మహిళా చైతన్యంపై మాట్లాడుదాం రండి -పసుపులేటి రమాదేవి

మిత్రులారా, నేను చదివిన పుస్తకం ‘‘మహిళా చైతన్యంపై మాట్లాడుదాం రండి’’. ఇది కేవలం 28 పేజీలు కలిగిన చాలా చిన్న పుస్తకం. కానీ దీనిలో ఉండే విషయం మాత్రం చాలా పెద్దది. ఈ పుస్తకాన్ని యు.వాసుకి (ఐద్వా, తమిళనాడు కార్యదర్శి) తమిళంలో వ్రాయగా ఎ.జి.యతిరాజులు తెలుగులోకి అనువదించారు.

మహిళా చైతన్యం అంటే ఇత్తడి, కంచు లాంటి లోహం గురించినది కాదు. అది ఒక విద్య, పరిశోధన, ఆచరణ, మహిళా హక్కులకు సంబంధించిన దృక్పథం. ‘ఆడవాళ్ళు ఇలాగే ఉండాలి’ అనే అభిప్రాయాన్ని సవాలు చేసేదే మహిళా చైతన్యం. అది పురుషాధిక్యతను ధిక్కరిస్తుంది. సాధారణంగా సినిమా చూసేందుకు వెళ్ళేవారు రకరకాలైన వారుంటారు. అందరి మనసుల్లోనూ ఏవేవో ఊహలు, భావాలు గజిబిజిగా గందరగోళపరుస్తుంటాయి. వాటితో పాటు సినిమా చూస్తున్నప్పుడు అందులో ఎన్నో అంశాలు వస్తున్నప్పటికీ ప్రతి ఒక్కరూ వారికి అత్యంత దగ్గరయిన అంశాలను మాత్రమే ఆ సినిమాలో ప్రధానంగా గమనిస్తారు.
అయితే మహిళా ఉద్యమాలకు సంబంధించిన స్త్రీలు సినిమాలు చూస్తున్నప్పుడు తమ భావజాలానికి వ్యతిరేకమైన దృశ్యాలేమైనా అందులో ఉన్నాయా అని కళ్ళు పెద్దవి చేసి చూసేస్తారు. ఇదేంటి, ఎనిమిదవ తరగతి అమ్మాయికి అప్పుడే పెళ్ళి చేసేస్తున్నారు. వయస్సురీత్యా ఎదగని, మానసికంగా వికసించని పసి అమ్మాయికి బలవంతంగా పెళ్ళి చేయడం ఎంతవరకు సమంజసమని ఆ డైరెక్టర్‌ని అడగాలనిపిస్తుంది. విరిసీ విరియని వయసులో ఉన్న అబ్బాయిను, అమ్మాయిలను ప్రేమింపచేసి ఆ దృశ్యాలను రంగు, రుచిలతో తెరమీదకెక్కించే నిర్మాతలను, డైరెక్టర్లను నిలదీయాలనిపిస్తుంది.
స్త్రీ హక్కులకు వ్యతిరేకమైన వైఖరి పాశ్చాత్య దేశాలనుండి భారతదేశానికి దిగుమతి అయ్యిందని అనుకోకండి. మన దేశంలో వైదిక యుగంలో గార్గి, మైత్రేయి లాంటి మునిపత్నులు వైదిక శాస్త్రాలలో నిష్ణాతులుగా ఉన్నారు. తర్క శాస్త్రంలో పురుషులను సైతం ఓడిరచారు. అయితే తమ భార్యల మేధస్సు మునిపుంగవులకు నచ్చలేదు. అందువల్ల తమ భార్యలనే శపించిన ‘ఉదారులు’ వారు.
1848వ సంవత్సరంలో అమెరికాలో బానిస వ్యవస్థకు ప్రతిఘటనోద్యమం సాగింది. ఆ సందర్భంలో అమెరికాలో ప్రప్రథమంగా జరిగిన మహిళా మహాసభ మహిళల హక్కులకు సంబంధించి కొన్ని డిమాండ్లను దేశం ముందుంచింది. మహిళలందరికీ ఓటుహక్కు కోరింది. అయితే, 1928 వ సంవత్సరానికి వారి కోరిక నెరవేరింది.
స్త్రీ మయం చేయబడిన పేదరికం ఎలా ఏర్పడుతుంది? మహిళలు పిల్లలను, వృద్ధులను, రోగులను చూసుకునే, ప్రతిఫలం లేని పనులు మాత్రం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇవన్నీ పనులా? కర్తవ్యాలు కదా…? ఆడవారికి వాత్సల్యం లేదా…? అని ప్రశ్నించొచ్చు. అయితే పురుషులు మాత్రం ఈ పనులు ఎందుకు చేయటం లేదు?
మహిళలు జీవితంలో కొత్త, కొత్త రంగాల్లో కొత్తగా ప్రవేశించే సందర్భంగా అలా ప్రవేశించటం సంప్రదాయ విరుద్ధమని గగ్గోలు చేయబడుతుంది. అయితే, ఆ సందర్భంలోనే పురుషులకు సంబంధించినంత వరకు వారి ప్రవేశం ‘నూతనత్వం’ అని కొనియాడబడుతుంది.
స్త్రీ వాదాన్ని ద్వేషించడం, దాన్ని చూసి భయపడటం అనేది మన సమాజంలో ఒక శాశ్వతమైన వైరస్‌గా వ్యాపించింది. ఆ వైరస్‌ లక్షణాలు కొన్ని సమయాల్లో తగ్గుతాయి. మరికొన్ని సమయాల్లో
ఉధృతమవుతాయి.
స్త్రీ వాదాలు అనేక రకాలు: ఉదాహరణకు ‘అమేజన్‌ స్త్రీ వాదం’ అనే ఒక విధమైన భావన
ఉంది. దాని ప్రకారం మహిళలు శారీరక వ్యాయామం బాగా చేసి, బలం, శక్తి సంపాదించుకొని క్రీడల్లోనూ, సైన్యంలోనూ పురుషులు చేసే పనులన్నింటినీ చేయగలం అనే విషయాన్ని నిరూపించాలనేది. అనగా దీనికి ప్రాతిపదిక ‘శారీరక బలం’ మాత్రమే.
వేర్పాటు తత్వ స్త్రీ వాదం: అంటే ‘సమానమ’నిగాక, స్త్రీలకు పురుషులకు ప్రత్యేకమైన లక్షణాలుంటాయని అంగీకరించిన స్త్రీ గుణాలని సాధారణంగా చెప్పే ప్రేమ, వాత్సల్యం, కరుణ, దయ, ఆప్యాయత, సహకారం మొదలగు వాటిని అత్యంత గొప్పవిగా భావించడం.
పర్యావరణ స్త్రీ వాదం: ఇది ప్రకృతిని, స్త్రీని పోల్చి ప్రకృతి ఎలా దోపిడీకి గురవుతుందో దాని ప్రభావం స్త్రీ మీద కూడా ఉంటుందని వాదిస్తుంది.
సరళీకరణ స్త్రీ వాదం: ఉన్న సామాజిక వ్యవస్థను అలాగే ఉంచుకొని అందులోనే తమ హక్కులు అన్వేషించడం.
19వ శతాబ్దపు చివరలో ‘ఆర్థిక స్త్రీ వాదం’ విస్తృతంగా ప్రచారంలోకొచ్చింది. మహిళ ఆర్థిక స్థితిగతులను మెరుగు పరచటం, వారిని వంటపని, ఇంటి పనుల నుంచి విముక్తి చేయటం దీని
ఉద్దేశంగా చెప్పబడిరది.
1967`68 సంవత్సరాల్లో ‘తీవ్ర స్త్రీ వాదం’ ఉదయించింది. ఇది పౌరహక్కుల ఉద్యమం నుండి, ప్రపంచ శాంతి ఉద్యమం నుండి మొగ్గ తొడిగింది. అన్ని అణచివేతలకు స్త్రీలపై జరిపే అణచివేతే ప్రాతిపదిక అని ఈ వాదం ఉద్ఘాటించింది. మహిళలపై దమన నీతి అన్ని జాతుల్లోనూ, అన్ని నాగరికతల్లోనూ, అన్ని సంస్కృతుల్లోనూ, అన్ని వర్గాల్లోనూ వ్యాపించి ఉందని ఇది పేర్కొంది.
అయితే మార్క్సిజం చెప్పే మహిళా చైతన్యం వీటన్నిటికన్నా ప్రత్యేకమైనది. ఈ సామాజిక వ్యవస్థ పాలకవర్గాల కనుసన్నల్లో, పెత్తందారుల మార్గదర్శకత్వంలో నడుస్తోంది. స్త్రీలు, పురుషులందరూ దోపిడీకి గురవుతారు. అసమానతలు కొల్లలుగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఒకరు మాత్రమే (స్త్రీలు మాత్రమే) సమానత్వం పొందలేరు. అందరిపై జరుగుతున్న అణచివేతను అడ్డుకున్నప్పుడే, అందరికీ అభివృద్ధి చెందేందుకు సమాన అవకాశం లభించినప్పుడే మహిళలకు కూడా సమానత్వం లభించగలదు.
స్త్రీ చైతన్యమనేది పురుషాధిక్యతకు, లింగవివక్షతకు వ్యతిరేకమైంది. ఇందులో సామాజిక కార్యకలాపాల్లో మహిళల సంపూర్ణ భాగస్వామ్యం, స్త్రీ పురుషులకు సమాన హక్కులు, సమాన వేతనాలు తప్పనిసరిగా ఉండాలి.
‘‘మహిళలకు అన్ని విషయాలనూ నేర్చుకునే అవకాశం కల్పించకుండానే వారికి అది తెలీదు, ఇది అర్థంకాదు’’ అని చెప్పుకుంటూ ఉంటాం. అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ చమ్మర్స్‌ అనే మహానుభావుడు కూడా మహిళలకు గణితం, సైన్స్‌ సంపూర్ణంగా రాదని చెప్పి చిక్కుల్లో పడ్డాడు. మొత్తం ప్రపంచం నుండి విమర్శనాస్త్రాలు ఆయన్ను తాకాయి. తుదకు క్షమాపణ కోరాల్సి వచ్చింది.
భార్య పంచాయతీ సభ్యురాలైతే ఆమె బదులు పంచాయతీ సమావేశాల్లో భర్తే పాల్గొనటం మనం తరచుగా చూస్తుంటాం. ఆ సమావేశాలు జరుగుతున్నప్పుడు మీరో, నేనో లోపలకెళ్ళడానికి ప్రయత్నిస్తే ప్రభుత్వాధికారులు అనుమతిస్తారా? అయితే సభ్యురాలి భర్తకు మాత్రం పూర్తి స్వేచ్ఛను ప్రసాదిస్తారు. వారిలా ఎందుకు చేస్తారు? భార్యాభర్తల శరీరాలు వేర్వేరు అయినా ప్రాణం ఒక్కటే అని ఆ ప్రభుత్వాధికారులు నిర్ణయానికొచ్చేశారా? అదే నిజమైతే భర్త పంచాయతీ సభ్యుడైతే అతనికి బదులు అతని భార్యను సమావేశానికి అనుమతిస్తారా? ఇక్కడ వివక్ష అనేది నగ్నంగా కనబడుతోంది.
గర్భసంచులు, చేతులు: ఒక స్త్రీ వండగలుగుతుందంటే పురుషుడు వండలేడా? తప్పక వండగలడు. ఎందుకంటే స్త్రీలు తమ గర్భసంచులతో వంట చేయడం లేదు. తమ చేతులతోనే చేస్తున్నారు. గర్భసంచి కలిగినవారు పిల్లలకు జన్మనివ్వగలరు. మగవారికి గర్భసంచులు లేవు కనుక వారికి ఆ బాధ్యత ప్రకృతి అప్పగించలేదు. సమానత్వం మాట్లాడుతున్నామని ఏ మహిళ కూడా ‘ఐదు మాసాలు గర్భం నేను మోస్తాను, మరో ఐదు మాసాలు నీవు మోయి’ అని తన భర్తతో చెప్పటం లేదు. అది శాస్త్రబద్ధమైన వాదన కూడా కాదు. అయినా చేతులున్నవారందరూ వంట చేయొచ్చు. మగవారికి కూడా చేతులున్నాయిగా? కనుక వారు కూడా తప్పక వండి వార్చొచ్చు.
మాకు ఇంటి పనులు, వంట పనులు తెలీవుగా? అలవాటు కూడా లేదే? మాకు తెలిసుంటే ఊరుకుంటామా?
అవునండి…? ఆడపిల్ల మాత్రం పుట్టేటప్పుడే వంట, ఇంటి పనులు అంతా క్షుణ్ణంగా నేర్చుకుని వచ్చేసిందా? అన్నీ ఇక్కడ నేర్చుకున్నదేగా! ఏ పురుషుడికీ వంట రాదని చెప్పగలమా? టీ మాస్టర్‌ అంటారు, సరకు మాస్టర్‌ అంటారు. నల భీమపాకం, అంటే పెళ్ళిళ్ళలో మగవారే వేల మందికి వండి వార్చుతారు. హోటళ్ళలో ఫలహారాలన్నీ మగవారే చేస్తుంటారు. గుళ్ళలో పురుష పూజారులే దేవుడికి నైవేద్యాలు తయారు చేస్తుంటారు. వీరందరూ ఇక్కడే వంట నేర్చుకున్నవాళ్ళేగా? కనుక మీరు కూడా నిర్ణయించుకుంటే సులభంగా వంట నేర్చుకోగలరు. మహిళలకు వంటపని భారం, ఇంటి పని భారం తగ్గితే మరింత తమ సామర్ధ్ల్యానికి పెంచుకోవడానికి చదువుకోగలరు. తమ పిల్లలకు మంచి గురువుగా వర్ధిల్లగలరు. సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొని, సమాజ పురోభివృద్ధికి తమ వంతు కృషి చేయగలరు. ఇవి ఏవీ లేనందువల్లే ఆడవాళ్ళకు ఏదీ తెలీదు, అందువల్ల ఆమె ఏమీ చేయలేదు అనే భావం సర్వత్రా వ్యాపించింది.
నిజానికి ఆమె సొంతకాళ్ళపై నిలబడి స్వావలంబనగా జీవించగలదైనా మనం పెంపకం ద్వారా, సాంస్కృతిక ఉపాయాల ద్వారా పురుషుడికి అణిగి ఉండడమే అందమని ఆమెకు నూరిపోస్తున్నాం. అయితే ఇది నిన్నా, మొన్నా ప్రారంభం కాలేదు. వందల, వేల సంవత్సరాల పూర్వమే ప్రారంభమై క్రమక్రమంగా ఆ భావన బలపడి ఈనాడు ఒక గట్టి వ్యవస్థగానే మారిపోయింది. ఆడ, మగవారిలో మగవాడే అధికారం చెలాయించడానికి అర్హుడు అనే భావం మెదళ్ళలో గూడుకట్టుకుని పోయింది. దీన్ని మొత్తం సమాజం అంగీకరించడంతో అది సత్యంగా రూపొందిపోయింది. కానీ వాస్తవాలకు ఇది సహజమైందా అని ప్రశ్నిస్తే కాదు అనే జవాబు వస్తుంది.
పెంపకం కాదు, రూపొందించబడుతున్న మనం: వ్యక్తిగత ఆస్తి, సంపద సమాజంలో నెలకొన్న తరువాత బానిస గావించబడిన మహిళ కాలక్రమంలో గృహ కార్యక్రమంలో మాత్రమే తన ప్రతిభను అభివృద్ధి చేసుకోగలిగింది. శ్రామిక స్త్రీలు ఇళ్ళకు వెలుపల పనులకు వెళ్ళినా, వారి శ్రమ పురుషుని శ్రమకన్నా తక్కువగా పరిగణింపబడి ఆమెకు అతడికన్నా తక్కువ కూలి ఇవ్వబడుతుంది. పురుషుడి సంపాదనే ప్రధానమైంది, మహిళ సంపాదన దానికి సాయపడేది మాత్రమే అనే భావన సర్వత్రా వ్యాపింపచేయబడిరది. ఎంత ఎత్తుకు ఎదిగినా పిచ్చుక గద్ద కాబోదు అనే ఆలోచనను మహిళ మెదళ్ళలో ఈ సమాజం బాగా కూర్చి ఉంచింది. ఇందుకనుగుణంగా రకరకాల ప్రతిభలు, సామర్ధ్యాలు, ఆలోచనలు, గుణగణాలు విభజింపబడ్డాయి. ఇంటినుండి బయటికెళ్ళి తిరిగొచ్చే పురుషులను సాహసవీరులుగా చిత్రించి, ఇళ్ళల్లోనే ఉన్న స్త్రీలను సిగ్గు, శరం, లజ్జ, భయం ఉన్నవారిగా చూపించడం జరిగింది. ఈ క్రమమంతా మానవ సమాజంలో నాలుగు దశలుగా జరిగినట్లు సామాజిక శాస్త్రజ్ఞులు చెబుతారు.
1. రూపొందించడం: అనగా ఒక బిడ్డను ఎలా పెంచుతారో తెలుపుతుంది. కొడుకును ఒక విధంగా, కూతురిని ఒక విధంగా మీరు పెంచేటప్పుడు అబ్బాయిలు, అమ్మాయిలు తమ గురించిన సామాజికాభిప్రాయాలను రూపొందించుకుంటారు.
2. సిద్ధపరచడం : అనగా ఆడ, మగ బిడ్డల గమనాన్ని కొన్ని వస్తువులపై కొన్ని విషయాలపై మళ్ళించి వాటి స్వభావాలు అర్థం చేసుకోనివ్వడం ఉదాహరణకు ఆడపిల్లలకు ఆడుకోవడానికి బొమ్మలు, పిడతలు ఇస్తాం. మగపిల్లలకు తుపాకులు, విమానాలు, రేసుకారులు కొనిచ్చి వాటితో ఆడుకోమని ప్రోత్సహిస్తాం. ఇలా మనం వివక్ష చూపడం ద్వారా అబ్బాయిలు, అమ్మాయిలలో ప్రత్యేకమైన సామర్ధ్యాలు, మనోభావాలు పెంపొందించుకోవడం ఆరంభిస్తాయి.
3. నోటిమాటలు : అంటే కొడుకుతో ‘‘నీవు పెద్దవాడివై ఉద్యోగం చేసి సంపాదించి మీ అమ్మను బాగా చూసుకోవాలి’’ అనటం, కూతురితో ‘‘నీవు పెళ్ళై మెట్టినింటిలో మంచిగా ప్రవర్తించి నీ తల్లి పేరును నిలబెట్టాలి’’ అని బోధించటం ద్వారా వారి వారి స్వీయ గుణగణాలు రూపుదాల్చేట్లు చేస్తాం.
4. కార్యాచరణ : అనగా చిన్నప్పటినుంచి ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలనే విషయం అలవరచటం. అంటే తరతరాలుగా వస్తున్న మగతనం, స్త్రీత్వానికి తగిన కార్యాచరణను పిల్లలకు పరిచయం చేయడం. అమ్మాయిలు ఇంటి పనుల్లో తల్లికి సాయపడాలని ఎదురుచూస్తాం. అబ్బాయిలను మాత్రం బయట తిరగడానికి అనుమతిస్తాం. ఈ విధంగా వారి వారి హద్దులకు సంబంధించిన మ్యాప్‌ను రూపొందించి వారి బుర్రల్లో స్థిరపరుస్తాం.
‘సాధారణంగా’ అంటే…?: దీన్నే మనం రెండు విధాల కొలబద్దలు అంటాం. పురుషుడ్ని చూసినప్పుడు, అతని ప్రతిభను తూస్తున్నప్పుడు ఒక రకమైన కళ్ళద్దాలను ఉపయోగిస్తాం. స్త్రీని చూసినప్పుడు, ఆమె ప్రతిభను లెక్కగట్టేటప్పుడు మరోరకమైన కళ్ళద్దాలు వాడతాం. టీ కొట్టు, హోటల్‌, సినిమా హాల్‌, బజారు… ఇవన్నీ సాధారణ స్థలాలే. ఈ అన్ని చోట్లకు పురుషులు ఒంటరిగా వెళ్ళొచ్చు.
ఒక ఆడపిల్ల ఈ చోట్లన్నింటికి ఒంటరిగా వెళ్ళొచ్చా? వెళితే అందుకు వేరే పేరు పెట్టేస్తారు కదా?
‘సాధారణం’ అనే పదం లోపల మగ అనే అర్థమే ప్రముఖంగా కనిపిస్తోంది. అలాగే వంటిల్లు, వీథి కొళాయి, వీథి బావి… ఇవన్నీ ఇంచు మించు స్త్రీల చోట్లనే భావించబడుతుంది. ఇక్కడల్లా పురుషులను చూడడం అపూర్వం. ఒకరిద్దరు వచ్చినా వారిని ఎగతాళి పట్టిస్తాం. అంతవరకెందుకు… మన ఇళ్ళలోపలే ఈ విభజన స్పష్టంగా ఉందే…? నాన్న గది, నాన్న బల్ల, నాన్న ఈజీ ఛెయిర్‌, నాన్న చేతి గడియారం అనే చిహ్నాలు స్పష్టంగా ఉంటాయి. అమ్మకూ ప్రత్యేకమైన చిహ్నాలున్నాయే! వంట పాత్రలు, మసిగుడ్డలు, గరిటెలు, తట్టలు, స్పూన్లు, చీపురు, చాటల్లాంటివి ప్రత్యేకంగా ఉన్నాయి కదా…! అందుకే ‘ఉల్ఫ్‌ వర్జీనియా’ అనే సుప్రసిద్ధ అమెరికన్‌ రచయిత్రి ‘నాకు మాత్రం ప్రత్యేక గది ఉండుంటే..!’ అని కలలు కన్నారు.
స్త్రీ వాదం మహిళల శ్రమను గౌరవించాలని గట్టిగా చెబుతోంది.
సాధారణంగా వస్తూత్పత్తిలో పురుషుడి పాత్ర ఎక్కువగా ఉండొచ్చు. అయితే ఆ పాత్ర మరలా, మరోలా తన కార్యం నిర్వర్తించాలంటే, పునరుత్పత్తి కొనసాగాలంటే కొన్ని అవసరాలు పూర్తి చేయబడాలి. ఇల్లు, వాకిలీ, పిల్లపాపలు, కుటుంబం, భోజనం, నిద్ర, బట్టల శుభ్రత, జబ్బు పడితే సేవా శుశ్రూషలు… మొత్తంలో పురుషుడు మానవుడిగా ఉండి మర్నాడు, ఆ మర్నాడు, అలాగే అన్ని రోజులూ ఉత్పత్తి లోపాలు పంచుకోవాలంటే పై అవసరాలన్నీ అతడికి తీర్చబడాలి. ఇవన్నీ మహిళలే చేస్తారు. అయితే ఉత్పత్తిలో మగవాడికున్న గౌరవ, మర్యాదలు ఉత్పత్తికవసరమైన విషయాలను నిరంతరం చేస్తున్న స్త్రీకి మాత్రం సమాజం ఇవ్వటంలేదు. ఈ అన్ని సేవాకార్యాలు ‘ఊరికనే’ అనే శ్రేణి కిందకు వచ్చేస్తాయి.
ఐక్యరాజ్యసమితి ఒక అంచనా ప్రకారం ప్రపంచం మొత్తంలోని ‘ఊరకనే’ ఉన్న మహిళల సేవల విలువ ఏడాదికి 11 వేల లక్షల డాలర్లు. ‘ఊరకనే’ అంటారు కదా, ఊరకనే ఉండటం అంటే ఏమిటి? ఎవ్వరైనా రోజంతా చేతులు కట్టుకుని కూర్చునేందుకు వీలవుతుందా? ఒక సామాన్య స్త్రీ వాస్తవానికి ఒక్క క్షణం ఊరకనే ఉండదు. చెప్పాలంటే ఉద్యోగం చేసేవారికి ఆదివారం సెలవుంటుంది. వయస్సు మీరితే పదవీ విరమణ ఉంటుంది. అయితే గృహ కార్యాలు చేసే మహిళలకు ఆదివారం డబుల్‌ షిఫ్ట్‌ ఉంటుంది. అందువల్లే ఓ కవి….
‘‘మంచి రోజు, పండుగ రోజు లేదు పేదవారికి ‘ఆదివారం’ అసలే లేదు మహిళలకు…!’’ అని చెప్పాడు.
‘ఆదివారం ఎక్కడికీ వెళ్ళకుండా నీ కోసం ఇంట్లోనే ఉంటాను’ అని చెప్పే మగ మహారాజుకు అర్థగంటకు ఒకసారి కాఫీలు సప్లయ్‌ చేస్తుండాలి. మాంసం తెచ్చి రుచికరంగా వండి పెట్టాలి. ఆయన గారు హాయిగా ఆరగించి గంటసేపు పవళించి లేస్తారు. వెంటనే సతీమణి వేడి, వేడిగా టీ అందించాలి. ఆయన సంపాదనాపరుడు కదా…! మెల్లిగా టీ చప్పరిస్తూ సిగరెట్‌ పొగను రింగు రింగులుగా వదులుతూ నిజంగానే ఆదివారాన్ని అనుభవిస్తాడు. ఈమెకు మాత్రం నడుం విరిగిపోయే పనులు.
‘‘మానవ సమాజ ఆవిర్భావ కాలంలోనే స్త్రీ బానిసగా ఉందనే అభిప్రాయం 18వ శతాబ్దంలో ఉంది. ఇది పూర్తిగా అబద్ధం. అనాగరిక కాలంలోనూ, దాని తర్వాత కాలంలోనూ స్త్రీ ఒక స్వతంత్రమైన, స్వేచ్ఛాయుతమైన పాత్రను నిర్వర్తించింది. అంతేకాక ఆమె గౌరవనీయురాలిగా కూడా విరాజిల్లింది.’’ ` ఏంగెల్స్‌
స్త్రీలు వినమ్రులుగా, విధేయులుగా, సేవచేసేవారిగా, సహకరించేవారిగా ఉండాలని ఈ సమాజం కోరుకుంటుంది. ఈ కోరికలు ఒకదానికొకటి సర్దుకుని పోయేవిగా ఉండవు. అందువల్ల మహిళలు శారీరకంగా, మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురికావాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ విషయం శ్రామిక మహిళలందరూ చెబుతారు. చక్కటి భార్య, ఉత్తమ నిర్వాహకురాలు అనే రెండు కర్తవ్యాలు ఒకే సమయంలో నిర్వర్తించడం కష్టం. కానీ విచిత్రమేమిటంటే… పురుషులు మాత్రం ఉత్తమ భర్తలుగా, సమర్ధమైన నిర్వాహకుడిగా ఒకే సమయంలో ఉండాలని సమాజం ఆశించడంలేదు.
ఇటీవల వచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకమే తీసుకుందాం. ఇంటికొక పని కల్పించాలన్నారు. దీన్ని అలాగే అమలు పరిస్తే ఏం జరుగుతుంది? ఆ ఒక్కరు పురుషుడుగానే ఉంటారు కానీ స్త్రీ ఉండదు. అందువల్లే ఉపాధి హామీ పథకంలో కూడా మహిళలకు
1/3 వ వంతున పని కల్పించాలని మహిళా సంఘాలు డిమాండు చేయడం న్యాయ సమ్మతమే. మార్క్స్‌, ఏంగెల్స్‌, లెనిన్‌ మొదలైనవారు స్త్రీ బానిసత్వాన్ని వివరించి, ఆమె విముక్తి చెందేందుకు అవసరమైన మార్గం కూడా చూపారు. ఒక ఇంటి లోపల బందీjైు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్న మహిళా ప్రపంచం కుదించుకు పోతుంది. ఆమె జ్ఞానాభివృద్ధికి ఆ వాతావరణం సానుకూలంగా లేదు. దీన్ని గ్రహించిన లెనిన్‌ ఇంటి పనులు మహిళలను ఎలా కుంగదీస్తున్నాయో ఇలా వివరించారు…
‘‘స్త్రీకి ఏ విధంగాను ప్రయోజనం లేని, జంతువులా ఒకే పనిని మాటిమాటికీ చేసే పరంపరలో ఆమె సృజనాత్మక శక్తి పూర్తిగా నశించిపోతుంది.’’ ‘‘గృహ కార్యాలు మహిళల కోసమే అని భావింపబడుతున్న సమాజంలో భర్త, భార్య పనుల బరువును పంచుకుంటే ఆమె బాధలను, చింతలను కొంతవరకు తేలికపరచొచ్చు, లేక పూర్తిగా కూడా తొలగించొచ్చు. అయితే ఆ విధంగా భార్యకు సహకరించటాన్ని సమాజం అతడికి సంబంధించినంత వరకు అగౌరవమైన విషయమని భావిస్తోంది.’’ ` ూవఅఱఅ శీఅ జూaత్‌ీఱషఱజూa్‌ఱశీఅ శీట షశీఎవఅ
ఇంటి పనులను సార్వత్రికం చేసే ప్రయత్నంలో (అనగా స్త్రీలు, పురుషులు కలిసి చేసుకునే ప్రయత్నంలో) సోషలిస్టు దేశాలు కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. అనగా ఉమ్మడి వంటశాలలు, ఉమ్మడి బట్టల శుభ్రత, పిల్లల సంరక్షణ శాలలను ఆయా దేశాల్లో ఏర్పాటు చేశారు. ఇందువల్ల అక్కడ మహిళలు కుటుంబ సంరక్షణ చేసుకుంటూ, తమ తమ వృత్తులు చేసుకుంటూ, సామాజిక కార్యకలాపాల్లో కూడా పాల్గొనేందుకు వీలైంది. అయినా ఈ దేశాల్లో కూడా మహిళ పూర్తి విముక్తి చెందలేదని, సాంస్కృతికంగా స్త్రీ, పురుషుల సమానత్వం సంపూర్ణంగా సాధించబడలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి.
ఒక కుటుంబంలో భర్త మాత్రమే సంపాదనాపరుడైనా, ఇంట్లో ఉండి మాత్రమే గృహ కార్యాలు నిర్వర్తించే భార్యకు కూడా భర్త ఆస్తిలో సగం భాగం ఇచ్చి తీరాలని మహాత్మాగాంధీ నొక్కి చెప్పారు. నేటి మహిళోద్యమం కూడా ఈ డిమాండే చేస్తోంది. అయితే 75 సంవత్సరాలకు ముందే గాంధీజీ ఈ డిమాండు చేశారంటే దీని సమంజసత్వాన్ని ఎవరూ సవాలు చేయలేరు.
వివాహమనేది స్త్రీకి ఆర్థికాశ్రయం అనే పరిస్థితి మారితేనే ఆమె విముక్తి చెందగలదని జవహర్‌లాల్‌ నెహ్రు కూడా ఆ కాలంలోనే చెప్పారు. భర్తపై ఆధారపడి బ్రతికే మహిళలు ఎన్నటికీ స్వతంత్రులు కాలేరు. సంపూర్ణ స్వాతంత్య్రం ప్రాతిపదికన ఉండే స్త్రీ, పురుష సంబంధం మాత్రమే ఆదర్శవంతమవుతుందని ఆయన పేర్కొన్నారు.
(మైథిలీ శివరామన్‌ రచించిన ‘మహిళా హక్కులు`ఒక మార్క్సిస్టు దృక్పథం పుస్తకం నుంచి…)
ఇప్పుడు వరకట్నం తీసుకోని వారెవరండీ, వరకట్నం అందరూ తీసుకుంటున్నారని చెప్పినంత మాత్రాన ఒక మంచి విషయం కాబోదు. వివాహమనేది స్త్రీలకు, పురుషులకు సమానంగా కొంత మేలు, కొన్ని అపకారాలు కూడా చేస్తాయి. అయినా వివాహ వ్యవస్థలో ఇద్దరూ సమాన భాగస్వాములే. కానీ స్త్రీ మాత్రం పురుషుడికి పైకం చెల్లించే ఆ వ్యవస్థలో ప్రవేశించాలనడం ఎంతవరకు సమర్థనీయం? కళ్యాణ మండపాల్లో వివాహాల సందర్భంగా వరుడికిచ్చే మంచాలు, బీరువాలు, పరుపులు, గిన్నెలు, చెంబుల్లాంటి పాత్రలతోపాటు సబ్బు పెట్టెలు, సబ్బులు, పౌడర్లు, పుట్టబోయే బిడ్డ కోసం ఉగ్గుపాల గిన్నెలు, స్పూన్లు వంటి వాటిని ప్రదర్శనగా, అందరూ చూసే విధంగా అమర్చి పెడతారు. ఇదేకాక పెళ్ళికి వచ్చిన వారందరినీ బలవంతం చేస్తారు చూడమని. అంటే పెళ్ళిరోజు ముందు వరకు పెళ్ళికొడుకు ఇంట్లో సబ్బుపెట్టెలు కూడా లేవా? అని ప్రశ్నించాలనిపిస్తుంది. పెళ్ళికొడుకు ఇంటివారు అంత దరిద్రులా? అని అడగాలనిపిస్తుంది.
మహిళా చైతన్య దృష్టితో మాత్రమే కాదు, సామాన్యుల దృష్టిలో సైతం అత్యంత హేయమైన విషయం ఇది.
‘‘స్త్రీలకు నిజమైన స్వాతంత్య్రం లభించాలంటే వైవాహిక జీవితంలో ఇద్దరికీ ఒకే విధమైన నైతిక విలువలు, కట్టుబాట్లు విధించాలి. ఈ విషయంలో దేశ రాజ్యాంగాన్నీ సవరించాలి. మహిళలు సైతం బానిస మనో భావాన్ని, భయాన్ని పూర్తిగా పోగొట్టుకోవాలి’. ` పెరియార్‌ ఈవే. రమాస్వామి
‘‘స్త్రీ, పురుష సమానత్వమనేది ఏదో మహిళోద్యమాల డిమాండు మాత్రమే కాదు. దాన్ని ఐక్యరాజ్య సమితి కూడా అంగీకరించింది. భారత రాజ్యాంగ చట్టం కూడా దాన్ని అంగీకరించింది. కనుక స్త్రీ, పురుష సమానత్వాన్ని ఒప్పుకోనివారు మన రాజ్యాంగ చట్టాన్నే ధిక్కరిస్తారన్న మాట, అవమానిస్తున్నారన్న మాట.
వివరణ సరే, మహిళ పట్ల మహిళలే వివక్ష చూపుతున్నారు కదా? దీనికేమంటారు?
లేదని ఎవరు చెబుతున్నారు? పురుషుడు గొప్ప, స్త్రీ తక్కువ అనే ఆలోచనా ధోరణి ఎన్నో శతాబ్దాలుగా అందరినీ పట్టి పీడిస్తోంది. పురుషులనూ, స్త్రీలనూ సమానంగా ఈ ఆలోచనా ధోరణే కల్లోలపరుస్తోంది. పురుషాధిక్యత భావన, పట్టుదల గల మహిళలూ ఉన్నారు, పురుషులూ ఉన్నారు. దానికోసం ఇరువురూ దృఢసంకల్పంతో పాటుపడుతున్న దృష్ట్యాంతాలున్నాయి కూడా. ఇద్దరూ కలిసి కృషి చేయాల్సిన అవసరమూ ఉంది.
ఒక కాలంలో ఉన్నత స్థితిలో ఉన్న స్త్రీ ఈనాడు అథఃపాతాళానికి కుంగిపోయి, సమానత్వం పోగొట్టుకుని, ఆడ శిశువును గర్భంలోనే నాశనం చేసే పరిస్థితికి చేరుకుంది. ఆ విధంగా తన గౌరవ మర్యాదలను పోగొట్టుకుని ఉంది. అయితే ఇది ప్రకృతి సహజమైనదేమీ కాదు. మానవజాతి ఆవిర్భవించిన కాలంలో ఈ దయనీయమైన పరిస్థితి లేదు. స్త్రీని ఏ విధంగా బానిసగా మార్చారు, మతం, పురాణాలు, నైతిక విలువలూ, ప్రస్తుతం ప్రసార సాధనాలు అన్నీ ఆమెను బానిసగా మార్చేందుకు తమ వంతు పాత్ర నిర్వర్తించాయి, నిర్వర్తిస్తున్నాయి అనే విషయాన్ని మనం ఈ పుస్తకంలో గమనిస్తాం. ఇది ఒకే రాత్రిలో జరిగిపోలేదు. నేడు, నిన్న మాత్రమే కాదు కొన్ని వందల సంవత్సరాలుగా క్రమక్రమంగా జరిగింది. ఈ వందల సంవత్సరాల్లో మానవ జాతి మస్తిష్కంలో నింపి ఉంచిన ఈ తప్పుడు అభిప్రాయాలను, భావాలను తుడిచి పెట్టాల్సిన అవసరముంది. కొన్ని సందర్భాల్లో నేర్చుకున్నదాన్ని కూడా మరచిపోవటం అవసరమే.
దాంతోపాటే మన కుటుంబాన్నీ, బయట ప్రపంచాన్ని మహిళా చైతన్య దృష్టితో చూడడం కూడా నేర్చుకుందాం. ఇందుకు అందరం గట్టిగా ఆలోచించాలి. తరచుగా మాట్లాడుకోవాలి. దాన్ని మన జీవితాల్లో అనుసరించాలి కూడా.
ఈ పుస్తకాన్ని స్త్రీ, పురుష తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చదివి సమాజంలో మార్పు కోసం కృషి చేయగలరు.

Share
This entry was posted in పుస్తక పరిచయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.