డిగ్నిటీ ఆఫ్‌ లేబర్‌ -పి. ప్రశాంతి

‘అమ్మా ఒన్‌ కేజి కవర్స్‌ ఐపోయినాయి. పావు కిలో కవర్స్‌ కూడా ఐపోవస్తున్నాయి. ఒకసారి చూసుకో అమ్మా, నాకు క్లాస్‌ టైమవుతోంది’ అంటూ బుక్స్‌ తీసుకుని గబగబా కంప్యూటర్‌ ఆన్‌ చేసి కూర్చున్నాడు సిద్దు. ‘అమ్మా టమాట, ఆలుగడ్డ, కాకరకాయలు లేవు. ఆర్డర్స్‌

ఉన్నాయోమే ఒకసారి నాన్నని చూసుకో మను’ అని టేబుల్‌ మీద ఉన్న ఫోన్‌ తీసుకుని లోపలిగదిలోకి వెళ్ళింది శ్రావ్య. ‘సరే నా వంట పని ఐపోయిందిలే. నేను చూసుకుంటాను మీరిద్దరూ వెళ్ళండి’ అని కిచెన్లోనించే చెప్పింది మాలతి. ఆ రోజుకి డెలివరి ఇవ్వాల్సిన వాటిని ట్యాబ్‌లో సార్ట్‌అవుట్‌ చేస్తున్న వాసు పని ఆపి ఒకక్షణం కిటికీలోనించి శూన్యంలోకి దీర్ఘంగా చూసి ఒక నిట్టూర్పుతో మళ్ళీ పనిలో పడ్డాడు. పిల్లలిద్దరికీ టిఫిన్‌ ప్లేట్స్‌ ఇచ్చి, రెండు ప్లేట్స్‌ పట్టుకుని గదిలో భర్త దగ్గరకొచ్చింది మాలతి. దీక్షగా పనిచేసుకుంటున్న వాసు పక్కన కూర్చీలో కూర్చుంటూ ‘ఈ రోజు ఆప్‌డేట్స్‌ ఏంటి’ అని అడిగింది. ఆ రోజుకున్న ఆర్డర్స్‌ని, డెలివరీ ఇవ్వాల్సిన వాటిని, వాళ్ళ సర్వీస్‌ పైన వచ్చిన ఆన్లైన్‌ రివ్యూస్‌ని మాలతితో షేర్‌ చేశాడు.
సరిగ్గా సంవత్సరం క్రితం మాలతి, వాసుల జీవితం, ఆ ఇంటి పరిస్థితి వేరేగా ఉండేవి. ఒక ప్రైవేట్‌ కంపెనీలో సేల్స్‌ మేనేజర్‌గా పని చేసేవాడు వాసు. నెలకి ముప్ఫై వేలు జీతం. సేల్స్‌ ప్రమోషన్ని బట్టి మూణ్ణేల్లకో, ఆర్నెల్లకో బోనస్‌ ఉండేది. మాలతి కూడా మంచిపేరే
ఉన్న ఒక ప్రైవేట్‌ స్కూల్లో ఇంగ్లీష్‌ టీచర్‌గా చేసేది. నెలకి పదిహేను వేల జీతంతో పాటు పిల్లలిద్దరికీ సగం స్కూల్‌ ఫీజు కడితే చాలు. ముగ్గురికీ స్కూల్‌ బస్‌ ఫ్రీ. పొదుపుగా వాడుకుం టూ ఇంటికి కావలసినన్నీ సమకూర్చుకోటంతో పాటు. బ్యాంక్‌లో లోన్‌ తీసుకుని సెకండ్‌ హాండ్‌దే ఐనా టూ బెడ్రూం ఫ్లాట్‌ కొనుక్కోగలిగారు.
కంపెనీ పనిమీద సొంత జిల్లాకి వెళ్ళిన వాసు పనైపోయాక శనాదివారాలు కలిసొస్తున్నాయని తల్లిదండ్రుల దగ్గరకెళ్ళి ఊర్లో రెండు రోజులున్నాడు. తిరిగి సోమవారం తెల్లవారే బయలుదేరి వచ్చేస్తుంటే యాక్సిడెంట్‌ అయ్యి చాలా రక్తంపోయి చావు బతుకుల్లో ఎవరో హాస్పిటల్‌లో చేర్పిస్తే కష్టంమీద ఆచూకీ దొరికిచ్చుకుని మర్నాటికి హాస్పటల్‌కి చేరుకుంది మాలతి. కండిషన్‌ క్రిటికల్‌గా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం పట్నం తీసుకొచ్చేసి వైద్యం చేయించినా తలకి గట్టిదెబ్బ తగలడంతో మూడు వారాలపైనే కోమాలో ఉండిపోయాడు. ఇక మామూలు మనిషవడం కష్టం అనుకున్న సమయంలో కోమాలోంచి బైటపడి మరో రెండు వారాలకి కాస్త నార్మల్‌ స్టేజికి వచ్చాడు. కాని కాళ్ళు చచ్చుబడిపోయాయి. వైద్యానికి ఉన్నదంతా ఖర్చయిపోగా ఇన్యూరెన్స్‌ డబ్బు కొంతొచ్చినా పెద్దెత్తున అప్పు మిగిలింది. తనదగ్గరున్న కొద్దిపాటి బంగారాన్ని అమ్మేసింది. ఇల్లుంటే తిన్నా తినకపోయినా గుట్టుగా ఉండచ్చని నానాతంటాలుపడి బ్యాంకులో కిస్తీలు కడుతోంది. తిరగాల్సిన ఉద్యోగం కనుక కాళ్ళు పనిచేయని స్థితిలో తామేమే చేయలేమని వాసు పనిచేసే కంపెనీ వారు అతనికి రావలసిన వాటిని సెటిల్‌ చేసి, మరో యాభైవేలు అవసరాలకి ఉంటాయని ఇచ్చారు. రెణ్ణెళ్ళుగా స్కూల్‌కి వెళ్ళలేకపోవడంతో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ మాలతిని తిరిగి
ఉద్యోగంలోకి తీసుకోలేమని, పిల్లల చదువుని మాత్రం ఇప్పటిలాగే కంటిన్యూ చేయచ్చని చెప్పారు. ఇంత కష్టంలోనూ కొంచెం ఉప శమనం అనిపించింది. వాసు మందులకి, ఇంటి ఖర్చులకి కష్టమవుతుండటంతో ఏదో ఒక పని చూసుకోవాలని గట్టిగా ప్రయత్నించింది. అపార్ట్‌మెంట్లో ఉన్న నలుగురైదుగురు పిల్లలకి ట్యూషన్‌ చెప్పడం మొదలుపెట్టింది. ఐనా లోను కట్టడానికి కూడా ఇబ్బంది అవడం మొదలైంది.
ఇంతలో పులిమీద పుట్రలా జనతా కర్ఫ్యూ, లాక్డౌన్‌, కోవిడ్‌ ప్రతాపం, స్కూళ్ళు మూతపడడం, జనజీవనం స్తంభించడంతో పరిస్థితి ఘోరంగా తయారైంది. చివరికి దాతలిచ్చే డ్రైరేషన్ని తెచ్చుకుని కొన్నాళ్ళు గడిపినా కష్టానికి అంతు లేకుండాపోయింది. ఒకరోజు పిల్లలిద్దరూ రెండు బిర్యానీ పొట్లాలు, ఒక నీళ్ళ సీసా, రెండు అరటిపళ్లు పట్టుకుని హుషారుగా ఇంటికొస్తే మాలతికి చచ్చిపోవాలనిపించింది. వాసుకి తట్టుకోలేని బాధతో ఫిట్స్‌ వచ్చినాయి. ఈ ప్రమాదం ఉంటుందనే పెద్దగా ఏ విషయాలు వాసు దగ్గర మాట్లాడట్లేదు. ఇక ఇలాకాదని హస్పటల్లో ఆయా అవసరం ఉందని తెలిసి చెరింది. నెలకి ఐదువేలు, ఎక్స్‌ట్రా షిఫ్ట్‌ చేసినపుడు రెండొందలు, సెలవు పెడితే జీతం కట్‌, వారాంతపు సెలవు లేదు.
ఒకరోజు వాసుకి తీవ్రమైన జ్వరం, తలనొప్పి, శ్వాస ఇబ్బంది అయ్యేసరికి కోవిడ్‌ సోకి
ఉంటుందని, తనవల్లే వ్యాపించి ఉండొచ్చని, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అనారోగ్యంతో ఉన్న వాసుకి ఇన్ఫెక్షన్‌ చేరుంటుందని విపరీతంగా టెన్షన్‌ పడిరది. టెస్ట్‌ చేయించాలంటే ఒకవైపు డబ్బు ఇబ్బంది, మరోవైపు బెరుకు. రెండ్రోజుల్లో జ్వరం, తలనొప్పి తగ్గాయి. శ్వాస సమస్య మరో రెండు రోజులకి తగ్గిపోయింది. మళ్ళీ మళ్ళీ ప్రమాదం ఉండనే ఉందని ఆ ఉద్యోగం మానేసింది.
మాలతి కష్టం తెలుసుకున్న స్టాఫ్‌, డాక్టర్లు ఆమె వెళ్ళిపోయేటపుడు ఐదువేలు చేతిలో పెట్టారు. సిగ్గుతో చితికిపోయినా అవసరం కనుక తీసుకుంది. రెండువేలు పెట్టి కూర గాయలు కొనుక్కొచ్చి ఫ్యాక్‌చేసి చుట్టుపక్కల ఇళ్ళకెల్లి అమ్మి వచ్చింది. అలా ఒక వారం గడిచేసరికి ఇంకొంత మంది అడగడం మొదలు పెట్టారు. దాన్తో పిల్లల్ని కూర్చోబెట్టుకుని వాసుతో చర్చించి ఆన్‌లైన్లో కూరగాయలు అమ్మడానికి ప్లాన్‌ చేసుకున్నారు. మొదట్లో తనే ఆటోలో వెళ్ళి హోల్‌సేల్లో కొనుక్కొచ్చేది. ఇప్పుడు ఆటో అతనే తెస్తున్నాడు. ఆర్డర్లు తీసుకోవడం, లెక్కలు చూడ్డం అన్నీ వాసు చూసుకుంటే, ప్యాకింగ్‌కి పిల్లలు సాయపడ్తున్నారు. ఇళ్ళల్లో పనులు పోగొట్టుకున్న నలుగురు మహిళల్ని కూడేసి న్యూస్‌ పేపర్‌తో కవర్లు చెయ్యడం నేర్పింది. పాత న్యూస్‌ పేపర్లను కూడా ఆన్లైన్లో కొనడం, అవి డైరెక్ట్‌గా ఆ మహిళల దగ్గరకే చేర్చడం. వారు చేసిన కవర్లను తెచ్చుకోడం, ఆర్డర్లు డెలివరి ఇవ్వడం… నెల్రోజుల్లోనే మరో ఇద్దరు కుర్రాళ్ళని డెలివరీ కోసం పెట్టుకోవలసొచ్చింది. ప్రస్తుతం రోజుకి ఖర్చులన్నీ పోను సుమారు పదిహే నొందలు మిగులుతోంది.
ఒకరోజు ఆటోడ్రైవర్ని, డెలివరీ బాయ్స్‌ని, కవర్లు చేసే మహిళల్ని పిలిచి తలో వెయ్యి రూపాయలు ఇచ్చింది. ‘చేసేపని మీద ప్రేమ, గౌరవం, నమ్మకం ఉండాలిగాని పనికి లోటు లేదు’ అని మాలతి అంటుంటే ఎమ్బియే చేస్తున్న ఒక డెలివరీ బాయ్‌ ‘డిగ్నిటీ ఆఫ్‌ లేబర్‌
ఉండాలి కాని పనిలో చిన్న పనులు, పనికిరాని పనులనేవే లేవు అంటీ’ అన్నాడు. మరి అందుకే కదా ఇంతమందికి ఈ కష్ట కాలంలోనూ జీవనాధారాన్ని కల్పించగలిగింది మాలతి!
మాలతి, వాసుల్లా ఆలోచించగలిగితే పని దొరక్క, ఇంటిని నడపలేక ఆత్మహత్యలు చేసు కుంటున్న వారి సంఖ్య తగ్గుతుందేమో!

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.