పిల్లలు ఇవి కూడా చెప్తారా?! – పి. ప్రశాంతి

‘భావన ఏది? నిన్నటి నుంచి కనపడలేదు?’
‘ఏమో, తెలీదు’ శాంతి అడిగిన ప్రశ్నకు చందు జవాబు.
‘తెలీకపోడం ఏంటి? ఎక్కడికన్నా వెళ్ళిందా?’ ఆశ్చర్యంగా మళ్ళీ అడిగిన శాంతి ప్రశ్నకి భావన తమ్ముడు చందు నించి మళ్ళీ అదే జవాబు. ‘మొన్నే కదా, కొమ్ముల కూర’ వండిచ్చింది.

నిన్న అడిగితే ‘కొండకెళ్ళిం దన్నావు?’ అబద్ధం చెప్తున్నావా అన్న భావం శాంతి గొంతులో. తల కిందికేసుకుని మెల్లిగా పక్కకెళ్ళిపోయాడు చందు.
ఆ ఊరు ఎప్పుడెళ్ళినా వెంట వెంటే ఉండే భావన, క నపడకపోయినా వినపడేంత దూరంలోనే ఉండే భావన… రెండు కాదు, మూడు రోజులు దాటిపోయినా కనపడకపోయేసరికి ఏమయిందో అర్థం కాలేదు శాంతికి. ఆ చిన్న ఊర్లో అందరూ అందరికీ ఏదో ఒకరకంగా బంధువులే. బీరకాయ పీచు చుట్టాలే. రోజూ ఏ ఒక్కరూ ఎవరి దృష్టి నుంచి దాటిపోరు. అలాంటిది పదిహేనేళ్ళ భావన నాల్రోజులుగా కనపడకపోతే శాంతికి ఆదుర్దాగా
ఉంది, కానీ ఊర్లో ఎవరూ వివరాలు చెప్పట్లేదు. భావనతో ఎప్పుడూ క్లోజ్‌గా ఉండే లల్లి కానీ, వింధ్య కానీ, సీత కానీ… తమ్ముడు చందు కానీ… పిన్ని, బాబాయిలు కానీ… ఇంకా ఎవర్నడిగినా ఒకటే జవాబు ‘ఏమో, తెలీదు!’ ఇక శాంతికి అసహనంతో పాటు కోపం మొదలైంది. ఆమె నాన్నని అడుగుదా మంటే శాంతిని చూస్తూనే దాక్కోడమో, చాటుగా తప్పించుకుని జారుకోడమో చేస్తుంటే ఏదో అనుమానమొచ్చి ఆ రోజు అతనొచ్చేవరకూ కదలకూడదని, ఏ విషయం తేల్చుకోవాలని వాళ్ళ ఇంటిముందే కూర్చుంది. శాంతి దగ్గరికి పిల్లలందరూ చేరడంతో కథలు, కబుర్లు చెప్పుకుంటూ రెండు గంటలపైనే గడిపారు. అంతలో వర్షం మొదలయ్యేసరికి ఇక తప్పక అల్లంత దూరంలోని స్కూల్‌ వరండాలోకి వెళ్ళిపోయారు.
ఏమైందీయనకి? ఎందుకు తప్పించుకు తిరుగు తున్నాడు? భార్య చిన్న వయసులోనే చనిపోయినా మళ్ళీ పెళ్ళి గురించి ఆలోచించకుండా పిల్లలిద్దర్నీ ప్రాణప్రదంగా చూసుకునే అతను ఇప్పుడెందుకని నిమ్మకు నీరెత్తినట్లు న్నాడు. అర్థంకాక అయోమ యంగా ఉంది శాంతికి. కాపలాకాసి తప్పించుకుని వెళ్ళే అవకాశం లేకుండా అతను తడికలు అల్లడా నికి సిద్ధం చేసుకుంటుండగా నిశ్శబ్దంగా వెళ్ళి కొంత దూరంలో ఎదురుగా కూర్చుంది. దీక్షగా పనిచేసు కుంటున్న అతను వెదురు బద్దలు లేపుతూ తలెత్తేసరికి కనిపించిన శాంతిని చూసి తడబడి ‘మేడం’ అన్నాడు చిన్నగా. ‘భావన ఎక్కడికెళ్ళింది?’ వెంటనే అడిగింది శాంతి. సమాధా నం లేదు. ‘ఎవరన్నా తీసుకెళ్ళారా? ఎవరితోనన్నా పంపించే శావా?’ తీక్షణంగా అడిగింది.
అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. ‘మొన్నా రోజు కొమ్ముల కూర వండి, సాయంత్రం నీకివ్వడా నికి వచ్చిందిగా. ఆ తర్వాత కనపడ్లేదు. రాత్రంతా అడవంతా ఎతికా. వాగులెంట చూశా. చెట్లన్నీ ఎతికా…’ గొంతు ఒణికింది. ఒక్క క్షణం ఆగాడు. వెంటనే ‘అంత పిరికిది కాదు భావన. అయినా అలా ఎందుకు చేస్తుంది. నువ్వేమన్నా అన్నావా? కొట్టావా? ఆ రోజు నా దగ్గరికొచ్చి నపుడు ఒక మాటంది. ఎంత చెప్పినా నాన్న తాగుడు మానట్లేదు. బాధపోయి ఇప్పుడు కోపం వస్తోంది అని బాధపడిరది. అలా తాగి ఏమన్నా అన్నావా?’ అంది శాంతి. ‘లేదు మేడం… తెల్లారి రోడ్డు దగ్గరకెళ్ళి, ఎవరన్నా చూశారేమో అని అడిగా. నీ కూతురు ఆటో ఎక్కి ఎల్లటం చూశా అంటే ఆ ఆటోవాడ్ని దొరికిచ్చుకుని అడిగా. మా మామ వాళ్ళ ఊరు దగ్గర దింపాడంట. ఫోన్‌ చేస్తే అక్కడికొచ్చి ఎల్లిపోయిందన్నారు. ఆ రోజు రాత్రి పొద్దుపోయాక రాము బండిమీద తీసుకొచ్చి ఇక్కడ దింపెల్లాడంట. కాని ఇంటికి రాలేదు. లల్లిగారింట్లో పండుకుందంట. కాని తెల్లారేసరికి లేదంట. అంతా ఎతికాను. బళ్ళో వంటపాక దగ్గర చెప్పులు దొరికాయి కాని ఎటుపోయిందో తెలియదు’ అంటూ తలవాల్చుకున్నాడు.
శాంతికి ఆశ్చర్యం, కోపం, ఆదుర్దా, సంశయం, అసహనం అన్నీ ఒకేసారి కలిగి అచేతనంగా కూర్చుండిపోయింది. అంతలో ఏదో మెరుపు మెరిసినట్లై ‘నువ్వు కంగారుపడకు. భావనకి ఏమీ అవ్వదు, తిరిగొచ్చేస్తుందిలే. నేను మళ్ళీ వస్తా’ అంటూ అక్కడ్నించి రాము ఇంటికెళ్ళి, తనతో రమ్మని ఊరు చివర వాగొడ్డున మద్దిచెట్టు కింద కూర్చున్నాక అడిగింది. ‘రాము, నువ్వు నాతో అబద్ధం ఎందుకు చెప్తున్నావు? నిజం ఎందుకు దాచిపెడ్తున్నావు? భావన ఎక్కడుంది?’ అని. ఆ మాటలో చురుకు చూసి ఒక్క క్షణం మౌనం తర్వాత ‘తనకి పెద్ద పరిచయం లేకపోయినా మా తాతగారి ఊరు వెళ్ళిందని మా బాబాయి కొడుకు ఫోన్‌ చేస్తే వెళ్ళి తీసుకొచ్చి ఆ రోజు పొద్దుపోయాక వాళ్ళింటి దగ్గర దింపాను. మర్నాడు లేదంటే వెతికితే అక్కడ చెప్పులు దొరికాయి. ఎక్కడికెళ్ళిందో నాకూ తెలియదు మేడం… మీకు చెప్పలేదు. తప్పే. సారీ’ అంటూ తలొంచుకున్నాడు. ‘కిషన్‌కి ఫోన్‌ చెయ్‌’ అన్న శాంతి మాటకి లింకు దొరకనట్టు ముఖం పెట్టినా ఫోన్‌ డయల్‌ చేశాడు. రింగవుతుండగా ‘భావన వచ్చిందేమో అడుగు’ అంటుండగానే కిషన్‌ ఫోనెత్తి ‘అన్నా! ఏంటి ఈ టైంలో ఫోన్‌ చేశావు? అందరూ బానే ఉన్నారుగా’ అన్నాడు. ‘బాగున్నా మురా. భావన వచ్చిందా నీ దగ్గరికి’ అన్న రాము ప్రశ్నకి అవతల నుంచి సమాధానం లేదు. ఆ నిశ్శబ్దంలోనే జవాబు దొరికినా రెట్టించి అడిగాడు రాము. ‘అవునన్నా, రెండు రోజులైంది. తను చేసింది మంచి పని కాదు. ఇంటికెల్లిపొమ్మన్నాను. భయపడుతోంది’ అన్నాడు. ఫోన్‌ శాంతి తీసుకుని మాట్లాడిరది. భావనతో కూడా మాట్లాడిరది. ఇంటికొచ్చేస్తానని, శాంతిని ఉండమని అడిగింది భావన. సరేనని, ఒక గంటలో బస్సెక్కిస్తే తెల్లారే సరికి వచ్చేస్తుందని, రిసీవ్‌ చేసుకోడానికి రోడ్డు మీదకొస్తానని చెప్పింది శాంతి.
ఇంకా అయోమయావస్థలో ఉన్న రాముతో పద వెళ్దాం, రేపు మాట్లాడుకుందాం అంది. తన ప్రేమ గురించి, వాళ్ళు మాట్లాడుకున్న విషయాల గురించి, తీసుకున్న నిర్ణయాల గురించి భావన తనకి చెప్పిందని శాంతి అంటుంటే ‘మీతో పిల్లలు ఇలాంటివి కూడా మాట్లాడ్తారా’ అని ఆశ్చర్యంగా అన్నారు భావన మిస్సయిందని తెలిసి అక్కడికి ఎంక్వయిరీకి వచ్చిన గ్రామ పోలీసు, సెక్రటరీ, అంగన్వాడీ టీచరు. వాళ్ళని నమ్మీ, వాళ్ళ ఆలోచనలకి, భావాలకి విలువిచ్చే వారుంటే వయసుతో సంబంధం లేదు. పిల్లలు అన్ని విషయాలూ పంచుకుంటారు. వాళ్ళకి తమ జీవితా లకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో ఉండే గందరగోళాన్ని అర్థం చేసుకుని సరిగ్గా ఆలోచించేలా ఫెసిలిటేట్‌ చేసేవారు కావాలి కానీ, వారి ఆలోచనల్ని కొట్టి పారేసి, చిన్నపిల్లవని పక్కకి పెట్టేసి, ఇష్టాయిష్టాలని పట్టించుకోకుండా కమాండ్‌ చేసేచోట పిల్లలు ఏం చెప్పుకుంటారు? ఎలా ఓపెన్‌ అవుతారు? వారి ఆకాంక్షల్ని, ఆశల్ని ఎలా పంచుకుంటారు? పిల్లలంతా డెమోక్రెటిక్‌గా పెరిగే వాతావరణం కల్పించకపోతే, పెద్దయ్యాక డెమోక్రెటిక్‌గా ఎలా ఉండగలరు?
శాంతి చెప్పిన విషయాలు సమంజసమే అనిపించినా తను లేవనెత్తిన ప్రశ్నలకి వారెవ్వరి దగ్గరా సమాధానం లేదు.

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.