భూమిక సంపాదకురాలు సత్యవతి గారికి,
మాకు తెలియని 18వ శతాబ్దం చివరి దశాబ్దాలు, 20వ శతాబ్దపు తొలి దశాబ్దాలకు సంబంధించిన మన సాంఘిక చరిత్రకు మూలకారకులైన నాయికా నాయకుల నేపథ్యంలో ఓల్గా గారు ‘గమనమే గమ్యం’ అన్న నవలను వ్రాయడం, ఆ నవలను మీరు భూమికలో జనవరి సంచిక నుంచి ధారావాహికంగా ప్రచురిస్తుండడం ముదావహం. ఓల్గా గారి రచనా విధానంతో ఆనాటి సాంఘిక పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చిత్రిస్తున్నారు. అప్పటి సాంఘిక పరిస్థితులకు అద్దం పడుతున్న ఈ నవలను వ్రాసిన ఓల్గా గారికి, దాన్ని ప్రచురిస్తున్న మీకు ధన్యవాదాలు. ఇలాంటి నవలలు పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలుగా పెట్టినట్లయితే ఒక నవల చదవడంతో కలిగే సంతోషంతో పాటు ఆనాటి సాంఘిక చరిత్రను విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోగలరు.
వేలూరి కృష్ణమూర్తి, మైసూరు