దినసరి కూలీలు, నిర్మాణ రంగ కార్మికులు, ఫ్యాక్టరీ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, పట్టణ ఉత్పత్తిదారులు, సేవారంగ కార్మికులు, ఇంటి పనివారలు మొదలయినవారంతా వలస కార్మికుల కోవలోకి వస్తారు. 2020 మార్చి 23న భారత ప్రధాని నరేంద్ర మోడి కోవిడ్-19 వ్యాప్తి అదుపు చేయడానికి దేశమంతా లాక్‌డౌన్ ప్రకటించారు. నూట నలభై కోట్ల భారత ప్రజానీకం బలవంతంగా రుద్ధబడిన ఈ ”సామాజిక దూరం”తో జరిగిన మార్పులకు అలవాటు పడే క్రమంలో ఉంటే… భారతదేశపు నాలుగు కోట్ల వలస కార్మికులు భిన్నమయిన సవాళ్ళను ఎదుర్కొంటున్నారు (బిబిసి 2020). దేశంలో 500 కోవిడ్-19 కేసులు ఉన్నప్పుడు ప్రభుత్వం లాక్‌డౌన్ విధించి మొత్తం వ్యాపారాలను మూసివేసింది. హాట్‌స్పాట్స్ మూసేయటం, నియంత్రించబడిన ప్రాంతాలు వంటి చర్యలతో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని అనుసరించాయి. దాంతో లక్షలాదిమంది వలస కార్మికులు దిక్కుతోచని ఒంటరితనంలో ఇరుక్కుపోయారు. లాక్‌డౌన్ కొంతమేరకు కరోనా వ్యాప్తి వేగాన్ని తగ్గించి ఉండవచ్చు, కానీ అది సమాజంలోని అసమానతలను, నిస్సహాయతలను మరింత ఉధృతం చేసింది.
దేశం నిలకడయిన ఆర్థికాభివృద్ది నమోదు చేయడానికంటే ముందుగానే దేశంలో స్త్రీలు విద్యను అభ్యసిస్తున్నారు. అయినా ప్రపంచంలోనే అతి తక్కువ మహిళా శ్రామిక శక్తి కలిగిన దేశాల్లో భారతదేశం ఒకటిగా ఉంది. కోవిడ్-19 మహమ్మారి వలన ఈ దేశపు నగరాల్లో అసంపూర్ణ మహిళా శ్రామికుల పని పరిస్థితులు ఎంత దుర్బరంగా ఉన్నాయో తేటతెల్లమయింది. ప్రణాళిక లేకుండా అకస్మాత్తుగా, యాదృచ్ఛికంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్… ఆకలితో అల్లాడడం, కుటుంబాల నుండి వేరు పడిపోవడం, మొత్తం అసంఘటిత రంగ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి లేకపోవడం వంటి సమస్యల్ని సృష్టించింది.
ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థలకు, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థతో వలస వెళ్ళినవారే వెన్నెముక. డాక్టర్లు, నర్సులు, సైంటిస్టులు, పరిశోధకులు, వ్యాపారవేత్తలు, అవసరమైన శ్రామికులు, వగైరాలు కోవిడ్-19కు ప్రతిస్పందించడంలో ముందు పీఠాన ఉన్నారు.
మహిళా వలస కార్మికులు ఒక దానితో ఒకటి అల్లుకుపోయిన వివక్ష, అసమానతల్లో చిక్కుకుపోయారు. అవి…
– వలస విధానాల్లో స్త్రీలపై విధించిన ఆంక్షలు ఎదుర్కొనవలసి రావడం
– విభిన్న భాషల్లో సాంస్కృతికంగా సున్నితమైన ఆరోగ్య సేవలు పొందడంలో
– దేశంలోనూ, దేశాల మధ్యన ప్రయాణాలపై కఠిన నిబంధనల వలన మరింత లైంగిక వేధింపులకూ, ఆర్థిక దోపిడీకి గురికావడం.
– అసంఘటిత రంగంలో ఏ మాత్రం భద్రతలేని ఉద్యోగాలు అతి తక్కువ వేతనంలో ఇంటి పనివారలు, పారిశుధ్య కార్మికులు, బట్టలుతికేవాళ్ళు వంటి ఉపాధిలో చేరడానికి నెట్టబడడం.
– సాధారణంగా వీళ్ళు సామాజిక భద్రత పథకాలలో, భీమా సదుపాయాల నుండి వెలుపలే ఉంటారు. దానివల్ల ఆరోగ్య సేవలు, ఆదాయ వనరులు, ఇతర సామాజిక, ఆర్థిక భద్రతలు పొందలేరు.
భారతదేశంలో దాదాపుగా ఎనిమిదిన్నర లక్షల మంది మహిళా వలస ఇంటివాళ్ళు ఉన్నారు. కరోనా వల్ల వారి ఉపాధి, ఆదాయం, ఆరోగ్యం, భద్రత అన్నీ కోల్పోయారు. ఆర్థిక పతనం వలన ఈ సంక్షోభ కాలంలో, మహిళా వలస కార్మికులు వారి కుటుంబాలకు ఎవరికయితే ఈ ఆదాయం జీవనాధారమో వారికి వారి స్వంత దేశాల్లోని సమూహాలకు అతి తక్కవ మాత్రమే పంపగలుగుతున్నారు.
శారీరక దూరం పాటించడం అమలు చేయడం పెద్ద సవాలుగా ఉండే కిక్కిరిసిన నివాసాల్లో/ ఇరుకు గదుల్లో వలస కార్మికులు నివసిస్తుంటారు మాస్కులు, శానిటైనర్లు వంటి వ్యక్తిగత రక్షణ సాధనాలు వారికి అంతగా అందుబాటులో ఉండవు. వారు స్వంత దేశానికి, వలస దేశానికి కూడా ఎనలేని లాభం చేకూరుస్తుంటారు. అయినా గానీ ఒక సంక్షోభం ఏర్పడినప్పుడు ఆరోగ్య సేవలు, నివాసం, సామాజిక భద్రతల అందుబాటు లేక అత్యంత నిస్సహాయులుగా మారిపోతారు. పెరుగుతున్న వివక్షతలకు, విదేశీయుల పట్ల ఉండే విపరీత భయాలకు గురవుతారు.
ఇప్పుడు ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు ప్రభుత్వం నుండి సహాయం గానీ నిరుద్యోగ భృతి, ఇతర సదుపాయాలు గానీ పొందడానికి అర్హులు కాకపోవచ్చును. ఆహార కొరత, నివాసాలు లేని తనం పెరగడం అనేది ఆధునిక బానిసత్వానికి దారితీయవచ్చు.
వారి పని ప్రదేశాలకు / నగరాలకు తిరిగి వచ్చినాక కూడా శ్రామికుల కొరత వలన వలస కార్మికులు మరింత దోపిడీకి గురయ్యే అవకాశం ఉంది. ప్రణాళిక లేని ప్రభుత్వ విధానాల కారణంగా పెద్ద పెద్ద నగరాల నిర్మాతలయిన ఈ కార్మికులు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కోవిడ్-19 పరిణామాల వలన అత్యధికంగా దెబ్బ తినేది వలస కార్మికులే. రానున్న కార్మిక కఠిన ప్రయాణంలో బతకడానికి అవసరమైన మౌలిక సరుకులు / సామగ్రి కూడా వారి దగ్గర లేవు. ఈ అనధికారిత వారి పట్టణ పని ప్రదేశాలకే పరిమితం కాదు. అలలు అలలుగా వలస కార్మికులు ‘అపసవ్య వలస’గా తమ స్వంత గ్రామాలకు తరలి వెళ్ళారో అక్కడ కూడా వాళ్ళు రైతులే… అసంఘటిత కార్మికులే.
నిర్మాణ రంగంలో, దేశవ్యాప్తంగా పొలాలలో, సేవారంగపు కార్యాలయాల్లో, గ్రామీణ పట్టణ మార్కెట్లలో అమ్మకంలో, పాలు, ఆహారం, పత్రికల చేరవేతల్లో, దేశపు ఉత్పత్తి కేంద్రాలయిన ఫ్యాక్టరీలలో వీరి ఉనికిని గమనిస్తే ఈ వలస కార్మికులు ఈ దేశపు స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలను తమ భుజాలపై మోస్తున్నారని అర్థమవుతోంది.
వాస్తవాలు / గణాంకాలు : 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో శ్రామిక జనాభా 48.2 కోట్లు. వీరిలో వలస కార్మికులు 20 శాతం. 2016 నాటికి వీరు దాదాపుగా 10 కోట్లు. జాతీయ శాంపిల్ సర్వే / ఆర్థిక సర్వే ప్రకారం 6.5 కోట్ల మంది అంతర్రాష్ట్ర వలస కార్మికులు… అంటే మొత్తం 33% మంది కార్మికులు.
– 2019 నాటి అంతర్జాతీయ వలసదారుల్లో 47.9% మంది అంటే 13 కోట్ల మంది స్త్రీలు. అంతేకాకుండా ఇంటి యజమానులుగా, పని కోసం, విద్య కోసం స్త్రీలు స్వతంత్రంగా వలస వెళ్తున్నారు. ఈ ముందడుగులు ఉన్నా కానీ వలస వెళ్ళే స్త్రీలు తీవ్రమైన వివక్షత ఎదుర్కొంటున్నారు. పురుషులతో పోలిస్తే ఎక్కువ దుర్వ్వవహారానికి ఎరగా ఉన్నారు.
– రాష్ట్రాలు కార్మిక చట్టాలు ఎత్తివేయడం / రద్దు చేయటం ః కార్మిక చట్టాలు అమలులో అనేక రాష్ట్రాలు కీలకమైన మార్పులు చేశాయి. బిజెపి పాలనలోని మూడు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో తీవ్రమైన మార్పులు జరిగాయి. కాంగ్రెస్ పాలనలోని రాజస్థాన్, పంజాబ్, బిజెడి పాలించే ఒడిషా రాష్ట్రాల్లో కొన్ని మార్పులు జరిగాయి. అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ అన్ని కార్మిక చట్టాల అమలును వచ్చే రెండేళ్ళపాటు రద్దు చేయడం ద్వారా అత్యంత క్రూరమైన మార్పులకు ఒడిగట్టింది.
– 1979 అంతర్రాష్ట్ర వలస చట్టంతో సహా చట్టాలు, నియంత్రణల్లో సంస్కరణలు తీసుకువస్తూ వారి స్థితిని పునర్వించించడానికి ఆన్‌లైన్ ప్రవేశాలు, డేటాబేస్‌లు తయారు చేస్తోంది. దీనివలన వారు మానవహక్కుల రక్షకులుగా కనబడే అవకాశం ఉంది. ఇది అధికారికతను ప్రోత్సహిస్తుంది. అదే సమయంలో యజమాని / పెట్టుబడిదారు / కార్మికులపై వారి రాష్ట్రాల్లో కానీ, వారు వలస వెళ్ళిన రాష్ట్రాల్లో కానీ ఊహించగలిగిన స్థితిని కల్పిస్తుంది.
జవాబుదారీతనం ఉండాలి :
కోవిడ్-19 తర్వాత కార్మికులకు మంచి గౌరవప్రదమైన, సరసమైన వేతనాలతో ఉపాధి పొందే హక్కును నిలబెట్టడానికి అవసరమైన చర్యలను ప్రభుత్వాలు చేపట్టాలి.
– ఎవరు వలస కార్మికులు అనేదానిపై స్పష్టమైన నిర్వచనం లేకుంటే వారి ప్రాతినిధ్యం తప్పుగా జరిగే అవకాశం ఉంది కనుక స్పష్టమైన నిర్వచనం ఇవ్వాలి.
– పూర్తిస్థాయి వేతనంతో పాటు ప్రతి కార్మికుడికి / కార్మికురాలికి వచ్చే 3 నెలలపాటు కనీసం రూ.7000 (7వ పే కమిషన్ చెప్పిన కనీస వేతనం రూ.18000 లలో మూడో వంతు) లబించేలా ప్రభుత్వం హామీ ఇవ్వాలి. లక్షలాది మంది దిక్కుతోచని కార్మికులు గౌరవప్రదంగా బతకడానికి ఇది కనీస అవసరం.
– లైంగిక సున్నితత్వం గల, హక్కుల ప్రాతిపదిక గల విధానాలు, చర్యలు సంస్థాగతంగా తీసుకోవడం ద్వారా ప్రభుత్వం (కార్మిక మంత్రిత్వ శాఖ / ఇతర సంబంధిత శాఖలు) కార్మిక / మానవ హక్కులకు భంగం వాటిల్లకుండాను, వ్యాపారాలు కోలుకోవడంలో ఖర్చు తగ్గించడానికి ప్రస్తుతం దోహదపడుతుంది. దీర్ఘకాలికంగా ఆర్థిక వ్యవస్థ కోలుకున్నప్పుడు వలస కార్మికులు, వారి కుటుంబాల ఉపాధి సామాజిక భద్రతల లభ్యతను కాపాడడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
– ప్రభుత్వ పౌర, విధాన యంత్రాంగం కార్మికుల గురించి గణాంకాలు, వివరాలు, అంచనాలు సరిగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలి.
– 2008 అసంఘటిత రంగపు సామాజిక భద్రతా చట్టం అమలు చేయాలి. ఈ చట్టం ప్రకారం జిల్లా స్థాయిలో సామాజిక భద్రత కల్పించడం, నమోదు చేసుకోవడం జరగాలి. కానీ దీనిని అమలు చేస్తున్న దాఖలాలు ఏమీ లేవు. నిద్రావస్థలో ఉన్న ఈ చట్టపరమైన సదుపాయాల కల్పన అమలు చేయడానికి కోవిడ్ మహమ్మారిని ఒక అవకాశంగా భావించాలి. ఇది నగదు పంపిణీకి, వేతనాల చెల్లించకపోతే దీని పరిష్కార వేదికగాను అదనంగా ఉపయోగపడుతుంది.
తక్షణ చర్యకై పిలుపు : కోవిడ్-19 భౌతిక దూరాన్ని రుద్దినప్పటికీ సామాజిక సంఘీభావం కొనసాగుతూనే ఉంది. మానవత్వ దృక్పథాన్ని, ఈ సామాజిక సంఘీభావాన్ని పెంచి పోషించడంలోనూ ముందుకు కొనసాగించడంలో మన సమూహ సభ్యుల అప్రతిహతమైన మద్దతు చాలా అవసరం.
– ఉపాధిలో వారు ఆర్థిక భాగస్వాములయ్యేలా చూస్తూనే అసహాయులయిన కార్మికులలో ఈ వైరస్, ఆరోగ్యంపై దాని ప్రభావం గురించిన అవగాహన కలిగించాలి. కార్మికులు, కనీస జీవనోపాధి సంబంధిత అంశాలపై విధానాల అమలు గురించి ప్రభుత్వాలతో చర్చలు జరపడానికి మరింతమంది స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది.
– వలస కార్మికులు లేబర్ మార్కెట్‌లో అవసరాలు తీర్చడంలో పోషించే పాత్రను స్థానిక ప్రజలు చేయలేని / చేయడానికి ఇష్టపడని పనులు ఎట్లా చేస్తారో వివరిస్తూ సానుకూల కథనాలు రాయడం ద్వారా వివక్షతను, భయాన్ని తగ్గించేందుకు కృషి చేయాలి.
– ప్రభుత్వాలు చేపట్టిన పరిమితమైన చట్టపరమయిన చట్టానికి బదులుగా వలస కార్మికుల హక్కుల ఆధారితమైన పరిశోధన చేపట్టాలి.
ఓ ఆశా రేఖ : హర్యానా లోని సికర్ జిల్లాలో ఉన్న రెండు స్కూళ్ళలో, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్‌లకు చెందిన 54 మంది వలస కార్మికులను క్వారంటైన్ చేశారు. ఆ గ్రామ ప్రజలు వారికి ఆహారం, వసతి కల్పించారు. ఆ కార్మికులు తమకు క్వారంటైన్‌లో ఈ ఏర్పాట్లు చేసిన గ్రామస్థులకు తమ కృతజ్ఞత తెలపాలనుకున్నారు. గ్రామస్థులు వారికి అవసరమైన రంగులు, ఇతర సామగ్రి అందించారు. కార్మికులు ఆ సామగ్రిని ఉపయోగించి ఆ పాఠశాలలను అందంగా తీర్చిదిద్దారు. కార్మికులు చేసిన నిర్మాణ పనితనంతో గ్రామస్తులు చాలా సంతోషపడ్డారు. స్కూళ్ళు తిరిగి తెరవగానే పిల్లలు తిరిగి రావడానికి అద్భుతమైన వాతావరణం ఏర్పడింది. లాక్‌డౌన్ ప్రారంభంలో హర్యానాలోని సిర్యా, హిస్సార్ జిల్లాల్లోని తమ తమ గ్రామాలకు కొన్ని కుటుంబాలవారు తిరిగివచ్చారు. ధర్మశాలల్లో, స్కూళ్ళలో ఆయా గ్రామాల వాళ్ళు వారికి వసతి ఇచ్చి అవసరమైన సామగ్రిని అందించారు. కొన్ని వారాలపాటు ఈ వలస కార్మికులు క్వారంటైన్‌లో ఉన్నారు. ఆయా జిల్లాల్లోని ప్రజలు అందరి క్షేమం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పనిచేయడం ఆనందదాయకం. తిరిగి వచ్చిన కుటుంబాలు స్థానిక సమాజాలు, ఉన్నత తరగతి విద్య ఉంటేనే అవగాహన ఉంటుందనీ, ప్రభుత్వం వల్లనే సహాయం అందుతుందనే భ్రమలను బ్రద్దలు చేశారు.