ఉప్పొంగే అమ్మాయిలు – కమలా భాసిన్ అనువాదం : ఎస్. వేణు గోపాల్

అమ్మాయిలు గాలులలాగ తయారవుతారు
తడబడకుండా వీచడమే గాలుల ఆనందం
తమను నిష్కారణంగా అడ్డుకుంటే ఆ గాలులు
ఒప్పుకోవు

అమ్మాయిలు పూలలాగ తయారవుతారు
పరిమళాలు వెదజల్లడమే ఆ పూల ఉత్సాహం
తమను నిర్దయగా నలిపిపారేస్తే ఆ పూలు ఒప్పుకోవు
అమ్మాయిలు పక్షులలాగ తయారవుతారు
లెక్కలేకుండా స్వేచ్ఛగా ఎగరడమే ఆ పక్షుల అద్భుతం
తమ రెక్కలు కత్తిరిస్తే ఆ పక్షులు ఒప్పుకోవు
అమ్మాయిలు పర్వతాలలాగ తయారవుతారు
ఎల్లప్పుడూ తలలెత్తి నిలబడడమే ఆ పర్వతాల ఆహ్లాదం
తల వంచి జీవించమంటే ఆ పర్వతాలు ఎప్పటికీ
ఒప్పుకోవు.
అమ్మాయిలు సూర్యగోళంలాగ తయారవుతారు
అన్ని వేళలా వెలుగులీనడమే ఆ సూర్యగోళాల ఉత్తేజం
మేఘాల ముసుగులు కప్పితే ఆ సూర్యగోళాలు
ఒప్పుకోవు.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.