కుడుంబశ్రీ : కోవిడ్‌`19 లాక్‌డౌన్‌ సమయంలో మహిళా స్వయం సహాయక బృందాల పాత్ర -కందగట్ల శ్రవణ్‌ కుమార్‌

భారతదేశంలో లాక్‌డౌన్‌ సమస్య తీవ్రతను తగ్గించడంలో వీలైనంత తక్కువ సమయంలో
ఉత్తమ పరిష్కారాలు చూపించడంలో మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో మహిళల పాత్ర ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఇక్కడి ప్రభుత్వ యంత్రాంగాలకు మహిళలు అందించిన చేయూత గొప్ప సామాజిక ప్రభావాన్ని చూపాయి. కోవిడ్‌`19 లాంటి విపత్తును ఎదుర్కోవడం కేవలం ప్రభుత్వాలకు మాత్రమే సాధ్యం కాదు.

అందరికీ అన్నీ అందించడానికి చాలా పెద్ద యంత్రాంగం కావాలి. దానికి బలమైన వ్యవస్థీకృత పద్ధతులుండాలి. సరిగ్గా ఆ ఖాళీనే మహిళా స్వయం సహాయక బృందాలు పూరించాయి. ఇవే కోవిడ్‌`19 కాలంలో దక్షిణ భారతంలో వెలుగు రేఖల్లా మారాయి. దాదాపు మొత్తం జనాభాకు వివిధ అవసరాలు ఒకేసారి పెద్ద ఎత్తున తీర్చాల్సి రావడం, వైద్యపరంగా దాదాపు ప్రతి కుటుంబాన్నీ సర్వే చేయాల్సిన అవసరం రావడం, ఈ రెండిరటినీ సమన్వయం చేయడం సాధారణ విషయం కాదు. కానీ మహిళా సంఘాలు ఆ బాధ్యతను సత్వరంగా సమర్థంగా చేపట్టాయి, చేపడుతున్నాయి. భోజనం పెట్టడం దగ్గర నుంచీ ఆరోగ్యం కాపాడడం వరకూ అన్ని విధాలా వారు తమ వంతు సాయం అందిస్తున్నారు. దక్షిణాదిన దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక రూపంలో మహిళల పాత్ర కనిపిస్తోంది. ఈ విషయంలో కేరళ మహిళలు మరింత ముందున్నారు. అక్కడ ప్రభుత్వాలు, స్థానిక సంస్థలకు సమాంతరంగా పనిచేస్తోంది కుడుంబశ్రీ (మలయాళంలో కుటుంబాన్ని కుడుంబ అని అంటారు). కేరళను కాపాడుతున్న మహిళా స్వయం సహాయక బృందాల సంస్థ కుడుంబశ్రీ.
కుడుంబశ్రీ 1998, మే 17న కేరళ రాష్ట్ర పేదరిక నిర్మూలన మిషన్‌ మహిళలతో కూడిన నైబర్‌హుడ్‌ గ్రూప్స్‌ (ఎన్‌హెచ్‌జి) సంఘ సంస్థగా ప్రారంభించబడిరది. కుడుంబశ్రీ దేశంలోని అతి పెద్ద మహిళా స్వయం సహాయక సంఘాల సంస్థ. దేశంలోని ఇతర ప్రాంతాలలోని చాలా స్వయం సహాయక బృందాల మాదిరిగా కాకుండా కుడుంబశ్రీని ఆర్థిక సాధికారత, సామాజిక మార్పు రెండిరటికీ కృషి చేసే సంస్థగా ఏర్పాటు చేశారు. అంతేకాక ఇది ప్రారంభమైనప్పటి నుండి సమాంతర వ్యవస్థగా కాకుండా స్థానిక ప్రభుత్వంతో సన్నిహిత భాగస్వామ్యంతో పనిచేసింది. కుడుంబశ్రీకి చెందిన 14 వేల మంది మహిళలు 2015లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేశారు. కుడుంబశ్రీ 360 కమ్యూనిటీ కౌన్సిలర్ల ద్వారా కోవిడ్‌`19 లాక్‌డౌన్‌ సమయంలో వివిధ మానసిక సమస్యలను ఎదుర్కోవడానికి అవసరమైన వారికి కౌన్సిలింగ్‌, మానసిక మద్దతును ఇవ్వడం జరిగింది. కమ్యూనిటీ కౌన్సిలర్ల ద్వారా కుడుంబశ్రీ ఔషధాలు అవసరమైన వారికి ఇవ్వటం, కమ్యూనిటీ కిచెన్‌లకు సంబంధించిన కార్యకలాపాలు సమన్వయం, వృద్ధులకు మానసిక సహకారం ఇచ్చారు. లాక్‌డౌన్‌ వ్యవధిలో ఇంట్లో ఉన్న వ్యక్తుల మానసిక వేధింపులు, దుర్వినియోగాలను తగ్గించడానికి కుడుంబశ్రీ ‘స్నేహిత’ అనే జెండర్‌ హెల్ప్‌ డెస్క్‌ సెంటర్‌ ద్వారా ప్రచారాన్ని నిర్వహించింది.
నిజానికి మహిళా స్వయం సహాయక బృందాల ఉద్యమం దేశమంతా ఉంది. కానీ కొన్నిచోట్లే బాగా విజయవంతమైంది. కొన్నిచోట్లే సామాజికంగా, ఆర్థికంగా ప్రభావం చూపగలిగింది. దక్షిణ భారతదేశంలో ఈ సంఘాల ప్రభావం గ్రామీణ పేదరికాన్ని తగ్గించడంలో స్పష్టంగా కనిపించిందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. కేరళ వంటి చోట్ల ఈ సంఘాలు మరింత శక్తివంతంగా ఎదిగాయి. ఈ కుడుంబశ్రీని తెలుగు రాష్ట్రాల్లోని డ్వాక్రాతో పోల్చవచ్చు. కేరళలో 90లలో ఈ
ఉద్యమం మొదలైంది. 2019 మార్చి నాటికి అక్కడ మొత్తం 2,91,507 స్వయం సహాయక సంఘాలు ఏర్పడ్డాయి. వాటిపైన 19,489 ప్రాంతీయ అభివృద్ధి సంఘాలు, మరో 1064 కమ్యూనిటీ అభివృద్ధి సంఘాలు ఉన్నాయి. వీటిలో 43 లక్షల 93 వేల 579 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఏ మహిళయినా ఇందులో చేరవచ్చు. కాకపోతే ఇంటికి ఒక్కరు మాత్రమే చేరాలి. సమగ్ర ఆర్థిక, సామాజిక, మహిళా సాధికారత ఈ సంస్థ లక్ష్యం. సూక్ష్మ రుణాలు, సూక్ష్మ వ్యాపారాలు, ఉమ్మడి సాగు, జంతువుల పెంపకం, మార్కెట్‌ అభివృద్ధి, వాల్యూ చైన్‌ ఆధారిత వ్యవహారాలు లాంటి కార్యకలాపాల కిందకు వస్తాయి. ఆశ్రయ (దిక్కులేని వారికి సాయం చేయడం), బాలసభ (పిల్లల కోసం), బడ్స్‌ (ప్రత్యేక అవసరాలున్న పిల్లల విద్య కోసం), ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక ప్రాజెక్టులు… ఇవన్నీ సామాజిక కార్యక్రమాల కిందకు వస్తాయి. ఇక మహిళల కోసం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయి. వీటివల్ల ఎందరో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోగలిగారు. వ్యాపారవేత్తలుగా కొందరు ఎదిగారు. కొందరు స్వయం ఉపాధి పొందారు. కేరళ తరువాత స్థానంలో మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ సంఘాలు బలంగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ సంఘాలు ఎందరో మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశాయి. స్వయం ఉపాధి పొందడానికి సహాయపడ్డాయి. వారి ఉత్పత్తులను అమ్ముకోవడానికి వేదిక కల్పించాయి. అలాగే అనేక కుటుంబాలకు ఆర్థికంగా మేలు చేశాయి. పరోక్షంగా పేదరిక నిర్మూలనకు సహాయపడ్డాయి.
కుడుంబశ్రీ : కోవిడ్‌`10 సహాయక చర్యలు
దేశంలో కరోనా వ్యాప్తిని ముందుగానే ఊహించిన కుడుంబశ్రీ సంస్థ 2020 మార్చి 15 నుంచే శానిటైజర్లు, మాస్కుల తయారీ మొదలుపెట్టింది. 21 యూనిట్లలో నిరంతరం శానిటైజర్లు, 306 యూనిట్లలో రోజుకు 1,26,000 మాస్కులు తయారు చేయడం ప్రారంభించారు. వీరు తమ ఉత్పత్తులను ఆస్పత్రులు, విధులు నిర్వహిస్తోన్న ప్రభుత్వ సిబ్బందికి అందించారు. అదే కాకుండా పలు ప్రైవేట్‌ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కూడా అందించారు. 2020, మార్చి 15`30 మధ్య వీరు 18.5 లక్షల మాస్కులు, 4492 లీటర్ల శానిటైజర్లు ఉత్పత్తి చేసి రూ.2.30 కోట్ల టర్నోవర్‌ చేశారు. ఈ విషయంలో కేరళ మాత్రమే కాదు మిగిలిన దక్షిణాది రాష్ట్రాల మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున మాస్కులను ఉత్పత్తి చేశాయి.
కోవిడ్‌`19 సమయంలో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు భారతదేశ ప్రజారోగ్య వ్యవస్థకి వెన్నెముక అంటే ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం పట్ల అవగాహన, అనుకూలత లేనిచోట్ల వైద్యసౌకర్యాలు లేని చోట్ల వీరి పాత్ర ఎంతో కీలకమైనది. మామూలు రోజుల్లో వీరి పని పెద్దదే అయినా దాన్ని కాసేపు పక్కన బెడితే, కోవిడ్‌ సమయాల్లో ఈ మహిళలు ఏ మాత్రం వెరవకుండా చేసి విధి నిర్వహణ రాష్ట్రాలను కరోనా నుంచి కొంతవరకు కాపాడారు. లాక్‌డౌన్‌ అమలు నుండి డాక్టర్లు వైద్య సేవలు అందించినా అసలైన క్షేత్రస్థాయి పని అంటే అవగాహన కల్పించడం, ఎవరికి ఆరోగ్యం బాలేదో గుర్తించడం, ఇంటింటికీ తిరిగి సర్వే చేయడం లాంటివి వీరే చేశారు. 2018`19 నాటికి దేశవ్యాప్తంగా 9,37,107 మంది ఆశావర్కర్లు ఉన్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌లో 42,209, కర్నాటకలో 39,329, కేరళలో 24,359, తమిళనాడులో 2,650, తెలంగాణలో 29,871, పుదుచ్చేరిలో 341 మంది ఉన్నారు. కరోనా సమయాల్లో ఇళ్ళల్లోంచి కాలు బయట పెట్టడానికే అందరూ భయపడుతున్న వేళ వీళ్ళు రెడ్‌జోన్‌లు, హాట్‌స్పాట్‌లలో ఇంటింటి సర్వేకు వెళ్ళి అక్కడ ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదా, విదేశాల నుంచి లేదా ఇతర రాష్ట్రాల నుండి ఎవరైనా వచ్చారా లాంటి వివరాలు రాసుకున్నారు. ఆ తర్వాత అలాంటి వారిని ప్రతిరోజూ ఫాలోఅప్‌ చేస్తూ ఉన్నతాధికారులకు సమాచారం చేరవేసి, కోవిడ్‌ నియంత్రణలో కీలక పాత్ర పోషించారు. అసలు మహిళా స్వయం సహాయక బృందాలు లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడం కష్టం. వారికి తమ పరిధిలోని ఇళ్ళు, వీథులు, అక్కడి ప్రజల ఆరోగ్య సమస్యలపై కాస్త అవగాహన ఉంటుంది. రోజూ భయపడకుండా ఇంటింటికీ వెళ్ళి సమాచారం తెస్తారు. మామూలుగా గ్రామాల్లో వెయ్యి జనాభాకు ఒక ఆశా వర్కర్‌ ఉంటారు. కోవిడ్‌`19 సమయంలో అవగాహన కల్పించడం, తమ పరిధిలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారేమో చూడడం వంటి క్రమంలో వారు కొంత ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు. అవగాహన లేని ప్రజలు వీళ్ళు ఇంటికి వస్తుంటేనే భయపడతారు. ఆశా వర్కర్లు ఓపిగ్గా వాళ్ళకు నచ్చచెప్పి అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఈ విధంగా మహిళలు ముందుండి కార్యక్రమాలు నడిపించడం దక్షిణ భారతంలో ముందునుంచీ ఉంది. ఇదే కుడుంబశ్రీ కేరళ వరదల సమయంలో కూడా తన వంతు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంది.
కోవిడ్‌`19 సంబంధిత వివిధ కార్యకలాపాలను సమన్వయం చేయడానికి వాలంటీర్లను చేర్చుకునేందుకు కేరళ ప్రభుత్వం ‘సన్నాధసేన పోర్టల్‌’ అనే వాలంటీర్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. కుడుంబశ్రీ సభ్యులు వాలంటీర్లుగా పాల్గొనడాన్ని నిర్థారించడానికి, పోర్టల్‌ మరియు రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వివరాలు కుడుంబశ్రీ మహిళల్లో పంపిణీ చేయబడ్డాయి. లాక్‌డౌన్‌ తర్వాత దేశమంతా పేదలు, వలస కార్మికుల ఆకలి కేకలు వినిపించాయి. కానీ కేరళ కుడుంబశ్రీ మహిళల కమ్యూనిటీ కిచెన్‌ అందరికంటే కాస్త ముందుగా వారి ఆకలి తీర్చింది. అక్కడి స్థానిక సంస్థలతో కలిసి కుడుంబశ్రీ సంఘాలు ఈ వంటశాలలు ఏర్పాటు చేశాయి. పేదల దగ్గర నుంచి క్వారంటైన్‌లో ఉన్నవారి వరకూ అందరికీ భోజనాలు అందచేశాయి. మొత్తం 1304 కమ్యూనిటీ కిచెన్‌లలో 1100 వంటశాలల్ని ఈ మహిళా సంఘాలే నడుపుతున్నాయి. ఆహారం ఉచితం. కాస్త డబ్బు పెట్టగలిగిన వారి కోసం వీటిలో 238 కిచెన్లను హోటళ్ళుగా కేటాయించారు. అక్కడ ఇరవై రూపాయిలకే భోజనం అందుబాటులోకి తెచ్చారు. ఇక సరిహద్దుల్లో లారీ డ్రైవర్లు ఎక్కువగా ఇరుక్కుపోయిన చోట, వారికోసం 15 ‘టేక్‌ అవే’ పాయింట్లు ఉన్నాయి. వీటి ద్వారా సాధారణ వ్యక్తులతో పాటు అనాధ కుటుంబాలకి కూడా ఆహారం అందించారు. కేరళ సివిల్‌ సప్లైస్‌ శాఖ 87 లక్షల కుటుంబాలకు అందించడానికి నిత్యావసరాల కిట్లను తయారు చేయడంలో వీరి సాయం కోరింది. దానికి అదనంగా ఆ కిట్లకు కావల్సిన సంచులు కుట్టే పని కూడా వీరే తీసుకున్నారు. ఇక అంగన్వాడీల ద్వారా అందించే పౌష్టికాహారం లాక్‌డౌన్‌లో కూడా ఆగిపోకుండా పంపిణీ చేశారు. గిరిజన ప్రాంతాలకూ ఆహార పదార్థాలను సరఫరా చేశారు. కొన్ని చోట్ల పడవల్లోనూ సూపర్‌ మార్కెట్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 60 ఏళ్ళు పైబడిన వారు ఎక్కడా బయటకు రాకుండానే వారి అన్ని అవసరాలు తీర్చేలా చేశారు. విస్తృత నెట్‌వర్క్‌, సమర్ధులైన సభ్యులు వారి మధ్య స్పష్టమైన కమ్యూనికేషన్‌ వల్ల స్వయం సహాయక బృందాలపై ప్రభుత్వాలే ఆధారపడేలా చేయగలిగాయి.
కేవలం భోజనం పెట్టడమే కాదు వారి మంచి చెడ్డలు చూస్తూ ఆప్యాయంగా పలకరించి కౌన్సిలింగ్‌ చేయడం కోసం స్నేహిత అనే కార్యక్రమం ఉంది. ముఖ్యంగా దిక్కులేని కుటుంబాల్లో 1,22,920 మంది వృద్ధులే ఉన్నారు. లాక్‌డౌన ్‌సమయంలో వారందరినీ రోజూ పలకరించడం కుడుంబశ్రీ పనుల్లో ఒకటి. క్వారంటైన్లో ఉన్నవారందరూ మానసికంగా, ధైర్యంగా ఉండేందుకు వారందరినీ పలకరించాలనే నియమం పెట్టుకున్నారు. ఈ పలకరింపుల పని కోసమే 2,500 మంది ఉన్నారు. అంతేకాదు, అందరూ ఇంట్లోనే ఉండిపోవడంతో, బయటకు వెళ్ళకపోవడంతో వచ్చే మానసిక ఒత్తిడిని ఎదుర్కోవడానికి, గృహ హింసను ఎదుర్కొంటున్న మహిళలను గుర్తించడానికి కూడా స్నేహిత కౌన్సిలింగ్‌ కార్యక్రమం పనిచేస్తోంది. కుడుంబశ్రీ చేసిన ముఖ్యమైన పనుల్లో కమ్యూనికేషన్‌ ఒకటి. దీని కింద 1,90,000 వాట్సాప్‌ గ్రూప్‌లు ఉన్నాయి. వాటిలో 22 లక్షల 50 వేల మంది సభ్యులు ఉన్నారు. వీరందరికీ కోవిడ్‌ గురించి స్పష్టమైన సమాచారం ఎప్పటికప్పుడు చేరిపోతూ వచ్చింది. ఇంగ్లీష్‌, మలయాళ భాషల్లో రూపొందించిన పోస్టర్లను వ్యాప్తి చేశారు. ‘బ్రేక్‌ ద చెయిన్‌’ క్యాంపైన్‌ ద్వారా చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం, పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడంలో చురుగ్గా వ్యవహరించారు. వాట్సప్‌ ద్వారానూ, వాట్సప్‌ లేనిచోట ప్రత్యక్షంగా ప్రచారం చేయడం ద్వారానూ ప్రజల్లో అవగాహన కల్పించారు.
దేశంలో కోవిడ్‌`19 వ్యాప్తిని అరికట్టడంలో, మెరుగైన ఆరోగ్య సేవలు అందించడంలో కేరళ రాష్ట్రం గణనీయమైన కృషి చేసింది. కరోనా వైరస్‌ని అరికట్టడంలో కేరళ ప్రభుత్వం అవలంబించిన విధానాలు ఇతర రాష్ట్రాలకు కూడా దిశా నిర్దేశం చేశాయి. లాక్‌డౌన్‌ సమయంలో కుడుంబశ్రీ మహిళా స్వయం సహాయక బృందాల సేవలు దేశానికే ఆదర్శం. కేరళ రాష్ట్ర ప్రతిష్టాత్మక కుడుంబశ్రీ అనేక సత్ఫలితాలను ఇచ్చింది. కేవలం మహిళా సాధికారత కోసమే కాకుండా పేదరికాన్ని నిర్మూలించడంలో కూడా దోహదపడుతున్న అతి పెద్ద మహిళా స్వయం సహాయక సంస్ధ ఇది. కుడుంబశ్రీ సేవలు కేరళ రాష్ట్రానికే కాక దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఇటువంటి సంస్థను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తే మహిళా సాధికారతలో మరియు మహిళా పేదరికాన్ని తగ్గించడంలో మరింత ముందుకు సాగొచ్చు. మహిళా స్వయం సహాయక బృందాలకు మరింత సామాజిక, ఆర్థిక సహకారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.