వివాహ మంత్రాల తాత్పర్యం -అబ్బూరి ఛాయాదేవి

ఇది పెళ్ళిళ్ళ సమయం. ఎందరో వధూవరులు పెళ్ళిపీటల మీద కూర్చుని పురోహితుడు చదివే మంత్రాలను వింటున్నారు. కొన్నింటిని చిలక పలుకుల్లా పురోహితుడు చెప్పమన్నట్లు చెబుతున్నారు. అందులో ఎందరికి తెలుసు వివాహ మంత్రాల అర్థాలు? పీటలమీద కూర్చున్న వాళ్ళకి తెలియవు. పెళ్ళికి వచ్చిన ఆహుతులకూ తెలియవు, ఎవరో ఒకరిద్దరికి తప్ప.

మచ్చుకి కొన్ని ముఖ్యమైన వివాహ మంత్రాలకు తాత్పర్యాన్ని తెలుసుకుంటే చాలు ఎన్నో ఆశ్చర్యకరమైన విశేషాలు వెల్లడవుతాయి. వివాహ కార్యక్రమంలో వరుడి ప్రాముఖ్యం, ఆదిమానవుల సాంఘిక వ్యవస్థ, వేదకాలంనాటి వారి విశ్వాసాలూ, ధర్మసూత్రాలూ మొదలైనవి ఎన్నో తెలియవస్తాయి. ముఖ్యంగా అరుంధతిని ఆదర్శంగా తీసుకోవలసిన వధువు స్థానం ఎటువంటిదో, ఆ వధువు పొందే వరుడు ఎటువంటివాడో మొదలైనవి తెలుసుకోవలసిన, ఆలోచించవలసిన అంశాలు.

వివాహ కార్యక్రమంలో పురోహితుడు చదివే మంత్రాలు చాలావరకు వరుడి తరపున, వరుడికి బదులుగా చదివే మంత్రాలే. వివాహం చేసుకుంటున్నది వరుడు. వరుడు ముందుగా దేవతలను ప్రార్థిస్తాడు.

”దేవతలకు తల్లివైన ఓ అదితీదేవీ, నేను చేస్తున్న ఈ వివాహ కర్మను అంగీకరించు. ఓ సరస్వతీ దేవీ అంగీకరించు. ఓ పరమేశ్వరుడా నాకు స్ఫూర్తినిచ్చి, ఈ కర్మను అంగీకరించు. ఓ వరుణుడా ఈ కన్యకు సహోదరులు పోనట్టి భాగ్యాన్ని ప్రసాదించు.. ఓ బృహస్పతీ ఈమెకు భర్తపోనట్టి భాగ్యాన్ని ప్రసాదించు… ఓ ఇంద్రుడా ఈమెకు పుత్రులు పోనట్టి భాగ్యాన్ని ప్రసాదించు. ఓ సూర్యుడా ఈమెకు సహోదరులు, భర్త, పుత్రులూ పోనట్టి భాగ్యాన్ని ప్రసాదించు”.

తరువాత వరుడు వధువుని ఉద్దేశిస్తూ –

”ఓ కన్యా నీవు హింసాకరమైన దృష్టి లేకుండా భర్తను చంపేదానవు కాకుండా ఉండు. భర్త కోసం, బావమరుదుల కోసం మంగళప్రదంగా ఉండు. దేవతలను పూజిస్తూ ఉండు. మనుషులనూ, పశువులనూ సుఖప్రదంగా ఉంచు” అని చెప్పి,

”ఓ వధూ, భర్తను చంపే దౌర్భాగ్యం నీకున్నట్లయితే దాన్ని ఈ దర్భతో తుడిచివేస్తున్నాను” అంటూ వధువు కనుబొమల మధ్య దర్భను తాగిస్తాడు. వధువు శిరస్సుపైన ఉంచిన దర్భ వలయంలాగ వధూవరుల తల్లులు, బావమరుదులూ వలయాకారంలో వివాహాగ్ని చుట్టూ ఉండి దాన్ని సంరక్షించమని ప్రార్థిస్తాడు.

తరువాత ఇంద్రుని ప్రార్థిస్తాడు వరుడు.

”ఓ ఇంద్రుడా! ‘అపాల’ను తేజోవంతంగా చేసినట్లుగానే ఈ వధువును కూడా సూర్యతేజస్సు కలదానినిగా చేయి” ఈ ప్రార్థనకు కారణం అత్రి మహా ముని కుమార్తె బ్రహ్మవాదిని అనే కన్యకు ”బొల్లి” వ్యాధి ఉండడం వలన వరుడు దొరకలేదు. ‘పాలకుడు’ లభించనిది కాబట్టి ఆమెకి ‘అపాల’ అని పేరొచ్చింది. వరుడు లభించేలా చేయమని ఆమె నిత్యం ఇంద్రుని పూజించేదట. ఓ సారి నదిలో కొట్టుకుపోతూ కూడా, చేతికందిన సోమలతని నమిలి, ఆ రసంతో ఇంద్రుని పూజించిందట. ఇంద్రుడు ఆ రసాన్ని స్వీకరించి రతము, ఇరుసు, కాడి ఈ మూడింటి రంధ్రాల గుండి ఉదకాన్ని పోసి ఆమెను పవిత్రురాల్ని చేశాడట. ఆమెకు ‘బొల్లి’ పోయి ఆరోగ్యవంతురాలైందట. అప్పటి నుంచీ ప్రతి వధువునూ ఆ విధంగా ఉదకంతో పవిత్రం చేయడం ఆచారమైంది.

బండి కాడి యొక్క రంథ్రంలో బంగారం (మంగళసూత్రం) ఉంచి దాని మీదుగా వధువుపైన ఉదకం వచ్చి వధువు దేహాన్ని పవిత్రం చేసి ”ఆలింగనానికి అర్హమయ్యేటట్లు” చేయమని పరమేశ్వరుని ప్రార్థిస్తాడు వరుడు. ఆ తరువాత వధువుకి మధుపర్క వస్త్రాన్ని ఇచ్చి, వరుడు వధువుకి నడుముకి దర్బతాడు కడతాడు వివాహమనే పుణ్యకర్మ ఆచరించడానికి.

వరుడు వధువుని ఉద్దేశించి ఇలా అంటాడు –

”ఓ వధూ! చంద్రుడు నిన్ను ముందుగా పొంది, తరువాత విశ్వావసుడనే గంధర్వునికిచ్చాడు. ఆ ఇద్దరి తరువాత అగ్నిహోత్రుడు నిన్ను వరించి నీకు మూడవ భర్త అయ్యాడు. ఆ దేవతలు పొందిన తరువాత మనుషులలో నిన్ను పొందిన నేను నీకు నాల్గవ భర్తనవుతాను. అగ్నిహోత్రుడు నిన్ను నాకిచ్చి, నీ వల్ల సంతానమూ, భాగ్యమూ కలిగేటట్లు నన్ను అనుగ్రహించాడు. నన్ను వివాహం చేసుకుని ఆజన్మాంతం నాతో ఉండు. యోగ్యమైన సంతానం కోసం నిన్ను వివాహమాడుతున్నాను. వివాహ వేదికపై ప్రకాశిస్తున్న అగ్నిహోత్రుని ఎదుట దేవతలందరూ నిన్ను నాకర్పించినందువల్ల నిన్ను స్వీకరిస్తున్నాను. అగ్నిహోత్రుని స్నేహితుడైన వాయువు నాపై ఎల్లప్పుడూ నీవు ప్రేమ కలిగి ఉండేలా అనుగ్రహించవలసిందని కోరుతున్నాను”.

”ఓ వధూ! చంద్రుడు నిన్ను ముందుగా పొంది, తరువాత విశ్వావసుడనే గంధర్వునికిచ్చాడు. ఆ ఇద్దరి తరువాత అగ్నిహోత్రుడు నిన్ను వరించి నీకు మూడవ భర్త అయ్యాడు. ఆ దేవతలు పొందిన తరువాత మనుషులలో నిన్ను పొందిన నేను నీకు నాల్గవ భర్తనవుతాను. అగ్నిహోత్రుడు నిన్ను నాకిచ్చి, నీ వల్ల సంతానమూ, భాగ్యమూ కలిగేటట్లు నన్ను అనుగ్రహించాడు. నన్ను వివాహం చేసుకుని ఆజన్మాంతం నాతో ఉండు. యోగ్యమైన సంతానం కోసం నిన్ను వివాహమాడుతున్నాను. వివాహ వేదికపై ప్రకాశిస్తున్న అగ్నిహోత్రుని ఎదుట దేవతలందరూ నిన్ను నాకర్పించినందువల్ల నిన్ను స్వీకరిస్తున్నాను. అగ్నిహోత్రుని స్నేహితుడైన వాయువు నాపై ఎల్లప్పుడూ నీవు ప్రేమ కలిగి ఉండేలా అనుగ్రహించవలసిందని కోరుతున్నాను”.

”ఓ వధూ, నీవు నన్ను అనుసరించి నడు. విష్ణుమూర్తి నీవు వేసే మొదటి అడుగు వలన అన్నాన్నీ, రెండవ అడుగు వలన బలాన్నీ, మూడవ అడుగు వలన కర్మాన్నీ, నాల్గవ అడుగు వలన కర్మసుఖాన్నీ, అయిదవ అడుగు వలన పశుసమృద్ధినీ, ఆరవ అడుగు వలన ఋతుసంపత్తినీ, ఏడవ అడుగు వలన యజ్ఞం చేయించడానికి ఏడుగురు ఋత్విక్కులనూ కలుగజేయవలసిందని ప్రార్థిస్తున్నాను”.

”ఓ వధూ! మనమిద్దరం ఏడడుగులు కలిసి నడిచినందువల్ల స్నేహితులమైనాం. ఇక మనం ఒకరినొకరు విడువవద్దు. మనమిద్దరం పరస్పరం ప్రేమించుకుంటూ, అనుకూల దాంపత్యం సాగిస్తూ, ఒకరినొకరు సంప్రదించుకుంటూ మన మనసుల్ని ఏకం చేసుకుని ధర్మకార్యాలన్నింటినీ నిర్వర్తిస్తూ కలిసి ఉందాం. నేను సామవేదమైతే, నీవు ఋగ్వేదానివి. అంటే ఋగ్వేద సామవేదాలలాగే అవినాభావంగా ఉందాం. సంయోగ క్రియను బట్టి నేను ఆకాశంతో సమానం, నీవు భూమితో సమానం. నేను పైన, నీవు క్రింద… ఇంద్రియాల్లో ప్రధానమైన మనస్సుని నేనైతే, ఆ మనస్సు నుంచి వచ్చే వాక్కువి నీవు…”

వధువుని మొట్టమొదట పొందిన చంద్రునికి, తరువాత పొందిన విశ్వావసుడనే గంధర్వునికి, ఆ తరువాత పొందిన అగ్రిహోత్రునికి హవిస్సుని సమర్పిస్తాడు వరుడు. అంతటితో కన్యాక్రాంతం పూర్తయి, వధువు తండ్రి గృహాన్ని విడిచి భర్త గృహానికి బయలుదేరుతుంది.

వరుడు మళ్ళీ ప్రార్ధిస్తాడు – ”ఓ ఇంద్రుడా, ఈ వధువుకి వివాహానంతరం పుట్టింటి పైన ఆపేక్ష లేకుండానూ, మెట్టింటిపైనే ప్రేమ కలిగి ఉండేటట్లుగానూ, సుపుత్ర సంతానం, భాగ్యం కలిగేటట్లుగానూ అనుగ్రహించు”.

దీర్ఘాయువు కలిగిన సంతానాన్ని ప్రసాదించమని వరుణునీ, అగ్నిహోత్రుని కూడా ప్రార్థిస్తాడు. తరువాత, వధువుతో అంటాడు.

”ఓ వధూ, మన ఇంట్లో ఎప్పుడూ ఏడుపు వినిపించకుండా ఉండాలి. ఏడ్చేవాళ్ళకి దూరంగా ఉండు. నీవు కూడా ఎప్పుడూ జుట్టు విరబోసుకుని, గుండెలు బాదుకుంటూ ఏడవకు. భర్తనీ, సంతానాన్నీ చూసుకుంటూ సంతోషంగా ఉండు.”

”ఓ వధూ, నీ నడుముని ఆకాశమూ, తొడల్ని వాయువూ, స్తనాల్ని అశ్వనీదేవతలూ, ధరించిన వస్త్రాన్ని బృహస్పతీ, వెనుక భాగాన్ని విశ్వదేవతలూ రక్షించవలసిందని ప్రార్థిస్తున్నాను.”

”ఓ వధూ, ఈ రాతి మీద పాదం పెట్టు. నీవు కూడా ఈ రాయిలాగే శాశ్వతంగా ఉంటావు. యుద్ధం చేసేవారిని ఎదుర్కొని యుద్ధం చెయ్యి”. ”ఓ వధూ, వరుణ దేవుడు నిన్ను బంధించిన పాశాన్ని విడిపిస్తున్నట్లుగా ఈ దర్బతాడుని విప్పుతున్నాను”.

”అత్తమామలపైనా, ఆడబిడ్డలపైనా, బావమరుదుల పైనా ప్రేమగా ఉండు. నీవు నా వలన పోషించబడుతూ, నాయందు నిశ్చలమైన భక్తితో ఉండు. బృహస్పతి నిన్ను నా కొరకు ఇచ్చాడు కనుక, నా వల్ల సంతానాన్ని పొంది

నూరేళ్ళు జీవించు”. అని చెప్పి వరుడు ఇలా ప్రార్థిస్తాడు.

”కశ్యపుడు మొదలైన ఏడుగురు మునులూ తమ ఏడుగురు భార్యలతో అరుంధతీదేవి అగ్రగణ్యురాలనీ, మనస్సులోనైనా వ్యభిచరించే గుణంలేని నిశ్చల మనస్సు కలది అనీ భావించేవారు. అందువల్ల అరుంధతిని మిగిలిన ఆరుగురు స్త్రీలూ తమలో అగ్రగణ్యురాలని భావించారు. ఇప్పుడీ వధువు ఆ ఏడుగురి తరువాత ఎనిమిదవదిగా పవిత్రమైనదిగా ఎంచాము కాబట్టి ఈమె వృద్ధి పొందుగాక!”

ఇదంతా హిందూ సాంప్రదాయం ప్రకారం చెప్పే కొన్ని వివాహ మంత్రాల తాత్పర్యం. అయితే, ఆచరణలో వివిద ప్రాంతాల్లో వివాహ కార్యక్రమంలో వైవిధ్యం కనిపిస్తుంది. మిగిలిన మతాలవారు వారి సాంప్రదాయాల ప్రకారం ఏమేం చెబుతారో మరి?!

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.