ఈ హైదరాబాదు మా సీతారామపురం ఒక్కటే నాకు -కొండవీటి సత్యవతి

1975 లో చిన్న బావిలాంటి మా సీతారామపురం నుండి నేను మొదటి సారి రైలెక్కి మా నాన్నతో కలిసి హైదరాబాదుకొచ్చినప్పుడు నేను చాలా భయపడిపోయాను. రైల్లోనే వింత అనుభవం ఎదురైంది. హైదరాబాద్‌ సమీపిస్తున్నాం. నా ఎదుటి సీట్లో ూర్చున్న ఒకాయన కాలు పొరపాటున నా కాలికి తగిలింది. ‘మాఫ్‌ కరో బేటీ’ అన్నాడు. నేను కంగారుపడి కాలు వెనక్కి లాగేసుకున్నాను.దక్షిణ హిందీ ప్రచార సభ వాళ్ళ పరీక్షలు రాసి ఉండడం వల్ల నాకు కొంచం హిందీ తెలుసు. కానీ ఆయన ఏమన్నాడో నాకు అర్ధమవ్వలేదు.

రైలు దిగాక మా నాన్న నేను ఆటో ఎక్కి పాటిగడ్డ కాలనీ లోని మా చిన్నాన్న ఇంటికి వెళ్ళాం.అలా 45 సంవత్సరాలుగా హైదరాబాద్‌తో నా అనుబంధం కొనసాగుతోంది. కొంత కాలం అనామకంగా ఊరు పేరు లేకుండా రోడ్ల మీదే తిరిగాను. అప్పట్లో ఆర్టిసీ బస్సుల్లో సీజన్‌ టిట్లుె, హాలీడే టిట్లుె ఉండేవి. ఒక ఆదివారం ఆ టిట్‌ె కొనుక్కుని బస్సెక్కితే ఎన్ని రూట్లలోనైనా హేపీగా అదే టిట్‌ె తో తిరగొచ్చు.

చేతిలో డబ్బుల్లేని గడ్డు కాలం. ఎన్నో ఆదివారాలు హాలిడే టిట్‌ె కొనుక్కుని నగరం నులుమూలలా తిరిగిన ఆనుభవాలు ఎంత గొప్పవో. ఒక వారం మెహదిపట్నం రూట్లో. ఒక వారం దిల్‌షుక్‌నగర్‌ రూట్లో. అలా తిరగడం వల్లనే నాకు హైదరాబాద్‌ దారులన్ని కొట్టిన పిండి.తర్వాత కాలంలో కైనటిక్‌ ¬ండా, ఆ తరవాత కారు నడపడం నాకు నల్లేరు మీద నడకైంది.

అప్పట్లో డబుల్‌ డెక్కర్‌ బుస్సులుండేవి. ఓ మొక్క జొన్న పొత్తు కొనుక్కుని పై అంతస్థు మీద ూర్చుని హుస్సేన్‌ సాగర్‌ మీదగా చార్మినార్‌ ప్రయాణం అబ్బో ఎంత అద్భుతమో. ఇప్పుడొక డౌట్‌ వస్తోంది. డబుల్‌ డెక్కర్‌ బస్సులు చార్మినార్‌ దాకా వెళ్ళేవో, అఫ్‌జల్‌గంజ్‌ లో ఆగిపోయేవో గుర్తులేదు. చార్మినార్‌ చుట్టూ ఉండే షాపులు ఎంత కలర్‌ఫుల్‌గా ఉంటాయో… గాజుల బజార్‌ లో ఈ చివరి నుండి ఆ చివరికి ఎన్ని సార్లు తిరిగానో. నేనెప్పుడూ గాజులేసుకోలేదు కానీ మా ఊరి నుంచి వచ్చే వాళ్ళను చార్మినార్‌ తీసుళ్ళెడం గాజుల బజారు చూపించడం తప్పనిసరి. ఒక్క దాన్ని హాలిడే టిట్‌ె తో చార్మినార్‌ వెళ్ళినప్పుడు ఎదురైన అనుభవం తప్పక రాయాలి.

ఆ రోజు బస్సు దిగేసి నడుచుకుంటూ తిరుగుతున్నప్పుడు పెద్ద వర్షం మొదలైంది. నా చేతిలో గొడుగు గట్రా ఏమీ లేదు.

ఓ షాపు ముందు నిలబడ్డాను. పొడవాటి గడ్డం, తలమీద టోపి పెట్టుకున్న ఒకాయన షాపులో ఉన్నాడు. అది ఏమి షాపో ఇప్పుడు గుర్తు లేదు. షాపు మీద నుంచి నీళ్ళు ధారాగా పడుతున్నాయ్‌.

”అందర్‌ ఆవో బేటీ” అని పిలిచాడు. అప్పటికి కొంచం హిందీ అర్ధమౌతోంది. నేను భయపడ్డాను. కదలకుండా నిలబడ్డాను. సగం తడిచిపోయాను.

”తస్లీమా, ఏ బచ్చీకో అందర్‌ బులాదో” అని గట్టిగా సాేేడు.

ఆ షాప్‌ వెన ఆయన ఇల్లుంది కాబోలు ఒకామె బయటకొచ్చి, ‘అరే ఆవో అందర్‌ ఆవో ‘ అంటూ నా చేయిపట్టి లోపలికి తీసుళ్ళిెంది. తల తుడుచుకోమని టవలిచ్చి వేడి వేడి టీ ఇచ్చింది. వర్షం తగ్గేవరకు అక్కడే ఉన్నాను.

ఒక ముస్లిం కుటుంబంతో ఇదే నా మొదటి ఆత్మీయ అనుభవం.

చరిత్ర ద్వారానో, మరిందోే సాధనం ద్వారానో నా బుర్రలో ఉన్న ఒక అనుమానపు దృష్టి, నాకు కూడా కనబడని ఒక ద్వేష దృష్టి ఆ రోజు ఆ వర్షంలో కొట్టుకుపోయాయి.

ఆ తర్వాత లెక్కలేనన్ని అనుభవాలు, లెక్కలేనంతమంది స్నేహితాలు కుదిరాయి.

స్నేహాలు కలిసాయి. అవి అలాగే నిలిచి ఉన్నాయి.

హైదరాబాద్‌ అంటే ఇరానీ చాయ్‌, ఉస్మానియా బిస్కెట్స్‌. మొదట్లో ఇరానీ ఫ్‌ేలకి వెళ్ళాలంటే ఎదో బెరుకుగా ఉండేది. అవెప్పుడూ మగవాళ్ళతో నిండి ఉంటాయి. గుంపులు గుంపులుగా మగవాళ్ళు ూర్చుని ఆరాంగా టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం సాధారణంగా కనిపించే దృశ్యం. అలాంటి ఇరానీ ఫుేల్లోకి చొరబడి ఎర్రటి బురదనీళ్ళల్లాంటి వేడి వేడి చాయ్‌ తాగడం మొదట్లో పెద్ద అడ్వంచరే. ఆ తర్వాత బయటళిెతే చాయ్‌ తాగకుండా ఇంటికొచ్చేదే లేదు.

ఆంధ్రాలో కాఫీ అంటే ఎంత జ్రోే హైదరాబాద్‌ ఇరానీ చాయ్‌ అంతకంటే సూపర్‌.

అప్పట్లో హైదరాబాద్‌ బిరియాని అంటే సికింద్రాబాద్‌ స్టేషన్‌ దగ్గరున్న అల్ఫా ¬టల్‌ మాత్రమే ఉండేది నాకు తెలిసి.పేరడైజ్లు,బావర్చీలు అప్పట్లో లేవు.

బిరియానీ తినాలనిపిస్తే అల్ఫా ¬టల్‌ కి వెళ్ళడం.అలాగే చాదర్‌ఘట్‌ దగ్గర నయాగరాకి ూడా వెళ్ళినట్టు గుర్తు.

మా ఊరు వెళ్ళాలంటే సికింద్రాబాద్‌లో రైలెక్కాలి. ముందే బయలుదేరి అల్ఫా ¬టల్‌ కి వెళ్ళి బిరియాని లాగించెయ్యడమో, పాక్‌ చేయించుకోవడమో అలవాటుగా ఉండేది. అలాగే నాన్‌కింగ్‌లో చికెన్‌ లాలీపాప్స్‌ కూడా తినేవాళ్ళం. చైనీస్‌ పుడ్‌ అంటే ఏంటో హైదరాబాదు వచ్చాకే కదా తెలిసింది.

హైదరాబాద్‌ లోని ముస్లిం ఫ్రెండ్స్‌ ఇళ్ళల్లో తిన్న బిర్యానీ రుచి ఎప్పటికీ మర్చిపోలేను.

కబాబ్స్‌ అంటే ఏమిటనేది హైదరాబాద్‌ వచ్చా తెలిసింది.

ఎన్ని రకాల కబాబ్స్‌ ఎంత రుచికరమైన కబాబ్స్‌.

నిజాం క్లబ్‌ లో కబాబ్స్‌, మటన్‌ బిర్యానీ తినాల్సిందే. చెప్పడానికి ఏమీ ఉండదు.

మా సీతారామపురంలో మాకు తెలిసిన మామిడి పండ్లు తిప్పికొడితే పది రకాలుంటాయేమో.

హైదరాబాదొచ్చాకా ఎన్ని వెరైటీస్‌ మామిడి పండ్లు.

ఇమాం పసంద్‌, నూర్జహాన్‌, అల్ఫోన్సా, హిమయత్‌ పసంద్‌ ఏమి పసందైన మామిడిపండ్లు.

హైదరాబాద్‌ అంటే మూసీకి ఇవతలి ప్రాంతమే కాదు.

అసలైన హైదరాబాదీ జీవితం మూసీకి అవతలే ఉంది.

అక్కడి కట్టు, అక్కడి భాష, అక్కడి ఆహార్యం, అక్కడి ఆహారం, అక్కడి వారి ప్రేమ, ఆత్మీయతలు ఇవన్ని కలబోస్తే తయారైందే హైదరాబాద్‌ హలీం.

ఎన్నో సంవత్సరాలుగా భిన్నత్వంలోనే ఏకత్వాన్ని సాధించిన, ప్రేమ పునాదుల మీద నిలబడిన హైదరాబాదు మీద ద్వేషమేఘాలు కమ్ముకునేలా చెయ్యాలని జరుగుతున్న ప్రయత్నాలు తీవ్ర మానసిక కల్లోలాన్ని రేపుతున్నాయ్‌.

ప్రేమపూర్వక రంజాన్‌ ఆలింగనాల సాక్షిగా ఇక్కడ బతుకుతున్న ప్రజలెవ్వరికీ లేని విద్వేషం, అసహనం రాజకీయ నాయకులు ప్రోదిచేసి పెనుమంట వెయ్యాలనుకుంటున్నారు.

మహా నగర ఎన్నికలు నగర అభివృద్ధి అంశాల చుట్టూ ఉండాలి కానీ మత ద్వేషం చుట్టూ కాదు.

మతద్వేషాన్ని మండించిన వారు బాగానే ఉంటారు.

సమిధలై కాలిపోయేది మాత్రం సామాన్య ప్రజలే.

నేను మనిషిగా ఒక అస్తిత్వంతో నిలబడింది ప్రేమ నిండిన ఈ నగరం లోనే.

ద్కిూ మ్కెుూ లేకుండా పొట్ట చేబట్టి ఈ నగరానికొచ్చిన నాలాంటి లక్షలాది మందిని అక్కున చేర్చుకున్న హైదారాబాద్‌ అంటే నాకు ఒల్లమాలిన ప్రేమ.

ఇక్కడి బహుముఖీన సంసృతి, ఇక్కడి ఆహారపు అలవాట్లు, ఇక్కడి మనుష్యుల ప్రేమాభిమానాలు ఒక మూసలో ఇమిడేవి కావు.

భిన్నత్వంతో ఫరిడవిల్లేవి. భిన్నత్వంలో ఉన్న సౌందర్యం అర్ధమవ్వాలంటే ఇక్కడ బతకాల్సిందే.

హైదరాబాద్‌ అంటే సైబరాబాద్‌, ఐటి మాత్రమే కాదు హైదరాబాదంటే బహుళం. ఏడు రంగుల ఇంధ్రధనుస్సు. నాకు కావాల్సింది ఒక్క రంగు కాదు, బహు వర్ణాలు కావాలి నాకు. విభిన్నత్వం కావాలి. భిన్నమైన సంస్కృతి ధారలు కావాలి.

హైదరాబాద్‌ ఆత్మ, అనంతమైన ప్రేమ కావాలి.

ద్వేషం, అసహనం వద్దు కాక వద్దు.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.