ఇటీవల బాల కార్మిక వ్యతిరేక దినాన సంబంధించిన ఒక సమావేశంలో తిరుపతి నుండి వచ్చిన ఒక మిత్రురాలు అన్న ఒక మాట నన్ను చాలా కలవరపెట్టింది. ఆవిడేమన్నారంటే ”నేను మీ భూమిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి చదువుతుంటే నాతో కలిసి పనిచేసే ఒక వ్యక్తి నా లేప్‌టాప్ వేపు తొంగిచూసి ఏం చదువుతున్నారు అని అడిగి ‘స్త్రీవాద పత్రిక భూమిక’ అని బిగ్గరగా చదివి ”హమ్మో! మిమ్మల్ని ఇప్పటికే భరించలేకపోతున్నాం. మీరు ఇలాంటి స్త్రీవాద పత్రికలు చదివితే ఇంకేమైనా వుందా?” అంటూ గుండెలు బాదుకున్నాడట. ఇంకోచోట ఒకావిడ స్త్రీల సమస్యల మీద, స్త్రీల అంశాల మీద అనర్ఘళంగా ఉపన్యసించాక – మీరు ఫెమినిస్టా అని పత్రికల వాళ్ళు అడిగితే అబ్బే కాదండి నేను మానవతావాది – అన్నారు.
అలాగే భూమిక స్త్రీవాదపత్రిక అని ఎందుకు పెట్టారు. స్త్రీవాద అని వుండడం వల్ల చాలామంది దీన్ని చదవడం లేదు. స్త్రీల పత్రిక అని మార్చవచ్చు కదా అని మాకు లెక్కలేనన్నిసార్లు సలహాలు వచ్చాయి. ఇటీవల అబ్బూరి ఛాయాదేవి గారిని ఇంటర్వ్యూ చేసిన ఒక యువ మహిళా జర్నలిస్ట్ ”ఇంతా చేసి ఈమెది స్త్రీవాదం కాదు. సమాన వాదం” అని తేల్చేసింది.
పై అంశాలను గమనించాక స్త్రీవాదం మీద విపులమైన చర్చను లేవనెత్తాలనే ఆలోచన కలిగింది. ఈ క్రింది అంశంపై మీ అభిప్రాయాలు వ్యాసం రూపంలో రాసి పంపండి. చర్చలో పాల్గొనండి. ఉత్తమ వ్యాసానికి బహుమతులు కూడా వుంటాయి.
”నా దృష్టి స్త్రీవాదమంటే……
నా అవగాహనలో స్త్రీవాదులంటే…….”
చర్చలో పాల్గొనమని ఆసక్తివున్న పాఠకులందరినీ ఆహ్వానిస్తు
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
స్త్రీవాదం పట్ల అవగాహనకన్నా, అపోహలే ఎక్కువున్నాయి. అందులో ఏ మాత్రం సందేహం లేదు. మితావగాహనతో కొందరు స్త్రీవాదులే స్త్రీవాదాన్ని ఒక పిడివాదం చేసారనేదీ సత్యదూరం కాదు.
చెరసాల కథలో అగ్నిహోత్రిలా ధైర్యంగా ఉండేవాళ్ళే స్త్రీవాదులు. http://sahityaavalokanam.net/kathanilayam/2009/july/cherasaala.html
స్త్రీవాదం అంటే ఏమిటో స్త్రీవాదం పేరు చెప్పుకునే వాళ్ళలో 90% మందికి తెలియదు. నేను వ్రాసిన కథలలో వదిన-మరిదులు పెళ్ళి చేసుకుంటున్నట్టు వ్రాస్తేనే స్త్రీ పురుష సంబంధాలని చెత్తగా చూపించానని విమర్శించారు. బావా-మరదళ్ళ సరసాలు పేరుతో చెత్త మసాలా చూపించే సినిమాలని నిజంగా వాళ్ళు విమర్శిస్తే వాళ్ళకి నిజాయితీ ఉంది అనుకుంటాను. వాళ్ళకి నిజాయితీ లేకపోతే చలం, రంగనాయకమ్మ గార్ల పేర్లు చెప్పుకోవడం మానెయ్యండి అనే నా సలహా.
ప్రవీన గారు స్త్రి వాదం అంటు ప్రత్యేక మైన కొమ్ములు పెట్టుకుని ఎవరు తిరగడం లేదు . నాకు అర్ధం అయినంతవరకు
స్రీవాదాన్ని భుతాద్దల్లొ పెట్టి చూస్తున్నరు .ఏ స్రీఅయినా తనకి జరిగిన అన్యాం ఇంకొకరికి జరగకూడదు అని అనుకుంటుంది ఇది భాహాటంగా చెప్పేఅవకాసం అందరికి రాదు కొందరే చెప్పగలుగుతున్నరు.స్త్రిలందరు ఇంత నిశ్వార్ధంగ
ఆలొచిస్తున్నారా ఆలొచిస్తే కుటూంబాల్లొ బయట ఏందుకు ఇంకా స్త్రిలు అవమానిం చ బడుతున్నరు.? స్త్రి లందరిని వేధిస్తున్న ప్ర శ్న .. దానికొసం ఎన్నొ ప్రయత్నాలు పత్రికలు పెట్టీనా ప్రపంచంలొ ఏ మూల ఏచిన్నపాటి అన్యాయం జరిగినా
స్పందించి కధలు రసినా కవిత్వం రాసిన అది నేరుగా అక్ష్రం ముక్క చదివే కొందరిననైనా కదిలిస్తుందని నమ్మ కం
ఏవాదం అయినా అర్ధం తేలికుండా వున్నారండం అనుకొడంలొనే వుంది తెలియనితనం.. .
ఇప్పటికే కుటుంబాల్లొ సత్సంబంధాలులెక అందొళ న పడుతుంటే ,మీరు రాసిన దాన్ని సమర్ధించలేదు అనుకొవడం
ఎంతవరకు న్యాయం బావా మరదళ్ళ సరసాలు కొత్తగా తెచ్చి పెట్టినవి కాదు ,అలోచించండీ……..