(పాఠశాలలు పునఃప్రారంభమమయ్యాక, అసెంబ్లీలో జరిగిన సమావేశం తర్వాత చిన్నారులు వ్రాసిన వారి మనోభావాలు…)
ఈ ప్రశ్నకి సమాధానం నా దగ్గర లేదు. అవునని చెప్పాలో, కాదని బాధపడాలో అర్థం కాని పరిస్థితి.
అందరూ సంతోషంగా అన్ని పండుగలు కలిసి కుటుంబం తో జరుపుకొని వేసవి సెలవులలో ఎలా ఆనందంగా ఆడుకో వాలి, ఎలా గడపాలి అని ఆలోచించే సమయంలో కరోనా అందరి ఆలోచనలకు అడ్డుగోడలా మారిపోయింది. మొదటి పది రోజులే కదా అని బడికి సెలవు తీసుకున్నాను. ఆ పది రోజులు ఇంకా మమ్మల్ని ఇంట్లో ఉండమని చెప్పింది, ”లాక్‌డౌన్” అని అందర్నీ ఇంట్లోనే కూర్చోబెట్టి బాధపడమని చెప్పింది.
పాఠం మధ్యలో వేరే విషయాల గురించి అవగాహన కల్పించి ఉపాధ్యాయులను, వారికి ఇష్టమైన, కష్టమైన పనులను పంచుకొనే స్నేహితులను ఎవరినీ కలవనియ్యకుండా చేసింది. ఆన్లైన్ క్లాసులని పెట్టారు కానీ టీచర్ యొక్క భావాలను ఎంతో మిస్సయ్యాను. ఆ తర్వాత తగిన జాగ్రత్తలతో పాఠశాలకు వెళ్ళి అందరూ కాకపోయినా కొందరిని కలుపుకోగలిగాను. ఇప్పుడు కొంచెం సంతోషంగా ఉంది.