16 రోజుల యాక్టివిజం కాదు… 365 రోజుల ఉద్యమం కావాలి – కొండవీటి సత్యవతి

నవంబరు 25 నుండి డిసెంబరు 10 వరకు స్త్రీలపరంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భిన్నమైన కార్యక్రమాలు జరుగుతాయి. చాలా సంవత్సరాలుగా ఇవి జరుగుతున్నాయి. స్త్రీల మీద అమలవుతున్న హింసకు వ్యతిరేకంగా నవంబరు 25ని ‘వయొలెన్స్‌ అగైనెస్ట్‌ ఉమెన్‌’ డే

అంటూ మొదలుపెట్టి అంతర్జాతీయ మానవహక్కుల దినం డిసెంబరు 10తో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి.
ఒక్కో దేశంలో ఒక్కో కార్యక్రమం. మన దేశంలో కూడా వివిధ రాష్ట్రాల్లో భిన్నమైన ప్రోగ్రామ్‌లు చేస్తున్నారు. దీనిని 16 రోజుల ఏక్టివిజమ్‌గా కూడా పిలుస్తున్నారు. రోజుకో రకమైన హింస గురించి మాట్లాడినా గానీ, ఈ రోజు స్త్రీల మీద అమలవుతున్న హింసా రూపాల గురించి మాట్లాడాలంటే ఈ పదహారు రోజులు ఏం సరిపోతాయి? ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడ ఆపాలి? ఏ హింస గురించి ఎక్కువ మాట్లాడి ఏ హింస గురించి తక్కువ మాట్లాడాలి?
అమ్మ కడుపులో భద్రంగా పడుకున్న పసికందుని చంపే క్రమం గురించి మాట్లాడాలా? పుట్టగానే, ఆడశిశువని తెలియగానే వడ్లగింజ వేసో, ముక్కు చెవులు మూసేసో చంపేసే అమానవీయత గురించి మాట్లాడాలా? సొంతపిల్లల్ని వయసు, వావి, వరస ఏమీ లేకుండా లైంగికంగా దాడి చేస్తున్న తండ్రుల గురించి మాట్లాడాలా? చదువు చెప్పాల్సిన పంతుళ్ళు ఆడపిల్లల్ని లైంగికంగా కాల్చుకుతింటున్న సంఘటనల గురించి మాట్లాడాలా? పెళ్ళయితే కుటుంబ హింస, పెళ్ళి చేసుకోకపోతే ఒంటరి మహిళగా ఎదుర్కొనే హింస, రోడ్డు మీద హింస, పనిచేసే చోట హింస, యుద్ధ హింస, మత హింస… ఏ హింస గురించి మాట్లాడాలి. ఎంత కాలం ఇలా మాట్లాడాలి?
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది స్త్రీలు గొంతు చించుకుని ఎలుగెత్తి ‘‘హింసలేని సమాజం స్త్రీల హక్కు. అన్ని హింసలకు వ్యతిరేకంగా పోరాడదాం’’ అంటూ నినదిస్తున్నారు. ఎవరు వింటున్నారీ మాట? ఎవరి చెవుల ద్వారా ఎవరి గుండెల్లోకి చేరుతోంది ఈ ఘోష? అసలు ఎవరైనా వింటున్నారా? ఆ వింటున్న వాళ్ళకు తల్లి ఉండదా? తోడబుట్టిన వాళ్ళుండరా? సహచరో, సహవాసో ఉండరా? కూతుళ్ళుండరా? ఉంటారు. అందరూ ఉంటారు. తాము నానారకాల హింసలకి పాల్పడుతూ,.. తమ వాళ్ళని భద్రంగా ఉంచుతున్నామనే భ్రమలో ఇళ్ళల్లో బంధించాలనుకుంటున్నారు.
ఓ పక్క స్త్రీల బతుకుల్ని హింసామయం చేస్తూ మరో పక్క మేమే స్త్రీల రక్షకులంటూ ఫోజు కొట్టడం ఎలాంటి నీతి అవుతుంది? పురుషులు పాటిస్తున్న ఈ ద్వంద్వ నీతి కోట్లాది స్త్రీల జీవితాలను ఎలా ఛిద్రం చేస్తున్నాయో గణాంకాలు చెబుతూనే ఉన్నాయి. ‘అన్ని హింసలకు వ్యతిరేకంగా పోరాడుదాం’ అనే నినాదం ఎవరిని ఉద్దేశించింది? పురుషుల్నా? వ్యవస్థల్నా? ప్రభుత్వాలనా? వివిధ హింసలతో వేలాది స్త్రీల మరణాలకు కారణమౌతున్న శత్రువు అసలు ఎవరు? ఎవరి మీద మనం పోరాడుతున్నాం. స్త్రీల రక్షణ కోసం బోలెడు చట్టాలు తెచ్చాం మా పని అయిపోయింది అంటుంది ప్రభుత్వం. ప్రభుత్వాలు స్త్రీల పక్షపాతంతో వ్యవహరిస్తూ, వాళ్ళ కోసం కొత్త చట్టాలు తెస్తూ, మమ్మల్ని రాచిరంపాన పెడుతోంది అంటున్నాయి పురుషవాద సంఘాలు. అంతేకాదు పురుషుల్ని వేధించే స్థితికి మహిళలు చేరిపోయారని, చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని కూడా ఆరోపించి, దూషిస్తున్నారు. ఇదే నిజమైతే… హింస ఎందుకు పెరుగుతోంది? హింసారూపాలెందుకు మారుతున్నాయి? ఆలోచించి, విశ్లేషించే ఆసక్తిగాని, అసలు కారణాలను అన్వేషించే సహనం కానీ లేని కొంతమంది పురుషులు స్త్రీలు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు. అంతే… అవతలి వైపు చూసే అవసరం మాకు లేదు అంటూ మొండికేస్తున్నారు.
నిజమే! ప్రభుత్వం మహిళల ఉద్ధరణ కోసం కొత్త చట్టాలను తెస్తూనే ఉంది. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం స్త్రీల మీద హింసను అంతం చేసే చట్టాలను తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇంకా ఎన్నో క్యూలో
ఉన్నాయి కూడా. ఇవన్నీ మహిళలకు అండగా, రక్షణగా ఎందుకుండటం లేదు? దీనికి కారణం ఒక్కటే. ప్రభుత్వం తెస్తున్న కొత్త చట్టాలన్నీ ఆచరణ యోగ్యం కాని విధంగానే మిగిలిపోతున్నాయి. కొత్త చట్టాల అమలుకు కావలసిన బడ్జెట్‌, వనరులు మంజూరు కావు. వాటిని పటిష్టంగా అమలు పరిచే వ్యవస్థలు రూపొందవు. చట్టం అందమైన భాషలో, అద్భుతమైన పదజాలంతో రూపొంది కాగితం పులిలా గాండ్రిస్తుంటుంది. ఆ గాండ్రిరపులకే భయపడి పురుష ప్రపంచం ప్రభుత్వం స్త్రీల పక్షం అంటూ నింద వేస్తుంది, మరింత హింసను ప్రేరేపిస్తుంది. పటిష్టమైన ఆచరణకు నోచుకోని చట్టాలు మరో వంద వచ్చినా స్త్రీలకు ఒరిగిందేమీ లేదు. జిల్లా ప్రధాన కేంద్రంలో కూర్చున్న రక్షణాధికారి ఆ జిల్లాలోని స్త్రీలందరినీ గృహ హింస నుంచి కాపాడుతుందనుకోవడం ఎంత భ్రమో! చట్టాలొక్కటే స్త్రీలను హింసల్నుండి రక్షిస్తాయనుకోవడం అంతే భ్రమ.
స్త్రీల మీద హింస ఇంత భయానక స్థితికి చేరి తొమ్మిది నెలల పసికందు నుంచి ఎనభై ఏళ్ళ వృద్ధురాలికి కూడా రక్షణ లేని స్థితి ఇటు కుటుంబంలోను, అటు సమాజంలోను పెచ్చరిల్లిపోతోంది. భారతదేశంలో స్త్రీల ఉద్యమం వల్ల అనేకానేక చట్టాలు, సహాయ సంస్థలూ వచ్చాయి. మహిళలు, పిల్లల సహాయార్ధం అనేక వ్యవస్థలు నడుస్తున్నాయి. అయినపన్పటికీ హింస తగ్గుముఖం పట్టకపోవడానికి కారణం అమల్లో ఉన్న చట్టాల గురించిన ప్రచారం పెద్ద ఎత్తున జరగకపోవడం ఒక కారణమైతే, చట్టాల అమలు తీరు, సకాలంలో న్యాయం దొరికి శిక్షలు పడకపోవడం మరో కారణం.
ఒక పల్స్‌ పోలియో డ్రాప్స్‌కి, ఒక హెచ్‌ఐవి నియంత్రణకి జరిగిన స్థాయిలో మహిళ మీద హింస ఆమోదయోగ్యం కాదు. కఠిన చట్టాలు అమలులో ఉన్నాయనే ప్రచార లోపం కూడా ఒక కారణం. కుటుంబాల్లోను, సమాజపు అన్ని పొరల్లోను శిలాజ రూపంలో తిష్టవేసి ఉన్న పితృస్వామ్య భావజాలం మహిళలను, వారి హక్కులను అనుభవించనీయడం లేదు. స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రతిపాదించే జెండర్‌ అవగాహన లేకపోవడం, ఆ దిశగా కార్యక్రమాలు గానీ, ప్రచారం గానీ లేకపోవడం మరో ముఖ్యమైన కారణం.
అన్ని రకాల హింసల్ని వ్యతిరేకిస్తూ జరిగే 16 రోజుల యాక్టివిజంలో ఈ అంశాలను ప్రస్తావిస్తూ హింసలేని సమాజం స్త్రీల హక్కు అని నినదిద్దాం.పదహారు రోజుల యాక్టివిజమ్‌ మాత్రమే కాదు మూడొందల అరవై అయిదు రోజుల ఉద్యమం… స్త్రీల ఉద్యమం. అట్టడుగు స్థాయినుంచి ఢల్లీిదాకా విస్తరించి ఉవ్వెత్తున ఎగిసిపడాల్సిన ఉద్యమం.
ఆ ఉద్యమమే నేటి ఆవశ్యకత. ఆ ఉద్యమమే అన్ని రకాల హింసలకి సమాధానం.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.