జయశాలి భాగ్యమ్మ – డా|| చల్లపల్లి స్వరూపరాణి

యిటీవల దళిత ఉద్యమాన్ని ప్రతిఘటనా స్థాయికి తీసుళ్ళిె అటు ప్రభుత్వాలకు, యిటు పెత్తందారీ కులాల దౌర్జన్యకారులకు మింగుడు పడకుండా వార్తలలో వ్యక్తిగా అసాధారణమైన గుర్తింపును పొందిన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం, పెదగొట్టిపాడు గ్రామానికి చెందిన నిరక్షరాస్యురాలైన డెభ్బై రెండు సంవత్సరాల వృద్ధ దళిత పేద స్త్రీ జొన్నలగడ్డ జయ భాగ్యమ్మ. ఆమె తల్లిదండ్రులు పుల్లగూర సువార్తమ్మ, ప్రకాశం. వీరిది గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట పట్టణానికి సమీప గ్రామమైన తిమ్మాపురం. అయితే జయ భాగ్యమ్మ తండ్రి తన అత్తగారి వూరైన పెదగొట్టిపాడు గ్రామానికి యిల్లరికం వొచ్చి అక్కడే స్థిరపడ్డారు. ఆమెకి అదే గ్రామానికి చెందిన జొన్నలగడ్డ సుబ్బారావుతో వివాహం జరిగింది. సుబ్బారావు, జయ భాగ్యమ్మలకు ముగ్గురు సంతానం – యిద్దరు మొగపిల్లలు, వొక ఆడ పిల్ల. ఆమెకి చదువులేదు. అటు తల్లిదండ్రులనుంచి గానీ యిటు అత్తమామల నుంచిగానీ కనీసం సెంటు భూమిలేదు. రెక్కల కష్టం మీద బతుకు వెళ్ళదీయడం తప్ప వేరే ఆర్ధిక వనరులు లేని కుటుంబం ఆమెది. పెదగొట్టిపాడు సగటు భారతీయ గ్రామానికి నిలువెత్తు ప్రతినిధి లాంటి వూరు. అక్కడ కుల భూస్వామ్యం బాహాటంగానే బుసలు కొడుతుంది. గుంటూరు మిరపకారం పొగరంతా అక్కడి దొర తనంలో గుప్పుమంటుంది. అయితే ఆ వూరిలో మాలా మాదిగలు కలిసి సుమారు వెయ్యి గడప వుండే దళిత వాడలో యెవరికీ పొలం పుట్రా లేకపోయినా వారి ఆత్మగౌరవానికి మాత్రం కొదవలేదు. దళితులు పాలేరుతనం, భూస్వాముల యిండ్లలో పాచిపనులు చెయ్యడం వంటి ఆత్మ న్యూనతకు గురిచేసే పనులను చాలారోజుల క్రితమే మానివేసి తమ గౌరవానికి భంగం కాని విధంగా కాంట్రాక్ట్‌ పనికి, ూలికి వెళ్ళి గౌరవప్రదమైన జీవనోపాధిని పొందడం ఆ గ్రామ దళిత చైతన్యా నికి నిదర్శనం.

భాగ్యమ్మకు ప్రాధమిక స్థాయి చదువులేకపోయి నప్పటికీ అసాధారణమైన జ్ఞానం ఆమె సొత్తు. జీవితంలో యెదురైన అనుభవాల నుంచి ఆమెకి గొప్ప చైతన్యం సహజంగానే వొచ్చింది. దౌర్జన్యాన్ని ప్రశ్నించడం, కులదురహంకారానికి యెదురొడ్డి పోరాడడం అనేవి ఆమెకి తన తండ్రి పుల్లగూర ప్రకాశం గారి నుంచి అబ్బాయనవచ్చు. ఆయన తనకున్న చిన్నపాటి వ్యవసాయ భూమిని సాగుచేసుకోనివ్వకుండా పెత్తందారీ కులస్థులు అడ్డుకుని దానిని ఆక్రమించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన తన సామాజిక వర్గంనుంచి జనాన్ని సమీకరించి పెత్తందారులతో కలబడి తిరిగి తన భూమిని దక్కించుకున్న తెగువ వున్న వ్యక్తి. జయ భాగ్యమ్మ ూడా చిన్నతనం నుంచి యెవరైనా తన పైన జులుం ప్రదర్శిస్తే సహించేది కాదు. అన్యాయాన్ని యెదిరించడం ఆమె తన తండ్రి దగ్గర నేర్చుకుంది. భాగ్యమ్మ భర్త జొన్నలగడ్డ సుబ్బారావు తాగుబోతు, పేకాట రాయుడు. వ్యసన పరుడైన తన భర్తతో పాటు దళితవాడలో తాగి తందనాలాడుతూ భార్యా బిడ్డలకు ూలీ డబ్బులు ూడా మిగలకుండా చేసి కుటుంబాలను అశ్రద్ధ చేసే భర్తలందరికీ బుద్ధి చెప్పడానికి ఆమె నడుం కట్టింది. ఆ గ్రామంలో వున్న ప్రభుత్వ సారా దుకాణాన్ని, లైసెన్సు వున్న మరో ప్రవేటు మద్యం దుకాణాన్ని మూయించేవరకు ఆమె తన పోరాటాన్ని కొనసాగించింది. యింటా బయటా యెన్ని అవరోధాలు యెదురైనప్పటికీ జంకకుండా సవాళ్ళకు యెదురొడ్డి నిలబడి సారా వ్యతిరేక వుద్యమాన్ని విజయవంతంగా నడిపిన జయ భాగ్యమ్మకు అప్పటి నుంచి ఆ గ్రామంలో కొందరు స్త్రీ పురుషులు అభిమానులుగా మారి ఆమెని తమ నాయకురాలిగా గౌరవించడం మొదలు పెట్టారు.

సారా వ్యతిరేక ఉద్యమం ద్వారా సమర్ధురాలైన నాయకురాలిగా అందరి దృష్టిలో పడిన భాగ్యమ్మను లోక్‌ సత్తా పార్టీ జయ ప్రకాష్‌ నారాయణ గుర్తించి ఆమెకు పార్టీ సీటివ్వగా ఆమె 2009 అసెంబ్లీ యెన్నికలల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యడం విశేషం. ఈ క్రమంలో జయభాగ్య మ్మకు ప్రజా ఉద్యమాలలో క్రియాశీల కంగా పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలతో బాగా పరిచయాలు పెరిగి ఆమెలో అదివరకటి పోరాట పటిమ మరింత రాటుదేలిందనవచ్చు. భాగ్యమ్మ మాట్లాడితే ఆమె చదువుకోలేదని యెవరూ అనుకోరు. భాషలో స్పష్టతతో పాటు ఆమె ఆలోచనా తీరులో ూడా కనిపించే స్పష్టత యెదుటివారిని కట్టిపడేస్తుంది. జయభాగ్యమ్మకి ఇప్పుడు డెబ్భె రెండేళ్ళు. తాగుబోతు, వ్యసనపరుడైన భర్త, జొన్నలగడ్డ సుబ్బారావుతో తెగతెంపులు చేసుకుని ముగ్గురు పిల్లల్ని తన రెక్కల కష్టంతో పెంచి, పెద్ద చేసి వారు జీవితంలో స్థిరపడేలా చేసింది. జీవనోపాధి కొరకు ఆమె యెప్పుడూ పెత్తందారీ కులాల వద్ద పాచిపనులు, యెట్టిపనులు చెయ్యడా నికి మొగ్గుచూపకపోవడం ఆమెలోని ఆత్మగౌరవ చైతన్యానికి నిదర్శనం. బతుకుదెరువు కోసం ఆమె అందరిలా కాక ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. కొన్ని గేదెలను మేపుకుని వాటి ద్వారా వచ్చే పాలతో పాల వ్యాపారం చేసి కుటుం బాన్ని పోషించింది. ఉద్యమాలలో చురుకుగా పాల్గొనడానికి తన కుటుంబంలో యెవరి సహకా రం, నైతిక మద్దతు భాగ్యమ్మకు దొరకలేదు. అయినప్పటికీ ఆమె తన అభిప్రాయాలను మార్చు కోవడం, రాజీ పడడం చెయ్యలేదు. పిల్లలు యెవరి దారిన వారు వెళ్తే తనొక్కతే ూలీ నాలీ చేసుకుంటూ బతుకుపోరు సాగిస్తొంది.

యిటీవల గొట్టిపాడు దళితవాడపై అక్కడి పెత్తందారీ కులస్తుల దాడికి నిరసనగా వెల్లువెత్తిన వుద్యమంలో జయభాగ్యమ్మ వొక నిర్ణయాత్మకమైన పాత్ర పోషించడమే కాక ఆ వుద్యమం ప్రతిఘటనా స్థాయికి వెళ్ళడంలో ఆమె అందించిన తోడ్పాటు యెంతో కీలకమైనదిగా భావించ వచ్చు. సంఘటన పూర్వాపరాలను ఆమె మీడియాకు వివరించిన తీరు చదుకున్న స్త్రీలకు ూడా అసాధ్యమని చెప్పాలి. దళితులపై జరుగుతున్న దాడుల వెనక వున్న అసలు కారణాలను ఆమె చాలా సైద్ధాంతికంగా విశ్లేషిం చింది.

సుమారు వెయ్యి కుటుంబాలున్న గొట్టిపాడు దళితులకు నేడు జయ భాగ్యమ్మ తిరుగులేని నాయకురాలు. ఆమె మాటకు యెవరూ జవ దాటరు. తాగుబోతులు చాటు మాటుగా తిట్టుకో వడం తప్ప ఆమె ముందు యెదురు తిరిగే పరిస్థితి లేదు. అది ఆ సమాజంలో జయ భాగ్యమ్మ స్థాయి. దళితుల చేతిలో అధికారం లేకపోవడం వల్లనే వారిపై నిరాటంకంగా యితరుల పెత్తనం, దౌర్జన్యా లు కొనసాగుతున్నాయని వారికి రాజ్యాధికారం తప్పనిసరి అని జయ భాగ్యమ్మ భావన. రాబోయే యెన్నికలలో ప్రజాప్రతినిధి గా పోటీ చెయ్యడానికి సమాయత్తమవ్వడం ఆమెలోని రాజకీయ చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం. ఆమె సమాజాన్ని అర్ధం చేసుకున్న తీరు అబ్బుర పరుస్తుంది. ‘మాల, మాదిగలపై దొంగ దెబ్బ తియ్యకుండా యెలమీద నిలబడి బాహీ బాహీగా తలబడితే ఆ పెత్తందారీ నా బట్టలు యెందుూ పనికి రారు. నా పిల్లలు (దళిత యువకులు) వొక్కొక్కరు యెంతో శక్తి వంతులు’ అని ఆమె దళిత శక్తి పట్ల తనకున్న ఆశని వ్యక్తపరిచింది. అలాగే తాగుడుకి బానిసలై పెత్తందారుల ప్రలోభాలకు లొంగిపోయే దళిత పురుషులపై ూడా ఆమె నిప్పులు చెరిగి ‘అట్టాంటి వాళ్ళవల్లే మాల, మాదిగ కులాలు కునారిల్లి పోతున్నయ్‌’ అని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే దళిత స్త్రీలు స్వతహాగా యెంతో బలవంతులని, బతుకులో యెదురైన యెన్ని ఆటంకాలనైనా యెదురీదగలరని భాగ్యమ్మ అభిప్రాయం. ఆమె యవ్వన ప్రాయంలోనే భర్త నుంచి విడిపోయి మగ వాడికి ధీటుగా బతికింది. వొంటరి స్త్రీలపై పితృస్వామిక సమాజం చూసే చిన్న చూపు, అవహేళనలను తన నిండైన వ్యక్తిత్వంతో యెదుర్కొని నిలబడింది భాగ్యమ్మ. వొంటరిగానే అన్ని అగచాట్లను యీదుకొచ్చి తానొక జయశాలి అని నిరూపించుకుంది. వర్గ కుల పితృస్వామిక సమాజం ఆమెని పేద వొంటరి దాన్ని చేస్తే దానిపై అలుపెరుగని యుద్ధం చేస్తుంది జయ భాగ్యమ్మ. ఆమె వో నిలువెత్తు చైతన్య స్పూర్తి… తన చుట్టూ అలుముకున్న చీకట్లను పారద్రోలి స్వంత వ్యక్తిత్వంతో తనకు తాను ప్రకాశించిన మిణుగురు. చదువులేకపోయినా సమాజాన్ని నిశితంగా పరిశీలించి అర్థం చేసుకోగల తెలివిడి ఆమె స్వంతం. ఆమె బయట కుల సమాజం నుంచి, లోపల పితృస్వామిక కుటుంబ వ్యవస్థ నుంచి యెదురైన సవాళ్ళను, అవరోధాలను దాటుకుంటూ వొచ్చి తాను కుంగిపోకుండా వో నిండైన వ్యక్తిగా, నాయకురాలిగా తన ప్రజలకు వో చుక్కానిగా మెరిసి నిలిచిన ధీర జయభాగ్యమ్మ…

Share
This entry was posted in మిణుగురులు . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.