ఆచారాలు సరే చట్టాల సంగతేంటి? – పి. ప్రశాంతి

కొండ చరియల్లో చెట్లని చాటు చేసుకుంటూ చకచకా కొండ కిందికి దిగిపోతున్నాడు రాజిరెడ్డి. ఎక్కడా ఆగకుండా లోయలాంటి చోటు వాగు ఒడ్డుకి చేరుకుని చిన్న బండమీద కూర్చుని అప్పుడు మాత్రమే వెనక్కి తిరిగి అల్లంత దూరంలో కొండపైన బొమ్మరిళ్ళలా కనిపిస్తున్న తన గ్రామంవైపు చూశాడు. చెట్ల కొమ్మలు, ఆకుల సందుల్లోంచి కాస్త వెలుతురు సోకుతున్నా తనెవరికీ కనిపించడు, తనకి మాత్రం ఊరు ఒక ప్రక్కంతా స్పష్టంగానే కనిపిస్తోంది. తనని వెంబడించి ఎవరూ రావట్లేదని నిర్ధారించు కున్నాక గట్టిగా ఒకసారి ఊపిరి పీల్చుకుని పక్కనున్న చెట్టుకి చేరగిలబడి కూర్చున్నాడు. కళ్ళు మూసుకుంటే కళ్ళముందు తన కూతురు దీపిక ఆమెని పొదివి పట్టుకున్న తన భార్య కన్నమ్మ కనిపించారు. దీపికకి ఇష్టమైనప్పుడే, ఆమెకి ఇష్టమైన వాడితోనే పెళ్ళి చేస్తానని కన్నమ్మకిచ్చిన మాట గుర్తొచ్చింది. దీపికని తనకిమ్మని, తను తీసుకెళ్తానని పదేపదే అడుగుతున్న భూమిరెడ్డి, కుటుంబంతో సహా పెద్ద మనుషుల్తో మాట్లాడడానికి వస్తున్నాడని చూసి వాళ్ళు కొండెక్కి ఇల్లు చేరుకునేలోపు వాళ్ళకి అందకుండా ఊరికి ఆ వైపు నుంచి కొండ దిగేశాడు రాజిరెడ్డి. ఎందుకంటే తన కూతురు దీపికకి పై చదువులు చదవాలని కోరిక, పెళ్ళి వద్దంది.

ఆదివాసీ కొండరెడ్ల కుటుంబానికి చెందిన దీపికకిప్పుడు పదిహేనేళ్ళు. పన్నెండో ఏట పెద్దమనిషైంది. మూడో నెలసరి అయ్యాక కొత్త బట్టలు కొనిపిచ్చుకోడానికి తండ్రి, ఇద్దరు తమ్ముళ్ళతో కలిసి శుక్రవారం సంత కెళ్ళింది.20 ఏళ్ళకే ముగ్గురు పిల్లల్ని కని చిన్న తమ్ముడు చంటి పిల్లాడుగా ఉన్నప్పుడే ఏదో తెలియని జబ్బుతో తల్లి చనిపోతే తండ్రే చూసుకుం టున్నాడు. ఊరు ఊరంతా మళ్ళీ పెళ్ళి చేసుకోమని ఒత్తిడి చేసినా, ఒకరిద్దరు యువతులు ఇష్టపడి వస్తామన్నా రాజిరెడ్డి వినలేదు. పిల్లలకు తల్లి లేని లోటు లేకుండా చూసుకుంటున్నాడు. అందుకే దీపిక పెద్దమనిషయ్యాక కొత్త బట్టలు, రిబ్బన్లు, ఇంకా ఆమెకి ఇష్టమైనవన్నీ కొనిపెట్టాలని పది రోజుల ముందుగానే అడివికెళ్ళి సేకరించిన తేనెనమ్మి డబ్బు జాగ్రత్త చేసుకున్నాడు. శుక్రవారం సంతకి తీసుకెళ్ళాడు. అక్కడ అనుకోకుండా తనకి అల్లుడు వరసయ్యే భూమిరెడ్డి కలిసినప్పుడు సంతోషంగా పలకరించాడు. రోజంతా వాళ్ళతోనే ఉండిపోయాడు పదిహేడేళ్ళ భూమిరెడ్డి. ఎక్కువ చనువు తీసుకుంటున్న భూమిరెడ్డి దీపికకు నచ్చలేదు. కానీ భూమిరెడ్డి మాత్రం దీపికకి దగ్గరవ్వాలని చూస్తూనే ఉన్నాడు. అంతా గమనిస్తున్న రాజిరెడ్డి ఇక పోదాం పదమన్నాడు. నీ కూతుర్ని నాకివ్వమని అడిగిన భూమిరెడ్డికి ‘ఇప్పుడు కాదు, అది చదువుకుం టది’ అన్నాడు రాజిరెడ్డి. ఆ మాటతో దీపిక ముఖం వెలగడం అందరూ గమనించారు.

ఆ సంవత్సరం ఊర్లో బడిలో ఏడో తరగతి పూర్తిచేసిన దీపిక కొండ దిగువన పెద్ద ఊర్లో ఉన్న గిరిజన సంక్షేమ పాఠశాలలో ఎనిమిదో తరగతిలో చేరింది. ఎప్పుడూ తండ్రిని ఒదిలి ఉండని దీపికకి అక్కడ హాస్టల్లో ఉండడం కష్టంగా ఉంది. పైగా హాస్టల్లో తిండి వేరేగా ఉంది. తనెప్పుడూ తినని పదార్ధాలు పెడుతున్నారు. ఏదీ పారేయడానికి వీల్లేదు. నెలసరి వచ్చినా అందరితో కలిసే ఉండాలి, తనింటి దగ్గరలా విడిగా కీడుపాక లేదు. ఆ మూడు రోజులు కూడా క్లాసులు ఎగ్గొట్టడానికి లేదు. ఇవన్నీ కాక వేరే ఊర్లనుంచి వచ్చిన అమ్మాయిలు కొందరు ఉండలేక ఏడుస్తుంటే తనకీ బాగా ఏడుపొచ్చేది. ఒకరోజు వాళ్ళంతా చాటుగా మాట్లాడుకుని ఎవరితో చెప్పకుండా ఊరికెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. దీపికతో పాటు చేరిన చిన్ని, రాధ కూడా హాస్టల్నుంచి పారిపోయి ఊరుకొచ్చేశారు. వచ్చేసిన కొన్నాళ్ళకి చదువు మీద మనసు మళ్ళింది దీపికకి. తిరిగి హాస్టల్‌కి పోదామని ఫ్రెండ్స్‌తో అంటే రామన్నారు. బతిమాలింది. ఒక్కతే వెళ్ళాలని నిర్ణయించు కుంది. అంతలో భూమిరెడ్డి ఇంకొకతనితో ఊరికొచ్చి ‘బడి నుంచి వచ్చేసిందట నీ కూతురు, చదువుకో వట్లేదుగా నేను తీసుకుపోతా. ఇచ్చెయ్‌’ అని రాజిరెడ్డితో వాదనలోకి దిగడం విన్న దీపికకి ఎటూ తోచలేదు. ఇప్పుడు తను హాస్టల్‌కి వెళ్తే ఏదో ఒకరోజు తనని తీసుకుపోయినా తీసుకు పోతాడని అనిపించి, తన తండ్రితో పాటు ఉం డడమే తనకు రక్ష అనుకుని చదువు ఆలోచనని వదిలేసుకుంది. తండ్రితో పాటు పనికి వెళ్తోంది. తమ్ముళ్ళని చూసు కుంటూ ఇల్లు చక్కబెడ్తోంది.

రెండేళ్ళు గడిచిపోయినై. ఈ లోపు భూమిరెడ్డి పెద్దమనుషులతో కలిసి మూడుసార్లు ఊరికొచ్చాడు దీపికనిమ్మని. రెండుసార్లు కాదన్న రాజిరెడ్డిని ఊరివాళ్ళు కూడా ‘ఎందుకివ్వవు, ఇస్తే ఏమైంది, నీ బిడ్డని నువ్వే ఉంచుకుంటావా’ వంటి మాటలం టుంటే వాళ్ళకి అర్థం చేయించలేక సతమతమయ్యాడు. తర్వాత నుంచి భూమిరెడ్డి కనిపించినా, ఊరికి వస్తున్నారని తెలిసినా ఇలా కనిపించకుండా తప్పించుకు పోతున్నాడు. అమ్మాయికి ఇష్టం లేకపోతే, ఇంటివారు కాదంటే అబ్బాయి బలవంతంగా తీసుకుపోలేడు కనుక కూతుర్ని ఇంట్లో వదిలేసి తను తప్పించుకుపోయినా భయపడట్లేదు రాజిరెడ్డి. అదిగో అలాంటి సందర్భమే మళ్ళీ ఇప్పుడు ఎదురైంది.

పది రోజుల కిందట తమ ఊరి కొచ్చి మూడ్నాళ్ళున్న శాంతక్కతో పాటు చాలా సమయం గడిపిన దీపిక మళ్ళీ హాస్టల్‌కెళ్ళి చదువుకుంటానంటోంది. పెళ్ళికి ఒప్పించు దామనుకుంటున్న రాజిరెడ్డిని దీపిక మాటలు ఆపేసినాయి. ‘నేనేం చెయ్యాలో నాకు తెల్సింది నాన్నా. నేను పోయి చదువుకుంటా హాస్టల్‌కి తీసుకెళ్ళు’ అని చెప్పిన రెండోరోజే మళ్ళీ భూమిరెడ్డి కుటుంబంతోపాటు కొండెక్కి రావడం దూరం నుంచి గమనించి కొండ దిగొచ్చేశాడు.

ఇందులో మంచి చెడులేంటో బేరీజు వెయ్యాలనుకోవట్లేదు. కానీ, విద్యా హక్కు చట్టం కానీ, బాల్యవివాహాలు, బాల కార్మిక నిరోధక చట్టాలూ.. ఇంకా ఎన్నో రక్షణ, పరిరక్షణ చట్టాలు… ఏవీ ఇక్కడ అప్లయ్‌ కావట్లేదు. ఆదివాసీల ప్రత్యేక ఆచారాలు వర్సెస్‌ బాలల హక్కులు… ఛాయిస్‌ వర్సెస్‌ చట్టం… నిజంగానే బాలికలకు, స్త్రీలకు ఛాయిస్‌ ఉందా? వారి మీద ఈ ఆచారాల ప్రభావం ఎలా ఉంది? వీటి మీద లోతైన చర్చలు ఇప్పుడైనా మొదలవ్వాలి కదా!

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.