చట్టబద్ధంగా వెళ్ళండి… సురక్షితంగా వెళ్ళండి
వలస అనేది అభివృద్ధికి మార్గం కావాలి. వలస ఒక విషాదం, జీవన విధ్వంసానికి ప్రతీక కాకూడదు. చట్టబద్ధమైన, సురక్షితమైన వలసలను ప్రోత్సహిస్తూ, అక్రమ వలసల్ని నిరోధించాలి. ఉపాధి కోసం మన దేశం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్తున్న మన పౌరులను
కాపాడుకోవటం మన కర్తవ్యం. వారి కనీస ప్రాథమిక హక్కులను రక్షిస్తూ నకిలీ గల్ఫ్ ఏజెంట్ల నుంచి, మోసపూరిత కంపెనీల నుంచి వీరికి రక్షణ కల్పించాలి.
గల్ఫ్ దేశాలకు వలసలు ` జాగ్రత్తలు
గల్ఫ్‌కు వెళ్ళే ముందు…
్జ సరిjైున సమాచారంతో, తప్పులు లేకుండా పాస్‌పోర్ట్ పొందండి.
్జ ఏ దేశానికి, ఏ పనిమీద వెళ్ళాలని అనుకుంటున్నారో స్పష్టత కలిగి ఉండండి.
్జ ఏజెంటుకు భారత ప్రభుత్వం జారీ చేసిన రిజిస్టర్డ్ రిక్రూటింగ్ లైసెన్సు ఉన్నదీ లేనిదీ ఈ లింక్ https:/emigrate.gov.in/ext ralist.action పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
్జ ఎమిగ్రేషన్ యాక్టు`1983 ప్రకారం లైసెన్సు లేనివారు కానీ, సబ్ ఏజెంట్లు కానీ రిక్రూటింగ్ (ఉద్యోగాల భర్తీ) చేయడానికి వీలులేదు. లైసెన్సు కలిగిన ఏజెంట్లు కూడా సబ్ ఏజెంట్లను నియమించుకోవడం చట్ట విరుద్ధం.
్జ ప్రభుత్వం ఏర్పాటు చేసినTOMCOM (తెలంగాణ), OMCAP (ఆంధ్రప్రదేశ్) ఏజెన్సీల ద్వారా మాత్రమే వలస వెళ్ళడం సురక్షితం.
్జ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (NAC న్యాక్) కేంద్రాలలో ఉచిత భోజన, వసతి సౌకర్యంతో పాటు కల్పిస్తున్న ఉచిత నైపుణ్య శిక్షణ పొందండి.
్జ పని కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారు, విజిట్ వీసా, ఫ్రీ వీసా, ఆజాద్ వీసా, ఖఫాలత్ వీసా, ప్రైవేటు వీసాలపై వెళ్ళి చేయకూడదు.
్జ సరిjైున సమాచారంతో, తప్పులు లేకుండా పాస్‌పోర్టును పొందండి.
్జ ఏ దేశానికి, ఏ పనిమీద వెళ్ళాలని అనుకుంటున్నారో స్పష్టత కలిగి ఉండండి.
్జ ఏజెంటుకు భారత ప్రభుత్వం జారీ చేసిన రిజిస్టర్డ్ రిక్రూటింగ్ లైసెన్సు ఉన్నదీ లేనిదీ ఈ లింక్ https:/emigrate.gov.in/ext ralist.action పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
్జ ఎమిగ్రేషన్ యాక్టు`1983 ప్రకారం లైసెన్సు లేనివారు కానీ, సబ్ ఏజెంట్లు కానీ రిక్రూటింగ్ (ఉద్యోగాల భర్తీ) చేయడానికి వీలులేదు. లైసెన్సు కలిగిన ఏజెంట్లు కూడా సబ్ ఏజెంట్లను నియమించుకోవడం చట్ట విరుద్ధం.
్జ ప్రభుత్వం ఏర్పాటు చేసినTOMCOM (తెలంగాణ), OMCAP (ఆంధ్రప్రదేశ్) ఏజెన్సీల ద్వారా మాత్రమే వలస వెళ్ళడం సురక్షితం.
్జ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (NAC న్యాక్) కేంద్రాలలో ఉచిత భోజన, వసతి సౌకర్యంతో పాటు కల్పిస్తున్న ఉచిత నైపుణ్య శిక్షణ పొందండి.
్జ పని కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారు, విజిట్ వీసా, ఫ్రీ వీసా, ఆజాద్ వీసా, ఖఫాలత్ వీసా, ప్రైవేటు వీసాలపై వెళ్ళి చేయకూడదు.
్జ వర్క్ పర్మిట్ వీసా మాత్రమే పనిచేయడానికి అర్హత ఉంటుంది.
్జ విదేశాలకు వెళ్ళే ముందు చెల్లుబాటు అయ్యే వీసా, ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్, డిమాండ్ లెటర్, పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలను ఇవ్వాల్సిందిగా మీ ఏజెంట్‌ను డిమాండ్ చెయ్యండి.
్జ ‘‘ప్రవాస భారతీయ భీమా యోజన’’ ఇన్సూరెన్స్ పాలసీతో పాటు, అదనంగా తగినంత జీవిత భీమా పాలసీని కూడా తీసుకోవాలి.
్జ విదేశాలకు వెళ్ళేటపుడు పాస్ పోర్ట్, వీసా తదితర అన్ని రకాల డాక్యుమెంట్ల జిరాక్స్ సెట్లను కుటుంబ సభ్యులకు ఇచ్చి వెళ్ళండి.
్జ కుటుంబ సభ్యులతో కలిసి బ్యాంక్‌లో ఒక జాయింట్ అకౌంట్‌ను తెరవండి.
్జ అపరిచితులు అమ్మిన మందులు, పార్సిళ్ళను తీసుకెళ్ళవద్దు. ఒళ్ళు నొప్పుల నివారణ టాబ్లెట్లు, గసగసాలు (పాపీ సీడ్స్) లాంటి నిషేధిత పదార్ధాలను తీసుకెళ్తే 24 సంవత్సరాల (జీవిత ఖైదు) జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
్జ ఎమిగ్రేషన్ యాక్టు`1983 ప్రకారం లైసెన్సు కలిగిన రిక్రూటింగ్ ఏజెంటుకు గరిష్టముగా సర్వీస్ చార్జీగా రూ.30,000 (మరియు అదనంగా 18 శాతం జీఎస్టీ రూ.5,400) మాత్రమే చెల్లించి విదేశాలకు వెళ్ళండి. ఇంతకంటే ఎక్కువ చెల్లించవద్దు. మీరు ఏజెంటుకు చెల్లించిన సొమ్ముకు అధికారిక రశీదు పొందండి.
్జ ఇంటిపని కోసం వెళ్ళే మహిళలు, నర్సులు ఏజెంట్లకు ఎలాంటి సర్వీస్ చార్జి చెల్లించవలసిన అవసరం లేదు. ప్రభుత్వ రంగ రిక్రూటింగ్ ఏజెన్సీలయిన OMCAP (ఓంక్యాప్`ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్) మరియు TOMCOM (టాంకాం`తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ)ల ద్వారా ఉచితంగా వెళ్ళవచ్చు.
్జ వివరాలకు OMCAP ‘ఓంక్యాప్’ సెల్‌ః G91 99595 00207
ఇ`మెయిల్: gmomcap@gmail.com, md_omc@ap.gov.in, mdomcap@gmail.com
వెబ్‌సైట్: http:/www.omc.ap.gov.in మరియు
TOMCOM ‘టాంకాం’ సెల్‌ః G91 79979 73358
ఇ`మెయిల్: %tomcom.gmts@gmail.com
వెబ్‌సైట్: http:/tomcom.telangana.gov.in కు సంప్రదించవచ్చు.
ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారం ప్రవాసి కార్మికులు (మైగ్రెంట్ వర్కర్స్)గా మీకుండే హక్కులు:
్జ స్వదేశం నుండి విదేశానికి పోవడానికి, రావడానికి స్వేచ్ఛగా ప్రయాణించే హక్కు.
్జ బానిసత్వానికి మరియు బలవంతపు చాకిరీకి వ్యతిరేకంగా రక్షణ పొందే హక్కు
్జ ఆలోచన, మనస్సాక్షి మరియు మత విషయంలో స్వేచ్ఛగా ఉండే హక్కు
్జ హింస, అవమానకరమైన అణచివేత లేదా శిక్షల నుండి స్వేచ్ఛగా ఉండే హక్కు.
విదేశానికి వెళ్ళిన తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు:
్జ విదేశానికి చేరిన తర్వాత సాధ్యమైనంత త్వరగా రెసిడెంట్ పర్మిట్/ వర్క్ పర్మిట్/ ఐడెంటిటీ కార్డు/లేబర్ కార్డు/అఖామా/బతాకా పొందాలి.
్జ ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్ళిన కార్మికులు ఆయా దేశాల చట్టాలను, సాంప్రదాయాలను పాటించాలి, గౌరవించాలి.
్జ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అవసరమైన ఆడంబరాలకు, విలాసాల జోలికి వెళ్ళవద్దు. విలాస వస్తువుల కోసం డబ్బును వృధా చేయవద్దు, పొదుపు చేసుకోవాలి.
్జ విదేశాలలో ఉద్యోగాలు శాశ్వతం కాదు. ప్రపంచంలోని పరిస్థితులు, ఉద్యోగం చేస్తున్న దేశంలో సంభవించే పరిణామాల వలన ఏ క్షణంలోనైనా ఉద్యోగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్న స్పృహతో అప్రమత్తంగా ఉండాలి. గల్ఫ్ దేశాలలో యజమాని నుండి పారిపోయి వేరేచోట పనిచేయటం వలన అక్రమ నివాసులు (ఖల్లి వెళ్ళి)గా మారి తమ హక్కులను కోల్పోతారు.
్జ మీ పని ఒప్పందం మీకు తెలుసా? మీ పని ఒప్పందం తెలుసుకొని ఒప్పందంలో గల పనులు మాత్రమే చేసే హక్కు మీకుంది.
్జ ఒకవేళ మీ యజమాని లేదా ఎవరిమీదైనా ఫిర్యాదు కలిగి ఉన్న యెడల మీరు దేశం వదిలే ముందు భారత రాయబార కార్యాలయంలో ఒక లిఖితపూర్వక ఫిర్యాదు పత్రం సమర్పించండి మరియు పవర్ ఆఫ్ అటార్నీ వారికి ఇవ్వండి. లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించని తరుణంలో మీరు స్వదేశం చేరిన తరువాత ఎటువంటి కేసు నమోదు చేయబడదు.
్జ ఓవర్ టైం (అదనపు పనిగంటలు) పని చేయమని ఒత్తిడి చేసే అధికారం యజమానికి లేదు. మీకు ఇష్టమైతేనే అదనపు పనికి, అదనపు వేతనం ఇస్తేనే ఓవర్ టైం చేయండి. వారానికి ఒక రోజు సెలవు పొందడం మీ హక్కు.
్జ గల్ఫ్ దేశాల చట్టాల ప్రకారం సమ్మె, ఆందోళనలు చేయడం నిషేధం.
్జ ఏదైనా ఇబ్బంది వచ్చినపుడు మీరున్న దేశంలోని భారత రాయబార కార్యాలయాన్ని, ప్రవాస భారతీయ సంఘాలను సంప్రదించండి.
్జ నేషనల్ పెన్షన్ సిస్టంలో చేరి పొదుపు చేసుకుని వృద్ధాప్యంలో పెన్షన్ పొందండి. http://www.npstrust.org.in/sites/default/files.NRI_eNPS_FAQ.pdf
్జ ఎన్నారై ఓటరుగా మీ పేరు నమోదు చేసుకోండి. https://eci.gov.in/voter/overseas-electors/
్జ విదేశాల నుండి మీరు డబ్బును పంపడానికి మరియు పొదుపు కోసం మీ ఊరికి సమీపంలోని బ్యాంకులో ఒక ఎన్‌ఆర్‌ఐ ఖాతాను తెరవండి.
్జ సెల్‌ఫోన్‌ల వలన ఉత్తరాలు రాయడం మానేశారు. రెండు, మూడు నెలలకు ఒకసారైనా మీ కుటుంబ సభ్యులకు ఉత్తరం రాసి పోస్టు ద్వారా పంపండి. ఆపద సమయాలలో లెటర్ కవరుపై ఉన్న అడ్రస్ ఉపయోగపడుతుంది.
్జ పనిచేయు వయసులో మీరు చేసుకున్న పొదుపే వృద్ధాప్యంలో ఆదుకుంటుంది.
్జ విదేశంలో ఉద్యోగం శాశ్వతం కాదు, ఎన్నటికైనా తిరిగి రావాల్సిందే.
విదేశాల నుంచి తిరిగి వచ్చిన తరువాత:
్జ విదేశాలలో కొన్ని సంవత్సరాలపాటు ఉద్యోగం చేసి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత జీవితంలో స్థిరపడటానికి ముందే తగిన ప్రణాళిక వేసుకోవాలి.
్జ ఎంతోకాలంగా దేశానికి, ఊరికి, కుటుంబానికి, సమాజానికి దూరంగా ఉండి, విదేశం నుండి తిరిగి వచ్చిన తరువాత తమవారితో కలిసిపోవడం అంత సులువు కాదు.
్జ భారత్‌కు తిరిగిరాగానే ఒక వ్యాపారం ఆరంభించాలనే ఆలోచనలో ఉంటే, మీకు బాగా తెలిసిన వ్యాపారంలో ప్రవేశించండి. కొంత పరిశోధన చేయండి. ప్రజల అవసరాలు, మీ ప్రాంతంలో ఉన్న అవకాశాలను లెక్కలోకి తీసుకోండి.
్జ గల్ఫ్ దేశాల నుండి తిరిగి వచ్చిన తరువాత కొంత కాలానికి చాలామంది మళ్ళీ ఏదో ఒక దేశానికి వెళ్ళాలనుకుంటారు. సాధ్యమైనంత వరకు స్వదేశంలోనే స్థిరపడడానికి ప్రయత్నించండి.
్జ మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము సక్రమంగా వినియోగించుకోండి.
్జ మీ పిల్లలకు మంచి విద్యాభ్యాసాన్ని అందించి వారి హక్కును కాపాడండి.
ఆమ్నెస్టీ (క్షమాభిక్ష):
ప్రతి మూడు, నాలుగేళ్ళకు ఒకసారి గల్ఫ్ దేశాలలో అక్రమ నివాసులను (ఇర్రెగ్యులర్ మైగ్రెంట్స్) వారి వారి దేశాలకు పంపించడానికి ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) ప్రకటిస్తుంటారు. వీసా నిబంధనలు, ఇమిగ్రేషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారు, వీసా కాలపరిమితి ముగిసినా అక్కడే నివసిస్తున్న వారు ‘‘ఆమ్నెస్టీ’’ అవకాశాన్ని ఉపయోగించుకుని ఎలాంటి జరిమానా, జైలుశిక్ష లేకుండా స్వదేశానికి తిరిగి రావచ్చు. ఇది సంబంధిత వలస కార్మికులందరూ ఉపయోగించుకోవాలి. క్షమాభిక్ష కాలంలో వలస కార్మికుల కుటుంబ సభ్యులు సంబంధిత అధికారులను కలవవచ్చు.
ప్రమాద భీమా ప్రయోజనాలు:
ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ధీమా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ప్రవాసి భారతీయ భీమా యోజన పేరిట ఈ పథకం అమల్లో ఉంది. పిఓఈలో పేరు నమోదు చేసుకున్న వారు మాత్రమే ఇందుకు అర్హులు కావడం గమనార్హం.
పిఓఈ అధికారుల సూచనల మేరకు బీమా సంస్థల ద్వారా పాలసీ తీసుకోవచ్చు. రెండేండ్లకైతే రూ.375/, మూడేండ్లకైతే రూ.475/ ప్రీమియం చెల్లించడంతో పాటు అదనంగా సేవా పన్నును చెల్లిస్తే సరిపోతుంది. రూ.10 లక్షల కనీస భీమాను నామినీకి గానీ, చట్టబద్ధ వారసులకు గానీ భీమా సంస్థ నుంచి పరిహారం అందుతుంది. పిఓఈ క్లియరెన్స్ అనంతరం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా కారణంతో ఒప్పంద సంస్థ తిప్పి పంపినా, పనిలో చేర్చుకోకపోయినా, ఒప్పందం ప్రకారం నడుచుకోకుండా ఇబ్బందులకు గురి చేసినా భీమా సంస్థ నుంచి తిరుగు ప్రయాణానికి అయ్యే రవాణా ఖర్చు పొందవచ్చు. ప్రమాదంలో గాయపడినా, అనారోగ్యంతో జబ్బు పడినా కనీసం రూ.75 వేల వరకు భీమా సంస్థ ఆసుపత్రి ఖర్చులు అందజేస్తుంది. న్యాయ సహాయం కోసం రూ.30 వేల వరకు అందజేస్తారు. మహిళలకైతే బీమా సదుపాయాలతో పాటు ప్రసూతికి రూ.25 వేలు ఇస్తారు. ఈ భీమా సౌకర్యం కనీసం రెండేళ్ళు లేదా పని ఒప్పందాలలో ఏది ఎక్కువ ఉంటే దానికి వర్తిస్తుంది.
ఒకవేళ విదేశాలలో ఎవరైనా చనిపోతే ఎలా?
్జ ప్రమాదవశాత్తూ మరణిస్తే మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు అయ్యే రవాణా ఖర్చును బీమా సంస్థ భరిస్తుంది.
్జ తోడుగా ఉన్నవారికి ఎకానమీ క్లాస్ విమాన ఖర్చులు ఇస్తారు. గరిష్టంగా రెండు రోజుల్లోగా ఈ సొమ్మును అందజేస్తారు.
్జ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా ప్రభుత్వం విమానాశ్రయం నుంచి మీ గృహం వరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం అందజేస్తుంది.
విదేశాలలో చనిపోయినప్పుడు మృతదేహాలను తెప్పించుకోవడం ఎలా?
APNRT విజయవాడ కార్యాలయానికి సమాచారం అందించి వివరాలు నమోదు చేసుకోవాలి. భౌతిక కాయాన్ని ఎయిర్ పోర్టు వద్ద నుండి స్వగ్రామానికి ఉచితంగా అంబులెన్స్ ఏర్పాటు చేస్తారు.
మనవారు విదేశాలలో చనిపోయినప్పుడు మృతదేహాలను భారతదేశానికి తెప్పించుకోవడానికి ఆయా దేశాలలోని ఇండియన్ ఎంబసీల సహాయం తీసుకోవాలి. యాజమాన్య కంపెనీలు ఖర్చు భరించుకొని మృతదేహాలను పంపాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి స్వగ్రామం వరకు శవపేటికలను రవాణా చేయడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తున్నాయి.
మృతుల కుటుంబాలు పరిహారం పొందడం ఎలా?
APNRT విజయవాడ కార్యాలయానికి సమాచారం అందించి వివరాలు నమోదు చేసుకోవాలి. APNRT ద్వారా మృతుని కుటుంబానికి రూ.50 వేల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇస్తారు. విదేశాలలో చనిపోయిన మనవారికి రావలసిన పరిహారం పొందడానికి వారి కుటుంబ సభ్యులు కంపెనీ యజమానులకు లేఖలు రాయవచ్చు. రోడ్డు ప్రమాదం, పని ప్రదేశంలో ప్రమాదం వలన మరణించిన వారికి పరిహారం పొందడానికి ఆయా దేశాలలోని కోర్టులలో న్యాయ ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మీకు తెలిసిన న్యాయవాదిని నియమించుకోవచ్చు లేదా ఇండియన్ ఎంబసీకి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా పరిహారం అందించుకోవచ్చు.
ఈ క్రింది సెల్ఫ్ అటెస్టేషన్ చేసిన ధృవపత్రాలను APNRT విజయవాడ కార్యాలయానికి పంపించి నమోదు చేసుకోవాలి.
మృతుని యొక్క పాస్‌పోర్టు కాపీ. జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రం; ఇండియన్ ఎంబసీ; ఫ్యామిలీ రేషన్ కార్డు; లోకల్ అటెస్టేషన్ సర్టిఫికెట్స్, ఎయిర్ కార్గో టికెట్స్; ఆధార్ కార్డు; బ్యాంక్ పాస్ పుస్తకం మొదటి పేజీ; ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్.