాయంగా అడ్డుకుంటూనే ఉన్నారు. 2010లో ఎంత వ్యతిరేకత ఉన్నా ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందినా లోక్‌సభలో ప్రవేశపెట్టబడలేదు.

జవాబుదారీతనం ఉండాలి: రాజకీయ పార్టీలన్ని అసెంబ్లీ, పార్లమెంటులకు పోటీ చేసే తమ అభ్యర్థులలో 50% సీట్లు రాజకీయ పార్టీలన్నీ కేటాయించడం తప్పనిసరి చేయాలి. వారి ఎన్నికల మేనిఫెస్టోలలో స్త్రీలకు కొంత శాతం రిజర్వేషన్‌ ఇస్తామని వాగ్దానం చేసిన వాటిని ఖచ్చితంగా అమలు చేయాలి. స్త్రీలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీట్లు కేటాయించడానికి కట్టుబడి ఉండాలి.

కార్యాచరణ పిలుపు: ఎన్నికయిన మహిళా ప్రతినిధులకు మహిళా దృక్పథాన్ని బలోపేతం చేసేందుకు మహిళా సంఘాలు, సంస్థలు కృషి చేయాలి. కులం, మతం, అంగ వైకల్యం, ప్రత్యేక జాతి, లైంగిక ప్రత్యేకతలు ఇతర ఆధిపత్యాలను అధిగమించి రాజకీయ అమరికను బలోపేతం చేయడానికి అవసరమైన నాయకత్వాన్ని, యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ఫెమినిస్టు ఉద్యమాలు, పౌర సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరముంది. మన హక్కుల కోసం ప్రజాస్వామ్యంలో పోరాడిన స్త్రీ, పురుషుల చరిత్ర గురించిన అవగాహన కలిగిన యువతులతో కూడిన యువనాయకత్వం నిర్మించాలి. యువతకు విమర్శనాత్మక ఆలోచన నేర్పాలి. రాజకీయ ప్రక్రియ ద్వారా ఈ దేశాన్ని ‘నాది’ అనుకునే భావనను పెంపొందించాలి. మౌలిక రాజ్యాంగ విలువల కోసం నిలబడి బెదిరింపులు, ట్రోలింగ్‌, అరెస్టులు ఎదుర్కొంటున్న యువతులకు సంఘీభావంగా నిలబడాలి.

ఆశారేఖలు : రాజకీయ కార్యాచరణకు గౌరీ లంకేష్‌ పేరు పర్యాయ పదం అయ్యింది. రాజకీయ జీవితం గురించి పౌరుల్ని ఉత్తేజపరచగలగిన అత్యంత ధైర్యవంతురాలయిన జర్నలిస్టులలో ఆమె ఒకరు. ఎన్నికయిన ప్రజాప్రతినిధులకు వినిపించేలా హక్కుల అంశాలపై గొంతెత్తడానికి ఆమె ప్రజల్ని పురికొల్పారు. ఒక పాత్రికేయురాలిగా, ప్రజా కార్యకర్తగా పేదలు, మైనారిటీలు, స్త్రీల కోసం ఆమె పనిచేశారు. ఆమె అంటే రాజకీయ నాయకులకు భయం. ఆమెపై పోలీసు, ఇంటెలిజెంట్‌ సంస్థల నిఘా ఉండేది. మతోన్మాద, ఛాందసవాద సంఘాల విషపూరిత చర్యలకు ఆమె లక్ష్యం. కానీ ఆమె తన జీవితం గురించి భయపడలేదు. బాడీగార్డుల్లేరు. తన పత్రికను నడపడానికి సంఘర్షణ పడుతున్నా సదా ఉల్లాసంగా ఉండేవారు. రాజకీయాల్లో చురుకుగా పాల్గొడానికి ఆమె చేసిన వాదనలు అన్ని తరగతుల మహిళలను ఉత్తేజపరిచాయి.

ఆమె పోరాటంలో ముందు ఉన్నారు. తాను నమ్మినదాన్ని ఆచరించినందుకు భారీ మూల్యం చెల్లించారు. పార్టీలతో నిమిత్తం లేకుండా కార్యకర్తలంతా, జర్నలిస్టులంతా ఆమె కోసం శోకించారంటే… దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయంటే ఆమె మరణం ఎంత ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు. చెచెన్యా యుద్ధకాలంలో మాస్కోలో హత్య కావించబడిన పాత్రికేయురాలు, రాజకీయ కార్యకర్త పేరిట గల ‘అన్నా పాలికోన్‌స్కయా’ అవార్డు ఆమె మరణానంతరం ఆమెకు లభించింది.

2017 సెప్టెంబరు 5న తన ఇంటి గేటు ముందు మోటార్‌సైకిళ్ళపై వచ్చిన దుండగుల తూటాలకు ఆమె నేలకు ఒరిగారు. ఈ దుండగులు మతోన్మాద ఛాందస సంస్థలకు చెందినవారుగా తేలింది. విచారణ ఇంకా కొనసాగుతోంది.

గౌరి అందించిన వారసత్వం కొనసాగుతోంది. అందర్నీ ఉత్తేజపరుస్తోంది.

Share
This entry was posted in మనం గళమెత్తకపోతే . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.