పశ్చాత్తాపం లేని ఒక కార్పొరేట్‌ దళారీ – అశోక్‌ కుంబము

భారత ప్రభుత్వంతో రైతులు వీరోచితంగా చేస్తున్న పోరాటాన్ని మండీ దళారుల ప్రోత్సాహంతో నడిపిస్తున్న కృత్రిమ ఉద్యమంగా చిత్రీకరించే పనిని కొందరు మేధావులని ముద్రవేసుకున్న వాళ్ళు భుజానికి ఎత్తుకున్నారు. ప్రస్తుతం తెలుగు నేల మీద అలాంటి పని చేస్తున్న వాళ్ళలో ప్రముఖుడు జయప్రకాష్‌ నారాయణ (జెపి).

ప్రస్తుత సందర్భంలో జెపీని ఒక మేధావిగా భావించడం కన్నా ఒక కార్పొరేట్‌ దళారిగా చూడడం సరయినది. ఎందుకంటే ‘రైతు మేలు కోసమే’ అంటూ కార్పొరేట్‌ ప్రయోజనాల కోసం ఆయన సమర్ధిస్తున్న కొత్త చట్టాల మూలంగా రైతు తన పంట మీద, తన జీవితం మీద పూర్తి నియంత్రణ కోల్పోయి ఒక నిర్జీవ వస్తువుగా మారి మార్కెట్‌ చేతిలో ఒక సాధనమయ్యే ప్రమాదం ఉంది. ఇక మీదట రైతు మార్కెట్‌ నిర్దేశించే పంటలే వేయాలి. అది చెప్పే విత్తనాలు, రసాయనాలే వాడాలి. మార్కెట్‌ ధర నిర్ణయిస్తుంది. చివరికి రైతు భూమికి, మార్కెట్‌కు మధ్య ఒక appendageగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఈ మొత్తం ప్రక్రియలో జెపీ లాంటి ఎందరో మేధో దళారులు తమ శక్తినంతటినీ పోగు చేసుకుని రైతు వ్యతిరేక చట్టాలకు ప్రజల మద్దతు కూడగట్టే పని చేస్తున్నారు.

జెపీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే కుతర్కాన్ని కూడా గట్టిగా వక్కాణించి తర్కంగా చెలామణి చేయడం. వాదనలోని వైరుధ్యమైన, అహేతుకమైన అంశాలను సైతం తన గంభీరత్వంతో కప్పేయడం, తనకు తానుగా ప్రజల తరపున వకాల్తా పుచ్చుకున్న మేధావిలా ముద్ర వేసుకుని ప్రజల గొంతుకకు అడ్డు పడడం. తన భాషా ప్రావీణ్యంతో అనేకానేక ప్రవచన విన్యాసాలు చేస్తున్నప్పుడు ఎంతో కొంతమందైనా ”అరె జెపీ లాంటి పెద్ద మనిషే ఈ చట్టాలను ఆహ్వానిస్తున్నాడంటే వాటిలో ఏదో ఒక మంచి ఉండే ఉంటుంది” అని భ్రమ పడేటట్లు చేయడం. అయితే ”మా ఇల్లు సత్యహరిశ్చంద్రుని ఇంటి పక్కనే” అని చెప్పుకున్నంత మాత్రాన తాను చెప్పేవన్నీ సత్యాలయిపోవు కదా. అందుకే నీ ”ఒట్టి మాటలు కట్టిపెట్టవోయ్‌” అని సున్నితంగానే కొందరు చెబుతున్నారు. కానీ ఆయన మాత్రం ”నాకు ఏ సిద్ధాంతాలతో పనిలేదు. రైతు మేలే నాకు ముఖ్యం” అనే మాట అన్ని టీవీ ఛానల్స్‌లో ప్రతిధ్వనించేలా మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉన్నాడు.

వ్యవసాయ చట్టాల మీద తాను చేస్తున్న వాదనలోని డొల్లతనాన్ని ఇప్పటికే ఎందరో రైతు మిత్రులు అనేక మాధ్యమాలలో ఎండగట్టి ఉన్నారు. కాబట్టి వాటి లోతుల్లోకి మళ్ళీ వెళ్ళదలచుకోలేదు. అయితే ఆయనలాంటి దళారీలను లోతుగా అర్థం చేసుకోవాలంటే తనకు ఏ సిద్ధాంతమూ లేదంటూనే ప్రచారం చేస్తున్న నయా ఉదారవాద మార్కెట్‌ సిద్ధాంతం గురించి మాట్లాడుకోవాలి.

చట్టాల గురించి ఆయన చేస్తున్న వాదనలను ఉపరితలంలోనే పరిశీలిస్తే అవి ఎంతో ఆకర్ణణీయంగా, రైతు ప్రయోజనకారిగా కనిపిస్తాయి. ఈ చట్టాలు చెబుతున్న కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. ఈ కొత్త చట్టాలు రైతులను దళారీ వ్యవస్థ నుండి విముక్తులను చేస్తాయి. రైతులు తమ ఇష్టానుసారం పంటను దేశంలో ఎక్కడైనా, ఎవరికైనా అమ్ముకునే అవకాశం పొందుతారు. మార్కెట్లో ఎక్కువమంది కొనుగోలుదారులు ఉంటే రైతు తన పంటకు ధర ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే అమ్ముకునే ప్రయోజనం (Competitive advantage) ఉంటుంది. దీని వల్ల మధ్యవర్తులు, వాళ్ళ లాభాల గోల లేని ఒక పారదర్శక (transparency) పరిస్థితి వచ్చి రైతు, మార్కెట్‌ శక్తులు ఇద్దరూ లాభపడే అవకాశం ఉంటుంది. ఈ చట్టాల వల్ల ప్రభుత్వ గిడ్డంగుల్లో ధాన్యం కుళ్ళిపోకుండా రైతు పొలం నుండే కొనబడిన ఆహార ధాన్యాలు మార్కెట్‌ సామర్ధ్యం మూలంగా మెరుగైన నాణ్యంతో కూడిన ఆహారంగా (value added food) తిరిగి వాళ్ళ పళ్ళాలలోనికి వస్తాయి. మొత్తంగా ఈ చట్టాల మూలంగా రైతుల ఆదాయాలు పెరుగుతాయి. రిస్క్‌ తగ్గుతుంది. గ్రామీణ ఉపాధులు పెరుగుతాయి. చివరిగా రైతులు స్వేచ్ఛా వాణిజ్య మార్కెట్‌లో ఎలాంటి అడ్డంకులు లేకుండా విహరిస్తారు.

వినడానికి ఎంత బాగున్నాయికదా! ఇటువంటి మాటలు చెప్తూ ఒక ఊహాలోకంలోకి తీసుకుపోతున్నారు. ఇవన్నీ వీళ్ళ బుర్రల్లోంచి వచ్చినవే అనుకుంటే పొరబడినట్లే. వీటి మూలాలు వెతకడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. కనీసం 1980 నుండి వ్యవసాయం మీద ప్రపంచ బ్యాంక్‌ ప్రకటిస్తున్న ఏ పాలసీ డాక్యుమెంట్‌ను చూసినా ఈ పెద్ద మనుషుల సుద్దుల అసలు రహస్యం బయట పడుతుంది.

ప్రపంచబ్యాంక్‌ ఏం చెబుతుంది? వ్యవసాయాన్ని ఒక వ్యాపారంగా చూడాలని చెబుతుంది. వ్యవసాయంలో మా జీవితముంది, సంస్కృతి ఉంది, అది ప్రకృతితో ముడిపడి ఉంది… ఇలాంటివన్నీ ప్రపంచ బ్యాంక్‌ దృష్టిలో ‘పనికిమాలిన వెనుకబాటుతనపు మాటలు’. మరి వ్యవసాయం ఎలా చెయ్యాలి, రైతులు ఏం పండించాలి? ప్రపంచ మార్కెట్‌ ఏది నిర్దేశిస్తే అది రైతులు పండించాలి. ఎందుకంటే మార్కెట్‌ వ్యక్తులకన్నా, ప్రభుత్వాలకన్నా ఎక్కువ సామర్ధ్యం కలిగి ఉంటుంది. నిష్పాక్షికంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు మార్కెట్‌కు చట్టపరంగా, భద్రతాపరంగా కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రపంచ బ్యాంక్‌ గత నలబై సంవత్సరాలుగా అన్ని దేశాలను ఆదేశిస్తోంది.

ప్రపంచ బ్యాంక్‌ కేవలం ఆదేశించడమే కాదు, దానికి అనుకూలంగా తన వాదనలను ప్రజల్లోకి తీసుకుపోవడానికి ప్రజలను మోసం చేస్తున్నామని పశ్చాత్తాపపడని ఒక దళారీ మేధావి వర్గాన్ని కూడా తయారు చేసుకుంది. అటువంటి ప్రయోగశాలలో తయారుకాబడిన దళారీ లక్షణాలు పుష్కలంగా ఉన్న వ్యక్తుల్లో పోటీపడి మొదటి వరుసలో ఉండగలిగిన వాడు జేపీ. సరే, ఆయన ఏ పల్లకీ మోస్తే మనకేంటి, దాని మూలంగా రైతులకు వచ్చే నష్టం ఏంటి? అనేది సహజంగా వచ్చే ప్రశ్నే.

ఈ చట్టాల ఫలితాలు అనుభవిస్తేనే కానీ తెలువనివి కాదు. ఎందుకంటే వీటిని సామ్రాజ్యవాద శక్తులు ప్రపంచమంతా ఏదో ఒక స్థాయిలో, ఏదో ఒక రూపంలో అమలు చేస్తూనే ఉన్నాయి. అన్నింటికి ‘ఆదర్శంగా’ చెప్పుకునే అమెరికాలో 1980ల నుండి వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణల మూలంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయి చతికిల పడింది. ముఖ్యంగా చిన్న రైతులు (మూడు, నాలుగువందల ఎకరాల భూమి ఉండేవాళ్ళు) వ్యవసాయం నుండి బయటకు వెళ్ళిపోయి పెద్ద రైతుల (మూడు, నాలుగు వేల ఎకరాల భూములుండే) కమతాలు ఇంకా పెరుగుతున్నాయి. ఈ భూకేంద్రీకరణ తీవ్రం కావడానికి కారణం చిన్న రైతులు ‘స్వేచ్ఛా మార్కెట్‌’లో బతకలేని పరిస్థితి మూలంగానే.

‘స్వేచ్ఛా మార్కెట్‌’లో స్వేచ్ఛ ఉండేది కేవలం కార్పొరేట్‌ శక్తులకే కానీ రైతులకు కాదు. ఎందుకంటే అందంగా చెప్పబడుతున్న స్వేచ్ఛా మార్కెట్‌లో కేవలం కొన్ని బహుళ జాతి సంస్థలు మాత్రమే గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లో, ఏ నిర్వచనం పరంగా కూడా మార్కెట్‌లో రైతులకు స్వేచ్ఛ దొరకదు. కేవలం ఐదు కార్పొరేషన్లే ప్రపంచ వ్యాప్తంగా ఎనభై ఐదు శాతం విత్తనాలను, రసాయనాలను, ఆహార ఉత్పత్తుల కొనుగోలును నియంత్రిస్తున్నాయి. ఇటువంటి స్థితిలో అమెరికాలోని రైతే బతకలేని పరిస్థితి ఉంటే ఇక భారత రైతాంగం గురించి ఏం చెప్పగలము. వాస్తవానికి, అమెరికన్‌ రైతులలో ప్రతి సంవత్సరం ఆత్మహత్యల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఇది వాస్తవం. కొద్దిపాటి పరిశోధనతో ఎవరికైనా అర్థమయ్యే విషయం.

అమెరికా పైన ఉన్న కెనడాలో కూడా పరిస్థితి ఏమీ మెరుగ్గా లేదు. దాదాపు 15 సంవత్సరాల క్రితం నేను పిహెచ్‌డి చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రైతు సదస్సుకు వెళ్ళే అవకాశం వచ్చింది. అక్కడికి వెళ్ళేముందు అనుకున్నా ఈ రైతులకు ఏం సమస్యలు ఉంటాయిలే అని. నేను అనుకున్నట్లే ఆ రైతులు మంచి సూటు, బూటు వేసుకొని ఉన్నారు. అక్కడ మీటింగ్‌ అయిపోగానే కొందరు డాన్స్‌ ఫ్లోర్‌ మీద బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. అవన్నీ చూస్తున్నప్పుడు తెలంగాణలో పురుగుల మందు తాగి చస్తున్న రైతులే గుర్తుకొచ్చారు. అయితే కాసేపయిన తర్వాత డిన్నర్‌ దగ్గర ఒక రైతుతో మాటలు కలిసి అతనే అడిగాడు ”మీ దగ్గర రైతు పరిస్థితి ఏంటి?” అని. ఆయన ఆ మాట అడగగానే రైతుల బాధలు, ఆత్మహత్యలు అన్నీ అడగకుండా పది, పదిహేను నిమిషాల పాటు చెప్పినా. అంతా ఓపికగా విన్న ఆ పెద్దాయన మెల్లగా అన్నాడు ”మా దగ్గర రైతు ఆత్మహత్యలు లేవు కానీ మేమూ ఆత్మహత్యా పరిస్థితుల్లో బతుకుతున్నాం” అని.

ఆ ఒక్క మాటతో నాకు దిమ్మ తిరిగిపోయింది. ఒక్క దెబ్బతో నా తప్పుడు అవగాహన పటాపంచలయింది. కేవలం వాళ్ళ తెల్లరంగుని బట్టి, వాళ్ళ రూపాన్ని బట్టి వాళ్ళను తప్పుగా అంచనా వేసినందుకు చాలా గిల్టీగా ఫీలయిన. ఆ ఒక్క మాటతోనే నా పరిశోధనలో కెనడియన్‌ వ్యవసాయాన్ని జతచేసిన. అయితే వాస్తవానికి ఆ కెనడియన్‌ రైతు చెప్పినట్లు ఆత్మహత్యలు లేవని కాదు, కానీ వాళ్ళ మరణాలు ఆత్మహత్యలుగా నమోదు కావడం లేదు. ఎందుకంటే ఆత్మహత్య అని చెబితే వాళ్ళకు రావాల్సిన ఇన్సూరెన్స్‌ డబ్బులు రాకుండా పోతాయని. ప్రస్తుతం నేను అమెరికాలో రైతుల మీద చేస్తున్న పరిశోధన కూడా అదే విషయాన్ని చెబుతోంది.

అభివృద్ధి చెందిన దేశాలలోని పరిస్థితే ఇంత దారుణంగా ఉంటే ఇక మన రైతుల భవిష్యత్తు గురించి ఊహించుకోవడం కష్టమేమీ కాదు. ఇది కేవలం వ్యవసాయానికి మాత్రమే కాదు, ప్రజల ఆహార భద్రతకు, జీవవైరుధ్యానికి, ప్రకృతికి పెద్ద విఘాతం. ఇప్పటివరకు ఏదో బాగుందని కాదు, కానీ ఈ చట్టాల మూలంగా రైతులు పెనం మీద నుండి పొయ్యిలో పడిపోతారు.

రైతులు ఒక వర్గంగా, సమూహంగా ఉండే స్థితి నుండి మార్కెట్‌కు సరుకులు అందించే ఒక ఏజెంట్‌ వ్యవస్థగా మార్చబడతారు. సమిష్టితత్వం స్థానంలో వ్యక్తి వాదం నిలబడిపోతుంది. రైతుల హక్కులు హరించబడడమే కాకుండా, వాళ్ళు సంఘటితమయ్యే శక్తి కూడా సన్నగిల్లుతుంది. ఎందుకంటే వాళ్ళ రాజకీయ ఏజెన్సీని మార్కెట్‌ శక్తులు, వాళ్ళ ప్రయోజనాలు నియంత్రిస్తాయి కాబట్టి.

ఇది కేవలం రైతుల సమస్య కాదు. మానవులందరి సమస్య. మనిషికి, ప్రకృతికి ఉండే సమతుల్య సంబంధాల సమస్య. ఇది భవిష్యత్తు సమస్య. భావితరాల సమస్య. అందుకే బడా కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనాల కోసం పాటుబడుతున్న దళారీలను ఎండగడదాం. రైతులతో క్రూర పరిహాసం ఆడుతున్న రాజ్యం కళ్ళల్లో మట్టిగొట్టడానికి సిద్ధమవుతున్న మనుషులందరినీ గుండెకు హత్తుకుందాం. రైతుల పోరాటానికి అన్ని రకాల మద్దతునిద్దాం.

Share
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.