1. మూడు సంస్థల సభ్యులతో కలిసి పనిచేయడం మీకెలా అనిపించింది?
జ. 3 సంస్థలతో కలిసి పనిచేయడం బాగుంది. అందరం కలిసి ఒకే ఉద్దేశ్యంతో కలిసి పనిచేయడం అనే అంశం బాగుందని అనిపించింది.
2. మీరు నేర్చుకున్న అంశాలలో మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశం లేదా ఆలోచింపచేసిన అంశాలు ఏమైనా ఉన్నాయా?
ఉంటే తెలుపగలరు.
జ. నన్ను ఆలోచింపచేసిన అంశం పితృస్వామ్య వ్యవస్థÑ ప్రభావితం చేసిన అంశం ట్రాన్స్‌జెండర్ యొక్క కష్టాలు. ఉదాహరణకు, ఆడపిల్లగా పుట్టిన ప్రతి ఒక్కరిలో అమ్మాయి లక్షణాలు, అలాగే అబ్బాయిగా పుట్టిన ప్రతి ఒక్కరిలో అబ్బాయి లక్షణాలే ఉండవు అని వారు చెప్పిన మాటలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. ఎందుకంటే నేను అమ్మాయినైనా నాలో కొన్ని అబ్బాయి లక్షణాలు
ఉంటాయి.
3. ఐక్యతారాగం ద్వారా వ్యక్తిగతంగా మీలో వచ్చిన మార్పు ఏమిటి?
జ. ఐక్యతారాగం ద్వారా నేర్చుకున్న అంశాల వలన నాలో నాలెడ్జి పెరిగింది. అన్ని అంశాలలో నాకు అవగాహన లేకపోవడం వలన ఎక్కడా సరిగ్గా మాట్లాడలేకపోయేదాన్ని. ప్రస్తుతం సామాజిక దృష్టి కోణంతో మాట్లాడగలుగుతున్నాను.
4. మీరు నేర్చుకున్న అంశాలు మీకు పనిలో ఎలా ఉపయోగపడ్డాయి? ముందుకు ఎలా తీసుకొని వెళ్తారు?
జ. నేను నేర్చుకున్న అంశాలు కౌన్సిలింగ్‌లో వారి సమస్యలను అర్థం చేసుకోవడం, తిరిగి వాళ్ళకు అర్థం చేయించే విధానంలో మరియు కుటుంబంలో నేను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి.
5. జెండర్ సంబంధిత అంశాలను మీ కుటుంబంలో గానీ, బంధువుల్లో గానీ, పనిచేసే చోట మరియు ఇతర ప్రాంతాలలో అమలు చేయడానికి/చేయడంలో ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి?
జ. పనిచేసే చోట, వచ్చే మహిళల కుటుంబంలో జెండర్‌కు సంబంధించిన హింస ఉంటుంది. అందువల్ల కౌన్సిలింగ్ సమయాలలో జెండర్ సమానత్వంపై అవగాహన చేయించడం, అమలు చేయించడం జరుగుతుంది. కుటుంబంలో కానీ, బంధువులలో కానీ జెండర్ అసమానత్వం దాదాపు లేదు.
6. స్త్రీ వాద దృక్పథంలో యువ నాయకత్వాన్ని ఒక ఉద్యమంలాగా ముందుకు నడపడానికి ఇంకా ఏం కావాలనుకుంటున్నారు?
జ. ఇంకా ఎక్కువ మందికి స్త్రీవాద దృక్పథంపై శిక్షణలు అందించాలి. స్త్రీ ఉద్యమకారుల యొక్క ఆలోచనా విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నాను.
7. 3 సంస్థల సభ్యులు కలిసి ఫెసిలిటేటర్‌గా ఎలా ముందుకు వెళ్ళవచ్చు?
జ. ఇప్పటివరకు 3 సంస్థల సభ్యులందరూ వేర్వేరు అజెండాలతో పని చేసినప్పటికీ, ఇప్పటినుండి ఐక్యతారాగం ద్వారా నేర్చుకున్న స్త్రీవాద దృక్పథంతో ఇదే అజెండాగా అందరూ కలిసి ఫెసిలిటేటర్లుగా ఇక ముందు పనిచేయవచ్చు.