మూడు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న రైతాంగ ఆందోళనలో మహిళా రైతుల సమస్యలను భాగం చేసి చర్చించాలి
గత 10 నెలలుగా రాజధాని ఢల్లీి సరిహద్దులలో జరుగుతోన్న చారిత్రాత్మక రైతాంగ ఆందోళనలో పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలోని పలు జిల్లాల
నుండి పెద్ద సంఖ్యలో మహిళా రైతులు పాల్గొంటున్నారు. ఈ రైతాంగ ఆందోళనకు మద్దతుగా అనేక ఇతర రాష్ట్రాలలో రైతులు నిరసన తెలుపుతున్నారు. వాటిలో కూడా మహిళలు పాల్గొంటున్నారు. ఈ నిరసనలలో మహిళలు కేవలం సంఖ్య రీత్యానే కాకుండా మద్దతును సమీకరించటంలో, రైతు వ్యతిరేక చట్టాల గురించి అవగాహన కల్పించటంలో, నిధులను పోగుచేయటంలో, ఢల్లీి, పంజాబ్‌ల సరిహద్దులలో నిరసనను నిలబెట్టటంలో కూడా వారు వహిస్తున్న పాత్రను ప్రసార సాధనాలు గుర్తించి రిపోర్టు చేస్తున్నాయి.
మూడు కార్పొరేట్ అనుకూల చట్టాలను రద్దుచేసి కనీస మద్దతు ధరలకు హామీ కల్పిస్తూ చట్టం తేవాలనే సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్లకు మహిళా రైతుల హక్కుల వేదిక (మకాం) బలంగా మద్దతు తెలియజేస్తూనే దీర్ఘకాలంలో రైతుల హక్కులు ప్రత్యేకించి చిన్న సన్నకారు రైతులు, మహిళా రైతుల హక్కుల పరిరక్షణ కోసం మార్కెట్లు, మద్దతు ధరలకు అదనంగా అనేక అంశాలను లేవనెత్తాలని బలంగా విశ్వసిస్తున్నది. రైతులకు వనరులపై హక్కులు, రక్షిత సాగు నీరు, జీవవైవిధ్యాన్ని పెంపొందించే రసాయన రహిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించటానికి అవసరమైన పెట్టుబడులు, వ్యవసాయ ఉత్పాదకాలు మొదలైనవి అందించేందుకు వ్యవస్థీకృత సంస్కరణలు తీసుకురావాలనే డిమాండ్లను కూడా సంయుక్త కిసాన్ మోర్చా తన డిమాండ్లలో చేర్చాలని మకాం కోరుతోంది. క్లుప్తంగా చెప్పాలంటే కార్పొరేట్ కంపెనీలకు కాకుండా అత్యధిక శాతం రైతుల హక్కులను, ప్రయోజనాలను కాపాడేందుకు పెద్ద ఎత్తున ప్రభుత్వ పెట్టుబడులను తెచ్చే విధంగా వ్యవసాయ రంగంలో సంస్కరణలు అవసరం.
మహిళా రైతుల సమస్యలను ఈ ఉద్యమంలో ఎందుకు భాగం చెయ్యాలి?
పంజాబ్ వంటి రాష్ట్రాలకు చెందిన అనేక రైతు సంఘాలు సమీకరించినందువల్లే ఈ నిరసనలలో మహిళా రైతులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారనేది నిజమే అయినప్పటికీ, వాళ్ళు రైతులుగా తమ ప్రత్యేక సమస్యల దృష్ట్యా కూడా పాల్గొంటున్నారని గుర్తించటం చాలా ముఖ్యం. వాళ్ళు కూడా ఈ ఉద్యమ ఫలితాలలో అంతే ముఖ్యమైన ప్రయోజనాలను ఆశిస్తున్నారు.
ఈ నిరసనలలో మహిళా రైతులు కేవలం ప్రేక్షకులుగా ఉండటం నుండి వేదికపై ఉపన్యాసకులుగా ఉండే స్థితికి మారారు. మహిళా కిసాన్ దివస్ వంటి కొన్ని సందర్భాలలో వాళ్ళు తమ సమస్యలను తెలియజెప్పడానికి ప్రయత్నించారు. అయితే ఈ మొత్తం
ఉద్యమంలో మహిళా రైతుల ప్రత్యేక సమస్యలను భాగం చేయటానికి గ్రామీణ వ్యవసాయ రంగ నిర్మాణంలో కులం, వర్గం పరంగా వారి స్థితిగతులను, బహుముఖ గుర్తింపులను అర్థం చేసుకోవటానికి తగినంత ప్రయత్నాలు జరగలేదని తెలుస్తోంది. అందుకే మహిళా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్పష్టంగా ప్రకటించి చర్చించటానికి విడిగా ఒక వేదికను సృష్టించాల్సిన అవసరం ఉంది. అలా చేసినపుడు రైతాంగ నిరసన ఉద్యమంలో స్థూలంగా ముందుకొస్తున్న డిమాండ్లను మహిళా రైతుల దృష్టికోణం నుండి జెండర్ దృక్పథంతో మేళవించటానికి పునాది ఏర్పడుతుంది.
ప్రస్తుత నిరసన ఉద్యమంలో మహిళా రైతుల సమస్యలు దేశవ్యాప్తంగా ఉన్న మహిళా రైతుల సమస్యలను ప్రతిఫలిస్తాయి.
వివిధ వర్గాలకు చెందిన మహిళా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ విస్తృత రైతాంగ ఉద్యమంలో భాగం చెయ్యాల్సిన ప్రత్యేక అవసరం ఎందుకు ఏర్పడిరదంటే వారి సమస్యలు దేశవ్యాప్తంగా మహిళా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతిఫలిస్తాయి. కనుక, మహిళా రైతులు తమకు రైతులుగా గుర్తింపు లేకపోవటం, భూమి, నీరు, అడవులు, ఉమ్మడి వనరులపై హక్కు లేకపోవటం, రుణాలు, విత్తనాలు, వ్యవసాయ విస్తరణ సేవలు, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ సౌకర్యాలు, బీమా వంటి మద్దతు వ్యవస్థలను అందుకోవడంలో జెండర్ పరమైన అడ్డంకులు, రైతు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలలో సభ్యత్వం, నాయకత్వ పాత్ర లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుత రైతు ఉద్యమ నేపథ్యంలో ఈ క్రింద పేర్కొన్న మహిళా రైతుల ప్రత్యేక వర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యలను భాగం చేసి వాటిని లోతుగా చర్చించాలి.
` రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల మహిళలు, ఒంటరి మహిళలు
` కౌలు రైతులుగా ఉన్న మహిళా రైతులు
` భూమిలేని మహిళా వ్యవసాయ కూలీలు, వలసకు వెళ్ళే మహిళా వ్యవసాయ కూలీలు
` ఉమ్మడి వనరులపై ఆధారపడిన మహిళా పశు పెంపకందారులు
` అడవులలో నివసించే, అడవులపై ఆధారపడిన సమూహాలకు చెందిన మహిళా రైతులు
పైన పేర్కొన్న మహిళా రైతుల వర్గాలు ఒకదానితో ఒకటి కలగలసి ఉంటాయనేది అందరికీ తెలిసిందే. అయితే, ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమిటంటే గ్రామీణ వ్యవసాయ నిర్మాణంలో ఆ వర్గాలన్నీ సామాజిక, ఆర్థిక స్థాయిలో అత్యంత వెనకబడి ఉన్నాయి. ఈ వర్గాల మహిళా రైతులు ఎదుర్కొంటున్న కీలకమైన సమస్యలను, వాటికి సూచనలను ఈ క్రింది విధంగా సంగ్రహంగా చెప్పవచ్చు:
రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలలోని మహిళా రైతులు:
` అప్పులను మాఫీ చేయటం
` గుర్తింపు కార్డులు ఇవ్వటం
` రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్‌గ్రేషియా చెల్లించటం
` కుటుంబ భూమిలో వాటా ఇచ్చి పట్టా చేయించటం
` ప్రత్యామ్నాయ జీవనోపాధులకు మద్దతు
` గృహ వసతి, పెన్షన్లు, సామాజిక భద్రత
` పిల్లల చదువుకు సహాయం
కౌలు భూముల సాగుదారులైన మహిళా రైతులు:
` రికార్డులలో నమోదుచేసి సాగుదారులుగా గుర్తింపు
` పంట ఋణం, పెట్టుబడి సహాయం (రైతు బంధు, పి.ఎం.కిసాన్ పథకాల వంటివి), పంటల భీమా, పంట నష్టపరిహారం వంటి పథకాలకు అర్హతనివ్వటానికి సాగుదారులుగా రిజిస్టర్ చేసి గుర్తింపు కార్డులు ఇవ్వటం.
` సాగుచేసుకోవటానికి భూమి, ప్రత్యేకించి సమిష్టి వ్యవసాయం చేయటానికి భూమి అందుబాటులోకి తేవటం, దానికి అవసరమైన రాష్ట్రస్థాయి చట్టాలను రూపొందించటం.
భూమిలేని వ్యవసాయ కూలీలుగా మహిళా రైతులు:
` సాగుయోగ్యమైన భూమి ఇవ్వాలి, దానిలో వ్యవసాయానికి మద్దతు అందించాలి
` కొత్త కార్మిక కోడ్‌లను రద్దు చేయాలి
` జాతీయ ఉపాధి హామీ పథకంలో 200 రోజులు పని కల్పించాలి.
` అసంఘటిత కార్మికుల బోర్డులో రిజిస్టర్ చేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. దాని ప్రకారం లభించే సామాజిక భద్రత, తదితర ప్రయోజనాలను కల్పించాలి.
` గౌరవప్రదమైన వేతనాలు, పని పరిస్థితులు కల్పించాలి
` జీవనోపాధి అవసరాల కోసం, అంటే మేత, వంట చెరకు సేకరణ, చేపలు పట్టుకోవటం, సాగుచేయని ఆకుకూరలు, పండ్లు, దుంపలు తదితర ఆహార పదార్థాల సేకరణకు వీలుగా ఉమ్మడి భూములు, నీటి వనరులను అందుబాటులోకి తేవాలి. వాటి ద్వారా అవసరమైన ఆహారం, కనీస వనరులు అందే విధంగా చర్యలు తీసుకోవాలి.
పశు పెంపకంపై ఆధారపడే మహిళలు:
` తమ పశువులను మేపుకోవటానికి, నీటి అవసరాల కోసం ఉమ్మడి వనరుల అందుబాటు, దీనికి హామీ కల్పించటానికి రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలి.
` పశువుల పంపిణీ పథకాలలో మహిళా రైతులకు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాలు వారి పశు పెంపక ఆధారిత జీవనోపాధులను బలోపేతం చెయ్యాలి.
` కోళ్ళు, మేకలు, గొర్రెలు, పాలు తదితర ఉత్పత్తుల అమ్మకాలకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించి ఆదాయాలకు హామీ ఇవ్వాలి.
అడవులలో నివసించే అటవీ ఆధారిత సమూహాలకు చెందిన మహిళా రైతులు
` అటవీ భూములపై వ్యక్తిగత/జాయింట్ హక్కులను గుర్తించాలి.
` ఉమ్మడి అటవీ భూములు, ప్రత్యేకించి పివిటిజి గ్రూపులకు ఆవాస భూములపై హక్కులను గుర్తించి వాటిని అందుబాటులోకి తేవాలి.
` అటవీ భూములను, అటవీ ఉత్పత్తులను ఉపయోగించటంలోనూ, అటవీ పరిపాలనలోనూ పీసా చట్టం స్ఫూర్తికి అనుగుణంగా మహిళలకు నిర్ణయాధికార హక్కులు కల్పించాలి.
` అడవులలోకి వెళ్ళటాన్ని ఆపకుండా చర్యలు తీసుకోవాలి. (అటవీ సమూహాలలో అడవులలో వారి సాంప్రదాయక ఫలసాయ సేకరణ, పోడు వ్యవసాయం చేయటానికి, ఆవాసాలకు వెళ్ళకుండా ఆంక్షలు విధించటం వల్ల వారు జీవనోపాధి కోల్పోవటమే కాదు వారి జీవన విధానం దెబ్బ తింటుంది. సాంఘిక, సాంస్కృతిక పరాయీకరణ జరుగుతుంది. అది వారి గుర్తింపు సాంస్కృతిక మూలాలపై ప్రభావం పడుతుంది.
` కాంపా తదితర పథకాలను అమలు చేయటానికి అటవీ భూములను మళ్ళించటాన్ని ఆపాలి. ఆ పథకాలు జీవవైవిధ్యంతో కూడిన అడవుల స్థానంలో ఒకేరకమైన చెట్లను నాటి, ఆదివాసులకు అత్యవసరమైన వైవిధ్యంతో కూడిన జీవావరణ వ్యవస్థలను నాశనం చేస్తాయి.
గత కొద్ది సంవత్సరాలుగా కొనసాగుతున్న వ్యవసాయ సంక్షోభం కోవిడ్ కారణంగా విధించిన లాక్‌డౌన్ నుండి మరింత తీవ్రమైంది. ఇది దేశవ్యాప్తంగా వివిధ వర్గాల మహిళా రైతుల కష్టాలను కూడా పెంచింది. మహిళా రైతులు అప్పటికే ఎదుర్కొంటున్న అసమానతలు, వివక్షలకు తోడు కోవిడ్ కారణంగా ఉపాధి తగ్గిపోయి, పెన్షన్లు, రేషన్ కార్డులు తదితర సామాజిక భద్రతా పథకాలు అందక మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని 11 రాష్ట్రాలలో మకాం నిర్వహించిన అధ్యయనంలో తేలింది. గత సంవత్సర కాలంలో అప్పులు పెరిగిపోయాయి. నగదు అందుబాటులో లేక మహిళా రైతులు మరిన్ని అప్పులు చేసే పరిస్థితికి నెట్టబడ్డారు. సాధారణంగానే అనేక సవాళ్ళను ఎదుర్కొనే విధవలు, ఒంటరి మహిళలు కోవిడ్ కారణంగా మరింత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
వాళ్ళు తమకున్న అతి కొద్దిపాటి ఆస్తులను అమ్ముకుని, భూములను కౌలుకు ఇవ్వాల్సి వచ్చింది. ప్రభుత్వ ఉపశమన పథకాలు ఈ మహిళా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీర్చలేకపోయాయి.
లాక్‌డౌన్ సమయంలో తీవ్ర ప్రభావంతో పాటు, ఆహారం, ఆదాయం, జీవనోపాధులు కోల్పోవటంతో పాటు అన్ని వర్గాల మహిళా రైతులు కొన్ని కీలకమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నారు.
మూడు వ్యవసాయ చట్టాలు, లేబర్ కోడ్‌ల కారణంగా అదనపు నష్టాలను ఎదుర్కోబోతున్నారు. అందుకే ఈ కొత్త చట్టాలను జెండర్ దృక్కోణం నుండి విశ్లేషించి మహిళా రైతులపై వాటి ప్రభావాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న రైతాంగ ఉద్యమం మహిళా రైతులు ఎదుర్కొంటున్న స్థూల సమస్యలను సంఘటితపరచుకుని వాటి పరిష్కారం దిశగా పనిచేయటానికి ఒక మంచి నేపధ్యాన్ని చారిత్రక అవకాశాన్ని కల్పిస్తుంది.
ఈ ఉద్యమంలో భాగంగా వివిధ వర్గాల మహిళా రైతులతో ప్రత్యేకించి మహిళా కిసాన్ పార్లమెంటును నిర్వహించి వాటిలో మహిళా రైతుల సాక్ష్యాలను వినిపించే విధంగా చేయటం, పబ్లిక్ హియరింగ్‌లు నిర్వహించటం వల్ల వాళ్ళ ప్రత్యేక సమస్యలను, డిమాండ్లను అర్థం చేసుకోవటానికి ఉపయోగంగా ఉంటుంది. ఈ పార్లమెంటు, పబ్లిక్ హియరింగ్‌ల ద్వారా బయటికి వచ్చే అంశాలు క్షేత్రస్థాయిలో రాజకీయ కార్యాచరణ చేపట్టటానికి, సరైన విధానాలను రూపొందించటానికి ఆధారం ఏర్పడాలి.
‘రైతు సంఘాలు మహిళా రైతులను ఒక రాజకీయ వర్గంగా పరిగణించి వారి సమస్యలను చర్చించాలి’’
దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలు మహిళా రైతులను వారి ప్రత్యేక సమస్యలపై సమీకరించి, మహిళా విభాగాలను నిర్మించాల్సిన అవసరాన్ని ప్రస్తుత రైతాంగ ఉద్యమం ప్రముఖంగా చాటి చెబుతోంది. ఇందుకోసం రైతు సంఘాలకు మహిళా రైతుల పట్ల ఉన్న అవగాహనలో ప్రాథమిక మార్పు రావాలి. వ్యవసాయంలో వారి ముఖ్య పాత్రను గుర్తిస్తూ వారి భాష (రైతన్న వంటి మాటలు) మారాలి, క్షేత్ర స్థాయిలో వారిని సమీకరించే వ్యూహాలను పునరాలోచించాలి.
పంజాబ్‌లో ఉన్న కొన్ని రైతు సంఘాలు తప్ప దేశంలోని అత్యధిక రైతు సంఘాలలో ఎక్కువగా మగ రైతులే సభ్యులుగా ఉన్నారు, పురుషులే నాయకత్వంలో ఉన్నారు. అందుకే వారు మహిళా రైతులను సమావేశాలకు కేవలం ప్రేక్షకులుగా మాత్రమే సమీకరిస్తారు. పార్టీలకు అనుబంధంగా ఉన్న, లేదా స్వతంత్ర రైతు సంఘాలు ఇప్పటికీ మహిళలను రైతులుగా గుర్తించటం లేదు, మహిళా రైతుల సమస్యలపై పనిచేయటం లేదు.
వ్యవసాయ రంగంలో మహిళలకు కీలకమైన అతి పెద్ద పాత్ర ఉందని జాతీయ స్థాయిలో జరిగిన సర్వేలు నిరూపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో 73% మహిళా శ్రామికులు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. వారిలో 60% మంది పశు పెంపకంలో ఉండగా 32 శాతం పంటల సాగులో ఉన్నారు. అయితే ఈ గణాంకాలు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో మహిళల పని స్వభావాన్ని, వైవిధ్యాన్నీ, తీవ్రతను వ్యక్తం చేయటంలో విఫలమవుతాయి. గణాంకాలు మహిళల వేతన శ్రమను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాయి. వేతనాలు లేని అనేక రకాల శ్రమను వదిలివేస్తాయి. దానికి తోడు మహిళలకు భూమిపై హక్కులు లేకపోవడం కారణంగా, వారికి రైతులుగా గుర్తింపు లేకపోవటానికి, వ్యవసాయంలో వారి పని అదృశ్యంగా ఉండిపోవటానికీ దారి తీస్తున్నది. మొత్తం సాగు భూమిలో 12.79% భూమి విస్తీర్ణంలో గల 13% కామతాలను మాత్రమే మహిళలు సాగు చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. భూ సంస్కరణలు అనే అంశం అసలు చర్చలో కూడా లేకుండా పోయిన సందర్భంలో, వ్యవసాయంపైనా, రోజు కూలీపైన ఆధారపడ్డ పెద్ద సంఖ్యలో ఉన్న భూమిలేని అణగారిన వర్గాల మహిళలకు భూమి దక్కటం అనేది ఒక సామాజిక న్యాయం, స్వాభిమానంతో కూడిన విషయంగా ఉంది.
ఈ అనుభవపూర్వక గణాంకాల ఆధారంగా వివిధ రైతు సంఘాలు, వివిధ వర్గాల మహిళా రైతులను కేవలం నిరసనలలో, సమావేశాలలో నిశ్శబ్ద భాగస్వాములుగా, ప్రేక్షకులుగా మాత్రమే సమీకరించటం కాక వారి సమస్యలను విస్తృత రైతాంగ నిరసనలలో భాగం చేసి వారిని క్రియాశీల పౌరులుగా తమ గొంతును వినిపించే విధంగా కొత్త ఆలోచనతో నిరంతరం పనిచేయాలి. మహిళా రైతులలో ప్రత్యేక వర్గ, కుల సెక్షన్లు సమస్యలను గురించి మాట్లాడుతూ జెండర్ స్పృహ కలిగిన విస్తృత ఎజెండాను రూపొందించుకోవటం నిజంగా ఒక సవాలు. అయితే అది దేశంలో రైతు సంఘాలు ఇప్పటివరకూ పట్టించుకోకుండా అసంపూర్ణంగా మిగిలివున్న అజెండా కూడా.
రైతు సంఘాలు తమ సంఘాలలో మహిళా రైతు నాయకులు తమ ఎజెండాలను ముందుకు తేవడానికి అవకాశాలు కల్పించి వారికి సహకారం అందించాలి. దానిని ఒక నిరంతర ప్రక్రియగా చూడాలి. రైతు సంఘాలు మహిళా రైతులలో ఒక రాజకీయ అస్తిత్వ చైతన్యం కలిగించేలా పనిచేయాలి.
ఇతర పోరాటాలతో ఐక్య సంఘటనల నిర్మాణం
దేశంలో ప్రస్తుతం సంయుక్త కిసాన్ మోర్చా అనే విశాల ఐక్య సంఘటన నాయకత్వంలో సాగుతున్న రైతాంగ
ఉద్యమం దీర్ఘకాలం తర్వాత నిరంకుశ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా భారతదేశంలో జరుగుతున్న అతి పెద్ద ప్రజాస్వామిక
ఉద్యమం. వివిధ సైద్ధాంతిక ధోరణులు గల అనేక రైతు సంఘాలు, సంస్థల మధ్య సంఫీుభావాలు నెలకొల్పటం చాలా సవాళ్ళతో కూడుకున్నదే. అందులోనూ కులం, వర్గం, జెండర్ సమస్యల పెనుగులాట కూడా పెద్ద సమస్యే.
అయినప్పటికీ ప్రస్తుత రైతాంగ ఉద్యమం సాధించిన అనేక విజయాలను విస్తృతపరుచుకుని నిలబెట్టుకోవటం, క్షేత్రస్థాయిలో దీర్ఘకాలికంగా రాజకీయపరమైన కర్తవ్యాన్ని కొనసాగించటం చాలా ముఖ్యం. స్థానికంగా చిన్న స్థాయిలలో జరిగే పోరాటాలతో ఐక్య సంఘటనలు, సంఫీుభావాలు నిర్మించుకుంటూ పునాదిని విస్తృత పరచుకున్నప్పుడే అది సాధ్యపడుతుంది. మహిళలు వనరులపై హక్కుల కోసం, నిర్వాసితనికి వ్యతిరేకంగా, ఉమ్మడి వనరులను తిరిగి సాధించుకోవడానికి స్థానికంగా పోరాటాలలో క్రియాశీలంగా పాల్గొంటూ వాటికి నాయకత్వం వహిస్తున్నారు. సమిష్టి వ్యవసాయం ద్వారా ప్రకృతి అనుకూల వ్యవసాయాన్ని సాగిస్తూ, విత్తన బ్యాంకులను ఏర్పాటు చేసుకుని విత్తనాల మార్పిడి, సమిష్టి మార్కెటింగ్ వంటి ప్రయత్నాల ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలను ప్రదర్శిస్తున్నారు. మహిళా రైతుల ఈ అనుభవాలు విషరసాయనాల పైనా, అస్థిర పద్దతులలో సాగుతున్న ప్రస్తుత వ్యవసాయ నమూనాను పునరాలోచించటానికి ప్రాతిపదికగా నిలుస్తాయి.