1. మూడు సంస్థల సభ్యులతో కలిసి పనిచేయడం మీకెలా అనిపించింది?
జ. గ్రామ్య, భూమిక, వేదిక సంస్థలతో పనిచేయడం చాలా మంచిగా అనిపించింది. కొత్త స్నేహాలు ఏర్పడ్డాయి. తెలియని విషయాలను చాలా నేర్చుకున్నాము. కొత్త విషయాలను గ్రూప్స్
ద్వారా, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ద్వారా ఒక విషయాన్ని ఎన్ని విధాలుగా చేసుకోవాలి, స్త్రీ దృక్పథంతో ఎలా ఆలోచించాలి అనేది తెలుసుకున్నాము.
2. మీరు నేర్చుకున్న అంశాలలో మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశం లేదా ఆలోచింపచేసిన అంశాలు ఏమైనా ఉన్నాయా?
ఉంటే తెలుపగలరు.
జ. మేము నేర్చుకున్న అంశాలలో జెండర్, కులం, మతం, పితృస్వామ్యం, సెక్స్‌వాలిటీ, ట్రాన్స్‌జెండర్, జోగిని,
ఉద్యమాలు, వాటిలో పనిచేసిన వారి గురించి తెలుసుకున్నాము. ట్రాన్స్‌జెండర్, జోగినీలు పడుతున్న ఇబ్బందులు,
ఉద్యమంలో పనిచేసేటపుడు వారు పడుతున్న ఇబ్బందులు మమ్మల్ని ఆలోచింపచేశాయి.
3. ఐక్యతారాగం ద్వారా వ్యక్తిగతంగా మీలో వచ్చిన మార్పు ఏమిటి?
జ. ఐక్యతారాగం ద్వారా మాలో వచ్చిన మార్పులు… భయం లేకుండా ధైర్యంగా మాట్లాడడం మరియు మహిళల బాధలు ఏ కోణంలో చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి, బాధలో ఉన్న వారితో ఎలా మాట్లాడాలి, అలాగే ప్రతి విషయాన్ని ఆలోచించి, అర్థం చేసుకొని మాట్లాడాలి అనేవి మాలో వచ్చిన మార్పులు.
4. మీరు నేర్చుకున్న అంశాలు మీకు పనిలో ఎలా ఉపయోగపడ్డాయి? ముందుకు ఎలా తీసుకొని వెళ్తారు?
జ. మేము నేర్చుకున్న అంశాలు… సెషన్ ప్లాన్ మరియు కమ్యూనిటీలో పిల్లలతో ఎలా మాట్లాడాలి అన్నది నేర్చుకున్నాము. మీటింగులో వచ్చిన వారు ఎలా మాట్లాడితే వింటారో తెలుసుకున్నాము. అందరితో కలిసి సెషన్ మీట్ ఎలా చేయాలి, వచ్చిన ప్రజల ఫీడ్ బ్యాక్ ఎలా తీసుకోవాలని కూడా నేర్చుకున్నాము.
5. జెండర్ సంబంధిత అంశాలను మీ కుటుంబంలో గానీ, బంధువుల్లో గానీ, పనిచేసే చోట మరియు ఇతర ప్రాంతాలలో అమలు చేయడానికి/చేయడంలో ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి?
జ. జెండర్ సంబంధిత అంశాలు మా కుటుంబంలో, మా బంధువుల్లో, పనిచేసే చోట చెబుతున్నాము. ఆడ, మగ ఇద్దరూ ఒకటేనని, ఇద్దర్నీ సమానంగా చూడాలని చెబుతున్నాము. అయితే అందరూ వినడంలేదు, కొందరు మాత్రమే వింటున్నారు.
6. స్త్రీ వాద దృక్పథంలో యువ నాయకత్వాన్ని ఒక ఉద్యమంలాగా ముందుకు నడపడానికి ఇంకా ఏం కావాలనుకుంటున్నారు?
జ. స్త్రీవాద దృక్పథంలో యువ నాయకత్వాన్ని ఒక ఉద్యమంలాగా ముందుకు నడపడానికి, ఇంకా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, మోసాలు, లైంగిక, ఆర్థిక వేధింపులను ఆపడానికి గ్రామాల్లో మహిళా కమిటీలు ఏర్పాటు చేసి మహిళలకు, మధ్య వయసు వారికి అవగాహన కల్పించాలి. మేము ఇంకా కౌన్సిలింగ్ గురించి, స్త్రీ దృక్పథం గురించి తెలుసుకోవాలి. మగపిల్లలకు కూడా కాలేజీలలో సెషన్స్ చేసి జెండర్‌మీద అవగాహన తీసుకురావాలి.
7. 3 సంస్థల సభ్యులు కలిసి ఫెసిలిటేటర్‌గా ఎలా ముందుకు వెళ్ళవచ్చు?
జ. 3 సంస్థల సభ్యులు కలిసి ఫెసిలిటేటర్‌గా కొత్త విషయాలు ఎలా మాట్లాడాలి, ఎలా ముందుకు వెళ్తే బాగుంటుందన్నది మీడిj, పత్రికలు, వాల్ పేపర్లు, పాంప్లెట్లు, కథలు, నాటికలు, షార్ట్ ఫిలిమ్స్, బొమ్మల ద్వారా, అలాగే గ్రామాల్లో సెషన్స్ చేయడం ద్వారా, విద్యార్థులతో మీటింగుల ద్వారా ముందుకు వెళ్ళవచ్చు.