ఉగాది కవితలు
ఉగాది… ఉగాది… మనసైనది
మన తెలుగు వారి పండుగ
నచ్చేది, మెచ్చేది ఈ పచ్చడి!
ఆరు రుచుల కలయిక ఇది
మనుషుల స్వభావాలు
స్వరూపాలు ఎన్నో ఎన్నెన్నో…
మంచికి తీపి
చెడుకు చేదు
పొగరు వగరు
కోపానికి కారం
కలుపుగోలుకు పులుపు
అన్నింట ఉండేది ఉప్పు…
నేను ఉండాలి అందరిలో
ఎక్కువ, తక్కువ కాని ఉప్పులా…!!
` కె.దినేష్ కార్తీక్, 6వ తరగతి
కారం అంటే మంట
నేను అలంకరిస్తాను ఇల్లంతా అంట
చింతపండు పులుపు
నా మనస్సు తెలపు
కాకరకాయ చేదు
తినాలి మధుమేహవంతులు,
ఉప్పు ఎంతో కొంత తెలుపు
ఉగాది పచ్చడికి అది పిలుపు
అమ్మ మాట లాంటిది
పంచదార తీపి
వగరు తినలేదెప్పుడూ
కానీ పొగరుబోతుల జోలికి పోనెప్పుడూ
` పి.పాల్ ప్రిన్స్, 7వ తరగతియుగానికి ఆరంభం ఉగాది,
షడ్రుచుల సంబరం ఉగాది,
నూతన ఆనందాల పునాది!
కోయిలమ్మ రాగాల సవ్వడి,
కొత్త చిగురు తొడిగిన మామిడి!
వసంతుడి వినోదాల సందడి,
పరిమళించే సుమాల సుగంధం!కోయిల రంగు నలుపు
కాని దాని గొంతు వినసొంపు
దానికి దేవుడు ఇచ్చిన వరం ఇంపు
మానవుడు అనేక రకాల మేళవింపు
అతని మనసు ఉండాలి తెలుపు
జీవనంలో ఉండాలి షడ్రుచుల మేళవింపు
కోరకూడదు ఏ రుచిని అమితంగా
అప్పుడే జీవనం సాగుతుంది మంచి ఉగాదిలా…
` పి.ధనుష్, 7వ తరగతి
చైత్ర మాసపు భానుని ప్రకాశం,
సుఖసంతోషాల జీవనానికి ఆహ్వానం!
` బి.శివప్రణీత, 6వ తరగతి