నేను గెలిచాను – రావుల కిరణ్మయి

వారం రోజుల్లో పరీక్షలు మొదలవుతున్నాయి. చాలా కష్టపడవలసిన సమయం. కానీ, పుస్తకం ముందు వేసుకుంటే ఆలోచనలే పుటల్లా మారుతూ చదువును మింగేస్తున్నాయి. ఆ సంఘటనే జరగకుండా ఉంటే హాయిగా హాస్టల్‌లో ప్రశాంతంగా చదువు సాగేది. ఫైనలియర్‌ పరీక్షల్లో ప్రతిభ చూపిన వారికి పై చదువులకు ఆర్థిక సాయం అందిస్తామన్న కల సాకారం

చేసుకునే ఆశలూ అడుగంటుతున్నాయి. నిన్నటి సంఘటన గుర్తుకు వచ్చి వర్తమానం నుండి ఉత్పలను గతంలోకి నెట్టివేసింది.
తను, వింధ్య రూమ్మేట్స్‌. ఒకే ఊరు. ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్న కుల ప్రస్తావన రాని, లేని నేస్తాలు. వీరితో పాటు అతను కూడా. అతనొక్కడే కాదు. అప్పట్లో ఐదారుగురు అబ్బాయిలతో కలిసి మెలిసి ఉండేవాళ్ళు. ఆనాడూ వాళ్ళ మధ్య కులం, ఆడ, మగ వంటి ఏ భేషజాలు పొడచూపలేదు, ఒక్క స్వచ్ఛమైన స్నేహం తప్ప. వాళ్ళంతా ఒకే ఊరువాళ్ళైనా పదిలో ఫెయిలై ఇద్దరు, చదువు మానేసిన వాళ్ళు ఒక ఇద్దరు, వెరసి పై చదువులకు పట్నం బాట పట్టింది మాత్రం ఉత్పల, వింధ్య, అతను.
అతనొక్కడే డిగ్రీ వరకు ‘‘తోడై’’ వాళ్ళ కాలేజీలోనే చేరాడు. కానీ అతడి స్నేహంలో ఏదో మార్పు కనిపిస్తోంది. వింధ్య పైనే, వింధ్య కొరకే సమయం కేటాయించడం, వింధ్యే తన సర్వస్వం అనే స్థాయికి చేరుతున్నాడని పసిగట్టడానికి ఉత్పలకు ఎక్కువ కాలం పట్టలేదు. అంతకు ముందైతే ముగ్గురూ కలుసుకొని కామన్‌ సబ్జెక్ట్స్‌ చర్చించుకొంటూ చదువుకొనే వాళ్ళు. కానీ ఇప్పుడు ఇద్దరూ…
ఉత్సలా! ప్లీజ్‌… అతడితో నేను అని వింధ్య అంటే, అతనూ ఉత్పలా! ప్లీజ్‌… వింధ్యతో నేను… అంటూ పానకంలో పుడకలాగా నువ్వున్నావని చెప్పకనే చెప్పి ఏకాంతం కోరుకుంటున్నారు. ఈ మూడేళ్ళు చదువు మీదికంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఏర్పడిరదని, అది తారాస్థాయికి చేరుతున్నదని ఉత్పలకి త్వరగానే అర్థమైంది. కానీ వీళ్ళను పట్టించుకొని చూస్తూ కూర్చుంటే తన చదువు, తల్లిదండ్రుల ఆశలు అడియాసలై కొండెక్కుతాయని గ్రహించి హాస్టల్లో వేరే గదికి మారింది.
కాలేజీకి మాత్రం కలిసి వెళ్తున్నారు. ఇద్దరి మధ్య చదువును గురించిన మాటలే తప్ప ఇంక అతని గురించి ఉండటం లేదు. ఇంతకు ముందైతే అతను ఇద్దరికీ చెందినవాడు. కానీ, ఇప్పుడు మాత్రం పూర్తిగా వింధ్యకు మాత్రమే చెందినవాడు. వింధ్య కూడా ఉత్పల దూరమైతే ఏదో అడ్డు తొలగిందనే భావనతో పూర్తి కాలం ఇస్తోంది.
… … …
ఇంతలో సంక్రాంతి పండుగకు ఊరు చేరారు. ఊర్లో వాళ్ళకి, ఆ రెండు కుటుంబాల వాళ్ళకి ఆ ఇరువురి వ్యవహారం ఎలా తెలిసిందో ఉత్పలకు తెలియదు. కానీ, ఉత్పల వల్లే అనే అపోహతో ఇరు కుటుంబాలు ఆమె ఇంటిమీదికి వెళ్ళారు, మా వాడు అలాంటివాడు కాదని, మా అమ్మాయి అలాంటిది కాదని ఎవరికి వాళ్ళు తమ పిల్లలను వెనకేసుకుంటూ…
ఉత్పలే కావాలని చిల్లర బుద్ధితో పుకారు లేపిందని, తక్కువ కులంలో పుట్టిన గుణం బైటపెట్టుకున్నదని నానా యాగీ చేశారు. అంత గొడవలోనూ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇన్నాళ్ళూ కనబడని కులం ఈనాడు ఉత్పల చెయ్యని తప్పుకు ఊతమిచ్చి ఉత్పల కులాన్ని లెక్కగట్టే స్థితికి చేరటం. ఊళ్ళో ముగ్గురు కులపెద్దలూ కలిసి పంచాయితీ పెట్టారు. ఉత్పలకైతే అది కులాల మధ్య పోరాటంలా, పరువు కాపాడుకోవడానికి పడుతున్న పక్కా ఆరాటంలా కనిపించింది.
మేమే ఎక్కువంటే మేమే ఎక్కువనే ఆధిపత్య ధోరణికి అద్దంలా తోచింది. చెయ్యని నేరాన్ని ఉత్పల చేత అంగీకరింప చేశారు. లేదంటే ఎంతో కొంత జమానతు పెట్టి పంచాయతీకి కూర్చోవాలన్నారు.
పేదరికం అంత జమానతు కట్టలేదనీ, ఆత్మాభిమానం అంత తెగింపు చూపలేదనీ వాళ్ళ గట్టి నమ్మకం. ఉత్పల తల్లిదండ్రులు ఆమెకేం తెలియదని, తనిప్పుడు ఆ గదిలో ఉండడం లేదని మొత్తుకున్నా కనికరించలేదు.
ఉత్పల భవిష్యత్తు దృష్ట్యా ఆమె తండ్రి తన బిడ్డను ఇంక ఆ పట్నానికి పంపనని, ఇంటివద్దే చదివించుకుంటానని ఒప్పుకున్నాడు. వాళ్ళకి ఇది మా వాళ్ళతో పోటీగా చదువుతుందా? అన్న అక్కసే కనిపించింది. తగిన బుద్ధి చెప్పాం, ఇరు కులాలం ఆ నిమ్న కులం మీద గెలిచాం అన్న సంతోషమే వాళ్ళల్లో కనిపించింది తప్ప తమ పిల్లల విషయం ఆలోచించాలన్న ఇంగితం కనిపించలేదు.
ఆ రోజు ఉత్పల వాళ్ళ నాన్న… ‘‘బిడ్డా! వీళ్ళ గెలుపు నీటి బుడగ చేసే బాధ్యత నీదే. మాణిక్యం మట్టిలో ఉన్నా, బంగారు పెట్టెలో ఉన్నా దాని విలువ మారదు. నువ్వూ అంతే. ఇవేమీ పట్టించుకోకుండా నీ చదువు సాగించు. మనకూ సమయం వస్తుంది. అందుకే నీ భవిష్యత్తు కోసమే నేను రాజీపడ్డాను తప్ప నా కులం పట్ల నాకు గౌరవం లేక, న్యాయం, చట్టం పట్ల నమ్మకం లేక కాదు. నిన్ను ఇలా దెబ్బతీసి నీ ద్వారా మన కుటుంబాన్ని, తద్వారా మన కులాన్ని దెబ్బ తీయాలనుకుంటున్న వాళ్ళకు నువ్వే బుద్ది చెప్పాలి’’ అన్న మాటలు మనోధైర్యాన్ని నింపగా హాస్టల్‌ ఖాళీ చేసి ఇల్లు చేరింది. రోజూ హాస్టల్‌లో మాదిరిగానే పక్కా ప్రణాళికతో కష్టపడుతోంది.
ఒకరోజు వాళ్ళిద్దరూ గుడిలో కనిపించేసరికి మళ్ళీ గతం గుర్తుకువచ్చి బాధపడిరది. వెళ్ళి గట్టిగా నిలదీయాలనుకుంది. కానీ, అనవసరమైన రభస అవుతుందని మౌనంగా వస్తుండగా దారికడ్డంగా వింధ్య, దారిలో అతను… ఆశ్చర్యపోయింది. ఉత్పలా… నీతో మాట్లాడాలన్నారు ఇద్దరూ. ‘‘ఇంకా ఏం మాట్లాడాలి? ఈసారి ఏకంగా నా జీవితాన్నే ఖాళీ చేయాలా? లేక నా కులాన్నే ఈ సమాజం నుంచి ఖాళీ చేయించాలా?’’ అంది తీవ్రంగా. ఇంతలో ఎవరో అటు వస్తున్నట్లుగా చూసి ‘‘ప్లీజ్‌ ఉత్పలా! ఇవన్నీ మాట్లాడడానికి ఇది సమయం కాదు. మేం ఎల్లుండి హాస్టల్‌కి వెళ్తున్నాం. దయచేసి రేపు ఒక్క పది నిమిషాలు మా కోసం కేటాయించు’’ అంటూ కలవాల్సిన సమయం, స్థలం చెప్పి వెళ్ళిపోయారు.
ఉత్పల ఈ విషయాన్ని తండ్రికి చెప్పింది. సరే, ఏదైనా ఆపద తెచ్చిపెడితే ఈసారి మాత్రం వదలనని కరాఖండిగా చెప్పాడాయన.
సరేనని ఉత్పల వెళ్ళి మాట్లాడిరది.
సారాంశమేమిటంటే, మొన్న జరిగిన గొడవ తరువాత విషయం తెలుసుకున్న వింధ్య తల్లిదండ్రులు ఆమెకు వేరే సంబంధం నిశ్చయించారు. అది వారిద్దరికీ ఇష్టంలేదు. ‘‘ఇద్దరం మేజర్లే కాబట్టి ఎక్కడికైనా వెళ్ళి పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాం, ఇది మా ఇళ్ళల్లో తెలియదు, మా వల్ల్లే ఏమీ తెలియని నువ్వు ఇబ్బందుల పాలయ్యావు, మా ఇద్దరినీ క్షమించు, అందుకే పిలిచాం’’ అని కాళ్ళు పట్టుకున్నంత పనిచేశారు. నీకు ఎప్పుడైనా మాట్లాడాలని అనిపిస్తే ఫోన్‌ చెయ్యి, ఈ కొత్త నంబర్‌ నీకు మాత్రమే ఇస్తున్నాం అంటూ కొత్తగా తీసుకున్న ఫోన్‌ నెంబర్‌ ఇచ్చారు.
ఉత్పల ఏమీ మాట్లాడలేదు. ‘‘రేపు పరీక్షలయ్యాక మేము ఇంటికి రాము, అటునుంచి అటే దూరంగా వెళ్ళి బతుకుతాం, లేదంటే కలిసి చావడానికైనా సిద్ధం, ఇదే మన ఆఖరి కలయిక’’ అని సినిమా డైలాగుల్లా అప్పచెప్పి వాళ్ళు ఉత్పల జవాబు కోసం కూడా చూడకుండా కనుమరుగయ్యారు. ఇప్పుడేమిటి దారి? మొన్న మూడు కులాల మధ్య లొల్లి… ఇప్పుడు రెండు కులాల మధ్య మొదలవుతుందా? ఇలాంటి వారందరూ ఇలా పారిపోవాలి, లేదంటే చచ్చిపోవాల్సిందేనా? కొత్త పరిష్కారం మార్చి రాసి చూపలేమా? అనుకుంది ఉత్పల.
అంతలోనే తానే మళ్ళీ వారిద్దరూ చదువు సాగక ఉత్పలనూ దెబ్బ తీయాలనే ఇలా చెప్పి ప్లాన్‌ చేశారేమో? లేకుంటే వీళ్ళు ఇలా ఎలా మారతారు? అనుకొని అదే నిజమని గట్టిగా నమ్మి ఏదేమైనా ముందు పరీక్షలు, భవిష్యత్తు, నా వాళ్ళ ఆశలు అనుకుంటూ పుస్తకం చేతిలోకి తీసుకుంది.
విజయవంతంగా పరీక్షలు పూర్తిచేసింది. సెంటర్‌ వేరవడం వల్ల వాళ్ళు కలవలేదు. తానూ ప్రయత్నించలేదు. కానీ, ఒక్కటే ఆతృత. వాళ్ళు నిజంగానే అన్నంత పనీ చేస్తే, పాపం… ఆ రెండు కుటుంబాలు ఎంత బాధపడతాయో కదా! అలాకాక వాళ్ళు బాధపడుతూ, దూరంగా బతకలేక ఇంకేమైనా చేసుకుంటే, ముందే విషయం తెలిసీ బయట పెట్టకుండా వారి చావుకు పరోక్షంగా కారణమైనదాన్నవుతాను. ఎలా… ఎలా? దీన్ని ఎలా పరిష్కరించడం అని ఆలోచిస్తోంది. పరీక్షలైపోయి వారం గడిచినా వాళ్ళు ఇంటికి రాలేదు. ఇరు కుటుంబాలు వెళ్ళి వెతికి వచ్చాయి. ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఇంకా ఉపేక్షిస్తే ఇద్దరికీ తీరని ద్రోహం చేసినట్లవుతుందని నాన్నతో విషయం చెప్పింది. ఆయన కూడా ఉత్పల అనుకున్నట్టుగానే అనుకున్నాడు.
ఈ కుటుంబాలు పరువు హత్యలైనా చేస్తాయేమో కానీ, వారి ప్రేమను అంగీకరించి కొత్త జీవితాలకు నాంది పలకవన్నాడు. సామరస్యంగా, సజావుగా, సమస్య లేకుండా ఇద్దరినీ కలపాలని నిర్ణయించుకున్నారు. అందుకే సఖి సెంటర్‌కు వెళ్ళి విషయాన్ని వివరించి వాళ్ళ సహాయం తీసుకుని ఇరువురి పెద్దల మధ్య కౌన్సిలింగ్‌ ఇప్పించి సయోధ్య చేయించి అందరి సమక్షంలో ప్రేమ వివాహం, అందులోనూ కులాంతర వివాహం జరిపించింది ఉత్పల.
రెండు వేర్వేరు కులాలు జీవితాలను లేకుండా చెయ్యాలని చూస్తే మళ్ళీ నా నిమ్న కులమే వారికి వెన్నుదన్నై నిలిచింది. కొత్త జీవితం ఇచ్చింది. నేనూ గెలిచాను, నా కులాన్నీ గెలిపించుకున్నాను. మీలాంటి ‘‘పెద్ద బుద్దులు’’ మాకు లేవని, మానవత్వమే మా కులమని, మనుషులుగా మాత్రమే మాకు విలువలని, కులాలూ, మతాలూ అనే జాడ్యం మాకు లేదని ఉత్పల నిరూపించి ‘‘నేను గెలిచాను’’ అని మురిసిపోయింది. ఆడపిల్లైనా కన్నవారికి పేరు తెచ్చింది.

Share
This entry was posted in కధానికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.