ఈ అతడే ఒక సముద్రం పుస్తకాన్ని ఎర్నెస్ట్ హెమింగ్వే రాశాడు. హెమింగ్వే తనకి జరిగినవన్నీ కూడా కలిపి ఈ పుస్తకం రాశాడు. ఈ కథలో ఒక వృద్ధుడు ఉంటాడు. అతనికి ఒక బాలుడు పరిచయమవుతాడు. ఆ బాలుడు ఎప్పుడూ ఈ వృద్ధుని కోసం తినేవాటితో పాటు ఇంకా అతనికి కావల్సినవన్నీ తెస్తుంటాడు. మత్స్యకారుడైన ఆ వృద్ధుడు ఆ బాలుడికి పడవ నడపడం, చేపలు పట్టడం వంటివి నేర్పిస్తాడు.
ఒకసారి మత్స్యకారుడైన ఆ వృద్ధుడు సముద్రంలోకి ఒక చేపను పడదామని వెళ్తాడు. అతనికి ఒక పెద్ద చేప చిక్కుతుంది. దాంతో అలా మూడు రోజులదాకా గడుపుతాడు. అతను ఆ చేప బతికినంత కాలం అది తన తమ్ముడిగా గడుపుదామని అనుకుంటాడు. మధ్యలో అతనికి తెలుస్తుంది, అది ఒక మహా బ్లూ మార్గిన్ అని. అది ఒక్కసారిగా పైకి దూకడంతో ఆయన దాని వెన్నెముక దగ్గర గురిచూసి పంట్రకోలను గుచ్చుతాడు. అలాగే రెండు, మూడుసార్లు పొడిచి దాన్ని చంపేస్తాడు.
తర్వాత అతను నేను స్వయంగా నా తమ్ముడిని చంపేశానే అని అనుకుంటాడు. కానీ చేసేదేం లేక దానికి ఉచ్చు బిగించి, నోరును కట్టేసి తాడుతో దాన్ని పడవకు కట్టేసి బయల్దేరతాడు. వెళ్ళే దారిలో అతను దానికి వచ్చే ధర గురించి ఆలోచిస్తాడు. కానీ అప్పుడే ఒక సొరచేప ఆ బ్లూ మార్లిన్ తోకను కొరుకుతుంది. దానివల్ల ఆ బ్లూ మార్లిన్ నుండి రక్తం కారుతుంది. ఆ రక్తం వల్ల ఇంకెన్ని సొరచేపలు వస్తాయో అనుకుంటాడు ఆ వృద్ధ మత్స్యకారుడు.
అప్పుడు ఆయన పంట్రకోలను పట్టుకొని వచ్చిన ప్రతి సొరచేపను పొడుస్తాడు. కానీ ఎంత చేసినా ఆ బ్లూ మార్లిన్ నుండి అవి మాంసాన్ని తింటూనే ఉంటాయి. దాంతో ఇక దానిలో సగం కన్నా తక్కువ భాగమే మిగులుతుంది.
అతను తనకు తాను చెప్పుకుంటాడు ‘అవి నన్ను నాశనం చేయగలవు కానీ ఓడిరచలేవు’ అని.
ఆ మిగిలిన భాగంతోనే తిరిగి వెళ్ళిపోతాడు. అక్కడ ఆ బాలుడు ఈ వృద్ధుడి కోసం వేడి వేడి కాఫీ తీసుకొస్తాడు. అది తాగిన తర్వాత ఆయన నిద్రపోతాడు. ఆ సమయంలో జనమంతా ఆ బ్లూ మార్లిన్ చుట్టూ గుమిగూడి దాన్ని చూస్తారు.
ఆ బాబు మళ్ళీ ఆ వృద్దుడి ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడతాడు. తర్వాత ఆయన మళ్ళీ నిద్రలోకి జారుతాడు. ఆ బాలుడు అలా అతని ముందే కూర్చుంటాడు.
(ఈ ‘ది ఓల్డ్ మాన్ అండ్ ద సీ’ నవలకు రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే నోబెల్ బహుమతి అందుకున్నాడు. ఈ నవలను రవి వీరెల్లి, స్వాతికుమారి ‘అతడే ఒక సముద్రం’ పేరుతో తెలుగులోకి అనువదించారు.)
`