తూత్తుకుడి ఉప్పుమడుల రాణి- అపర్ణ కార్తికేయన్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

(గత సంచిక తరువాయి…)
(అనువాదం: ఆపర్ణ తోట)
కొంతమంది యువకులు ఇక్కడ రొయ్యల యూనిట్లలోనూ, పూల ఫ్యాక్టరీల్లోనూ పనిచేస్తారు. కానీ ఉప్పు మడులలో పనిచేసేవారు 30 ఏళ్ళ పైబడ్డవారే. వీరు దశాబ్దాల తరబడి ఇక్కడ పనిచేశారు. కుమార్‌ కోపమంతా వేతనంతోనే. ‘‘ఇక్కడ ప్యాకర్లు కాంట్రాక్టు పనివారి

వంటివారే. మాకు బోనస్‌ కూడా రాదు. ఒకామెకు ఒక కిలో ఉప్పును చెరో 25 ప్యాకెట్లలో వేసినందుకు 1.70 రూపాయలు ఇచ్చారు (ఒక పాకెట్‌కు 7 పైసలకన్నా తక్కువ). ఆ తరువాత ఇంకో వ్యక్తికి, సాధారణంగా వీరు మగవారే అయ్యుంటారు, ఒక సంచిలో ఈ 25 ప్యాకెట్లను సర్దడానికి, చేత్తో కుట్టడానికి, ఒక వరుసలో పెట్టడానికి 2 రూపాయలు ఇస్తారు. ఆ సంచులు నిలువునా ఎంత ఎత్తులో పేరిస్తే, ఆ పని చేస్తున్న వారి శరీరం మీద అంత భారం ఉంటుంది. కానీ వేతనం మాత్రం 2 రూపాయలు మాత్రమే ఉంటుంది.’’
డాక్టర్‌ అమలోర్పవనాథన్‌ జోసెఫ్‌, వాస్కులర్‌ సర్జన్‌ మరియు తమిళనాడు రాష్ట్ర ప్రణాళికా సంఘం సభ్యుడు, వీరి గురించి మాట్లాడుతూ, ‘‘వైద్యపరంగా వారు ఏ పాదరక్షలు తయారుచేసుకుని వాడుతున్నారో, అవి లీక్‌ ప్రూఫ్‌ లేదా టాక్సిన్‌ ప్రూఫ్‌ కావు. వీటితో ఒకటి, రెండు రోజులు పనిచేస్తే ఫర్వాలేదు. కానీ ఇది వారి జీవితకాల వృత్తి అయితే మాత్రం, వారికి శాస్త్రీయంగా రూపొందించిన బూట్లు అవసరం. అవి తరచుగా మారుస్తుండాలి. ఇలా చేయకపోతే వారి పాదాల ఆరోగ్యానికి ఎటువంటి హామీ ఉండదు’’ అన్నారు.
ఉప్పు నుండి ప్రతిబింబించే తెల్లటి కాంతితో పాటు అలాంటి వాతావరణంలో గాగుల్స్‌ లేకుండా పని చేయడం వలన కళ్ళల్లో చాలా చికాకులు ఉంటాయని ఆయన చెబుతున్నారు. ఉప్పు మడులలో, క్రమం తప్పకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, కార్మికులందరి రక్తపోటును తరచుగా తనిఖీ చేయాలని ఆయన సలహా ఇచ్చారు. ‘‘130/90 కంటే ఎక్కువ రీడిరగ్‌ ఉన్నవారు ఎవరైనా ఉంటే, నేను వారిని ఉప్పుమడిలో పని చేయడానికి అనుమతించను’’ అని ఆయన అన్నారు. కార్మికులు ఆ వాతావరణంలో శ్రమిస్తున్నప్పుడు కొంత మొత్తంలో ఉప్పును పీల్చుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ప్రతిరోజూ ఆ ఉప్పు లోడ్‌లను మోసుకెళ్ళడం వలన ఐదారు శారీరక శ్రమతో కూడిన పనులు ఉంటాయని, అక్కడ శక్తి అసాధారణంగా ఖర్చవుతుందని ఆయన చెప్పారు.
ఈ కార్మికులు నాలుగైదు దశాబ్దాలుగా ఈ పనిలో ఉండి ఉండవచ్చు. కానీ ఎటువంటి సామాజిక భద్రత, వేతనంతో కూడిన సెలవులు, శిశు సంరక్షణ లేదా గర్భిణీ ప్రయోజనాలు లేకుండా వారు ‘కూలీలు’ (తక్కువ వేతన కార్మికులు) కంటే మెరుగైనవారు కాదని, ఉప్పు మడి కార్మికులు చెబుతున్నారు.
… … …
‘‘ఉప్పుకు 15,000 పైనే ఉపయోగాలున్నాయి’’` ఎం.కృష్ణమూర్తి, జిల్లా సమన్వయకర్త, తూత్తుకుడి, అసంఘటిత కార్మికుల సమాఖ్య
అమెరికా, చైనా తరువాత భారతదేశమే అతి పెద్ద ఉప్పు తయారీదారని చెప్పారు కృష్ణమూర్తి. ఉప్పు లేకుండా బ్రతకడం ఇంచుమించుగా అసాధ్యం, అయినా కానీ ఈ పనివారి జీవితాలు వారి పంటంత ఉప్పగా ఉంటాయని ఆయన అన్నారు.
కృష్ణమూర్తి అంచనా ప్రకారం తూత్తుకుడి జిల్లాలో 50 వేల మంది ఉప్పు కార్మికులు ఉన్నారు. అంటే 7.48 లక్షల మంది కార్మికులున్న జిల్లాలో ప్రతి 15 మందిలో ఒకరు ఈ రంగంలో ఉన్నారు. ఫిబ్రవరి`సెప్టెంబర్‌ మధ్య దాదాపు 6`7 నెలల కాలంలో మాత్రమే వీరికి పని ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం వారి సంఖ్య చాలా తక్కువగా 21,528 వరకు ఉంది. ఇది తమిళనాడు రాష్ట్రం మొత్తంలో వారి జనాభా. కానీ కృష్ణమూర్తి అసంఘటిత కార్మికుల సమాఖ్య ఈ విషయంలోనే అక్కరకు వస్తుంది. వారు అధికారిక గణన నుండి మినహాయించబడిన కార్మికులను భారీ సంఖ్యలో నమోదు చేశారు.
ఇక్కడ పనిచేసే ప్రతి ఉప్పు కార్మికుడు ఉప్పు గళ్ళను గీరడానికి కానీ, లేదంటే ఉప్పును ఎత్తి మోసుకురావడానికి కానీ, రోజుకు ఇంచుమించుగా 5 నుండి 7 టన్నుల ఉప్పుని ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి మారుస్తారు. ఈ ఉప్పు టన్నుకు 1,600 నుండి 8,000 రూపాయల ఖరీదు చేస్తుంది. కానీ ఒక్క అకాల వర్షం ఈ పనిని వారం, పది రోజుల పాటు పాడు చేస్తుంది.
కానీ వారిని 1991 తర్వాత వచ్చిన సరళీకరణ పాలసీలు ఎక్కువగా దెబ్బతీశాయి. ఇవి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువయ్యాయి. పెద్ద, ప్రైవేటు సంస్థలను మార్కెట్లోకి అనుమతించారు. తరాల తరబడి ‘‘దళితులు, ఆడవారే ఇక్కడి కఠినమైన నేల నుండి ఉప్పు పంటను తెచ్చారు. ఇందులో 70`80 శాతం బలహీనవర్గాల నుండి వచ్చినవారే. ఈ ఉప్పు మడులను వారికే ఎందుకు లీజుకు ఇవ్వడం లేదు? వారు ఈ నేల కోసం వేసే వేలం పాటలో పెద్ద కార్పొరేట్‌లతో ఎలా నెగ్గగలరు?’’
కార్పొరేషన్లు ఇటువంటి వాటిలోకి అడుగుపెట్టాక, వీటి పరిమాణం బాగా పెరిగిపోయింది. పదుల ఎకరాల నుండి వేల ఎకరాల వరకు… ఇలా పెరిగాక, ఖచ్చితంగా పనులన్నీ మెషిన్లతో చేయిస్తారని కృష్ణమూర్తి నమ్ముతున్నారు. మరి 5,000 మంది ఉప్పు కార్మికుల సంగతేంటి? అని అడుగుతారు.
ప్రతి ఏడాది అక్టోబర్‌ 15 తర్వాత ఇక పని ఉండదు. అప్పుడే ఈశాన్య ఋతుపవనాలు మొదలవుతాయి. ఇవి జనవరి 15 దాకా ఉంటాయి. ఈ మూడు నెలలు అతి కష్టంగా సాగుతాయి. కుటుంబాలన్నీ అప్పులు చేసి ఇబ్బంది పడుతూ నడుస్తాయి. ఉప్పు మడులలో పనిచేసే 57 ఏళ్ళ ఎం.వేలుస్వామి ఉప్పు తయారీలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడుతూ, తన తల్లిదండ్రుల కాలంలో చిన్న చిన్న ఉత్పత్తిదారులు ఉప్పును తయారుచేసి అమ్మేవారని చెప్పాడు.
రెండు పాలసీ మార్పులు వీటన్నింటినీ నిలిపివేశాయి. 2011లో కేంద్ర ప్రభుత్వం, మనుషులు తినే ఉప్పులో అయోడిన్‌ కలపాలని ప్రకటించింది. కొంతకాలం తరువాత ఉప్పు మడులన్నింటికీ లీజు ఒప్పందం మార్చింది. ప్రభుత్వానికి ఆ శక్తి ఉంది, ఎందుకంటే ఉప్పు మన రాజ్యాంగ యూనియన్‌ జాబితాలో ఉంది.
ఈ కార్మికులు నాలుగైదు దశాబ్దాలుగా ఈ పనిలో ఉండి ఉండవచ్చు. కానీ, వారికి ఎటువంటి సామాజిక భద్రత, వేతనంతో కూడిన సెలవులు, శిశు సంరక్షణ లేదా గర్భిణీ ప్రయోజనాలు లేవు.
2011 భారత ప్రభుత్వ నిబంధన ప్రకారం ‘అయోడైజ్డ్‌ చేయబడితే తప్ప, సాధారణ ఉప్పును నేరుగా మానవ వినియోగానికి విక్రయించడం గాని, ఇవ్వడం గాని, బయట గాని, అతని ప్రాంగణంలో గాని విక్రయించకూడదు.’ దీని అర్థం సాధారణ ఉప్పు ఫ్యాక్టరీ ఉత్పత్తి మాత్రమే. (రాతి ఉప్పు, నల్ల ఉప్పు మరియు హిమాలయన్‌ పింక్‌ వంటి కొన్ని వర్గాలు మినహాయించబడ్డాయి) ఈ సాంప్రదాయ ఉప్పును పండిరచేవారు తమ ఏజెన్సీని కోల్పోయాయని కూడా దీని అర్థం. దీన్ని చట్టబద్ధంగా సవాలు చేసినప్పుడు సుప్రీంకోర్టు ఈ నిబంధనను తీవ్రంగా విమర్శించింది. కానీ ఇప్పుడు కూడా ఆ నిషేధం సమర్ధవంతంగా అమల్లో ఉంది. ఆహారం కోసం ఉపయోగించే సాధారణ ఉప్పును అయోడైజ్డ్‌ చేయకపోతే విక్రయించబడదు.
ఇక రెండో మార్పు అక్టోబర్‌ 2013లో అయింది. కేంద్ర నోటిఫికేషన్‌లో ఇతర విషయాలతో పాటు ‘టెండర్‌ను ఆహ్వానించడం ద్వారా ఉప్పు తయారీకి కేంద్ర ప్రభుత్వ భూమి లీజుకు ఇవ్వబడుతుంది’ అని ఉంది. ఇంకా, ప్రస్తుతం ఉన్న లీజు ఏదీ పునరుద్ధరించబడదు. తాజా టెండర్లు పిలువబడతాయి. లీజు గడువు ముగిసే చోట, ప్రస్తుత లీజుదారు ‘తాజాగా ఆశించే వారితో కలిసి పాల్గొనవచ్చు’ అని
ఉంది. ఇది పెద్ద నిర్మాతలకు మాత్రమే అనుకూలమని కృష్ణమూర్తి అన్నారు.
నాలుగు దశాబ్దాల క్రితం రaాన్సీ తల్లిదండ్రులు సబ్‌ లీజుకు ఆ భూమిని తీసుకుని, గోతిని తవ్వి గిలక సాయంతో నీటిని తోడి, తాటాకుల బుట్టను బక్కెట్టుగా వాడి, వారికున్న 10 చిన్న మడులలో వేసేవారు. ప్రతిరోజూ ఆమె తల్లి 40 కిలోల ఉప్పును నెత్తిమీద పెట్టుకుని (తాటాకుల బుట్టలోనే) ఊరిలో అమ్మేది. ‘‘ఐస్‌ కంపెనీలు ఆమె దగ్గర ఉన్న ఉప్పుని 25`30 రూపాయలకు కొనేసేవారు’’. వాళ్ళమ్మ వెళ్ళలేకపోయినప్పుడు, ఆమె రaాన్సీకి చిన్న బుట్టను ఇచ్చి పంపేది. రaాన్సీకి, తాను 10 పైసలకు కూడా ఉప్పు అమ్మినట్లు గుర్తుంది. మా మడులు ఉన్నచోట ఇప్పుడు భవంతులు వెలిశాయి. వాటిపైన ఇళ్ళున్నాయి అంది రaాన్సీ. భూమి మా చేతుల్లోంచి ఎలా వెళ్ళిపోయిందో మాకు తెలీదు అని ఆమె నీరసంగా అంది. ఆమె గొంతులో పశ్చాత్తాపం వినిపిస్తోంది. చుట్టూ ఉప్పు నిండిన గాలి, బరువుగా ఉంది.
తమ జీవితం ఎప్పుడూ కష్టంగానే గడిచిందని అంటారు ఉప్పు కార్మికులు. దశాబ్దాల తరబడి తపియోకా, చిరుధాన్యాలు (అరుదుగా బియ్యం తింటారు) మాత్రమే వారి ఆహారం. పక్కనే కొద్దిగా చేప కూర ఉంటుంది. ఇప్పుడందరూ తినే ఇడ్లీ, వారు ఏడాదికొకసారి వచ్చే దీపావళి పండుగకు మాత్రమే తింటారు. చిన్నప్పుడు, తర్వాత రోజు పండగ కాబట్టి ఇడ్లీలు పెడతారన్న ఉత్సాహంతో రాత్రంతా తనకు నిద్రపట్టేది కాదని రaాన్సీ చెప్పింది.
దీపావళి, సంక్రాంతి, ఈ రెండు పెద్ద పండుగలకు మాత్రమే వారు కొత్త బట్టలు కొనుక్కునేవారు. అప్పటిదాకా, వాళ్ళు పాత, చిరిగిపోయిన బట్టలు వేసుకునేవారు. ముఖ్యంగా అబ్బాయిల పాంట్లలో 16 కన్నాలు ఉంటాయి. ప్రతి కన్నమూ సూది, దారంతో కుట్టి ఉండేవని చెప్పింది రaాన్సీ. కాళ్ళకు తాటాకులతో చేసిన చెప్పులు వేసుకునేవారు. అవి వాళ్ళ తల్లి లేక తండ్రి చేతులతో చేసినవి. ఒక నారపోగుతో అవి కదలకుండా కలిపి కుట్టేవారు. ఇది సరపడా రక్షణనిస్తుంది. ఎందుకంటే అప్పటి నీటిలో ఇప్పుడు ఉన్నంత ఉప్పు లేదు. ఉప్పు పరిశ్రమగా మారినప్పుడు, ఇంట్లో వాడే నీళ్ళు మొత్తం వాడుకలో అతి చిన్న భాగం మాత్రమే. జీవితం ఎప్పుడూ కఠినంగానే ఉందంటారు ఉప్పు కార్మికులు. వారికి పని మధ్యలో నీడలేని పని ప్రదేశంలో టీ తాగడానికి, అతి కొద్ది విరామమే దొరుకుతుంది.
… … …
‘‘నా పేరు రాయగలను, బస్సు నంబర్లు గుర్తుపెట్టుకోగలను, ఎంజీఆర్‌ పాటలు కూడా పాడగలను’’ ` ఎస్‌.రాణి, ఉప్పు మాది కార్మికురాలు, నాయకురాలు
పనైపోయాక రాణి సాయంత్రం మమ్మల్ని తన ఇంటికి ఆహ్వానించింది. ఒక చిన్నగదిలో ఒక సోఫా, ఒక సైకిల్‌, తాడు మీద వేలాడుతున్న కొన్ని బట్టలు ఉన్నాయి. వేడి టీ తాగుతూ ఆమె తనకు 29 ఏళ్ళ వయసులో, రిజిస్ట్రార్‌ ఆఫీసులో పెళ్ళి జరిగిందని చెప్పింది. ఇది మామూలుగా గ్రామీణ యువతుల వయసుతో పోలిస్తే ఆలస్యంగా జరిగినట్లే. ఆమె కుటుంబంలో పేదరికమే బహుశా ఆ ఆలస్యానికి పెద్ద కారణం కావచ్చు. రాణికి ముగ్గురు కుమార్తెలు`తంగమ్మాళ్‌, సంగీత, కమల, ఒక కొడుకు కుమార్‌ ఆమెతోనే ఉంటాడు.
ఆమెకు పెళ్ళయినా గాని మా వద్ద వేడుకలు జరిపించడానికి డబ్బుల్లేవని అంది. ఆ తర్వాత ఆమె మాకు తమ ఫోటో ఆల్బమ్‌లు చూపించింది. పిల్లలు రజస్వల అయినప్పుడు వేడుకలు, ఇంకెవరిదో పెళ్ళి, కుటుంబమంతా మంచి బట్టలు వేసుకుని ఉండడం, ఆమె కొడుకు కుమార్‌ పాడడం, డాన్స్‌ చేయడం ఇవన్నీ వాళ్ళు ఉప్పు మోయడం వలన వచ్చిన డబ్బుతో ఖర్చు పెట్టినవి.
అలా మేము నవ్వుతూ మాట్లాడుతుంటే రాణి ఒక చేత్తో చేసిన పచ్చని వైర్‌ బుట్టను అల్లడం పూర్తిచేసింది. చివర్లను బిగదీసి బుట్టను పట్టుకోడానికి హ్యాండిల్స్‌ కూడా చేసింది. అసలైతే కుమార్‌ యూట్యూబ్‌లో వీడియోలో చూసి జామకాయ ఆకారంలో అల్లడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులు అతనికి ఇవన్నీ చేయడానికి సమయం దొరకదు. ఇంకాస్త సంపాదన వస్తుందని అతను రెండో షిఫ్ట్‌కి కూడా ఉప్పు పనికి వెళ్తాడు. ‘‘ఆడవారికి ఇంట్లో ఎప్పుడూ రెండో షిఫ్ట్‌ ఉంటుంది. వాళ్ళకు అస్సలు విశ్రాంతి ఉండదు’’ అన్నాడు కుమార్‌.
రాణికైతే అసలు ఎప్పుడూ విశ్రాంతి దొరకలేదు. ఆమెకి మూడేళ్ళు ఉండగానే తన తల్లి, అక్కతో పాటు సర్కస్‌లో చేసేది. ‘‘దాన్ని టుటికోరన్‌ సోలమన్‌ సర్కస్‌ అనేవారు. మా అమ్మ హై వీల్‌, ఒక చక్రం మాత్రమే ఉన్న సైకిల్‌ నడపడంలో ఛాంపియన్‌. రాణి బార్‌లో నేర్పరి, ఆమె అక్క గారడీ చేసేది. మా అక్క టైట్‌ రోప్‌పై కూడా నడిచేది. నేను వెనక్కి వంగి కప్పులను నోటితో అందుకునేదాన్ని’’. సర్కస్‌ ట్రూప్‌తో ఆమె మధురై, మనప్పారై, నాగర్‌ కోయిల్‌, పొల్లాచి తిరిగింది.
ఆమెకి ఎనిమిదేళ్ళొచ్చినప్పుడు సర్కస్‌ మళ్ళీ టుటికోరిన్‌కి వచ్చింది. రాణిని ఉప్పు మడులలో పనికి పంపించారు. అప్పటినుండి, ఆ ఉప్పు మడులే రాణి ప్రపంచం అయ్యాయి. అదే రాణి చివరిసారి బడికి వెళ్ళడం. ‘‘నేను మూడో తరగతి వరకే చదివాను. నేను నా పేరు రాయగలను, బస్సు నెంబర్‌ చదవగలను, ఎంజీఆర్‌ పాటలు పాడగలను’’ అంది. ఆ రోజు పొద్దున్న, రేడియోలో ఎంజీఆర్‌ పాటలు వస్తుంటే గొంతు కలిపింది ఆమె.
ఆమె మంచి నర్తకి కూడా ఆటపట్టిస్తూ అన్నారు ఆమె సహోద్యోగులు. పార్లమెంట్‌ సభ్యురాలైన కనిమొళి కరుణానిధి అధ్యక్షత వహించిన వేడుకలో పాల్గొందని, ఈ మధ్యే ఆమె చేసిన కరగాట్టం ప్రదర్శన గురించి వారు చెబుతుంటే రాణి సిగ్గుపడిరది. కుళు, మహిళల స్వయం సహాయక బృందానికి, అలాగే ఉప్పు కార్మికుల నాయకురాలిగా రాణి కూడా వేదిక మీద మాట్లాడటం నేర్చుకుంటోంది. అలానే ఆమె ప్రభుత్వ సమావేశాల్లో తమ సంఘం తరపున ప్రాతినిధ్యం వహించడానికి వెళ్తుంది. తన సహోద్యోగులు ఆమె గురించి చెబుతూ ‘‘ఈమె ఉప్పు మడుల రాణి’’ అంటే ఆమె నవ్వుతుంది.
2017లో కృష్ణమూర్తి ఏర్పాటు చేసిన అటువంటి ఒక యాత్రలో ఆమె చెన్నైకి వెళ్ళింది. ‘‘మేము చాలామందిమి మూడు రోజుల కోసం వెళ్ళాము. చాలా సరదాగా గడిచింది. మేము ఒక హోటల్‌ గదిలో ఉన్నాం. ఎంజీఆర్‌, అన్నాల సమాధులను చూశాం. నూడుల్స్‌, చికెన్‌, ఇడ్లీ, పొంగల్‌ తిన్నాము. మేము మెరీనా బీచ్‌కి వెళ్ళేసరికి చాలా చీకటైపోయింది, కానీ అక్కడ చాలా బావుంది’’ అని చెప్పింది రాణి.
ఇంట్లో ఆమె భోజనం చాలా సాధారణంగా ఉంటుంది. ఆమె అన్నం, కొళంబు (కూర), మామూలుగా చేప, ఉల్లిపాయ లేదా చిక్కుళ్ళతో చేస్తుంది. పక్కన నంజుకోవడానికి కరువాడు (ఎండు చేప), ఒక కూరగాయ, క్యాబేజీ కానీ, బీట్‌రూట్‌ కానీ ఉంటుంది. తమ దగ్గర డబ్బులు లేకపోతే తాము కాఫీ డికాషన్‌ మాత్రమే తాగుతామని ఆమె చెప్పింది. ఆమె దానికి ఆరోపించదు. క్రిస్టియన్‌ అయిన ఆమె చర్చిలకు వెళ్ళి అక్కడ కీర్తనలు పాడుతుంది. ఆమె భర్త శేషు చనిపోయాక, ఆమె పిల్లలు, ముఖ్యంగా తన కొడుకు తనను బాగా చూసుకుంటున్నాడని చెప్పింది. ‘‘ఒన్నుమ్‌ కురై సొల్లా ముడియాడు’’. నేను దేని గురించి ఫిర్యాదు చేయలేను, నాకు దేవుడు మంచి పిల్లలను ఇచ్చాడు అని చెప్తుంది ఆమె.
ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు కాన్పు రోజు వరకు పని చేస్తూనే ఉంది. ఆ ఉప్పు మడుల నుంచే నేరుగా ఆస్పత్రికి వెళ్ళింది. నా కడుపు ఇక్కడ వరకు ఉండేది అందామె తన తొడను తడుతూ. కాన్పు అయిన 13 రోజులకు ఆమె ఉప్పు మడులకు వచ్చేసేది. బిడ్డ ఆకలేస్తే ఏడవకుండా ఉండడానికి ఆమె తపియొక పిండితో పలుచని గంజి వంటిది చేసేది. రెండు చెంచాల ఈ గంజిని ఒక గుడ్డలో కట్టి, నీళ్ళలో ముంచి, వేడిచేసి, ఒక గ్రైప్‌ వాటర్‌ బాటిల్‌లో రబ్బర్‌ పీకతో ఇస్తే, ఆమె మడి నుండి వెనక్కు వచ్చి ఆ బిడ్డకు పాలు ఇచ్చేలోపల, ఎవరో ఒకరు ఆ బిడ్డకు ఇది తాగించేవారు.
నెలసరులు కూడా చాలా ఇబ్బంది అయ్యేది. తొడలు కోసుకుపోయి, మంట పుట్టేవి. సాయంత్రం వేడి నీళ్ళతో స్నానం చేశాక, నా తొడలకు కొబ్బరినూనె రాసేదాన్ని, తరువాత రోజు పనికి వెళ్ళడానికి వీలవ్వాలని అని చెప్పింది.
ఏళ్ళ తరబడి ఉన్న అనుభవంతో రాణి ఉప్పుని చూసి అది ఆహారానికి సంబంధించినదో కాదో చెప్పేయగలదు. మంచి రాతి ఉప్పు ఒకే పరిమాణం ఉన్న రాళ్ళతో ఉంటుంది. అతుక్కోదు, నీళ్ళగా మారదు. ‘‘అది కనుక అతుక్కునేలా ఉంటే, అది వంటకు బావుండదని ఆమె చెప్పింది. బామ్‌ థర్మామీటర్లు, విస్తృతమైన నీటిపారుదల మార్గాలతో శాస్త్రీయంగా తయారు చేయబడిన ఉప్పు ఒకే లక్ష్యంతో నడపబడుతుంది`అధిక మొత్తంలో ఉప్పును పండిరచడం. ఆ ఉద్దేశ్యం నెరవేరవచ్చు కానీ ఆ ఉప్పులో ఎక్కువ భాగం పారిశ్రామిక అవసరాలకు సరిపోతుందని ఆమె చెప్పింది.
తను గర్భం దాల్చిన ప్రతిసారీ కాన్పు రోజు వరకు పనికి వెళ్ళి అక్కడ మడినుంచే ఆస్పత్రికి నడుచుకుంటూ వెళ్ళింది.
… … …
ఉప్పు మడులను వ్యవసాయంలాగా చూడాలి, పరిశ్రమలాగా కాదు ` జి.గ్రహదురై, అధ్యక్షుడు, తూత్తుకుడి, చిన్నతరహా ఉప్పు తయారీదారుల సంఘం
తూత్తుకుడిలోని ఉప్పు మడుల నుండి పెద్దగా దూరం లేని న్యూకాలనీలోని తన ఎయిర్‌ కండిషన్డ్‌ ఆఫీసులో జి.గ్రహదురై నాకు జిల్లా ఉప్పు పరిశ్రమపై పెద్ద చిత్రాన్ని అందించారు. అతని సంఘంలో దాదాపు 175 మంది సభ్యులు ఉన్నారు. అందులో ఒక్కొక్కరికి పదెకరాల భూమి ఉంది. జిల్లా వ్యాప్తంగా 25 వేల ఎకరాల్లో ఏటా 25 లక్షల టన్నుల ఉప్పు ఉత్పత్తి అవుతుంది.
సగటున, ప్రతి ఎకరం సంవత్సరానికి 100 టన్నులు చేస్తుంది. బాగా వర్షాలు కురిసిన సంవత్సరంలో అది 60కి పడిపోతుంది. ఉప్పు నేల ఉప్పు నీటితో పాటు నీటిని పంప్‌ చేయడానికి మనకు విద్యుత్తు అవసరం. అలాగే ఉప్పును తయారు చేయడానికి కార్మికులు అవసరం అని గ్రహదురై చెప్పారు. కార్మికుల శ్రమ వేతనం గురించి, ఇది పైకి, పైపైకి అలా వెళ్తోంది. అంతేకాక, గతంలో ఉన్న ఎనిమిది పని గంటల నుండి ఇప్పుడు కేవలం నాలుగు పని గంటలకు తగ్గిపోతోంది. వారు ఉదయం 5 గంటలకు వస్తారు, ఉదయం 9 గంటలకు వెళ్ళిపోతారు. యజమానులు అక్కడికి వెళ్ళినప్పటికీ, అక్కడ కూలీలు కనబడరు అన్నారు. పని గంటల విషయంలో ఆయన చెప్పిన లెక్క, కార్మికులు చెప్పిన లెక్క మధ్య చాలా తేడా ఉంది.
ఉప్పు మడి కార్మికుల పని, పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయని గ్రహదురై అంగీకరించారు. నీరు మరియు మరుగుదొడ్లు అందించాలి, కానీ అది రవాణాపరంగా అంత సులభం కాదు. ఎందుకంటే మడులు 100 కిలోమీటర్ల పొడవునా ఉన్నాయి అన్నారు. తూత్తుకుడి ఉప్పు మార్కెట్‌ తగ్గిపోతోందని గ్రహదురై చెప్పారు. గతంలో ఇది ఎక్కడైనా ఉత్తమమైన తినదగిన ఉప్పుగా పిలవబడేదని, అయితే ఇప్పుడు ఇది నాలుగు దక్షిణాది రాష్ట్రాలకు మాత్రమే వెళ్తోందని, అలాగే సింగపూర్‌, మలేషియాలకు కొద్దిగా ఎగుమతి చేయబడుతోందని ఆయన చెప్పారు. ఇది చాలా వరకు పరిశ్రమలలో ఉపయోగించబడుతోందన్నారు. వర్షాకాలం తర్వాత మడులను తొలగించిన తర్వాత బయటపడే జిప్సం నుండి కొంత వరకు ఆదాయం వస్తుందని, కానీ ఉప్పు ఉత్పత్తి కూడా వాతావరణ మార్పుల వలన ఏప్రిల్‌, మే నెలల్లో వచ్చే అకాల వర్షాలతో ఎక్కవగా ప్రభావితమవుతోందని చెప్పారు.
గుజరాత్‌ నుండి కూడా గట్టి పోటీ ఉందని గ్రహదురై చెప్పారు. అక్కడి వాతావరణం తూత్తుకుడి కంటే వేడిగా, పొడిగా ఉంటుందని, ఇప్పుడు దేశ ఉత్పత్తిలో 76 శాతం ఆ పశ్చిమ రాష్ట్రం నుండే వస్తుందని చెప్పారు. వారి ఉప్పు నిల్వలు చాలా పెద్దవని, తయారీ కూడా పాక్షికంగా యాంత్రీకరించబడిరదని అన్నారు. కొంతవరకు బీహార్‌ వలస కార్మికులు పని చేస్తారని, వారి మడులు ఆటుపోట్ల ద్వారా నిండుతాయని, అందువల్ల విద్యుత్‌ ఖర్చులు కూడా ఆదా అవుతాయని అన్నారు.
చిన్న విజయాలు` కొద్దిగా పని, వేతనంలో పెంపు, బోనస్‌లు రావడం… ఇవన్నీ ఉప్పు మడుల కార్మికులు, వారి హక్కుల కోసం పోరాడగా వచ్చినవి.
తూత్తుకుడిలో టన్ను ఉప్పు ఉత్పత్తి ధర 600 నుండి 700 రూపాయలని, అయితే గుజరాత్‌లో అది 300 మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా 2019లో టన్ను ధర అకస్మాత్తుగా 600కి పడిపోయినప్పుడు మనం ఎలా పోటీపడగలమని అన్నారు. దీన్ని భర్తీ చేయడానికి, గ్రహదురై, ఇంకా ఇతరులు ఉప్పు తయారీని వ్యవసాయంగా పరిగణించాలని, పరిశ్రమగా పరిగణించకూడదని కోరుతున్నారు. చిన్న ఉప్పు తయారీదారులకు తక్కువ వడ్డీ రుణాలు, సబ్సిడీ విద్యుత్‌, ఫ్యాక్టరీలు, కార్మిక చట్టాల నుండి మినహాయింపు అవసరం. ఇప్పటికే గుజరాత్‌ నుండి ఓడలు వచ్చి తూత్తుకుడిలో ఉప్పును అమ్మి వెళ్ళాయి.
… … …
‘‘ఏదైనా ఘోరం జరిగితేనే వాళ్ళు మా గురించి రాస్తారు’’` మహిళా ఉప్పు కార్మికులు
ఉప్పు మడి కార్మికుల జీవనోపాధిని బలోపేతం చేయడానికి, అసంఘటిత కార్మికుల ఫెడరేషన్‌కు చెందిన కృష్ణమూర్తి అనేక డిమాండ్లను లేవనెత్తారు. ప్రాథమిక సౌకర్యాలతో పాటు, నీరు, పారిశుధ్యం, విశ్రాంతి స్థలం, పెండిరగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కార్మికులు, యజమానులు, ప్రభుత్వ ప్రతినిధులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
ఆయన మాట్లాడుతూ ‘‘మాకు వెంటనే శిశు సంరక్షణ సౌకర్యాలు కావాలి. ఇప్పుడైతే అంగన్వాడీలు ఆఫీసు గంటల్లోనే పనిచేస్తాయి (9`5 వరకు). ఉప్పు కార్మికులు 5 గంటలకు ఇల్లు వదిలి పనికి బయలుదేరవలసి వస్తుంది. కొందరైతే అంతకన్నా ముందుగానే బయల్దేరాలి. పిల్లల్లో అందరికన్నా పెద్దవారు, ముఖ్యంగా ఆడపిల్ల అయితే, అమ్మ బదులు తాను పిల్లల్ని చూసుకుంటుంది. కానీ ఆమె చదువు పాడైపోతుంది. అంగన్వాడీలు 5 గంటల నుండి 10 గంటల వరకు పని చెయ్యొద్దా ఈ పిల్లలను చూసుకోవడానికి?’’ అన్నారు.
కృష్ణమూర్తి తన చిన్న విజయాలను గురించి చెప్పారు, జీతాలు కాస్త పెరగడం, బోనస్‌లు రావడం వంటివి. ఇవన్నీ కూడా పనిచేసేవారు ఒక బృందంగా మారి, వారి హక్కుల కోసం పోరాడారు కాబట్టి జరిగింది. ఎప్పటినుండో వర్షాల సమయంలో సహాయక చర్యగా 5,000 రూపాయల డిమాండ్‌ చేస్తున్న వీరికి, ఇప్పుడు 2021లో తమిళనాడులోని కొత్త డిఎంకె ప్రభుత్వం దాన్ని మంజూరు చేసింది. కృష్ణమూర్తి, సోషల్‌ వర్కర్‌ ఉమామహేశ్వరి ఒక అసంఘటిత వ్యవస్థను వ్యవస్థీకృతం చేయడం కష్టమని ఒప్పుకున్నారు. ఆరోగ్య సమస్యలన్నీ వృత్తిపరంగా వచ్చినవే. కానీ వారు ఖచ్చితంగా అడుగుతారు, ‘‘కొన్ని ప్రాథమిక, సామాజిక భద్రతా చర్యలు అందుబాటులోకి తీసుకురాలేమా?’’ అని.
ఎంతైనా, ఆ ఆడవాళ్ళు చెప్పినట్లుగా ఇక్కడ యజమానులకు మాత్రమే లాభం చేకూరుతుంది. రaాన్సీ ఉప్పు మడులను తాటి చెట్లతో పోల్చుతుంది. రెండూ గట్టిగా ఉంటాయి. ఎంత ఎండలో ఎండినా, ఎప్పుడూ ఉపయోగకరంగానే ఉంటాయి. డబ్బుల గురించి ప్రస్తావిస్తూ ఆమె అనేకసార్లు, ఈ ఉప్పు మడులు ఎల్లప్పుడూ యజమానులకు డబ్బులను ఇస్తాయని అంది.
‘కానీ మాకు ఇవ్వవు. మా జీవితం గురించి ఎవరికీ తెలీదు’ అన్నారు అక్కడి ఆడవారు చిన్న కప్పుల్లో టీ తాగుతూ. ‘‘ప్రతిచోటా మీరు రైతుల గురించి రాస్తారు, కానీ మేము నిరసన చేస్తే తప్ప మీడియా మాతో మాట్లాడరు’’ వాళ్ళ గొంతులు పదునెక్కాయి. ‘‘మా గురించి ఏదైనా ఘోరం జరిగితే తప్ప రాయరు. చెప్పండి, అందరూ ఉప్పు వాడరా?’’
ఈ పరిశోధన అధ్యయనానికి బెంగుళూరులోని అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం వారి రీసెర్చి ఫండిరగ్‌ ప్రోగ్రాం 2020లో భాగంగా నిధులు సమకూరుస్తుంది.
(ఈ వ్యాసం (https://ruralindiaonline.org/en/articles/the-rani-of-thoothukudis-salt-pans/) పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా (ruralindiaonline.org) నవంబర్‌ 15, 2021 లో మొదట ప్రచురితమైనది.)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.