కొండ ఒడిలో మరో ప్రపంచం ఈ కొండబడి… -పి. ప్రశాంతి

స్వేచ్చగా, నిర్భయంగా, ఎటువంటి కట్టడులు లేకుండా, ఆడుతూ పాడుతూ గడిచే కాలం ఎంత నిర్మలంగా ఉంటుంది!

పచ్చటి చెట్లమధ్య, స్వచ్చమైన పచ్చిగాలి పీలుస్తూ, మట్టి పరిమళాన్ని ఆస్వాదిస్తూ, వాగునీటి సంగీతం వింటూ, సీతాకోకచిలుకల్లా తిరుగుతుంటే జీవితం ఎంత నిమ్మళంగాఉంటుంది!

ఇవన్నీ సొంతం చేసుకుంటూనే చదువుకుంటున్నామని తెలియకుండానే చదువునేర్చేసుకుంటే… ఎంత అద్భుతంగా ఉంటుంది!! ప్రకృతి ఒళ్ళో, అడవి గర్భంలో, కొండకొనాన, నిశ్శబ్ద వాతావరణంలో అక్షరాల పాటలు, అంలె ఆటలు, విజ్ఞానపు గేయాలు, జిజ్ఞాస నింపే కథలు, చిన్న పిల్లల ప్రశ్నలు, పెద్ద పిల్లల కబుర్లు, కమ్మని చిరుతిళ్ళు, కడుపునిండా పోషకాహారం, కలిసి పనులు చేసుకోడం, ఒకరికొకరు సహకరించుకుంటూ సమయాన్ని పాటించడం, టీచర్‌ తో చర్చలు… అచ్చంగా గిజూభాయ్‌ కలగన్న విద్యావిధానం ఇదేకదా అనిపించక మానదు ఆ వనఒడిలోని కొండబడిని చూసినప్పుడు.

ఏడుగుర్రాలపల్లి గ్రామపంచాయితిలోని ‘మద్దిబండ’ దగ్గరి కొండమీద చదునుగా ఉన్న ప్రదేశంలో పర్ణశాలలాంటి ఈ కొండబడి ఇంకాపైనున్న కొండల్లోని పిల్లలందరికోసం ఏర్పాటైంది. ఐతే పెద్ద ప్రణాళికలు, సుధీర్గ చర్చలు, స్ట్రాటజీలు, టాేయింపులు లాంటివేమీ లేకుండానే ఇది ఏర్పాటైపోయిందంటే నమ్ముతారా! నమ్మాల్సిందే. ఎందుకంటే అదే వాస్తవం కనుక.

ఎత్తైన ఆ కొండల్లో తరాలుగా నివాసాలు ఏర్పాటుచేసుకుని కొంత పోడు వ్యవసాయం మీద, ఇంకొంత అటవీ ఉత్పత్తులమీద ఆధారపడి జీవిస్తున్న కొండరెడ్డి కుటుంబాలు కొండలు దిగి కిందికి తరలిరావడానికి సుముఖంగా లేరు. పక్కా ఇళ్ళు లేవు. కరెంటు లేదు, బడులు లేవు, ఆరోగ్య సదుపాయాలు లేవు, తాగడానికి మంచినీళ్ళు ూడా లేవు. ఇవన్నీ మైదానాల్నించి చూస్తున్న వారికి కనపడేది! ఆ అడవి బిడ్డలు మాత్రం ఇవన్నీ లేవని ఏనాడూ ఎవరితోనూ ఫిర్యాదు చెయ్యలేదు. ఎందుకంటే అవి వారికి కావాలన్న కోరిక లేదు కనుక… అవి అందితే బానే ఉంటుందన్న భావన తప్పించి అవి లేకపోతే ఎలా అన్న భయం లేదు. వాటితో వచ్చే బాదరబందీలూ లేవు! ఎందుకంటే వారిది అడవితో సహజీవనం. అదే వారి సహజ జీవనం. ప్రకృతి వనరులే తమ ఆస్తి. పశుపక్ష్యాదులు, అడవిదుంపలు, పళ్ళు కాయలు, పోడుతో పండించుకున్న ఆహారధాన్యాలు, ూరగాయలు… ఇవే తమ ఆహారం. వాగులు వంకల్లోని నీళ్ళు దాహాన్ని తీరుస్తున్నాయి. వెదురు, తేనె వంటివి సేకరించడం, అవి అమ్మగా వచ్చిన డబ్బుతో కావలసినవి వారాంతపు సంతల్లో కొనుక్కోవడం. ఇంతకుమించి వారేమీ ఆశించట్లేదు. ఆశించినవాళ్ళు కొండలు దిగి మైదానాలకి వలసెళ్ళిపోయారు.

ఒకతీరుగా సాగిపోతున్న ఈ ఆదివాసీ జీవితాల్లో కరోనా ఉత్పాతం, దానితో వచ్చిన లాక్డౌన్‌ పెనుప్రభావాని చూపించాయి. ఇంటికి, కుటుంబానికి అవసరమైన అన్నిటికోసం వారాంతపు సంతలమీద ఆధారపడ్డ కుటుంబాలకి నెలల తరబడి నడిచిన లాక్డౌన్‌ వల్ల రోజువారి జీవనూండా కష్టమైపోయింది. పోడుతో పండించుకున్న తిండిగింజలు ఆదుకున్నా, ఉప్పు, నూనె, ఉల్లిపాయలు, ూరగాయల వంటివేవీ లేకుండానే సరిపెట్టుకోవాల్సివచ్చింది. చిన్న చిన్న గూడేలు కనుక ఉన్న గింజల్ని అందరూ పంచుకుని సర్దుకున్నారు.

ప్రభుత్వంనించి అందాల్సిన సాయం ఎటుపోయిందో ఆ ఆదివాసీలకీ తెలియదు, అధికారులకీ తెలియదు! ఎక్కడో అడవిలో, నాలుగేసి గంటలపాటు కొండలెక్కితే కాని చేరుకోలేని గూడేలలో ఉన్న వీరికి అంతదూరం ఎవరన్నా వస్తారన్న ఆశా లేదు. ఒకరిద్దరు కొండలు దిగొచ్చి ఏమి జరుగుతోందో కనుక్కుని వెన్కళ్ళడం తప్పించి చేయగలిగింది పెద్దగా ఏమీలేదు.

సరిగ్గా అలాంటి సమయంలో వచ్చింది విజేత. ఆశ సంస్థ ద్వారా ఆదివాసీలకి కోవిడ్‌ సహాయక చర్యలు చేపడుతున్నది తెలిసి తనవంతు సాయం చేద్దామని తనెప్పుడూ చూడని, తనకి పరిచయంలేని ఈ ప్రాంతానికి వచ్చింది. సుభానిగారు వారి టీం తో కలిసి అడవి లోలోపలి గూడేలకి వెళ్ళి రేషన్‌, ూరగాయలు, నిత్యావసరాలు, మందులవంటివి అందించారు. ఈ క్రమంలో జిన్నెతోగు, మద్దికుంట, మామిళ్ళబంద… ఇంకా ఆ చుట్టుపక్కల గూడేలతో కనెక్ట్‌ అయిపోయింది. అదే సమయంలో ఐటిడిఎ నుండి ూడా ఉపశమన చర్యలు చేపట్టడం, ఆ కొండ ప్రాంతాల్లోని దుర్భర పరిస్థితులను ఐటిడిఎ పి.ఒ. ఆకుల వెంకట రమణతో పంచుకోడం, ఆయన వెంటనే స్పందించి చదువే అన్నిటికీ పరిష్కారం కనుక పిల్లలంతా చదువుకునేందుకు అనుూలంగా ఆ కొండల్లోనే ఓ బడి ఏర్పాటు చెయ్యాలని నిర్ణయం తీసుకోడం వెంటవెంటనే జరిగిపోయాయి.

అప్పటి అక్కడి ఐదు గూడేలలో ఉన్న 167 కుటుంబాలతో చదువు ప్రాముఖ్యత గురించి విజేత మాట్లాడి, వారిని చైతన్య పరచడంవల్ల కొంత అనుమానంతోనే అయినా పిల్లల్ని బడికి పంపడానికి ముందుకొచ్చారు. అనుమానం ఎందుకంటే జిన్నెతోగులాంటి చోట ప్రభుత్వం ఏర్పాటు చేసిన బడిఎప్పుడో మూతపడిపోయింది. టీచర్‌ సక్రమంగా రాకపోవడం, వచ్చినా గిరిబిడ్డలకి అర్థమయ్యేలా నచ్చేరీతిలో పాఠాలు చెప్పలేకపోవడం, చెప్పే పాఠాలు వారి జీవితాలకి దగ్గరగా లేకపోవడం, స్వేచ్చగా తిరగాడే పిల్లల్ని కట్టేసినట్టు ూర్చోబెడితే నచ్చక బడికి దూరంగా పారిపోడం, తల్లిదండ్రులూ బడికి పోవాల్సిందే అని పిల్లలకి చెప్పకపోవడం, మధ్యాహ్న భోజనం ూడా దారితప్పడం… ఎన్నెన్నో కారణాలు వారి అనుభవంలో. అందు అనుమానం ఇదీ అంతే అవుతుందని. కాని కొండల్లో ఎవరూ చేరుకోని తమ దగ్గరికి విజేత రావడమేకాక, రోజుల తరబడి ఆ గూడేలలోనే ఉంటూ వారికి అన్నిహితంగా మెలగడంతో ఆమె మాటని విన్నారు. దాదాపు 2020 మే నించి సెప్టెంబర్‌ వరకు ఎండల్లో, వానల్లో ూడా వారితోనే ఉంది. అందు ఆమెని గట్టిగా నమ్మారు. అలాగే పి.ఒ. వెంకట రమణ ూడా కొండబాట పేరుతో చేపట్టిన కొండ గ్రామాల సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈసారి ఈగూడేలకి రావడం, పిల్లల చదువుల గురించి, పని చెయ్యని బడి గురించి మాట్లాడడం, గూడేలవాళ్ళు వెళ్ళబోసుకున్న ఎన్నో సమస్యలకి చదువే పరిష్కారం అని నచ్చచెప్పడంతోపాటు ఒక మెలిక వేశారు. ఆ గిరివాసులు పెన్షన్లు, రేషన్‌ కార్డులు, ఇళ్ళకప్పులకి రేకులు వంటి వాటితో పాటు పోడుచేసుకుంటున్న భూములకి పట్టాలివ్వమని అడుగుతుంటే ‘సరే, మీకు పట్టాలిచ్చే బాధ్యత నాది. మరి పిల్లలందర్నీ బడికి పంపే బాధ్యత మీదే’ అన్నారు. అప్పుడూ కొంతమంది వంక పెట్టారు. చిన్న పిల్లలు రొజూ కొండలు దిగి, ఎక్కి రాలేరు కష్టం అన్నారు. ‘మీ పిల్లల్ని మాకు అప్పచెప్పండి. వారి చదువూ సంధ్యా, ూడూ గుడ్డా, ఆటా పాటా, వసతులతో సహా మేమే చూసుకుంటాం’ అని హామీ ఇవ్వడంతో అందరూ ఒప్పుకున్నారు. అప్పటి విజేతతో కలిసి ఆలోచన చెయ్యడం, ఇప్పుడు అధికారుల నోటినుండి ూడా అధికారికంగా మాట రావడంతో ఇక బడికి దారి పడింది. కొండల్లో బడి కనుక ‘కొండబడి’ అని నామకరణం ూడా చేసేశారు రమణ ఆకుల.

ఇక ఆ తర్వాత చర్చలు, నిర్ణయాలు చకచకా జరిగిపోయినాయి. ఆదివాసీల భాగస్వామ్యంతోనే బడి ఎక్కడ కట్టాలి, ఎలా కట్టాలి, ఏమేమి అవసరం… అన్నీ నిర్ణయమైనాయి. తమ ఇళ్ళని ఎలా కట్టుకుంటారో అలాగే బడిని ూడా తామే కడతామని ముందుకొచ్చారు. అవసరమైన నిధులు ఐటిడిఎ నుండి సమూరుస్తానని రమణ మాటిచ్చారు. మధ్యాహ్న భోజనం, బోధనా సామాగ్రి, పిల్లలకి యూనిఫాం, దుప్పట్లు, రగ్గులవంటివన్నీ అందేలా చూస్తానని ూడా భరోసా ఇచ్చారు. ఆదివాసీ యువత శ్రమదానంతో బడికి నిర్దేశించిన స్థలంలో అవసరం మేరకు చెట్లని నరికారు. కొండల్లోనించి వెదురు తెచ్చి తడికలల్లారు. రాళ్ళు రప్పలతో ఉన్న ఆ ప్రాంతమంతా చదును చేశారు. నరికిన చెట్ల కలపతో పాకలేశారు. వెదురు తడికలతో పైకప్పు వేశారు. ఆపైన కప్పడానికి ఎండకి, గాలులకి తట్టుకుని కొంతకాలంపాటు మనగల బరకాలను రమణ పంపారు. తడికలనే గోడలుగా నిలబెట్టి మట్టిమెత్తారు. కొట్టిన చెట్ల మొదళ్ళ ఆధారంగా వెదురు బద్దలతో బల్లల్లా కట్టారు. 15 మంది ఆదివాసీ యువత సైన్యంలా పనిచేశారు. ఇంముేంది 15 రోజుల్లో బడి సిద్ధమైపోయింది.

ఆటపాటలతో చరువు నేర్చుకోడానికి వీలుగా ఒక పొడవాటి పాక, పిల్లలు ఉండడానికి రెండుగా విభజించిన ఇంకో పొడుగాటి పాక, ఆఫీస్‌ రూం కోసం ఒక చుట్టుగుడిసె (దీనినే ప్రస్తుతం స్టోర్‌ రూంగా ూడా వాడుతున్నారు) తయారైపోయినాయి. వంటగది మెల్లగా కట్టొచ్చని ఆగారు. ఇప్పటికైతే ఆరుబయట చెట్లకిందే వంట.

ఒక యజ్ఞంలా సాగిన ఈ నిర్మాణపు పనుల్లో గిరిబిడ్డల పనితనం, సమన్వయం, నిబద్ధత, పట్టుదల, స్నేహశీలత విస్పష్టంగా కనబడినాయంటుంది విజేత. దాదాపు పని జరుగుతున్నన్ని రోజులు విజేత కొండపైన స్కూల్‌ సైట్‌ లోనే ఉండడం, పనిచేస్తున్న వారందరికీ కొములమ్మ, దివ్యలతో కలిసి వంట చేసిపెట్టడం, అవసరమైనవి చూసుకోవడం, అందర్నీ కనిపెట్టుకుని ఉండడం వల్ల తనంటే ఆ ఐదు గూడేలలోని 167 కుటుంబాలకీ ఎంతో గురికుదిరింది. తమ పిల్లల చదువుతోపాటు తమకీ జీవనోపాదుల గురించి, ఆరోగ్యం గురించి ఏదైనా చెయ్యాలని ఆలోచిస్తున్న విజేత అంటే వాళ్ళందరికీ ఎంతో ఇష్టం, గౌరవం.

నవంబర్‌ 3, 2020: బడి ప్రారంభోత్సవపు రోజు రానేవచ్చింది. పిల్లలంతా సిద్ధమైపోయారు. దగ్గరి గూడేల నుండే వచ్చారు 20 మంది అమ్మాయిలు, అబ్బాయిలు. దాదాపు ఆ చుట్టుపక్కల అన్ని పల్లెలనుండి తల్లితండ్రులు, పెద్దలు ూడా చేరుకున్నారు. రమణ ఆకులతో పాటు ఇతర అధికారులూ వచ్చారు. వస్తూ వస్తూ సోలార్‌ లాంతర్లు, ఎటువంటి నీటినైనా వడగట్టి శుభ్రమైన రక్షిత తాగునీటిని అందించే వాటర్‌ ఫిల్టర్లనూ తెచ్చారు. బడికి మాత్రమే కాదు… ఆ పల్లెల్లోని ప్రతి కుటుంబానికి ఒకటి చొప్పున అందించారు. అంతేకాదు, వారు పండించడానికి సిద్ధపడితే ూరగాయల విత్తనాలు, అవసరమైన పరిజ్ఞానాన్ని ూడా అందిస్తామని, ఇంమైేనా జీవనోపాదులు చేపడతామంటే వారికి అందుబాటులో ఉన్న వనరులని ఉపయోగించి అలంకరణ వస్తువులు తయారుచేసేలా శిక్షణ ూడా ఇస్తామని చెప్పడంతో ఆ గిరివాసులకు తమ పి.ఒ. మీద అభిమానంతో పాటు నమ్మకమూ పెరిగింది. తమ పిల్లలు చక్కగా చదువుకుని తమకన్నా మెరుగైన జీవితాన్ని పొందగలరని నిర్ణయించుకున్నారు. దాంతో వారిలోనూ ఉత్సాహం పెరిగింది.

తమకోసం చక్కగా ముస్తాబైన కొండబడిని అన్నివేపులనించి తిరిగి తిరిగి చూసుకున్నారు పిల్లలు. అంతకుముందు మధ్య మధ్యలో చూసినవాళ్ళు కొందరైతే కొందరు మొదటిసారి చూస్తున్నారు. పని జరిగినన్ని రోజులూ రోజూ వచ్చి తనకి తోచిన సాయం చేసిన సోమిరెడ్డి ూడా రంగుకాయితాలు, గాలిబుడగలతో ముస్తాబైన బడి ఆకర్షనీయంగా కనబడుతుండడంతో కొత్తగా చూస్తున్నాడు. కానీ దృష్టంతా గాలిబుడగలమీదే ఉంది. ఇది గమనించిన రమణ బడి ప్రారంభంగా రిబ్బన్ని పిల్లలతోనే కట్‌ చేయించి బడిలోపలికి వెళ్ళగానే ముందు అలంకరణగా పెట్టిన గాలిబుడగల్ని తీసి పిల్లలకి ఇచ్చేశారు. వాళ్ళతో ఆడారు ూడా. పిల్లలకి అది ఎంతో నచ్చింది. కలసాకారమైన ఉత్సాహం ఉప్పొంగుతుంటే పిల్లల్లో పిల్లాడిలా అయిపోయినట్లుంది రమణ ఆకులని చూస్తే. నిజమేకదా, పిల్లలు తమ బాల్యాన్ని హాయిగా అనుభవిస్తూ, భవిష్యత్తుకి బాట వేసుకునేలా తయారుచేసేందుకు ఈ కొండబడి తయారైందంటే… అందులో తన పాత్ర ఉందంటే అది మరి ఎంతో సంతృప్తినిస్తుంది కదా. అదిగో దానితో వచ్చిన ఉత్తేజమే ఇది. ఇక ఈ బడి నిరాఘాటంగా కొనసాగి ఆ కొండరెడ్డి బాలలంతా బడిలో నిలదొక్కుకునేలా, ఇక్కడినుండి పెద్ద బడికి అందరూ వెళ్ళేలా చేసే బాధ్యత మిగిలిఉంది. అధికారులు మారుతుంటారు కనుక తనుండగానే కొండబడి కొన్నేళ్ళపాటు ఏ అడ్డంకులూ లేకుండా సుస్థిరంగా నడిచేందుకు అన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇక్కడ విజేత పాత్ర కూడా చాలా కీలకమౌతుంది.

తల్లిదండ్రులు, పెద్దమనుషులు, యువత, బడి బాధ్యతలు నిర్వహిస్తున్న వారితో కలిపి ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసి బడికి సంబంధించిన నిర్ణయాలన్నీ ఈ కమిటీ తీసుకున్నట్లైతే బాధ్యతతోపాటు సొంతదనం ూడా ఉంటుంది. గ్రామ సర్పంచ్‌, గ్రామ సెట్రెరీ, సిడిపిఒ, యస్‌.ఐ., యం.ఇ.ఒ., పి.ఒ.లు సభ్యులుగా ఒక అడ్వైజరీ కమిటీని ఏర్పరచడం ద్వారా పర్యవేక్షణ కమిటీకి సరైన సహకారం అందుతుంది. కొండబడిలో చదువు నేర్చుకున్న పిల్లలంతా జిెబివి లేదా గిరిజన సంక్షేమ హాస్టళ్ళలో వారి వయసుకి తగ్గ తరగతిలో చేరడానికి అవసరమైన కన్వర్జన్స్‌ ఏర్పరచుకోడం స్వతంత్ర కమిటీ పని అయితే, అవసరమైన విధానపరమైన చర్యలు తీసుకోడం, సంబంధిత అధికారులకి సూచనలతో పాటు దిశానిర్దేశం చేయడం అడ్వైజరీ కమిటీ పని. ఇలా చేయడం ద్వారా కొండబడిని ఒక సమగ్రరూపం లో బడిబయటి ఆదివాసీ పిల్లల్ని చదువులోకి తీసుకొచ్చే ఒక మోడల్‌ గా తయారు చేయొచ్చు… పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్నర్‌ షిప్‌ తో…

నేర్చుకునే ప్రక్రియలు: కొండబడిని ఆటపాటలతో చదువుకునే బడిగానే ప్రారంభించారు. ఎందుకంటే అక్కడి కొండరెడ్డి గూడేలలోని పిల్లల్లో మూడొంతులమంది బడిముఖం చూడనివారున్నారు. వీళ్ళల్లో కొంతమంది వాళ్ళ అక్కలతోనో, అన్నల్తోనో ఎప్పుడన్నా బడికిపోయున్నా మొత్తానికి చదువంటే తెలీదు. ఇలా ఆ పల్లెల్లో ఉన్న 80మంది పిల్లల్లో ఒక 30మంది కొండబడికి వచ్చినా నిలకడగా ఉన్నవాళ్ళు 28 మందే. ప్రారంభంలో 20గా ఉన్న ఈ సంఖ్య పెరిగి నిలకడగా ఉండడం గొప్ప విషయమే. దీని వెనక ఉన్న మరో కీలక వ్యక్తి వెంకటెష్‌. కొండ కింది గ్రామంలో ఉండే వెంకటేష్‌ ూడా ఆదివాసీనే. డిగ్రీ చదువుకుని, టీచర్‌ ట్రైనింగ్‌ చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. తమజాతి పిల్లలకి చదువులబ్బి, కొండల్లోంచి బైటికొస్తేనేకాని వారి అభివృద్ధి సాధ్యంకాదని అనుభవపూర్వకంగా తెలియడంతో ఆ పిల్లలకి చదువు చెప్పడానికి ముందుకొచ్చాడు.

మొదట్లో ఐటిడిఎ ద్వారా ముగ్గురు ఫ్యాకల్టీని నియమించినా కొండబడిలో వారు మనలేకపోయారు. కొద్దిరోజుల్లోనే వెళ్ళిపోయారు. వెంకటేష్‌ ఒక్కడే పిల్లల్లో కలిసిపోయితనకి తెలిసిన, ఎప్పుడో విన్న పిల్లల పాటలు గుర్తుచేసుకుని ఆటలాడిస్తూ పిల్లలకి బడంటే ఇష్టమయ్యేలా చెయ్యడంలో ఏప్రయత్నాన్నీ వదలలేదు. విజేతూడా తనకి తోచిన సలహాలిస్తూ వెంకటేష్‌ కి సపోర్ట్‌ చేసింది. కానీ ఇదొక పెద్ద సవాలుగానే ఉంది. ఈ విషయంలో రమణ ఆకుల స్పందించి మిత్రులు అజయ్‌ కుమార్‌ గారిని అడగ్గానే తమ టీం నించి టీచర్‌ వాలంటీర్స్‌ని కొండబడికి పంపించారట. ఆ వాలంటీర్స్‌ కొద్దిరోజులు అక్కడే ఉండి పిల్లలకి ఎన్నో పాటలు, ఆటలతో ూడిన చదువుని పరిచయం చేశారు. అలాగే వెంకటేష్‌కి యాక్టివిటీ బేస్డ్‌ లెర్నింగ్‌ మెథడ్స్‌ నేర్పించారు. చురుకైన, తెలివైన వెంకటేష్‌ వాటిని ఇట్టేపట్టేసి తన ఆలోచనని ూడా జోడించి పిల్లలకి చదువు చెప్పడం మొదలెట్టాడు. దీంతో ఓ పెద్ద సమస్య చిన్నదైపోయింది.

అయితే, పిల్లలకి పలకలున్నాయి, ఆట వస్తువులున్నాయి కాని ఆటపాటలతో చదువు నేర్చే సామాగ్రి లేకపోయింది. తయారు చేసుకుందామన్నా కావలసిన ముడిసరుకు లేదు. కావాలని అడగలేదు ూడా వెంకటేష్‌. కారణాలు అక్కడుండి చూస్తున్న తన తెలుసు. విజేతతో మాట్లాడినప్పుడు ఇది అర్ధంచేసుకున్నాను. నాకు అనియత విద్యకి సంబంధించి కొంత పరిజ్ఞానం ఉండడంతో అవసరమైన సామాగ్రి నేను తీసుళ్ళిె కొండబడి పిల్లలకి నావంతుగా అందించి నేనూ భాగస్వామిని కావాలని నిర్ణయించుకున్నాను. అనుకున్నదే తడవుగా ఛార్టులు, య్రాేన్లు, స్కెచ్‌ పెన్నులు, అక్షరాలు పదాలు, అంలెతో ూడిన బిల్డింగ్‌ బ్లాక్స్‌, ఆడుకునే బంతులు, లూడో, వైకుంఠపాళీ వంటి వాటితోపాటు నోట్‌ బుక్స్‌, బొమ్మలు చిన్న చిన్న వాక్యాలతో ఉండి భాషకి, రీడింగ్‌కి ఉపయోగపడే బేసిక్‌ కథల పుస్తకాలు తీసుళ్ళాెను. వీటితోపాటు వీడియో స్టోరీస్‌, ఆడియో పాటలు ూడా తీసుళ్ళాెను. నా ల్యాప్‌టాప్‌లో అవి చూపిస్తూ ఆ ఆదివాసీ పిల్లల్లో పిల్లనైపోయి నేనూ రిేంతలు కొట్టాను. పాటలకి అందరం కలిసి నృత్యాలు చేశాము. ‘బర్రె కొమ్ముల మీద పిట్టగూడు’ లాంటి కథల్ని ఆశ్చర్యంగా చూస్తూ పడీపడీ నవ్వుకున్నాం. నవ్వులాగాక దానిమీద చర్చలు ూడా చేశాం. ఎన్ని విషయాలు చెప్పారో పిల్లలు. అప్పుడు నేనూ విద్యార్ధినైపోయా!

వెంకటేష్‌తో ూర్చుని టీచింగ్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌ తయారీ గురించి కొన్ని ఐడియాలిచ్చాను. పిల్లల భాగస్వామ్యంతో ూడా తయారు చేసే కొన్ని విధానాల్ని వివరించాను. ఏదైనా అవసరమైతే ఎప్పుడైనా ఫోన్‌ చెయ్యొచ్చని చెప్తూ ఎప్పటికప్పుడు విద్యాప్రక్రియని మెరుగుపరుచుకోడానికి నేనూ వెంటుంటానని భరోసా ఇచ్చాను. పిల్లల చురుకుదనం చూశాక, నేర్చుకోడంలో వాళ్ళ వేగం గమనించాక వెంకటేష్‌కి తోడు తనలాంటి ఇంకొకరైనా ఉంటేనే పిల్లల్లో చదువుపై ఆసక్తిని నిలిపి ఉంచడం సాధ్యమౌతుందని, లేకపోతే పిల్లలు కొత్తదనం లేక చదువుపై అనాసక్తికి గురయ్యే అవకాశం లేకపోలేదనిపించింది. ఇదే విషయాన్ని విజేతతోనూ, రమణతోను ూడా పంచుకుంటూ వెంటనే ఇంకొకర్ని ూడా నియమించడం అవసరమని చెప్పాను. ఇది బడ్జెట్‌తో ూడుకున్న విషయం కదా… చూడాలి ఏమి జరుగుతుందో.

చా్లట్లు, రేపర్‌ బొమ్మలు: పిల్లలదగ్గరికి వెళ్తున్నామంటే పుస్తకాలు, బొమ్మలు, ఆటసామాగ్రేనా… అసలు చా్లట్లు, బిస్కెట్లు లేకుండా ఎలా వెళ్తాం! నాలుగు రకాల చా్లట్లు, నాలుగు రకాల బిస్కెట్‌ కార్టన్లు తీసుళ్ళాెను. వాటిలోంచి ఒక పెద్ద ప్యాట్‌ెలోంచి చా్లట్లని పళ్ళెంలో పోసి గోడవారగా వరసగా ూర్చున్న పిల్లలకి అందించా. ఒక్కొక్కరు గుప్పెడు తీసుకోవాలని నా కోరిక. కానీ వాళ్ళు ఒక్కొక్కటే తీసుకుంటున్నారు. అయ్యో అనుకుని ఇంకా తీసుకోమంటే ఇంకోటి మాత్రమే తీసుకున్నారు. ఇది క్రమశిక్షణా? ఏమో!

సరే, వాళ్ళతోపాటు ూర్చుని నేనూ ఒకటి తీసుకుని చా్లట్‌ నోట్లో వేసుకుని అలవాటుగా రేపర్‌తో బుట్టబొమ్మని చేసి చూపించా. కొంచెం మొహమాటంగా, ఎక్కువ ఆసక్తిగా చూశారు. ఐదేళ్ళ శ్రీనివాసరెడ్డికి మరింత ఆసక్తి. ఒక్క క్షణం అలాగేచూసి గబుక్కున లేచొచ్చి నా చేతిలోంచి బొమ్మని తీసుకుని అటుతిప్పి ఇటుతిప్పి చూస్తుంటే మెల్లగా సోమిరెడ్డి ూడా దగ్గరికి జరిగాడు. ‘మీయీడా చేస్తారా’ అనేసరికి చేతిలో రేపర్లు పట్టుకుని దగ్గరికి చేరిపోయారు. ూర్చుని, నించుని, ఒంగొని చూస్తున్న పిల్లలకి స్టెప్‌ బై స్టెప్‌ చూపిస్తూ చా్లట్‌ బుట్టబొమ్మని, చా్లట్‌ దొరబాబునీ తయారు చేస్తూ వారితో చేయించా. దాంతోపాటే వాళ్ళకి చిన్నగా కొలతలూ చెప్పా. ఇంముేంది… నవ్వులు, రిేంతలతో ఇంకోటి మరోటి అనుకుంటూ చా్లట్లు కడుపులోకి… రేపర్‌ బొమ్మలు తడిక గోడమీదకి చేరుతుంటే ఎంత ఆనందంగా అనిపించిందో. వీళ్ళతోపాటు వంటచేస్తూ, ర్‌ేటేకర్స్‌గా కూడా ఉన్న కొములమ్మ, దివ్యభారతిలు ూడా వాళ్ళు చేస్తున్న పనులు వదిలేసి రేపర్‌ బొమ్మలు చేయడంలో చేరిపోయారు. ‘అన్నీ ఇప్పుడే తినేస్తారా, పళ్ళు పుచ్చిపోతాయ్‌. మళ్ళీ తర్వాత తిందురుగాని’ అని వెంకటేష్‌ అనగానే మిగిలిన చా్లట్లని కవర్‌ లో వేసేసి దాచేసింది వాళ్ళల్లో కొంచెం పెద్దదైన లక్ష్మి. ఒక గంటసేపు పిల్లలంతా ఒకరితో ఒకరు పోటీ పడ్తూ, ఒకరు చేస్తుంటే ఒకరు ఆసక్తిగా చూస్తూ, అందంగా రాలేదని చిన్నబుచ్చుకుంటూ, నైపుణ్యంతో చేసిన వాళ్ళని మెచ్చుకుంటూ సందడి చేశారు. అంతకంటే ఇంం కావాలి. పిల్లలంతా భోజనాలళ్ళిెనప్పుడు వెంకటేష్‌తో కొద్దిసేపు వేస్ట్‌ మెటీరియల్‌ని ఉపయోగించడం, పిల్లలే సేకరించి వాళ్ళకి నచ్చినవి తయారు చేసేలా ప్రోత్సహించడం గురించి మాట్లాడాను. ఔనంటూ తన ఆలోచనల్నీ జోడించాడు. ఈ సందర్భంలో మళ్ళీ అనిపించింది ఇంకొక టీచర్‌ అవసరం అని.

ఓపెన్‌ కిచెన్‌ – వనభోజనం: చిన్నప్పుడు ప్రతి కార్తీకమాసంలో కనీసం ఒక ఆదివారం నాడు వనభోజనాలకి వెళ్ళడం కోసం అమ్మమ్మగారింటికి ఎప్పుడువెళ్తామా అని ఎదురు చూసేవాళ్ళం. 30, 40 మంది ఎడ్లబళ్ళు కట్టుకుని పొలాల్లోకి పోవడం, కాలవగట్ల మీద పరుగులు, తోటలో మామిడి చెట్లెక్కడం, పంపరపనస కాయల తొక్కల్ని జాగ్రత్తగా రెండు డొప్పలుగా ఒలిచి వాటిని టోపీల్లా పెట్టుకోడం, బోర్లకింద జలకాలాటలు, ఉసిరి చెట్టుకింద వంటలు, బంతిభోజనాలు… ఇదంతా గతం. ఆ జ్ఞాపకాలన్నీ ఉప్పెనలా వచ్చిపడ్డాయి కొండబడి సందర్శనలో. చుట్టూ ఎత్తుగా పెరిగిన టేకు, మద్ది, అడవి మామిడి, ఉసిరి, తాని, ఇందుగు, మారేడు… ఇంకా ఏవో పేర్లు తెలియని అడవి చెట్లు. మధ్యలో చదును చేసిన కాస్త స్థలంలో కొండబడి. ఒక పక్కగా ఖాళీస్థలంలో బండరాళ్ళతో పొయ్యిలు పెట్టి కట్టెలతో వంట, వాగులోంచి నీళ్ళు తెచ్చుకుని వంటకి వాడుకోడం, తాగడానికి మాత్రం ఫిల్టర్‌ నీళ్ళు. కొములమ్మ, దివ్యలకి పిల్లలూ సాయం చేస్తారు వంటలో. ఆరోజు సొరకాయ ముక్కలు వేసి చేసిన దబ్బకాయ పప్పు. ఆ కమ్మని రుచి నాలుకకి మొదటిసారి తెలిసిందేమో, మెదడుకి చేరవేసినది అక్కడ నిక్షిప్తమైపోయి ఇప్పుడు ూడా నోట్లో నీళ్ళూరుతున్నాయి. సాయంత్రం స్నాక్‌గా వేపిన పల్లీలు, పుట్నాలు, అటుకుల్లో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పూ కారం కలిపి తయారుచేసింది విజేత. అంతలో పిల్లలంతా కలిసి బడికి కొద్ది దూరంలో వాగుకి దగ్గర్లో వాళ్ళు చేస్తున్న ూరగాయల సేద్యాన్ని చూసొద్దామని తీసుకుపోయారు నన్ను. మిరప, టమాట, బెండ, వంగ, బీర, గోంగూర, తోటూర మళ్ళు… మొలకలొచ్చి బెత్తెడు ఎత్తు పెరిగినాయ్‌. వెంకటేష్‌ అబ్జర్వేషన్లో పిల్లలంతా తోటపని చేస్తారు. నేను తీసుళ్ళిెన తమ్మకాయి గింజల్ని ూడా నాటమని ఇచ్చాను.

చలిగాలి తిరుగుతున్న డిసెంబర్‌ చివరి వారపు ఒక సాయంకాలం కొండమీద ఆ కొండరెడ్డి బుడతలతో గుంపులుగా ూర్చుని పిచ్చాపాటీ కబుర్లు, చిరుతిళ్ళు, అల్లిబిల్లి ఆటలు, అరుపుల్నిపట్టి పిట్టల్ని గుర్తుపట్టే ప్రయత్నం, చీకట్లో చుక్కల్ని లెక్కపెట్టడం, నక్షత్ర మండలాల్ని చూపించడం, వాళ్ళ హాస్టల్‌ గదులకి వాళ్ళతోనే పేర్లు పెట్టించడం… అబ్బో అది మరో ప్రపంచమే! ఇక్కడొక మాట చెప్పాలి. పై కొండల్లోని ఆరగండి, మద్దికుంట, జిన్నెతోగు, మామిళ్ళబంద గ్రామాల ప్రజలు సంతకి వెళ్ళాలన్నా, రేషన్‌ సరుకులు తెచ్చుకోవాలన్నా, ఏ అవసరానికి క్రిందిళ్ళాెలన్నా మద్దిబండ దగ్గర్లో ఉన్న ఈ కొండబడిని దాటుకుని వెళ్ళాల్సిందే. అంతపైనించి కిందికి దిగడానికి వాళ్ళ మూడు, నాలుగ్గంటల సమయం పడుతుందట. తెల్లరే బయల్దేరి కొండలు దిగి పని చూసుకుని వచ్చేసరికి చీకటి పడక తప్పదు. ఇన్నాళ్ళు అర్ధరాత్రైనా అలాగే ఇళ్లకి చేరుకునేవారు. తిండి ఎప్పుడు తినేవారో, ఎక్కడ తినేవారో కొండబడి కట్టడం మొదలైనప్పట్నుంచి పని ముగించుముని ఇళ్ళళ్తుెన్న వాళ్ళకి ఇది విడిదయ్యింది. ఇక్కడ్నించి సుమారు రెండు గంటలన్నా నడిచి కొండ ఎక్కందే ఊరు రాదు. ఇక చిట్టచివరి గూడేనికి వెళ్ళేవాళ్ళకైతే నాలుగు గంటలు కొండ ఎక్కాలి. ఇక్కడ దూరం మాత్రమే లెక్కకాదు. ఒక్క మనిషి మాత్రమే పట్టేంత బాటలో రాళ్ళు, రప్పలు, బండల్లోంచి కొండలెక్కడం, దానికి పట్టే సమయం… ఇదే లెక్క.

ఏ పనిమీద వెళ్ళొస్తున్నవాళ్ళకైనా కాని కాలేకడుపుతో కొండబడి దాటిపోూడదు. ఇంత అన్నం తిని, ఇన్ని నీళ్ళు తాగి, కాసేపు ూర్చుని, పిల్లల్లో ఇన్ని కబుర్లు చెప్పి, సేదతీరి శక్తిని పుంజుకుని వెళ్ళాలి. వాళ్ళకిదొక పేదరాశి పెద్దమ్మ ఇల్లులాంటిది. ఇది ప్రేమమయి విజేత చేసిన ఏర్పాటు. ఇందుకుగాను సొంతంగా ఖర్చుపెడుతుంది. ఇదేకాదు బడి పనులు ప్రారంభమైనప్పట్నుంచి తన సొంత డబ్బు, కుటుంబంనించి సేకరించిన డబ్బు చాలానే ఖర్చు చేసింది. ప్రభుత్వానికి అన్నిటికీ లెక్కలు కావాలి; పిల్లల అవసరాలకి, బడినడపడానికి అవసరమయ్యే మెటీరియల్‌ అందించడంలో జాప్యం; టీచర్‌కి, ర్‌ేటేకర్స్‌కి జీతాలివ్వడానికి నిధుల విడుదల ఇంకా వ్యవస్థీకృతం కాకపోవడం… ఈ పరిస్థితుల్లో మరోదారి లేదు. సొంతగా తెచ్చి పెట్టాల్సిందే. మరి ఆ ఆదివాసీలకి ఈ సవాళ్ళతో సంబంధం లేదు కదా! పిల్లల చదువుల్తో వారి జీవితాల్లో మంచి మార్పొస్తుందని ఒప్పించి ఇంతదూరం తీసుకొచ్చిన విజేత ఏ కష్టం పడైనా దీన్ని నిలబెట్టాల్సిందే. వ్యవస్థీకృత అడ్డంకుల్ని అధిగమించడంలో అధికారులతోనూ పోరాడాల్సిందే.

సుస్థిరతకు ఓ ఆలోచన: బడి ఆలోచనని ఓనప్‌ చేసుకుని, వ్యక్తిగత చొరవతో వెంటనే సాకారమయ్యేలా బాధ్యత తీసుకుని, కొండబడి అని నామకరణం చేసిన ఐటిడిఎ పి.ఒ. రమణ ఆకుల ఇంకొంత ముందుళ్ళిె ఈ బడిని ఒక అత్యవసర ఆవిష్కరణగా పరిగణించి ప్రత్యేక నిధులని టాేయించడమే కాక ఇది ఒక బ్రిడ్జి స్కూల్‌గా నడపడానికి అవసరమైన బాధ్యతల్ని విద్యాశాఖ అధికారులకి పురమాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లైతేనే ఇది సుస్థిరంగా కొనసాగడానికి అవకాశముంటుంది. అలాగే ఐసిడియస్‌ నుండి ఉన్న సదుపాయాల్ని ూడా జోడించడానికి వీలుంది, ముఖ్యంగా కిశోర బాలబాలికల ప్రత్యేక అవసరాల దృష్ట్యా.

మానవీయ మనసుల్లోంచి పుట్టుకొచ్చే కొండబడిలాంటి ఆవిష్కరణలు నియమాల ప్రకారమే నడవాలన్నా, నిబంధనల్లో ఫిట్‌ అవ్వాలన్నా వీలుకాదు. సామాజిక పరిస్థితులు, అవసరాలు ప్రాంతాలనిబట్టి, ప్రజల నేపధ్యాన్నిబట్టి వేరువేరుగా ఉంటాయి కనుక అందుకు అనువుగా ఉన్న క్లాజులని అవసరానుగుణంగా వినియోగించుకుని, నియమనిబంధనల్లో ఉన్న ఫ్లెక్షిబిలిటీస్‌ని ఉపయోగించుకుంటూ చర్యలు చేపట్టడం అవసరం. ఈ నేపధ్యంలో కొన్నిసార్లు అధికారులు తమకున్న ప్రత్యేక అధికారాలని ూడా సందర్భానుసారంగా, ఖచ్చితంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో రమణ ఆకుల మరింత చొరవ తీసుకుని సంబంధిత అధికారులకి సూచనలతో ూడిన ఉత్తర్వులు ఇచ్చినట్లైతే అధికారులు మారినా కొండబడికి ఢోకా ఉండదు. ప్రజల్ని క్రియాశీలక భాగస్వాములని చేస్తూ ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసి, అధికారులతో సమన్వయ కమిటీని ఏర్పరచి కలిసి పనిచేసేలా చూడగలిగితే ఆదివాసీ బిడ్డల్ని చదువువైపు మళ్ళించడంలో సఫలీకృతమైనట్లే.

ఏమీలేనివారిలోంచి ఒక అద్భుతమైన ‘కొండబడి’ని ఆవిష్కరించిన, ఈ ఆవిష్కరణలో వివిధ దశల్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ అభినందనలు. సాధికారతతో కూడిన మరో ప్రపంచపు నిర్మాతలుగా మారబోతున్న వనబిడ్డలు ఈ కొండబడి విద్యార్ధులు…. వారికి నా జేజేలు.

Share
This entry was posted in వినూత్నం . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.