ఇతివృత్తానికి ప్రవేశిక:
”ఈ భిన్న లైంగికతకు సంబంధించిన సమూహ సభ్యులు, వారి కుటుంబాలు… శతాబ్దాల తరబడి అనుభవించిన అవమానాలకు, సంఘ బహిష్కరణలకూ… దిద్దుబాటు చర్యలను చేపట్టడంలో జరిగిన ఆలస్యానికి, వారికి చరిత్ర ఒక క్షమాపణని ఋణపడి ఉంది. ఈ సమూహంలోని సభ్యులు తమ జీవిత పర్యంతం… ప్రతీకారం మరియు పీడన అనే భయాల మధ్య నిర్బంధించబడ్డారు” – జస్టిస్ ఇందూ మల్హోత్రా (తన 50 పేజీల తీర్పులో)
ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 377ని పాక్షికంగా సవరిస్తూ, ఒకే జెండర్‌కి చెందిన వయోజనుల మధ్య శృంగారం ఇక నేరం కాదంటూ సెప్టెంబర్ 6, 2018న సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. ఈ తీర్పుతో ఆ సమూహానికి భారత న్యాయ వ్యవస్థ పరిధిలో ప్రత్యక్ష ఆమోదత లభించినా, సామాజిక ఆమోదానికి మాత్రం ఇది దారితీయలేదు. సమాజంలోని ప్రజల మానసిక మరియు శారీరక శ్రేయస్సుకి సామాజిక ఆమోదమనేది ప్రధానమైన వ్యవహారం. సెక్షన్ 377ని సవరించడమన్నది భిన్న సమూహ వ్యక్తులు బయట ప్రపంచంలోకి రావడానికి ఉపకరించింది తప్ప వారి కుటుంబాలలోకి కాదు.
వ్యాపార సంస్థలు తమ సంస్థలలో చేరిక విధానాలను బహు రూపాలుగా బలోపేతం చేయడం వలన ఎల్.జి.బి.టి.క్యూ.ఐ.ఎ. తదితర వ్యక్తులను తమ శ్రామిక శక్తిలోకి తీసుకోవడానికి దోహదపడింది. అయినప్పటికీ, ఎల్.జి.బి.టి.క్యూ.ఐ.ఎ. వ్యక్తుల మీద రోజువారీ జరుగుతున్న హింస, వివక్షతకి సంబంధించిన వార్తలను వింటూనే ఉన్నాము.
కోవిడ్-19 నివారణ కోసం విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ ఎల్.జి.బి.టి. సమూహాల పరిస్థితిని మరింత దిగజార్చింది. ఇప్పటికీ వీరు తమ విభిన్న లైంగిక శక్తుల వల్ల సమాజం నుంచి, కుటుంబం నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ ఒత్తిడులు అనేక రూపాలలో శారీరక, మానసిక హింసలకు దారితీశాయి. వాటిలో ముఖ్యమైనది వారి లైంగిక ఆసక్తిని దుర్భాషలాడడం, లింగమార్పిడి చికిత్స తీసుకోవడానికి ఒత్తిడి చేయడం మొదలైనవి. కింద పేర్కొన్న వాస్తవాలు భారతదేశంలో ప్రభుత్వ విధానాలు, సామాజిక పరిస్థితులు మరియు కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో గత సంవత్సర కాలంగా ఎల్.జి.బి.టి. సమూహాలపై ప్రభావం ఎలా ఉంది అన్నది కళ్ళకు కడుతున్నాయి.
ఉన్నదున్నట్లు (వాస్తవాలు-గణాంకాలు) :
శ్రీ లాక్‌డౌన్ తర్వాత గృహ హింస కేసుల సంఖ్య పెరిగింది. ఒక్క డిల్లీ నగరంలోనే సగటున ఒక మిలియన్‌కి 37 మంది మహిళలు తమపై హింస జరిగిందని ఫిర్యాదు చేశారు.
శ్రీ తమ జంటలో ఒకరికి తల్లిదండ్రులు బలవంతంగా వివాహం చేయడానికి తలపెట్టడంతో తమిళనాడులో ఒక జంట ఆత్మహత్య చేసుకుంది. సమాజం నుంచి ఎదుర్కొంటున్న ఒత్తిడి వల్ల గృహ హింస కేసులు చాలావరకు బయటికి రావు.
శ్రీ లాక్‌డౌన్ సమయంలో 61 శాతం మంది భారతీయులు మానసిక సమస్యలతో సతమతమయ్యారు. వేధింపులు, ఆర్థిక సమస్యల కారణాలతో ఆత్మహత్యల సంఖ్య పెరిగింది. తమిళనాడులో ఒకే యజమాని దగ్గర పనిచేస్తున్న ఒక జంటని వారు క్వీర్ అన్న అనుమానంతో పనినుండి తొలగించారు. భారతదేశంలో స్వలింగ సంపర్కానికి లింగమార్పిడి చికిత్స మాత్రమే మందు అనే అపోహ వల్ల ప్రమాదకరమైన చికిత్సా పద్ధతులు అవలంభిస్తున్నారు. దీన్ని చట్టవిరుద్ధంగా చేసే నిబంధన ఇంకా రాలేదు. కానీ, మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం 21(ఎ) ప్రకారం ఇది స్పష్టమైన ఉల్లంఘన కిందకు వస్తుంది. 21(ఎ) ప్రకారం వైద్యులు జెండర్ ఆధారంగా రోగులపై ఎలాంటి వివక్ష చూపరాదు.
విభిన్న లైంగికత ఉన్న సమూహాల పట్ల సమాజంలో ఒక విధమైన శతృత్వం కూడా పెరుగుతోంది. ప్రత్యేకంగా విభిన్న లైంగికత ఉన్న మహిళలైతే, పుట్టినప్పుడు స్త్రీగా నమోదు చేయబడినందుకు, ఆ తర్వాత తమ లైంగికత కారణంగానూ… రెండు రకాలుగానూ వివక్షను అనుభవిస్తున్నారు.
ఢిల్లీకి చెందిన ఒక హెల్ప్‌లైన్ నివేదిక ప్రకారం, వారికి వచ్చిన 86 కాల్స్‌లో 60 మంది విభిన్న లైంగికత ఉన్న మహిళలు మరియు పురుషుల నుంచి వచ్చాయి. వారిని ఇంట్లో నిర్బంధించడం వల్ల మానసికంగా భావోద్వేగాలకు గురైనట్లు వారు చెప్పారు. వారి ఫోన్లపై నిరంతరం నిఘా ఉండేది. కొంతమందయితే వారి ఫోన్లను ఛార్జ్ కూడా చేయించుకోలేకపోయారు.
జవాబుదారీతనం కోసం డిమాండ్లు:
శ్రీ లైంగికత ఆధారంగా ఈ విభిన్న సమూహాలపై జరిగే దాడులు, వారిపై చూపించే వివక్షతపై మాట్లాడడానికి ఉన్న ప్రాతినిధ్య వ్యవస్థను 2023 వరకు పొడిగించడం.
శ్రీ దేశవ్యాప్తంగా వారికోసమై సంక్షేమ గృహాలు ఏర్పాటు చేయాలి. లాక్‌డౌన్ కాలంలో స్పష్టంగా కనిపిస్తున్న హింసను తగ్గించడానికి మానసిక ఆరోగ్య హెల్ప్‌లైన్‌ను ప్రాంతీయ భాషల్లో ఏర్పాటు చేయాలి.
శ్రీ ఆర్ట్ మరియు హెచ్‌ఆర్‌టి విభాగాలను అత్యవసర సేవలుగా గుర్తించి ఎల్.జి.బి.టి.క్యూ.ఐ.ఎ వ్యక్తులు ఈ సేవలను స్థానిక మరియు జిల్లా వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా అందుకునేలా చూడాలి.
శ్రీ వివక్ష మరియు కళంకాలను ఎదుర్కోవడానికి, ఎల్.జి.బి.టి.క్యూ.ఐ.ఎ వ్యక్తుల యొక్క నిర్దిష్ట ఆరోగ్య అవసరాలకు సహాయం చేయడానికి వైద్య ఆరోగ్య సంరక్షణ నిపుణులను చైతన్యపరచాలి.
శ్రీ నవతేజ్ సింజ్ వెర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీపులో (సెక్షన్ 377) సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయాలి. ఎల్.జి.బి.టి.క్యూ.ఐ.ఎ వ్యక్తుల పట్ల ఉన్న సామాజిక అపోహలను తొలగించే విధంగా ప్రభుత్వ అధికారులను సెన్సిటైజ్ చేయాలి.
శ్రీ సంక్షోభ సమయాల్లో ఎల్.జి.బి.టి వ్యక్తులు సామాజిక భద్రతా ప్రయోజనాలు అందుకునే విధంగా భరోసా కల్పించాలి. రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు వంటివి పొందడం వారికి చాలాసార్లు కష్టమైన పని కాబట్టి ప్రభుత్వాలు వీరికి సామాజిక భద్రతా ప్రయోజనాలు అందించే సమయాల్లో వెసులుబాట్లు కల్పించాలి.
శ్రీ ఎల్.జి.బి.టి.క్యూ.ఐ.ఎ వ్యక్తుల పట్ల వివక్షత చూపుతున్న లింగ మార్పిడి వంటి ఆచరణలను నిషేధించాలి.
తీసుకోవాల్సిన చర్యలు:
ఎల్.జి.బి.టి.క్యూ.ఐ.ఎ వ్యక్తుల పరిస్థితులను సరిగ్గా అంచనా వేయడానికి, వారి హక్కుల కోసం పోరాడే సిఎస్‌ఓలతో కలిసి పని చేయాలి.
వీరి కోసం పనిచేసే సంస్థలకు ఆర్థిక సహాయ సహకారాలు అందించాలి.
సోషల్ మీడియా చర్చలలో భాగస్వామ్యం అవ్వడం, ఎల్.జి.బి.టి మరియు విభిన్న సమూహాలతో గొంతు కలపడం చేయాలి.
ఆశాకిరణం:
శ్రీ ఉత్తరాఖండ్ హైకోర్టు, జూన్ 12, 2020న ఇచ్చిన తీర్పులో, ”ఒకే లైంగికత కలిగిన జంటకి పెళ్ళి చేసుకోవడానికి అర్హత ఇంకా లేకపోయినా వారికి కలిసి జీవించే హక్కు ఉంది” అని పేర్కొంది. సెక్షన్ 377 ప్రకారం ఈ తీర్పు వల్ల వారు వివాహానికి అర్హులు కాకపోయినా, సహజీవనానికి అర్హులే.
శ్రీ ఇంకొక తీర్పులో పంజాబ్, హర్యానా హైకోర్టు ఒక యువ లెస్బియన్ జంటకు ఉపశమనం కల్పించింది. వారి కుటుంబం నుంచి ఎదుర్కొంటున్న బెదిరింపులను గమనించి అవసరమైతే భద్రతను కల్పించమని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మొహాలినీ వారిని ఆదేశించారు.
శ్రీ వారి కులం, సామర్ధ్యం మరియు విభిన్న లైంగికత ఆధారంగా అట్టడుగున ఉన్నవారిని గుర్తించి, వారికి సహాయం చేయడానికి సిఎస్‌ఓలు మరియు సోషల్ ఆర్గనైజేషన్స్ నుంచి చురుకైన ప్రయత్నం జరిగింది. కిరణ్ నాయక్ ఆదివాసులు మరియు వికలాంగుల హక్కుల కోసం పనిచేస్తున్నారు. కెవిఎస్ సంస్థ కర్నాటక, తెలంగాణ మరియు మహారాష్ట్రలలో ఆర్థికంగా, సామాజికంగా అణగారిన వారికి ఉపశమనం కల్పిస్తోంది.
శ్రీ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ సైకాలజిస్ట్స్, మే 21, 2020 న విడుదల చేసిన తన అధికారిక ప్రకటనలో లింగ మార్పిడి చికిత్సను ఖండిస్తూ, దీన్ని ”అతి ప్రమాదకరమైన, హానికరమైన, బాధాకరమైన మరియు అనైతికమైన పద్ధతి” అని పేర్కొంది.